breaking news
nagaraju
-
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. శనివారం క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును నార్త్ ఏసీపీ సత్యానందం తన కార్యాలయానికి పిలిపించి కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ఇంటికి వచ్చి క్రాంతి కుమార్‌ను తీసుకెళ్లడం మొదలు.. సీఐ నాగరాజు వేధించడం వరకు అన్ని అంశాలను వెంకటేశ్వరరావు వివరించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి వెంకటేశ్వరరావు నుంచి ఏసీపీ రాత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోకు సంబంధించిన ఫోన్‌ను సైతం స్వా«దీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలంటూ వెంకటేశ్వరరావు పోలీసులను కోరారు. బాధ్యులందరిపై కేసు నమోదు చేయాలి తమ కుమారుడిని కావాలని వేధించి, మృతి చెందేలా సీఐ నాగరాజు వ్యవహరించారని క్రాంతికుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, జాతీయ ఎస్సీ కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సీఐ నాగరాజుతో పాటు బాధ్యులందరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఐ నాగరాజు తీవ్రంగా వేధించడం వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తమకు ఎవరిపైనా ఎలాంటి కక్షలు లేవన్నారు. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని, తమకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కాగా, క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందని మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్టు బాధ్యుడు ఎ.వి.పటేల్ అన్నారు. ఎన్నికల్లో తాము జగన్ కోసం పని చేయకపోయినా, క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు. చంద్రబాబు సర్కారుకు మాలలు, మాదిగలు అంటే లెక్కలేదని మండిపడ్డారు. క్రాంతికుమార్ కుటుంబానికి దళిత సంఘాలు, న్యాయవాదులమంతా అండగా ఉంటామని న్యాయవాది గవాస్కర్ తెలిపారు. -
క్రాంతి కుమార్ కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసుల చేతికి సెల్ ఫోన్
-
సాయి కృష్ణ కేసులో CIనాగరాజుకి అన్యాయం జరిగిన కూడా ఒప్పుకోము
-
నాగరాజును విజయవాడలోనే విచారిస్తాం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇచ్చిన పోలీసు కస్టడీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైలులో కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజును విచారించేందుకు అనుమతించాలని సిట్ తన పిటిషన్లో హైకోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణ జరిపారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. సిట్ అత్యవసర విచారణ కోరుతున్న నేపథ్యంలో ఆదివారమైనప్పటికీ ఆ రోజున ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జైలులో విచారణకు సిట్ అభ్యంతరాలు ఇవీ.. నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని ఆదేశిస్తూ పలు నిబంధనలు విధించింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, ‘నేరం మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే జరిగింది. పోలీస్ కస్టడీ సమయంలో నిందితుడు నాగరాజు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలను సేకరించడానికి లేదా క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు దర్యాప్తు అధికారి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోలీస్ కస్టడీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే పరిమితం చేయడం వల్ల సరైన దర్యాప్తు జరపకుండా అడ్డుకున్నట్లవుతుంది. నేరం జరిగిన పరిధిని విడిచిపెట్టి వేరే చోట నాగరాజును విచారించడం వల్ల దర్యాప్తు అధికారికి ఎదురయ్యే ఇబ్బందులను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తులో భాగమైన అధికారులందరూ రాజమండ్రి జైలుకెళ్లడం సాధ్యం కాదు. పోలీసు అధికారి అయిన నాగరాజు నుంచి వివరాలు రాబట్టడం అంత సులభం కాదు. అందువల్ల ఇందుకు సంబంధించి కింది కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలి’’ అని విన్నవించారు.మరకలు ఉన్న లాఠీ.. ఎముకలు.. బూడిద, కాలిన రిస్ట్ చైన్ స్వాదీనం చేసుకున్నాం: హైకోర్టుకు సిట్ సంచలన విషయాలువిజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సిట్ తన పిటిషన్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ‘సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా, చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. ముఖ్య సాక్షులు అతనిని పోలీస్ స్టేషన్లో గాయాలతో చూశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు. 01.05.2026 నుండి 01.06.2026 వరకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేశారు. ఎల్రక్టానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైన్, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం స్వాదీనం చేసుకున్నాం.. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.’ అని సిట్ తన పిటిషన్లో పేర్కొంది.నాకు ప్రాణహాని ఉంది: నాగరాజుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ప్రధాని నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. నాగరాజును ఎనిమిది రోజుల పాటు విచారించేందుకు సిట్‌కు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయవాడ కోర్టుకు ఈ లేఖ రాశారు.తాను నిర్దోషినని, సిట్ తనను అన్యాయంగా ఇరికించి భయభ్రాంతులకు గురిచేస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలని, సిట్ టార్చర్ లేకుండా చూడాలని కోరారు. నాగరాజును రాజమహేంద్రవరంలో విచారించడంసహా పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణ కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఆయన విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. -
సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు సంచలన ఆరోపణలు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సిట్ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు.సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు. సాయికృష్ణ కేసులో తనను సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు.నేటి నుంచి నాగరాజును సిట్ కస్టడీ విచారణ జరపాల్సి ఉంది. సాయికృష్ణ కేసులో ఎనిమిది రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. కాసేపట్లో సిట్ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఈలోపే సంచలన ఆరోపణలతో లేఖ బయటకు రావడం కలకలం రేపుతోంది.ఇదిలా ఉంటే.. నాగరాజు కస్టడీ కోరుతూ సిట్ దాఖలు చేసిన మెమోలో సంచలన విషయాలు ఉన్నాయి. కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినట్లు సిట్ పేర్కొంది. అలాగే కృష్ణలంక పీఎస్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించినట్లు పేర్కొంది. రక్తపు గుర్తులు ఉన్న లాఠీ, ఎముకలు, బూడిద, కాలిన ఇనుప హ్యాండ్ గొలుసు స్టేషన్ టెర్రస్ నుంచి సీజ్ చేశామని చెప్పింది. ఇక సాయికృష్ణ కస్టడీలోనే తీవ్ర గాయాలతోనే మరణించాడని తేలిందని తెలిపింది. సాయికృష్ణ మృతదేహాన్ని అసలేం చేశారు? అనేదానిపై నాగరాజు నోరు విప్పితేనే బయటకు వస్తుందని.. అందుకే కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది. కస్టడీ నేపథ్యంలో నాగరాజు నోరు విప్పుతాడా? ఇందులో మిగతా పోలీసుల పాత్ర గురించి చెబుతాడా? లేదంటే తాజా లేఖ కలకలం నేపథ్యంలో ఏదైనా సంచలన విషయం బయటపెడతాడా? అనేది ఉత్కంఠగా మారింది. -
ఈ దారుణాల వెనుక 'పెద్ద కుట్ర'
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర రాజధానిలో ఒకే నెలలో రెండు మరణాలు జరిగాయి. ఒకటి లాకప్‌డెత్, మరొకటి బలవన్మరణం. ఈ మరణాల వెనుక పెద్ద కుట్ర ఉంది. పోలీసులను ఉపయోగించుకుని సిండికేట్‌గా మారి హత్యలు చేస్తున్నారు. సీఐ నుంచి సీఎం వరకూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు.’’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధింపులు తాళలేక, సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ గురువారం పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న బాధితుని ఇంటికి వెళ్లిన జగన్, క్రాంతికుమార్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్‌ను ఏ విధంగా వేధించారనేది జగన్‌కు బాధిత కుటుంబం వివరించింది. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పిన జగన్, ఆ ఇంటి వద్దనే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందని ఈ సందర్భంగా జగన్ అన్నారు. క్రాంతికుమార్ కుటుంబం కడు పేదరికంలో ఉందని, ఒక అమాయకుణ్ని వేధించి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దిగజారిన పోలీస్ వ్యవస్థకు ఈ సంఘటన నిదర్శనమని, ఇంత జరిగినా, ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంకా జగన్ ఏమన్నారంటే.. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రాష్ట్రంలో దిగజారిన పోలీస్ వ్యవస్థ ‘‘క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి, ఆ కుటుంబాన్ని చూస్తే హృదయవిదారకమైన పరిస్థితి కనిపిస్తోంది. క్రాంతి కుమార్, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి, తండ్రి, నాయనమ్మ..ఇలా అందరూ కలిసి ఈ చిన్న ఇంటిలో పేదరికంలో బతుకుతున్నారు. వారి కుటుంబాన్ని ఈ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది. ఎనిమిదేళ్లుగా టాక్సీ నడుపుకుంటూ జీవిస్తున్నాడు క్రాంతి కుమార్. అతనిపై ఎలాంటి కేసులు లేవు. అంతకు ముందు చిన్నా చితకా కేసులు ఉన్నా అవన్నీ కొట్టివేశారు. శిక్ష కూడా పడలేదు. అయినా క్రాంతికుమార్‌ను రోజూ పోలీస్ స్టేషన్‌కు రమ్మని 3 నెలలు వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. నిండా నలభై ఏళ్లు కూడా లేని అలాంటి వ్యక్తిని ఏ నేరం చేయకపోయినా, పోలీసులు ఎందుకు రోజూ స్టేషన్‌కు రమ్మని పిలిపించారు. తనను 3 నెలల నుంచి రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించారని, హింసించారని క్రాంతికుమార్ తన మరణ వాంగ్మూలం (సెల్ఫీ వీడియో రికార్డింగ్)లో చెప్పారు. పోలీసులు బలవంతపెట్టి తనతో చేయకూడని పనులు చేయించారని ఆ వీడియోలో తన గోడును చెప్పుకున్నాడు. వాళ్లను వాళ్లు కాపాడుకుంటున్నారు ఇదంతా రాజధాని ప్రాంతం విజయవాడలో జరిగింది. చంద్రబాబు పక్కనే ఉంటారు. కళ్లదుటే సీపీ, డీజీపీ, హోం మంత్రి, ముఖ్యమంత్రి ఆఫీసులున్నాయి. తన కొడుకు ఆత్మహత్య తర్వాత, ఆ వీడియోను ఆయన తండ్రి సీపీకి చూపినా, పట్టించుకోలేదు. ఏ చర్యా తీసుకోలేదు. మరి తప్పు చేసిన వారిని ఎందుకు రక్షిస్తున్నారు. క్లియర్‌కట్‌గా రాజధానిలో ఒక రాకెట్ నడిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సీఐ నాగరాజుని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం చంద్రబాబు కాపాడుతున్నారు. ఎవరు పడితే వారు సీసీ ఫుటేజ్ తీసేయొచ్చా? కృష్ణలంక పొలీస్ స్టేషన్లో పరిధిలో ఒక నెల వ్యవధిలో రెండు మరణాలు జరిగాయి. ఒకటి లాకప్‌డెత్. మరొకటి ఆత్మహత్య. అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ కూడా లేదు. పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైపోయింది. ఒక రిమాండ్ రిపోర్టులో మే 1 నుంచి జూన్ 1 వరకు ఒక నెల రోజుల ఫుటేజ్ లేదన్నారు. మరో దాంట్లో 18 నెలల నుంచి ఫుటేజ్ లేదన్నారు. ఎవరు పడితే వారు అలా సీసీ కెమెరాల ఫుటేజ్ తీసేయొచ్చా. మరి బ్యాకప్ ఉండదా?. అంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్ స్టేషన్లలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. కొడుతున్నారు. చంపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. చెత్తబుట్టలో వేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు న్యాయం జరిగేలా అండగా నిలబడతాం ఇంత జరిగినా కేసు నమోదు చేయలేదు. నిజానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. ఈ కేసుకు సంబంధించి, న్యాయ సహాయం మొదలు, అన్ని రకాలుగా బాధితులకు మా పార్టీ తరపున అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేలా అవసరమైతే కోర్టులో కూడా పోరాడతాం’’ అని జగన్ స్పష్టం చేశారు.‘సిండికేట్’ మర్డర్లు రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోంది. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా భావించే విజయవాడ నడి»ొడ్డున ఒకే నెలలో రెండు మరణాలు జరిగాయి. అది కూడా పోలీసుల వేధింపుల వల్ల. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్సయిందని అడగండి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరెస్టయిన సీఐ తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు. అంటే ఈ సంఘటనల వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అర్థం అవుతోంది. సీపీకి ఫిర్యాదు చేస్తే చెత్తబుట్టలో పడేస్తున్నారు. నేను బాధితుల పక్షాన నిలబడటం వల్ల కనీసం 46 రోజుల తరువాతయినా దారుణాలు బయటకు వచ్చాయి. లేదంటే మరుగున పడేసేవారు. పోలీసుల సాయంతో సిండికేట్‌గా మర్డర్లు చేస్తున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. -
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుకు సిట్ కస్టడీ
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజుని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు 12 రోజులు కస్టడీ కోరగా.. 8 రోజుల కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. రేపటి నుండి 10వ తేదీ వరకు కస్టడీ ఇచ్చిన న్యాయస్థానం.. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు విచారణ చేయాలని ఆదేశించింది. విచారణ చేసే సమయంలో వీడియో రికార్డ్ చేయాలని కోర్టు పేర్కొంది. రాజమండ్రిలో సిట్ విచారణ చేయనుంది.సాయికృష్ణ మెజిస్టీరియల్ విచారణ జరగనుంది. జూలై 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరపనున్నారు. ప్రజల నుంచి సమాచారాన్ని కోరుతూ మెజిస్టీరియల్ విచారణ చేపట్టనుంది. సమాచారం తెలిసిన వారు హాజరై తమ వద్ద ఉన్న సాక్ష్యాలు సమర్పించాలంటూ విజయవాడ ఆర్డీవో ప్రకటన విడుదల చేశారు. -
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
నా ప్రాణాలకు ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నా ప్రాణాలకు ముప్పుంది.. నన్ను పోలీస్ కస్టడీకి ఇస్తే నాకు ప్రాణహాని ఉంది’ అని లాకప్ నుంచి కనుమరుగైన సాయికృష్ణ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు బుధవారం ఏకంగా న్యాయస్థానంలో ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలు ఈ కేసు వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని స్పష్టం చేస్తున్నాయి. పోలీసు అధికారి అయిన నాగరాజే పోలీసు కస్టడీలో ప్రాణాలకు భరోసా లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే రాష్ట్రంలో పోలీసు స్టేషన్లలో వ్యక్తుల ప్రాణాలకు రక్షణ లేదని ఆయన తేల్చి చెప్పేశారు. సీఐ నాగరాజును పోలీస్ కస్టడీలోనే అంతం చేసేందుకు కుట్ర సాగుతోందన్నది బట్టబయలైంది. అంతటి తెగింపు ఎవరికి సాధ్యం? ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న వారికే సాధ్యమన్నది బహిరంగ రహస్యమే. అంటే సాయికృష్ణను లాకప్‌లో అంతం చేయడం వెనుక సూత్రధారులుగా ఉన్న ప్రభుత్వ పెద్దలే ప్రస్తుతం నాగరాజును అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని తేటతెల్లమవుతోంది. దాంతో ఈ కేసులో కీలక విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన సీఐ నాగరాజు విచారణకు సహకరించడం లేదని సిట్ చెబుతుంటే.. ఇప్పటికే తాను మొత్తం సమాచారం ఇచ్చినట్లుగా సీఐ నాగరాజు బుధవారం కోర్టు ఎదుట చెప్పడం సిట్ బండారాన్ని బయట పెట్టింది. బుధవారం కస్టడీ పిటీషన్‌పై విచారణలో సమయంలో సీఐ నాగరాజును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ, సిట్ తీరుపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నేరం ఒప్పుకునేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని, అకారణంగా కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఐ.. న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న సమాచారం అంతా అందించానని చెప్పారు. కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలను, ఆరోపణలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సిట్ బృందం మాత్రం ఇందుకు భిన్నంగా రిమాండ్ రిపోర్టులో దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పడం గమనార్హం. పెద్దల కుట్రలో పాత్రధారే సీఐ నాగరాజు టీడీపీ ప్రజాప్రతినిధి భారీ భూదందా, ఆర్థిక అక్రమాల పంచాయితీతోనే గాదె సాయికృష్ణను లాకప్‌లో అదృశ్యం చేశారన్నది ఇప్పటికే స్పష్టమైంది. చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయవాడ ప్రజాప్రతినిధి జగ్గయ్యపేట వద్ద ఓ భూ దందా సాగించారు. ఆ పంచాయితీలో ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం కూడా గట్టిగా నిలబడింది. ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం తరఫున సాయికృష్ణ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాంతోనే సాయికృష్ణను పోలీసుల సహకారంతో లాకప్‌లోనే అదృశ్యం చేశారని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విజయవాడ పోలీస్ బాస్, బిగ్‌బాస్ సూత్రధారులుగా సాగిన ఈ కుతంత్రంలో సీఐ నాగరాజు పాత్రధారిగా వ్యవహరించారు. గుట్టుచప్పుడు కాకుండా సాయికృష్ణను లాకప్‌లోనే అదృశ్యం చేశారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం బట్టబయలైంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. సిట్‌ను నియమించారు. కానీ సాయికృష్ణను మాయం చేయడానికి ప్రధాన కారణమైన భూ దందాను కప్పిపుచ్చడం ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలకు సవాల్‌గా మారింది. కుట్రకు ప్రత్యక్ష సాక్షి నాగరాజే కాబట్టి.. సాయికృష్ణను లాకప్‌లోనే అంతం చేసిన కుట్రలో ప్రధాన పాత్రధారి సీఐ నాగరాజే కాబట్టి, న్యాయ విచారణలో ఆయన వాస్తవాలు వెల్లడిస్తే ప్రభుత్వ పెద్దల బండారం మొత్తం బయటపడుతుంది. అందుకే ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ఆశ చూపించారు. ప్రస్తుతం ఈ కేసును తప్పుదారి పట్టించేంత వరకు తమకు సహకరించాలని సూచించారు. కాగా ఈ కేసు న్యాయస్థానం పర్యవేక్షణలో సాగుతుండటం.. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగ ప్రవేశం చేయడంతో సీఐ నాగరాజుకు పరిస్థితి క్రమంగా అర్థమవుతోంది.తన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని ఆయన గుర్తించారు. దాంతో ఈ కేసులో వాస్తవాలను న్యాయస్థానంలో వెల్లడించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సాయికృష్ణను లాకప్‌లోనే అంతం చేయాలని తనను ఆదేశించిన ప్రభుత్వ, పోలీసు పెద్దల పేర్లను ఆయన బయటపెట్టే అవకాశముంది. ఇలా జరగకుండా సాయికృష్ణను మాయం చేసినట్టే.. సీఐ నాగరాజును కూడా అడ్డు తొలగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు కుతంత్రం పన్నుతున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని నాగరాజు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజును మరింతగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దాంతో నాగరాజుకు భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండే అవకాశముందన్నది పూర్తిగా స్పష్టమైంది. తాను పోలీసుల కస్టడీలోకి వెళితే.. ఇక తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయో, ఉండవోనని ఆయన ఆందోళన చెందారు. అందుకే తనను కస్టడీకి ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా కుండబద్దలు కొట్టారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు, పోలీసు కస్టడీలో ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేదని స్వయంగా ఓ సీఐనే తేల్చి చెప్పారు. భూదందాలు, ఆర్థిక అక్రమాల కోసం తమ ప్రత్యర్థి వర్గీయులనే కాదు.. సాక్షాత్తు పోలీసు అధికారులను కూడా లాకప్‌లు, పోలీసు కస్టడీలోనే అంతం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు బరితెగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న జంగిల్ రాజ్ దారుణాలను బట్టబయలు చేస్తోంది. నిజాలు దాస్తున్న సిట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసును పది రోజులుగా సిట్ బృందం దర్యాప్తు చేస్తున్నా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్రణాళికతో నిజాలను దాస్తూ కేసును నీరుగార్చేలా నడిపిస్తోంది. సీఐ నాగరాజును అరెస్టు చేసిన సమయంలో, ఆ తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులతో ఈ విషయం తేటతెల్లమైంది. సిట్ బృందం ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించిన మూడు రిమాండ్ రిపోర్టుల్లో ‘విచారణలో నిందితులు సహకరించలేదు. ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. మౌనం వహించారు’ అనే సమాధానాలనే పొందు పరిచింది. మరోపక్క సీఐ నాగరాజు అరెస్టు సమయంలోనే కానిస్టేబుళ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నా సిట్ ఆ పని చేయలేదు. వారు పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేక బృందాలు వెదుకుతున్నట్లు కాల యాపన చేశారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోతున్నట్లు లీకులు ఇచ్చారు. చివరకు సినిమాలో మాదిరి ఇద్దరూ ఆటోలో వచ్చి, ఏసీపీ ఎదుట లొంగిపోయినట్లు కథ నడిపారు. వీరిద్దరి రిమాండ్ రిపోర్టులో సైతం పాత కథే చెప్పారు. ఈ కేసులో సీఐకి సహకరించి, కీలకంగా వ్యవహరించిన అతని సన్నిహితుడి పాత్ర ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ కేసులో మరో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు బాబూరావు, సాంబశివరావును మంగళవారం అదుపులోకి తీసుకుని, బుధవారం విజయవాడ రెండో ఏసీఎం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిద్దరి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ దాదాపు పాత కథనే చెప్పింది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి ప్రాణాలు విడిచిన క్రాంతికుమార్ ఉదంతంలో దర్యాప్తుపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఒకే కోణంలో కేసు దర్యాప్తు సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. -
కస్టడీలో కొట్టడంవల్లే సాయికృష్ణ మృతి
విజయవాడలీగల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కైతేపల్లి బాబురావు (ఏ–5), గొరిపర్తి సాంబయ్య (ఏ–6)కు ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీకాంత్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. అనంతరం బాబురావును అవనిగడ్డ సబ్‌జైలుకు, సాంబయ్యను గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.విజయవాడలోని సిటీ పోలీసుగెస్ట్‌హౌస్ వద్ద మంగళవారం ఉదయం వీరిరువురినీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజర్ మెమో ద్వారా జప్తుచేశారు. సిట్ అధికారుల విచారణలో నిందితులు ఇరువురు ఎలాంటి సహకారం అందించకుండా మౌనంగా ఉండిపోయారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలు..‘సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, కస్టడీలో ఉండగా తీవ్రంగా కొట్టడం వల్ల అతడు మరణించాడు. అనంతరం నిందితులంతా కలిసి నేరాన్ని దాచడానికి సాక్ష్యాలను తుడిచివేసి, మృతదేహాన్ని మాయం చేశారని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో ఏ–1 సీఐ నాగరాజు, ఎ–2 పొట్లంక అశోక్‌కుమార్, ఏ–3 జంగం నానిని నిందితులుగా చేర్చారు. కృష్ణలంక పోలీసుస్టేషన్లో సీఐతోపాటు నలుగురు నిందితుల సమక్షంలో సాయికృష్ణను విచారించినట్లు సీడీఆర్ డేటాలో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కృష్ణలంక పోలీసుస్టేషన్‌లోని నెట్వర్క్ వీడియో రికార్డును పరిశీలించగా, అందులో గత 18 నెలల సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. నిందితులు తమ చట్టవిరుద్ధ నిర్బంధాన్ని, కస్టడీ హింసను దాచడానికి ప్రభుత్వ ఆస్తి అయిన అసలు హార్డ్ డిస్కులను దొంగిలించి, వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్కులను ఉద్దేశపూర్వకంగా మార్చారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి వాదనలు వినిపిస్తూ నిందితులు పోలీసు శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ హోదాల్లో ఉన్నందున, వారు బయట ఉంటే సాక్షులను (సహచర సిబ్బందిని) బెదిరించే లేదా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన, సున్నితమైన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ దశలో ఉందని, ఈ నేపథ్యంలో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. సీఐ నాగరాజు కస్టడీపై తీర్పు వాయిదావిజయవాడ లీగల్: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపించారు. కీలకమైన ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజు విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించలేదన్నారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు 12 రోజులపాటు పోలీసు కస్టడీ కోరారు. నాగరాజుకు పూర్తి భద్రత కల్పించామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించగా, న్యాయమూర్తి దీనికి సంబంధించి అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం డిఫెన్స్ తరఫు న్యాయవాదులు దిట్టకవి రామ్‌చంద్, గుడిశేవ సాంబశివరావు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుడు పోలీసులకు పూర్తిగా సహకరించాడన్నారు. పోలీసు కస్టడీకి కేవలం రెండు రోజుల సమయం సరిపోతుందన్నారు.రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని, వీడియో, ఆడియో రికార్డులను భద్రపరచి న్యాయస్థానంలో సమర్పించాలని, న్యాయవాది సమక్షంలోనే నిందితుని విచారణ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని, అందుచేత రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ జరపాలని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనల అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీకాంత్ తీర్పును గురువారానికి వాయిదా వేశారు. -
ఆఫ్ట్రాల్ CI గాడివి.. క్రిమినల్ అయితే చంపేస్తావా..?
-
లాకప్ డెత్ కేసులో కొత్త ఆధారాలు.. సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్!
-
Big Intro : హెడ్ కానిస్టేబుళ్లపై సంచలన ఆరోపణలు.. వెలుగులోకి వచ్చిన నిజాలు!
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు...
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
విజయవాడ: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోయారు. వారిద్దరినీ సిట్ ఆఫీసుకు తరలించారు. వీరిద్దరు సాయికృష్ణ కేసులో నిందితులుగా ఉన్నారు. సీఐ నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.సాయికృష్ణ కేసులో వీరి పాత్ర ఉందని ఖరారైన నేపథ్యంలో ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల గురించి గాలించారు. ఇప్పటికే వీరిద్దరిని సస్పెండ్ చేశారు. వీరిద్దరు దొరకడంతో కేసులోని చిక్కుముడులన్నీ వీడుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసి విచారించి పలు వివరాలు లాగింది సిట్. మరోవైపు, సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారించింది. సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై విచారణను 15కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా, సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అత్యంత సంచలనం సృష్టించిన ఘటనల్లో ఒకటిగా మారింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదని వారు చెబుతున్నారు. దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక విషయాలు బయటపడ్డాయి. -
సీఐ నాగరాజు మాస్టర్ స్కెచ్.. 32 టెరాబైట్స్ CCTV ఫుటేజ్ డిలీట్..
