పెళ్లిపెద్దలుగా వివాహ తంతు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దంపతులు
వరంగల్: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.. వరంగల్ నగరానికి చెందిన కాలేశ్వరం ప్రకాశం ఇద్దరు మంచి స్నేహితులు. ప్రమాదవశాత్తు మిత్రుడు కాలేశ్వరం ప్రకాశం చనిపోయారు. ఆయన ప్రథమ కుమారుడు సూర్యదేవ వివాహానికి ఎమ్మెల్యే నాగరాజు దంపతులు పెళ్లిపెద్దలయ్యారు. వరంగల్ నగరంలో గురువారం జరిగిన సూర్యదేవ, హిమాన్షిల వివాహంలో పెళ్లిపెద్దలుగా కేఆర్ నాగరాజు దంపతులు కూర్చొని తంతును పూర్తి చేసి మిత్రుడి కుటుంబానికి కొండంత అండగా నిలిచారు.
ఇదీ చదవండి: 10 గంటలు నిర్బంధించి.. చిత్రహింసలు


