వీడో తేడా : వీడి మెంటల్‌ స్టంట్స్‌కి అంతే లేదు, అందుకే! | Bihar Police Respond After Viral Videos Scaring Schoolgirls With Dangerous Stunts | Sakshi
Sakshi News home page

వీడో తేడా : వీడి మెంటల్‌ స్టంట్స్‌కి అంతే లేదు..కట్‌ చేస్తే

Nov 28 2025 3:13 PM | Updated on Nov 28 2025 3:31 PM

Bihar Police Respond After Viral Videos Scaring Schoolgirls With Dangerous Stunts

అమ్మాయి  కనిపిస్తే చాలు అది  వీధిలోఅయినా, ఆన్‌లైన్‌లో అయినా కావాలని ఏదో కరంగా కమెంట్లు చేయడం, ఉద్దేశపూర్వకంగా వేధించడం, ట్రోలింగ్‌ చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అలాంటివారికి చెంపపెట్టులాంటిదీ వార్త. అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయికి బుద్ధి  చెప్పేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.  

బిహార్ షరీఫ్ నివాసి అయిన ఒక యువకుడు అమ్మాయిల ముందు విన్యాసాలు చేయడం, వారిని వేధించడం,అశ్లీల పాటలు ప్లే చేయడం అతని పని. సుభాష్ పార్క్, నలంద కాందహార్‌,  రాజ్‌గిర్ ఫిట్‌నెస్ పార్క్ . ఇవే  అతని అడ్డాలు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృజన్ ఫ్లిప్పర్. 

 అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి చొరబడి  అమ్మాయిలను భయపెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు.  సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు  వైరల్‌గా జిల్లీ పోలీసు యంత్రంగా రంగంలోకి దిగింది. నలంద జిల్లాలో ఒక యువకుడు పాఠశాల విద్యార్థినులను బెదిరించడానికి,  వేధించేందుకు, పట్టపగలు నడిరోడ్డుమీద  ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవాడు. ఈ దృశ్యాలు కనలంద జిల్లాలో వైరల్ అయ్యాయి. ఈ ఆందోళనకరమైన దృశ్యాలపై  జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమ్మాయిలు సురక్షితంగా ఉండేలా అతనిపై  సంబంధిత  అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌  చేశారు. 

 

 ఆన్‌లైన్‌లో షేర్  అయిన ఈ వీడియోల ప్రకారం,   ఇతగాడు ట్రాఫిక్‌లో  రోడ్డు మధ్యలోకి వచ్చి పిచ్చి పిచ్చి స్టంట్స్‌తో అమ్మాయిలపైకి దూకి, భయపెట్టేవాడు. దీంతో బాధిత అమ్మాయిలు, తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై  నలంద పరిపాలనా అధికారులు తగిన చర్యలు  తీసుకోవల్సిందిగా  పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ధోరణులుమరింత ముదిరి, తీవ్రమైన ప్రమాదం జరగక ముందు పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని  సోషల్ మీడియా వినియోగదారులు కోరారు. ఇప్పటికే పెరుగుతున్న ఆన్‌లైన్ ట్రెండ్స్‌పై  ఆందోళన రేకెత్తించిందీ ఘటన. ఇంటా, బయటా ఎక్కడైనా అమ్మాయిలను వేధించినా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే పేరుతో పిచ్చి పిచ్చి "స్టంట్స్‌" చేసినా తగిన గుణపాఠం తప్పదనే సంగతిని గుర్తుంచుకోవాలంటున్నారు పెద్దలు  

ఇలాంటి వాడిని జూలోని బోనులోపెట్టాలి, ఎవరికి  ఎలాంటి హాని లేకుండా  వాడి  విన్యాసాలుసాగుతాయి , ప్రభుత్వానికి  ఆదాయం  కూడా వస్తుందని నెటిజన్లు ఆగ్రహం  వ్యక్తం చేశారు. వీడికి బుద్ధి చెప్పకపోతే.. ఇలాంటి వాళ్లు మరికొందరు తయరవుతారని మరికొందరు మండిపడ్డారు.  తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement