న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో నాలుగు రోజుల్లో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సెలక్టర్లకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో సవాల్ విసిరాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ధ్రువ్ జురెల్.. రాజ్‌కోట్‌లో బరోడా జరుగుతున్న మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగాడు.
మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్.. టీ20 తరహాలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అతడు మాత్రం తన జోరును తగ్గించలేదు. యూపీ కెప్టెన్ రింకూ సింగ్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో జురెల్ కేవలం 78 బంతుల్లోనే తన తొలి లిస్ట్-ఎ క్రికెట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా ఓవరాల్‌గా 101 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 8 బంతుల్లో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రింకూ సింగ్ 67 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బరోడా బౌలర్లలో యువ పేసర్ రాజ్ లింబానీ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
రేసులో కిషన్-డిజే
కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరికి చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉండగా.. అతడికి బ్యాకప్‌గా కిషన్-పంత్-జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కిషన్-జురెల్‌లో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఇద్దరూ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జురెల్ గత కొన్ని సిరీస్‌లకు వన్డే జట్టులో ఉన్నప్పటికి.. ఇప్పటివరకు మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. కిషన్ కూడా ఈ దేశవాళీ వన్డే టోర్నీ తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. దీంతో సెలక్టర్లు మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
చదవండి: ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ!