-
సాయికృష్ణ కేసు.. అంబటి లేఖతో దర్యాప్తుపై కలకలం
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. సిట్ చీఫ్, ఐజీ ఎం. రవిప్రకాష్‌కు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, అనేక అనుమానాస్పద అంశాలను ప్రస్తావించిన అంబటి.. రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు స్పష్టంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య ఎలా జరిగింది? మొదలు.. ప్రతీ కీలక ప్రశ్నకూ సరైన సమాధానం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారాయన.టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్, పైస్థాయి అధికారుల పాత్ర ఉన్నప్పటికీ క్రిమినల్ లయబిలిటీని(బాధ్యత) కేవలం ఒక సీఐకే పరిమితం చేయడం సరికాదని అంబటి తన లేఖలో విమర్శించారు. సాయికృష్ణను హ్యాండోవర్ చేసిన సమయంలో రాతపూర్వక అకాలెడ్జ్మెంట్ ఉన్నప్పటికీ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదని ఆయన ప్రశ్నించారు.కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ విషయంలో సిట్ నిర్లక్ష్యం చూపిందని లేఖలో ఆరోపించారు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్‌లో ఉన్న ఫుటేజీని వెంటనే సీజ్ చేయకపోవడం, ఓవర్‌రైట్ లేదంటే డిలీట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన లోపమని ఆయన పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ధ్వంసం కావడంపై కూడా స్పష్టత అవసరమని అన్నారు.అంతేకాకుండా పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ను పరిశీలిస్తే పెద్ద కుట్ర వెలుగులోకి వచ్చేదని.. కానీ సిట్ ఆ దిశగా వెళ్లలేదని అంబటి ఆరోపించారు. భారత న్యాయసంహిత(BNS) సెక్షన్లు 61, 3(5) కింద క్రిమినల్ కాన్స్పిరసీ, కామన్ ఇంటెన్షన్ అంశాలు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మ్యాట్రిక్స్ సర్వైలెన్స్ సిస్టమ్, 90 రోజుల క్లౌడ్ బ్యాకప్ వంటి ఆధునిక నిఘా వ్యవస్థల ఫుటేజీని సిట్ పరిశీలించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. వాహనాల కదలికలు, మృతదేహం తరలింపు వంటి కీలక అంశాలు ఈ ఫుటేజీల్లో ఉండే అవకాశం ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.మే 28న బాధిత తల్లి ఇచ్చిన క్రైమ్ పిటిషన్‌పై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడాన్ని కూడా అంబటి ప్రశ్నిస్తూ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లేఖతో సాయికృష్ణ కేసు మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
సాయికృష్ణ కేసు కంచికే.. పోలీసులే పోలీసులపై విచారణ.. కృష్ణలంక క్రిమినల్స్
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
-
సాయి కృష్ణ తల్లి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే..! అడ్వొకేట్స్ సంచలన నిజాలు
-
పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా ? సీఐ నాగరాజు జాగ్రత్త
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. ఇద్దరు పై అనుమానాలు
-
సిట్ విచారణలో కీలక నిజాలు.. స్టేషన్ CCTV ప్యూటేజ్ రెండు చోట్ల ఉంది
-
పెద్దలకు తెలిసే జరిగిందా..? సాయికృష్ణ కేసులో బిగుస్తున్న ఉచ్చు
-
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!
-
ఈ సిట్ మాకొద్దు.. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
జాగ్రత్త నాగరాజు.. నిన్ను జైల్లోనే...! CIపై చంద్రబాబు బిగ్ స్కెచ్..!?
-
నాగరాజు కేసులో సిట్ దూకుడు.. ACM కోర్టులో పిటిషన్
-
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
-
నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు
-
ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి!
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ‘నా కొడుకును చూపిస్తామన్న పోలీసులు చివరకు చంపేసి శ్మశానంలో కాల్చేశారు. ఇప్పటికైనా నా బిడ్ద బూడిద ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటా’ అని విజయవాడలోని కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుని పోలీస్ కస్టడీలోనే కొట్టి చంపారన్నది నిజమైందని, తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన మిగతా వారందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ బిడ్డను స్టేషన్లోనే కొట్టి చంపేసి మూటకట్టి శ్మశానానికి తీసుకెళ్లి కాల్చేశారని, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని, ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈరోజు నేను కుమిలిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడ. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం చేశారు పోలీసులు. నా బిడ్డను అంత చిత్రవధ చేసి చంపిన వాళ్లందరికీ శిక్ష పడాలి. అందరూ కలిసి కొట్టి కొట్టి చంపేశారు. నన్ను స్టేషన్‌కు కూడా రానివ్వకుండా వాడిని ఎక్కడికో తీసుకెళ్లి హతమార్చారు. అలా చేయాల్సిన అవసరం ఏమొచి్చంది. వాడి వయసెంత. మీ పోలీసుల వయసెంత. అంత చిన్న బిడ్డను చిత్రవధ చేశారు. వాళ్లకు తగిన శిక్ష పడాలి. నాకు అదే కావాలి’ అని వాపోయారు. మీడియాను చూపిస్తూ ‘నాకు మీరే న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. -
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది. ఈ హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్‌బాస్‌తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకు ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకప్ హత్యకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకుండా ‘సిట్’ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్లు సూటిగా పేర్కొనని సిట్... దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూమంత్రంగా రిమాండ్ రిపోర్టును రూపొందించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు..? హత్యాయుధం.. సమయం.. మృతదేహం తరలింపు.. అవశేషాల గుర్తింపు.. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీసు రిజిస్టర్లు, రికార్డులు... వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు... సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ బాధ్యులు.. సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ స్వాధీనం..! ఇలా ఏ అంశాలను కూడా ప్రస్తావించకుండానే, వాటి గురించి పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టును సమర్పించడం విభ్రాంతి కలిగిస్తోంది. ప్రధానంగా సాయికృష్ణను లాకప్‌లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోకపోవడం గమనార్హం. తద్వారా ఈ కేసులో ఎవరో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నాగమన్నది తేటతెల్లమవుతోంది. సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది....హత్య వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా?కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ మరణం కేసును న్యాయ విచారణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయికృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు (డిసీజ్డ్)అని పేర్కొంది. కానీ ఆయన్ని ఎప్పుడు, ఎక్కడ ఎలా హత్య చేశారు? అనే కనీస వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనలేదు. అంటే.. నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనేలేదు. టాస్క్‌ఫోర్స్ అధికారులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తరువాత.. వివరాలన్నీ అగమ్యగోచరమే. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన సాయికృష్ణ తరువాత ఏమయ్యారన్నది సిట్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. ఆయన ప్రాణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారా...? లేదా ఆయన మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తరలించారా? అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్ అధికారులు విస్మరించారు. అసలు సాయికృష్ణ లాకప్‌లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్ రిపోర్ట్‌లో సూటిగా ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయపరుస్తోంది. లాకప్‌లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే పేర్కొంది. హత్య ప్రదేశం, సమయం, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అన్నవి ఈ కేసులో ప్రధానమైనవి. ఆ మూడు కీలక అంశాల గురించి రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. సాయికృష్ణ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్ గుర్తించనే లేదు. తద్వారా సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారని నిరూపించడానికి కీలక ఆధారం లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. అంటే సాయికృష్ణ అసలు హత్యకు గురయ్యారా లేదా అనే సందేహానికి బలం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుగానే కుట్రకు బరితెగించింది. అంతగా ఈ కేసును నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు భావిస్తున్నట్లు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్షులే లేకుండా చేసే కుతంత్రంఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితోపాటు ఎస్సైను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బలకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయటాన్ని తాను విన్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పారని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్సై కూడా తాను మే 6 – 8వ తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొన లేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం! మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిపోర్ట్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవర్ని కాపాడేందుకు యత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కీలక రిజిస్టర్లు, రికార్డుల వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా...!