కొన్ని చిన్న చిన్న పనులు..చాలా ఎఫెక్ట్‌వ్‌గా ఉంటాయి. చాలా చాలా సాధాసీదా పనులే అయినా వాటి ప్రభావం మాములుగా ఉండదు. మనకు మన తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మంచి మంచి విందులు ఇప్పిస్తారు. అదులో పెద్ద విషయం ఏం లేదు. కానీ మనం సంపాదించే రేంజ్‌కి వచ్చినప్పుడు కూడా వారి చేత ట్రీట్ ఇప్పించుకునే తింటే ఆ ఆనందమే వేరు. అది మన తల్లిదండ్రలకు గొప్ప అనుభూతి కూడా. అదెలాగో అందుకు సంబంధించిన వీడియోని జత చేస్తూ పోస్ట్‌లో వివరించారు చాయ్ సుట్టా బార్ సహ-వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే .
ఆయన తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం గురించి చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకుంది. ఆ వీడియోలో వ్యాపారవేత్త దూబే తన తల్లిదండ్రులను ఒక కేఫ్‌లో డేట్ కోసం తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. అంతేగాదు మీరు కూడా ఇలా పేరెంట్స్‌ని ట్రీట్ కోసం వెళ్దామని ప్రోత్సహించడంని పిలుపునిస్తూ..అక్కడ జరిగిన దృశ్యాన్ని ఇలా పంచుకున్నారు. తన కోసం కూడా తన తండ్రినే ఆర్డర్ చేయమని ఆ వ్యాపారవేత్త అడిగారు.
ఆయన తమ ముగ్గురు కోసం భోజనం ఆర్డర్ చేసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ తర్వాత చివరిలో బిల్లు కూడా తండ్రి చేత పే చేయించాడు ఆ వ్యాపారవేత్త. ఆ తర్వాత చివరగా నాన్న కొంచెం ఛేంజ్ ఉంటే ఇవ్వరూ అని అడిగి మరి తీసుకున్నాడు. ఆయన కూడా చాలా ఆనందంగా ఇచ్చారు. ఇలా ఎందుకు చేశానో వివరిస్తూ..ఇలా చెప్పుకొచ్చారు. "మనం పేరంట్స్‌చేత బిల్లు కట్టించి ఫ్రీగా ట్రీట్‌లు తీసుకోమని కాదు నా ఉద్దేశ్యం. మనం మంచి ఉన్నత స్థాయిలో డబ్బులు సంపాదించే రేంజ్‌లో ఉన్నా..వారి చేతనే డబ్బులు కట్టించి వారికి నచ్చిన ఐటెం ఆర్డర్ చేయిపించి తింటే మనం ఎప్పటికీ వారిపై ఆధారపడి ఉన్నామని, మనం ఎప్పటికీ వారి పిల్లలమే అనే భావన కలుగుతుంది.
అదే సమయంలో వారికి తాము వృద్ధులం అనే భావన కలగదు. మన పిల్లలు చిన్న వాళ్లు వాళ్ల కోసం మనం దృఢంగా ఉండాలనే భావన, ఆశ కలుగుతుంది. మన పిల్లలు ఎప్పటికీ పిల్లలే, చిన్నవాళ్లు మనపై ఆధారపడుతున్నవాళ్లు అన్న ఫీలింగ్ వారికి గొప్ప అనుభూతిని, జీవితంపై గొప్ప ఆశను రేకెత్తిస్తుందంటూ". పోస్ట్‌లో రాసుకొచ్చారు అనుభవ్ దూబే. ఇది చాలామంది మనసుని తాకడమే కాదు..ఇలాంటి చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకు మంచి అనుభూతిని కలిగించడంలో సహయపడటమే గాక, పిల్లలతో వారి బంధాన్ని మరింత బలపరుస్తాయని అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: పక్షవాతం బారినపడిన వ్యక్తి అసామాన్య ప్రతిభ..! జస్ట్ ఒక్క చేతి వేలు, కాలి బొటనవేలితో..)


