అనుకున్నదే జరిగింది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి టీమిండియా వికెట్‌కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ వైదొలిగాడు. శనివారం (జనవరి 10) మధ్యాహ్నం వడోదరలోని BCA స్టేడియంలో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్‌కు కుడి పక్క భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎంఆర్‌ఐ స్కాన్ తీయించగా.. Oblique Muscle Tear అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన BCCI మెడికల్ టీమ్, డాక్టర్లతో చర్చించి పంత్‌ను న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
🚨 PRESS RELEASE FROM BCCI ON RISHABH PANT 🚨 pic.twitter.com/z3l3jPKFCi
— Johns. (@CricCrazyJohns) January 11, 2026
ఈ మేరకు బోర్డు మీడియా అడ్వైజరీ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. పంత్ స్థానాన్ని ధృవ్ జురెల్‌తో భర్తీ చేస్తున్నట్లు అదే లేఖలో పేర్కొంది. జురెల్ ఇప్పటికే జట్టుతో కలిశాడు.
కాగా, న్యూజిలాండ్ సిరీస్‌కు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఎంపికయ్యాడు. ఇటీవలికాలంలో పంత్ టెస్ట్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. వన్డేల్లో అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. వన్డేల్లో కేఎల్ రాహుల్ టీమిండియాకు ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్‌గా ఉన్నాడు.
తాజాగా పంత్ గాయపడిన తర్వాత ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా జురెల్ ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే వడోదర వేదికగా ఇవాళ (జనవరి 11) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.
అప్ డేటెడ్ భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)


