Bihar Election Results 2025 ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ఫలితాల్లోకి మారితే, నితీష్ కుమార్ (Nitish Kumar) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఎన్డీయే అధికారికంగా సీఎం అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించనప్పటికీ, JD(U) నాయకులు ఆయనే సీఎం అని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఎన్డీయే విజయభేరి వెనుక రహస్యం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారిgది.
నవంబర్ 14న జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మెజారిటీ మార్కును దాటింది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకనుగుణంగా నితీశ్ కుమార్ నాయకత్వానికే ప్రజలు మొగ్గు చూపారు. కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు ఘోర పరాభవం తప్పలేదు. బిహార్ సీఎంకోసం తేజస్వి కలలు కల్లలయ్యాయ.
రికార్డ్ ఓటింగ్
బిహార్ ఈసారి ఓటింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సారి నమోదైన రికార్డ్‌ఓటింగ్‌ను ఎన్డీయే విజయానికి మార్గం సుగమం చేసింది. 60 శాతం అధిక పోలింగ్ శాతం ఉంది. చిన్న పోలింగ్ కేంద్రాలు, సవరించిన ఎన్నికల జాబితా యాక్సెస్ ఓటింగ్ శాతాన్ని పెంచిందంటున్నారు అధికారులు. అలాగే ముఖ్యంగా బలమైన స్థానిక సంబంధాలు ఉన్న అభ్యర్థుల ఎంపిక కూడా అధిక ఓటింగ్‌కు కారణమని భావిస్తున్నారు.

మహిళా సంక్షేమం, యువకులు King Makers
మహిళలు యువ ఓటర్ల బలమైన భాగస్వామ్యం కీలక ఫలితాలను నిర్ణయించడంలో కీలకమైనదని, ఇదే రాబోయేప్రభుత్వ విధాన ప్రాధాన్యతలను రూపొందిస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 'దశజారీ' ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గర్ యోజన (MMRY) పథకం ప్రకటించిన తర్వాత మహిళలు భారీ సంఖ్యలో ఓటు వేశారు. వివిధ ప్రాంతాలలో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. పురుషుల కంటే 5 లక్షల మంది మహిళలు ఓటు వేయడంరికార్డు స్థాయిలో ఓటింగ్‌కు దారితీసింది.
మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.4 కోట్ల మహిళలకు రూ. 10,000 నగదు, ఉచిత సైకిల్ పథకం, పంచాయతీల్లో 50శాతం రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35శాతం రిజర్వేషన్, ఉచిత విద్యుత్ లాంటి వాటితోపాటు, మహిళా సంక్షేమ పథకాల కింద రూ.2 లక్షల సాయం లాంటి హామీలు భారీ ప్రభావాన్ని చూపాయని అంచనా.
చదవండి: బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్
అలాగే కుల సమీకరణాల్లో ఎన్డీయే ఆధిపత్యాన్ని చాటుకుంది. అగ్ర కులాలలో 10శాతం కుష్వాహాలలో 4శాతంకంటే ఎక్కువ, పాశ్వాన్లలో 5శాతం కంటే ఎక్కువ, ముసాహర్లలో 3శాతం కంటే ఎక్కువ,మల్లాలలో 2.6శాతం వంటి విభిన్న వర్గాల మద్దతును కూడగట్టింది.
ఎస్‌ఐఆర్ వివాదం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలపై గందరగోళం, సామూహిక తొలగింపు ఆరోపణలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం, సజావుగా జరిగిన ఓటింగ్ ఈ ప్రభావ పెద్దగా లేదని తెలిపింది. అలాగు కేంద్రం బిహార్‌కు కేటాయించిన 1.62 లక్షల కోట్ల అభివృద్ధి ప్యాకేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, మౌలిక సదుపాయాల మెరుగుదల లాంటివాటిని బాగా ప్రచారంలో పెట్టుకోవడంతో ఇది బాగా కలిసి వచ్చింది.
'మోదీ హనుమాన్' చిరాగ్
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని LJP- రామ్ విలాస్ పార్టీ 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంచలనంగా చెప్పవచ్చు. 2020లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుని ఒకప్పుడు రద్దైన ఆపార్టీ, అనూహ్యంగా ఈఎన్నికల్లో పుంజుకుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి: వాడే నాకు కరెక్ట్ : చాట్‌జీపీటీ వరుడొచ్చేశాడు!
మోదీ మ్యాజిక్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చార్మ్, చాణక్యం అప్రతిహతంగా కొనసాగుతోంది. అసాధారణమైన 2024 లోక్‌సభ ఎన్నికలు మొదలు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలను కైవసం చేసుకునే మోదీ హవా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇపుడు బిహార్ మరో ప్రధాన విజయంగా మారనుంది.

ఫోనిక్స్ సీఎం నితీశ్ రాజకీయాలు
సంక్షేమం ఈ ఎన్నికలను నిర్వచించింది. ఓటర్లు తాజా వాగ్దానాల కంటే వారు ఇప్పటికే అనుభవించిన పథకాలను -రుణ బదిలీలు, పెన్షన్లు, మహిళా కేంద్రీకృత మద్దతు లాంటి పథకాలు వారిని మెప్పించాయి. సంక్షేమ విశ్వసనీయత, స్థిరమైన ప్రభుత్వంగా నితీష్ ప్రభుత్వాన్ని విశ్విసించడంతో ప్రభుత్వ వ్యతిరేకత బలహీనపడి, విజయభేరీ దిశగా నడిపించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఒక విధంగా లిట్మస్ పరీక్ష. అయితే, గత 20 సంవత్సరాలుగా ప్రతి బిహార్ ఎన్నికలలోనూ నితీష్ కుమార్ శాశ్వత ప్రజాదరణ స్పష్టమైన అభివృద్ధి ,సమ్మిళిత వృద్ధిపై ఆయన దృష్టి ఫలించింది. నితీష్ పాలనా శైలి రెండు దశాబ్దాలకు పైగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సహాయపడింది. అభివృద్ధి, కలుపుగోలుతనం ఆయనను బీహార్ రాజకీయాల్లో ఒక బలీయమైన శక్తిగా మార్చింది.


