సాక్షి, హైదరాబాద్: తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి.. తన స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ సీపీ సజ్జనార్ సూచించారు. ‘‘దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు రూ. 20 వేలు మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది; https://facebook.com/share/1DHPndApWj/. ఇది మినహా నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీనకిలివే’’ అని సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
‘‘ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం టీం తొలగించే పనిలో ఉంది. నా పేరుతో, లేదా ఏ అధికారి, ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వచ్చే రిక్వెస్ట్‌లను స్పందించకండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి.
..ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్ లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం’’ అంటూ సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
⚠️ ముఖ్య గమనిక❗
నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు.
దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు ₹20,000 ను మోసగాళ్ల ఖాతాకు పంపారు.
నా వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీ… https://t.co/h2hg43FChY— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 15, 2025


