పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మరో ఘనత సాధించారు. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనను లండన్‌లోని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’గుర్తించింది. ఈ విషయాన్ని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా పంచుకున్నారు. ‘పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నితీ‹ష్ కుమార్ సాధించిన మైలురాయిని లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించిది.
ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా, గర్వంగా ఉంది. దేశ ప్రజాస్వామ్యంలో ఇదో అరుదైన ఘనత’అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అభివర్ణించారు. ఆయన అచంచల ప్రజాసేవ, స్థిరమైన పాలన, బిహార్ ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసానానికి ఇది ప్రతిబింబమని ఝా కొనియాడారు.