సాయికృష్ణ లాకప్ మరణం కేసును నీరుగార్చేందుకు సిట్ పక్కాగా రంగంలోకి దిగింది. ప్రధాన బాధ్యుడైన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు టాస్క్‌ఫోర్స్ అధికారిని ఈ కేసు నుంచి తప్పించాలన్న కుట్ర బయటపడింది. తద్వారా వారిద్దరి వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను కాపాడాలన్న లక్ష్యంతో వ్యవహరించింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ అధికారులు మార్కాపురంలో అదుపులోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించినట్టు సిట్ పేర్కొంది. కానీ ఆ తరువాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ప్రధానంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సిన కీలక రిజిస్టర్లు, రికార్డులను సిట్ కనీసం పరిశీలించలేదు. తమ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించనూ లేదు. వాటిని రోజూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సీపీ రాజశేఖర్‌బాబు ఎందుకు తన బాధ్యతను విస్మరించారనే కోణంలో దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆ కీలక అంశాలు ఇవీ...» పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లాకప్‌లలో ఉన్న వారి వివరాలతో లాకప్ డెయిరీ సర్వీస్‌రిజిస్టర్(డీఎస్ఆర్)ను సీపీకి సమర్పిస్తారు. నిందితులను లాకప్‌లో పెట్టిన తేదీ, సమయం, సంబంధిత పోలీసు అధికారి తదితర వివరాలు అందులో ఉంటాయి. 24 గంటలు మించి ఎవరూ లాకప్‌లో ఉండకుండా.. న్యాయస్థానంలో హాజరుపరిచారా లేదా? అన్నది సీపీ పరిశీలించాలి. మరి సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్‌లో ఉంచితే ఆ విషయాన్ని సీపీ ఎందుకు పట్టించుకోలేదు? అవేవీ పరిశీలించకుండానే డీఎస్‌ఆర్‌ను ఆమోదించారా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే సీపీకి తెలిసే సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్‌లో ఉంచారన్నది స్పష్టమవుతోంది. » ఇక పోలీస్ స్టేషన్లలో స్టేషన్ ఆఫీసర్లు, జనరల్ డ్యూటీ ఇన్‌చార్జ్‌లు, సెంట్రీలు ప్రతి ఆరు నుంచి 12 గంటల మధ్య షిఫ్ట్‌లు మారుతూ ఉంటారు. అలా షిఫ్ట్ మారే సమయంలో లాకప్‌లో ఉన్న వారి వివరాలను జనరల్ డైరీలో రాయాలి. మరి సాయికృష్ణను ఉంచిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ వివరాలను సిట్ ఎందుకు రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించ లేదు? జనరల్ డైరీ, స్టేషన్ డైరీ, లాకప్ రిజిస్టర్, కస్టడీ రిజిస్టర్, ప్రిజనర్ మూవ్మెంట్ రిజిస్టర్, విజిటర్స్ రిజిస్టర్, సెంట్రీ రిజిస్టర్, అరెస్టు రికార్డులు ఇవన్నీ కీలకం. వాటిని పరిశీలించకుండా వాటి ప్రస్తావనే లేకుండా రిమాండ్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈకేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నారన్నది స్పష్టమవుతోంది. » సాయికృష్ణకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నందునే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. మరి పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు, వాటిపై తీసుకున్న చర్యలను పోలీస్ కమిషనర్‌కు ప్రతి రోజూ నివేదిస్తారు. మరి సాయికృష్ణను ఎన్బీడబ్ల్యూ జారీ చేసి అదుపులోకి తీసుకుంటే ఆ విషయాన్ని సీపీకి సమర్పించే రోజువారీ నివేదికలో ప్రస్తావించాలి కదా? మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? సాయికృష్ణకు ఎన్బీడబ్లూ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారా...? తీసుకుంటే న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అని ప్రశ్నించాలి కదా. మరి ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా స్పందించలేదు? అంటే ఆయనకు తెలిసే సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రస్తావన రిమాండ్ నివేదికలో పేర్కొనలేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.సాయికృష్ణను ఎక్కడ దహనం చేశారో ఎందుకు వెల్లడించలేదు?సాయికృష్ణను ఎలా కనుమరుగు చేశారన్నది కూడా రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మృతదేహం అనే అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే విషయాన్నే సిట్ అధికారులు ప్రస్తావించనే లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారు అనే కోణంలో సిట్ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? ఆయన మృతదేహాన్ని దహనం చేశారని భావిస్తున్న ప్రదేశాన్ని ఎందుకు గుర్తించ లేదు? వాస్తవానికి సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించి... అక్కడ అవశేషాలను సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపై ఉంది. ప్రధానంగా దంతపు అవశేషాలు అత్యంత కీలకం. మృతదేహాన్ని దహనం చేసినా దంతపు అవశేషాలు మిగిలే ఉంటాయి. వాటి నుంచి డీఎన్ఏ నమూనాలను పరీక్షించి నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించాలి. ఇంతటి కీలకమైన అంశాన్ని పోలీసులు ఎందుకు విస్మరించారన్నది సందేహాస్పదంగా మారింది. అంటే సాయికృష్ణ లాకప్ మరణం కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచాలన్నది పోలీసుల లక్ష్యమని స్పష్టమవుతోంది. తద్వారా ఈ హత్య వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులను రక్షించాలన్నదే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.క్రిమినల్ కుట్ర కోణాన్నే పట్టించుకోని సిట్ ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే...సాయికృష్ణ లాకప్ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు సిట్ అధికారులు బరితెగించారు. అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్నే పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. అందుకే సాయికృష్ణను ఎందుకు హత్య చేసి ఉంటారు? అనే కోణంలో కనీసం దర్యాప్తు చేయలేదు. విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ భూ వివాదం, విజయవాడలో ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థలో నిధుల వ్యవహారంలో రెండువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని... ఆ వ్యవహారాలను కప్పిపుచ్చేందుకే సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి సిట్ ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదన్నది కీలకంగా మారింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రజాప్రతినిధితోపాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్‌బాస్ పాత్ర బయటపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్ర కోణాన్నే విస్మరిస్తే... ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకేనా...!సాయికృష్ణ మిస్సింగ్ విషయంలో సీఐ నాగరాజుతోపాటు పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించారు. హెబియస్ కార్పస్ లాంటి కీలకమైన పిటిషన్‌కు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించే అధికారిక నివేదికపై సీపీ రాజశేఖర్‌బాబుకు ముందే సమాచారం ఉంటుంది. ఆయన ఆమోదంతోనే న్యాయస్థానానికి నివేదిక ఇస్తారు. కాగా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని సీఐ నాగరాజుతోపాటు విజయవాడ పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ సిట్ రిమాండ్ రిపోర్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనకు మే 6న అప్పగించినట్టు నాగరాజు పేర్కొన్నారని చెప్పారు. ఇక్కడ రెండు ప్రధాన సందేహాలు తలెత్తుతున్నాయి...» సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే అవాస్తవాలు చెప్పారా..? అలా చెబితే అందుకు సీపీతోపాటు విజయవాడ పోలీసులు బాధ్యులు అవుతారు. » లేదా... టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను సీఐ నాగరాజుకు అప్పగించినట్టు ప్రస్తుతం చెబుతున్న రికార్డులు ట్యాంపర్ చేసి ఉండవచ్చు. అధికారిక రికార్డులను ట్యాంపర్ చేయడం తీవ్రమైన నేరం. అందుకు సీపీ రాజశేఖర్‌బాబు, టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.ఈ రెండింటిలో ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..? అన్నది తేలాల్సి ఉంది.సీసీ టీవీ బ్యాకప్ ఫుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ధ్వంసమైనట్లు సిట్ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్ నుంచి ఫుటేజీని సిట్ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీ కావాలని సిట్ అధికారులు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమోరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరమని... ఆ మెమోరీ సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేటు సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.కాలయాపన చేసేందుకే సిట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్ అధికారులు వెంటనే వెళ్లి ఆ బ్యాకప్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?.. వారిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేటు సంస్థ ఇచ్చేంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్ ఫుటేజీ కూడా మాయం చేసే కుట్ర దాగుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పోలీసు ప్రధాన కార్యాలయంలో బ్యాకప్ ఫుటేజీ కూడా గల్లంతు అయితే అందుకు డీజీపీతోపాటు యావత్ పోలీసు ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొన లేదు. పోస్ట్‌మార్టం, మెడికల్ రికార్డులు లేనే లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నదీ చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్టు, రికార్డుల వివరాలు పేర్కొన లేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రస్తావనే లేదు. హత్య వెనుక కుట్ర కోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చి సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా 17 మంది
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం ..
-
నేనే చంపా..! రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు ఇవే
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. CI నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..!
-
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు.. మిస్సింగ్ కేసు కాదు.. రిపోర్ట్ లో సంచలన నిజాలు
-
నాగరాజుతో డీల్..? పెద్దల పేర్లు సేఫ్ ..?
