రెట్రో క్వీన్‌ కల్పనా ఈజ్‌  బ్యాక్‌ | Kalpana Iyer danced to her iconic song Ramba Ho Ho Ho at 69 years | Sakshi
Sakshi News home page

రెట్రో క్వీన్‌ కల్పనా ఈజ్‌  బ్యాక్‌

Feb 13 2026 6:00 AM | Updated on Feb 13 2026 6:00 AM

Kalpana Iyer danced to her iconic song Ramba Ho Ho Ho at 69 years

ట్రెండ్స్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉండే నేటి డిజిటల్‌ కాలంలో కూడా కానీ కొన్ని క్లాసిక్స్‌కు ఎప్పటికీ కాలం చెల్లదన డానికి 1981లో ఒక వెలుగు వెలిగిన రంభ హో  పాట, ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తం గా మార్మోగి పోతోంది. కారణం ఒరిజినల్‌ రంభా హో గర్ల్‌ కల్పనా అయ్యర్‌ తన 69 ఏళ్ల వయసులో చేసిన ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌. పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలోని ఒక పెళ్లి వేడుకలో ఈ మ్యాజిక్‌ జరిగింది. 

తన స్నేహితురాలి కుమారుడి పెళ్లికి వెళ్లిన కల్పనా, అక్కడివారి కోరిక మేరకు ఏమాత్రం ΄్లాన్‌ చేయకుండానే స్టేజ్‌ ఎక్కారు. లెజెండరీ సింగర్‌ ఉషా ఉతుప్‌  పాడిన అత్యంత ప్రసిద్ధ  పాటల్లో ఒకటైన రంభహో  పాటకు ఆమె తనదైన శైలిలో స్టెప్పులేసి సందడి చేశారు. ఈ వీడియో  పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌ అవ్వడంపై కల్పనా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానులంతా తనపట్ల చూపిస్తున్న ప్రేమకి ఎంతో సంతోషంగా ఉందని ఆమె కృతజ్ఞతలు తెలి పారు. 

కల్పనా అయ్యర్‌ 1980లలో బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన డాన్సర్, నటి. ఆమె 1978లో మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత  హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా డిస్కో డాన్సర్‌ సినిమాలోని ఔవా ఔవా, అర్మాన్‌ చిత్రంలోని రంభ హో వంటి  పాటలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెను అప్పట్లో క్యాబరే క్వీన్‌ అని పిలిచేవారు. ఈ  పాట మళ్ళీ ఇంతలా వైరల్‌ అవ్వడానికి మరో కారణం బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌. రణవీర్‌ సింగ్‌ ప్రధాన  పాత్రలో నటిస్తున్న ధురంధర్‌ సినిమా కోసం ఈ ఐకానిక్‌ సాంగ్‌ను రీమిక్స్‌ వెర్షన్ లో ఉపయోగించారు. 80ల నాటి ఈ ఎనర్జిటిక్‌  పాటను నేటి జెన్‌జెడ్‌ యువత కూడా ఇష్టపడటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement