ప్రఖ్యాత భారతీయ డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ ఖోస్లా రూపొందించిన డిజైనర్ వేర్‌లో టాలీవుడ్ నటి టబు తళుక్కుమంది. నవంబర్ 13న ముంబై ఫ్యాషన్‌షోలో డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ ఖోస్లా కోసం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేసి అందర్ని మెస్మరైజ్ చేసింది 54 ఏళ్ల టబు. మరోసారి ఫ్యాషన్‌కి వయోపరిమితి లేదు అని ప్రూవ్ చేస్తూ..అంత్యంత ఆకర్షణీయంగా కనిపించింది.
పొడవాటి చేతులతో కూడిని జాకెట్‌తో టబు చాలా కాన్ఫెడెంట్‌గా చేసిన ర్యాంప్ వాక్ అందర్నీ కట్టిపడేసింది. ఆ ఎథ్నిక్ వేర్‌లో ఆమె లుక్ ఎంత హైలెట్ అయ్యిందంటే..భారతీయ రూపురేఖల్ని ఎలివేట్ చేస్తున్నట్లుగా ఉంది ఆమె ఆహార్యం. అందుకు తగ్గట్టుగా కళ్లు మరింత పెద్దవిగా కనిపించేలా కాజోల్‌ని పెట్టింది. చేతికున్న వెండి ఎంబ్రాయిడరీ ఆ డిజైనర్‌వేర్ లుక్‌ని మరింత పెంచేసింది. పైగా మ్యాచింగ్ ఆర్కిటెక్చరల్ కోటుతో మరింత గ్లామరస్‌గా తళుక్కుమంది.
అంతేగాదు ముంబైలోని ఫ్యాషన్ ఆర్ట్ ర్యాంప్ వాక్‌పై ఓ శక్తిమంతమైన మహిళలా స్టైలిష్‌గా తన హోయలను ఒలకపోస్తూ చూపిన విధానం..అదుర్స్. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ డిజైనర్ల ద్వయం షోస్టాపర్‌గా టబు లుక్ అక్కడున్నవారందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అభిమానులు సైతం ఐదు పదుల వయసులో ఇంత అద్భుతంగానా అని విస్తుపోయారు. అంతేగాదు టబు లుక్‌కి మాటల్లేవ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..)