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు: కోర్టులో సిట్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసు మిస్టరీ అధికారికంగా వీడింది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టడీయల్ డెత్ కేసుగా పేర్కొంటూ దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. అలాగే ఈ కేసులో అరెస్టయిన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (2nd AJM) కోర్టులో ఈ కేసు నిందితుడు సీఐ(సస్పెండెడ్) నాగరాజును హాజరుపరిచిన సిట్ అధికారులు.. దర్యాప్తులో వెలుగుచూసిన పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుకు సిట్ చెప్పిన షాకింగ్ నిజాలుసాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారుసాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశాంమొత్తం 17 మంది సాక్షులను విచారించాంమే 6న సాయికృష్ణను మార్కాపురంలో అరెస్ట్ చేశారుఅదే తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజుకు అప్పగించారునాగరాజు 24 గంటల్లోపు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదునాన్బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదుసాయికృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా పీఎస్‌లో చూసినట్లు ఓ ఎస్సై వాంగ్మూలం ఇచ్చాడుమృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్సై స్టేట్మెంట్ ఇచ్చాడుసాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక.. డెడ్‌బాడీని మాయం చేశారుకృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీఫుటేజీ లేదుమే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజీలు లేవువాటిని ఎవరు? ఎందుకు మాయం ఎందుకు చేశారనేది తేలాల్సి ఉందిఅయితే మే 6-8 తేదీల మధ్య.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు చెప్పాడుఇతర సాక్ష్యాలను పరిశీలించాకే.. కస్టోడియల్ డెత్‌గా నిర్ధారించుకున్నాంఈ కేసులో నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశాంఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదుఅక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం.. డెడ్‌బాడీ మాయం చేశారుహైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారుఆధారాలు మాయం కావడం సహా అన్నింటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాంసిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది ప్రకారం.. మార్కాపురంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాదె సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉన్నప్పటికీ, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు. ఇది కోర్టు ధిక్కరణ (Contempt of Court) కిందకు వస్తుందని పేర్కొన్నారు.అలాగే దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు వెల్లడించారు. మృతి విషయాన్ని మెజిస్ట్రేట్‌కు తెలియపర్చకుండా.. మృతదేహాం మాయం చేశారని తెలిపారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారన్న ఆరోపణలకు ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. నాగరాజు నుంచి కీలక ప్రశ్నలకు సమాధానం దొరకలేదని సిట్ కోర్టుకు తెలిపింది. సాయికృష్ణను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు?లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ డెడ్‌బాడీని ఏం చేశారు?పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందన సిట్ కోర్టుకు తెలిపింది. అందుకే మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది.నాగరాజుకు రిమాండ్రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిందితుడు నాగరాజుకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది కోర్టు. జులై 8న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టమని సిట్‌ను ఆదేశించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ, సిట్ దర్యాప్తు, తాజాగా కోర్టులో వెల్లడైన అంశాలు కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లాయి. సీఐ(సస్పెండెడ్) నాగరాజు రిమాండ్ రిపోర్టులో నమోదైన అంశాలు, సిట్ కోర్టుకు సమర్పించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
-
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు
-
బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!
ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే ఎంత చిన్న కేసు అయినా దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ కేసును చంద్రబాబు ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ తల్లికాని, ఇతర కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి, చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లతో పాటు లోకేష్‌కు కూడా ధన్యవాదాలు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే భయపడ్డారేమో అన్న సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో అన్న సంశయం కలుగుతుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై పోరాటం ఆపబోమని అన్నారు. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు. సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక, పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. ఇటీవలి కాలంలో పలు ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా ఇబ్బంది పడుతుండడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటే మొత్తం కేసు బలహీనపడిపోవచ్చని అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్ హింసలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు. తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది. కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం చేయలేరని, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన అన్నారు..సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లోను, తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను పెట్టి తీవ్రంగా హింసించడం, గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ ప్రభావం అధికంగా ఉన్న రోజులలో కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది. బలహీనవర్గాలవారిపైన ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా హింసించడం, చిన్న,చిన్న కేసులలో సైతం వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం, అదే టీడీపీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్ దాడి చేస్తే మాత్రం పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ జగన్ దేశం అంతటికి తెలియచేసే యత్నం చేశారు. చంద్రబాబు ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదులో ఏముంది?ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.దండ రెడీ చేసుకో..విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్‌లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే హైకోర్టుకు.. సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
CI నాగరాజు మామూలోడు కాదు.. ఆ రోజు స్టేషన్ లో జరిగింది ఇదే
-
ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. ఎవరి పేర్లూ చెప్పొద్దు
సాక్షి, అమరావతి : ‘వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. మిత్రపక్షం అందుకు సిద్ధంగా ఉంది. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం వెనుక సూత్రధారుల పేర్లు బయటపెటొద్దు.’ – ఇదీ సీఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆఫర్.సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ, ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్‌బాస్‌తోపాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయటపెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగరాజుకు సన్నిహితుడైన రిటైర్డ్ డీజీపీ ఈ మేరకు రాయబారం నడిపినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అజ్ఞాతం వీడి, అరెస్టుకు సహకరించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఐ నాగరాజు అరెస్టుకు ముందు తెరవెనుక సాగిన వ్యవహారాలు ఇలా ఉన్నాయి.నేను ఒప్పుకోను.. అందరిపేర్లు బయటపెడతా – ఎదురుతిరిగిన సీఐ నాగరాజుకాపు యువకుడు సాయికృష్ణను లాకప్‌లోనే కనుమరుగు చేసిన వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. టీడీపీ కీలక నేతల భూ దందాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించిన ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంతోనే సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్‌బాస్ డైరెక్షన్లో కథ నడిపించారు. టాస్క్‌ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా, చినబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్‌బాస్ ఆమోదంతో గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి.. ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్బాస్లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల భూ, ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడ.అందుకే ఈ కేసులో ఏ1, ఏ2గా ఉండాల్సిన బాస్, టాస్క్‌ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సీఐ నాగరాజు వరకే ఎఫ్ఐఆర్ను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడ పట్ల సీఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తనను ఒక్కడిని ఇరికించి.. పెద్దలు అందరూ తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆయన ప్రభుత్వ, పోలీసు పెద్దలకు ఝలక్ ఇచ్చారు. ‘అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టాస్క్‌ఫోర్స్ సీపీ ఆధీనంలో పని చేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు’ అని సీఐ వాదించినట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి గానీ, తనకు అప్పగించినట్టు ఉన్నాయా.. అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ, పోలీసు పెద్దలు షాక్‌కు గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు. రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారంసీఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు. ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్‌ను కూడా వెల్లడించారు. దాంతో రిటైర్డ్ డీజీపీ.. సీఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్టు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సీఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లూ బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్టు అయితే త్వరగా బెయిల్‌పై విడుదల అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఈ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిందంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించినట్టు పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ను అరెస్టు చేయాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా ప్రభుత్వం తెరవెనుక నుంచి డ్రామాకు తెరతీసింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి ఆందోళనలు చేయిస్తుండటం గమనార్హం. -
సిట్ ప్రశ్నలకు CI నాగరాజు షాకింగ్ సమాధానాలు
-
తప్పు ఒప్పుకున్న CI నాగరాజు..? ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి?
-
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
-
ఒకరు కాదు ఇద్దరు కాదు.. 28 మంది వరకు ఈ కేసులో నిందితులు ఉన్నారు
-
CI నాగరాజు అరెస్ట్ పై, సీసీ టీవీ ఫుటేజ్ మాయం పై.. దేవినేని అవినాష్ రియాక్షన్
-
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, సీసీ పుటేజ్ మాయం ఎందుకు చేసారంటే ..!
-
సాయికృష్ణ కేసు: సీఐ నాగరాజు అరెస్ట్!
