కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.
మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం.
చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియో
లవర్‌తో బ్రేకప్...
ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్‌జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్‌ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్‌కాస్టింగ్‌తో చెప్పింది.
A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.
After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.
The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025
అయితే ప్రేమలో పడాలని చాట్‌జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్‌ని క్లాస్‌గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్‌కు "హనీమూన్"కి వెళ్ళింది

ఫిక్టోసెక్సువాలిటీ
ఈ సంఘటన జపాన్‌లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్‌లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.
అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?
ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్'