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్.. మంగళవారం నాగరాజు నివాసానికి వెళ్లింది. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.అయితే తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టగా.. సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం.. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం నాగరాజును పోలీస్ గెస్ట్‌హౌజ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అక్కడ వైద్యపరీక్షల అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. నాగరాజు అరెస్ట్‌పై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేసి ఉంటారనే అనుమానాల నడుమ.. ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని నాగరాజు మాయం చేసినట్లు.. లాకప్‌డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ వ్యవహారంలో సస్పెండైన సీఐ నాగరాజు పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ రికార్డులను పరిశీలించిన సిట్ అధికారులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సిన ఫుటేజ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడాన్నిగుర్తించినట్లు సమాచారం. నెల రోజుల వ్యవధిలో.. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉంచబడినట్లు తేలింది. మిగతా రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడ్డాయా? గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ చేశారా? నాగరాజే వీటి వెనుక ఉన్నాడా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలకు ముందే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ సాంకేతిక లోపమా లేదంటే కీలక ఆధారాలను చెరిపివేసే ప్రయత్నమా? అనే దానిపై విచారణ ముమ్మరమైంది.సాయికృష్ణ కేసు దర్యాప్తుకు ఈ సీసీటీవీ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వగల ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఫుటేజ్ లేకపోవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఐ నాగరాజే ఉద్దేశపూర్వకంగా వాటిని మాయం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే.. సాయికృష్ణ కేసులో కీలక ఆధారాలు అందుబాటులో లేకుండా పోవడంతో అప్పటి పోలీసు అధికారుల పాత్ర, కేసు నిర్వహణ తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీ ఫుటేజ్ మాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిట్, బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపుగా మారింది. -
ఆ పాపను ఎన్ని చిత్రహింసలు పెట్టాడంటే.. CI నాగరాజుపై జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు
-
పక్కా ప్లాన్.. సూత్రధారులు ఎస్కేప్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్, కనుమరుగు వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. సీఐ నాగరాజు ఒక్కడినే బాధితుడిగా చేసి, మిగిలిన ప్రభుత్వ, పోలీసు పెద్దలను కేసు నుంచి తప్పించేందుకు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొనే సమయంలోనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గంటల తరబడి చర్చించి, పోలీసు పెద్దలకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. అక్రమ నిర్భందం గురించి దాచి ఉంచినందుకు 127(6) సెక్షన్‌ను జోడించారు. కరకట్ట బంగ్లా డైరెక్షన్లోనే ఈ కేసులో దర్యాప్తు సాగుతోందని తెలుస్తోంది. దీంతో విచారణాధికారులు సైతం మొదటి రోజు సీఐ ఒక్కడినే బాధ్యుడిగా చేసేలా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీని విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను ఎప్పుడు తీసుకు వచ్చారు.. ఇందు కోసం ఎవరిని పంపించారు.. విజయవాడకు తీసుకొచ్చాక ఎవరికి అప్పగించారు.. అని ప్రశ్నించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకు సిబ్బందిని పంపించినట్లు ఆమె వివరించినట్లు సమాచారం. దీంతో సాయికృష్ణను తీసుకు వచ్చిన నలుగురు కానిస్టేబుళ్లనూ ప్రశ్నించారు. వీరు ఏం చెప్పారన్నదే ఈ కేసులో కీలకం కానుంది. సాయికృష్ణ మార్కాపురం నుంచి తెచ్చి, సీఐ నాగరాజుకు అప్పగించామనే ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు సమాచారం. కోర్టులో ఒకలా.. దర్యాప్తులో మరోలాసాయికృష్ణ కుటుంబ సభ్యులు ‘మా కొడుకును చూపండయ్యా..’ అని వేడుకొంటూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఖాకీలు కనికరించలేదు. ‘నీకొడుకు లేడు.. ఫొటోకు దండేసుకో’ అంటూ సీఐ హేళనగా మాట్లాడారని తల్లి కన్నీటి పర్యంతమైంది. దీంతో జూన్ 2న కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 4న విచారణకు వచ్చింది. జూన్ 15వ తేదీన సాయికృష్ణను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. అయితే పోలీసుల తరఫున వాదనలు వినిపించిన ఏజీపీ కృష్ణ ప్రణీత్.. సాయికృష్ణ అచూకీ తెలియదని, అందుకే కోర్టు ముందు హాజరు పరచలేదని తెలిపారు. అతన్ని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రస్తుతం మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ అధికారికి ఇచ్చిన సమాచారం కీలకమవుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండానే సాయికృష్ణ అచూకీ తెలియలేదని ఏజీపీ కోర్టుకు ఎలా నివేదిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇది లా ఉండగా సాయికృష్ణను తెచ్చి రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కాకుండా, బయట హోటల్లో ఉంచి.. కొట్టి చంపి, దహనం చేయడం వెనుక ఓ పెద్ద సెటిల్మెంట్ వ్యవహారమే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ, పోలీసు పెద్దల హస్తం ఉండటం వల్లే ఇలా చేశారని విశ్వసనీయంగా తెలిసింది.40 రోజులు ఎలా మేనేజ్ చేశారు?సాయికృష్ణ మృతి చెందాక.. అనాథ శవంగా చిత్రీకరించి కృష్ణలంక స్వర్గపురి (విద్యుత్ శ్మశాన వాటిక)లో దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణాధికారులు అక్కడి సీసీ పుటేజీ, అక్కడి నిబంధనల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఎలా దహనం చేశారన్న దానిపై ఆరా తీశారు. అయితే అనాథ శవాలను దహనం చేసినప్పుడు నిబంధనల ప్రకారం బూడిద ఇవ్వాల్సిన అవసరం లేదని స్వర్గపురి సిబ్బంది చెబుతున్నారు.అందుకే పోలీసులు ఇలా స్కెచ్ వేశారని సమాచారం. మొత్తంగా ఈ కేసులో సూత్రధారులను రక్షించేలా పక్కా ప్రణాళికతో దర్యాప్తు సాగుతోందని పోలీసు వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం 40 రోజులపాటు మేనేజ్ చేశారంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీలకు.. నగర పోలీస్‌బాస్ చెప్పకుండా ఎలా ఉంటారని పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ చెప్పకుండా దాచి ఉంచారనుకుంటే అది నేరమే అని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శకు వచ్చి ఉండకపోతే ఈ కేసు తెరమరుగయ్యేదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ రాక వల్లే ప్రభుత్వంలో ఒక్కసారిగా చలనం వచ్చిందని, ప్రజల్లో చులకనై పోతామనే భయంతో ఆగమేఘాలపై సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, సీఎస్, సీపీలు సమీక్షలు.. సీఐ సస్పెండ్, కేసు నమోదు.. ఇలా అన్నీ చకచకా జరిగిపోవడం తెలిసిందే. -
నేను స్టేషన్ కి రాను.. వస్తే మీ బండారం బయటపెడతా!
-
నా కొడుకు క్రాంతి కుమార్ ఎలా చనిపోయాడో.. నిజాలు బయటపెట్టిన తండ్రి
-
వీడియోలో ఏముంది..? ఒక్కొక్కటిగా బయతీకువస్తున్న సీఐ అరాచకాలు
-
పోలీసులే హంతకులైతే.. సీబీ‘ఐ’తోనే న్యాయం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ రాష్ట్ర పోలీసుల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పౌరులను, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే హంతకులుగా మారినప్పుడు జరిగే ఘోరానికి.. తమిళనాడులోని తూత్తుకుడి (సాతాన్‌కుళం), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (కృష్ణలంక)లలో జరిగిన రెండు భయంకరమైన లాకప్‌డెత్‌లు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడులో కరోనా సమయం 2020 జూన్‌లో పాన్ షాపు మూసివేతకు సంబంధించిన ఒక చిన్న వ్యవహారంలో జయరాజ్–బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి లాకప్‌డెత్ చేసిన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది. సదరు కేసులో ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అప్పట్లో జరిగిన ఆ దారుణంపై రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ కోర్టులో చెప్పిన సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు దర్యాప్తుతో ఏమాత్రం న్యాయం జరగదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టుకు ఇచ్చే సమాధానంపై ఆసక్తి విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీ తెలియకపోవడం, అతడి శవాన్ని మాయం చేసి కాల్చి బుడిద చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు 29వ తేదీన హైకోర్టుకు ఏం చెబుతారు? దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అదిరిపడి.. ఆగమేఘాలపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రభుత్వం తత్తరపాటుకు గురైంది. ఆలస్యం చేస్తే మరింతగా మెడకు చుట్టుకునేలా ఉందని బెంబేలెత్తిన ప్రభుత్వం.. వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలరింగ్ ఇచ్చింది. కృష్ణలంక సీఐని బలిపశువును చేసి, మిగతా పెద్దలందరూ బయటపడేలా పన్నాగం పన్నింది. వైఎస్ జగన్ గురువారం సాయికృష్ణ తల్లిని పరామర్శించగానే, ప్రభుత్వం ఆగమేఘాలపై కదిలింది. విజయవాడ నగర పోలీసు కమిషనర్ గురువారం రాత్రి 11 గంటలకు సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఫిర్యాదు తీసుకొని, అప్పటికప్పుడు కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ వై.దైవ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. అందులోనూ కృష్ణలంక సీఐ ఒక్కడినే బలిపశువును చేసి, మిగతా పెద్దలను తప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబరు 107/2026గా నమోదైన ఈ కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1) తోపాటు బీఎన్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా సీఐ నాగరాజును ఆరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లాకప్‌డెత్ వ్యవహారం ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి, పోలీసు బాస్, అందరికీ తెలిసినా మభ్యపెట్టే యత్నం చేశారు. మిగతా పెద్దలంతా కేసు నుంచి బయట పడేందుకు సీఐ ఒక్కడిపైనే కేసు నమోదు చేయడాన్ని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. రెండు గంటలు కుటుంబ సభ్యుల విచారణ విచారణాధికారి వై.దైవప్రసాద్ శుక్రవారం ఉదయమే ఇతర సిబ్బందితో కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గ నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. రెండు గంటలపాటు వారిని విచారించారు. మే 9న పోలీసులు తన వద్ద ఫోన్ లాక్కుని వెళ్లి, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకు వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలను అతని తల్లి వివరించారు. సీఐ నాగరాజుతో పాటు, అదే స్టేషన్‌లోని కానిస్టేబుళ్ల పాత్ర గురించి కూడా ఆమె వివరించారు.సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత విచారించిన టాస్‌్కఫోర్స్ ఏసీపీ లతాకుమారిని విచారణాధికారి దైవప్రసాద్ సాయంత్రం కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా, సాయికృష్ణ తల్లి మరో ఆరుగురు కానిస్టేబుళ్లపై ఆరోపణలు చేస్తుండగా, వారంతా అదే పోలీస్ స్టేషన్లో దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటప్పుడు విచారణ సక్రమంగా ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విధుల నుంచి తప్పించి విచారణ జరిపించాలని కోరుతున్నారు. స్టేషన్లో క్లూస్ టీమ్ తనిఖీలు కాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం తనిఖీలు చేశాయి. స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించాయి. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు చేయించుకున్న సంతకాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. నిందితులకు శిక్ష పడే వరకు నిద్రపోము: సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చి, అదృశ్యం చేసిన నాటి నుంచి మాకు మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు అనేక సార్లు సహకరించారు. మా కేసు వెలుగులోకి రావడంలో మీడియా కీలకంగా వ్యవహరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడేవరకూ నిద్రపోము. ఈ నెల 29న హైకోర్టు వాయిదా ఉంది. సీఐతో పాటు మిగతా వారి వివరాలు కూడా విచారణాధికారికి ఇచ్చాం -
హోటల్లో చంపేసి.. బస్టాండ్‌లో పారేసి!
సాక్షి ప్రతినిధి, విజయవాడ, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణది లాకప్ డెత్ కానే కాదని, ఇది ముమ్మాటికీ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యే అని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. విజయవాడ బందరు రోడ్డు రమేష్ హాస్పిటల్ సమీపంలోని ఓ హోటల్లో సాయికృష్ణను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని చెప్పారు. ఇందులో పోలీసులతోపాటు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, దీనికి సంబంధించి తన వద్ద ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడించారు.సాయికృష్ణను హత్య చేసి అనాథ శవంగా చిత్రీకరించి స్వర్గపురిలో శవ దహనం పూర్తి చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందన్నారు. జడ శ్రావణ్‌కుమార్ శుక్రవారం విజయవాడ గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాలను వెల్లడించారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తమ పార్టీ కాపు యువజన విభాగం అధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కేసు తేలాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు.. స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉన్నాయని నిందితులను హోటళ్లలో పెట్టి కొడుతున్నారన్నారు. జైభీమ్.. అంతకు మించిన సినిమాలను తలదన్నే రీతిలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ, ఉన్నతాధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఆ ఘటన జరిగిన క్రమం జడ శ్రావణ్‌కుమార్ మాటల్లోనే.. » గత నెల 8వతేదీన సాయంత్రం టాస్క్‌ఫోర్స్ సీఐ, కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్, ఏఎస్సై, బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురంలో మిత్రుడితో కలిసి ఒక రూంలో ఉంటున్న సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు.» ఆ రాత్రి అక్కడే ఉంచి 9వతేదీ ఉదయం స్టేషన్ నుంచి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.» అక్కడ ఒక రోజు ఉంచి.. ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ సమీపంలోని ప్రముఖ హోటల్‌కు తరలించారు. హోటల్ రూమ్ నంబరు 302లో సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రాత్రంతా సీఐ నాగరాజు హింసించారు. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ బుక్ అయింది. » విపరీతంగా కొట్టడం వల్ల సాయికృష్ణకు రక్తస్రావం అయ్యింది. కిడ్నీలు పగిలిపోయాయి. దవడ పగిలింది.. » సాయికృష్ణను వైద్యం కోసం 14వ తేదీన ప్రజావైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని, ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. » అక్కడి నుంచి 15వతేదీన మణిపాల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. » అక్కడ కూడా వైద్యుడు చేతులెత్తేయడంతో 16, 17వ తేదీలలో మళ్లీ హోటల్ రూంకు తరలించారు. » హోటల్ రూంలో ఆర్ఎంపీతో రెండు రోజులు ట్రీట్మెంట్ చేయించారు. » 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. » డెడ్‌బాడీని 24వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ 43వ నంబర్ ప్లాట్ఫారం వద్ద అనాథ యువకుడి శవంలా పడవేశారు. » అనంతరం తమకు ఏమీ తెలియనట్లుగా.. బస్టాండ్‌లో అనాథ శవం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి అనాథ శవాన్ని తగలబెట్టాలని టాస్క్‌ఫోర్స్ సీఐకి అత్యంత సన్నిహితుడైన మేనేజర్ ద్వారా వీఎంసీకి రిక్విజేషన్ ఇచ్చారు. » అనాథ శవంగా సీఐ నాగరాజు సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న స్వర్గపురిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ద్వారా 24వ తేదీన 5.45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.పవన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు కూటమి సర్కారు డెడ్‌బాడీ నో డెలివరీ ప్రభుత్వంగా పేరు సాధించిందని జడ శ్రావణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే నీకు జైలు జీవితం ఖరారైనట్లే అంటూ మంత్రి లోకేశ్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో న్యాయం నాలుగు పాదాల మీద కాదు.. 40 పాదాల మీద నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘సాయికృష్ణ మృతిపై హోం మినిస్టర్ మాట్లాడలేదు..! ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ బాధిత కుటుంబాన్ని కలవలేదు..’ అని విమర్శించారు. చేతి గీతలు అరగదీస్తామని, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు. ఆదిత్య నాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్‌కౌంటరేనని, అక్కడ 400కిపైగా జరిగాయని, పవన్ మాటల్లో అర్థం కూడా అదేనన్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడితే పోలీసులు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉంటారని ప్రశ్నించారు. గబ్బర్ సింగ్ సినిమా చూసే సీఐ నాగరాజు ఆ విధంగా తయారయ్యాడన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ‘ఎమ్మెల్యేలు అమ్మాయిలను రేప్ చేస్తే మాట్లాడరా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఢిల్లీలో పక్కన కూర్చోపెట్టుకుంటావా? నువ్వేం సనాతన ధర్మ సారధివి?’ అని మండిపడ్డారు.కేసును నీరు గార్చే కుట్రలు సాయికృష్ణ కేసులో ఇంత మంది పోలీసులు పాల్గొంటే కేవలం సీఐ నాగరాజు ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేశారని జడ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. సీఐపై నమోదు చేసిన హత్య కేసును నీరు గార్చే కుట్రలో తొలి అడుగు పడిందన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆధారాలు సేకరించిన తర్వాత అందులో భాగస్వాములైన వారిని చేర్చి హత్య కేసుగా మార్చాల్సి ఉండగా .. డెడ్‌బాడీ ఎక్కడుందో తెలియకుండా హత్య కేసుగా నమోదు చేశారన్నారు. ఇది కేసు మొత్తాన్ని నీరు గార్చే కుట్రలో భాగమేనని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ తరపున చివరి వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. -
పోలీసులే భక్షకులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘పోలీసులే భక్షకులవుతున్నారు. నా బిడ్డ బలవన్మరణానికి కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణం’’ అని పేరుపోగు క్రాంతికుమార్ తండ్రి, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విమర్శించారు. క్రాంతికుమార్ మరణానికి కారణమైన సీఐ నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘నేనొక సామాజిక ఉద్యమకారుడిని. సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు చేశాను. ప్రజల హక్కులు, దళిత హక్కుల కోసం పోరాడాను. నా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెల 21న ఉదయం 10.30 గంటల సమయంలో కృష్ణలంక పోలీసులు నా కుమారుడి ఇంటికి వచ్చారు. సీఐ రమ్మంటున్నారు. పోలీసు స్టేషన్‌కు రావాలని పిలిచారు. నా బిడ్డ భయపడి రానని చెప్పాడు. ‘‘సీఐ నన్ను చంపేస్తాడు’’ అని పోలీసులతో అన్నాడు. ‘‘నువ్వు వచ్చినా.. రాకపోయినా జరిగేది అదే’’ అని పోలీసులు బెదిరించారు. పోలీసులు పక్క ఇంట్లో ఉన్న నా భార్య వద్దకు వెళ్లి మీ అబ్బాయిని బయటకు రమ్మని చెప్పండని కోరారు. నా భార్య అక్కడికి వెళ్లి కొడుకును బయటకు రమ్మని చెప్పగా .. ‘‘వద్దమ్మ నేను బయటకు వస్తే చంపేస్తారు’’ అని భయపడుతూ నా కొడుకు చెప్పాడు. తర్వాత పోలీసులు వెళ్లిపోయారు. అనంతరం 11 గంటల సమయంలో నా కొడుకు గుళికల మందు తాగాడు. వెంటనే అక్కడే ఉన్న నా భార్య తలుపులు తీయాలని కోరగా తలుపులు తీశాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ వెంటనే హెల్ప్ హాస్పిటల్‌కు తరలించాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అదే రోజు రాత్రి హాస్పిటల్లో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నాడేమోనని తొలుత అనుకున్నాం. కానీ అతని ఫోన్ వెతకగా సెల్ఫీ వీడియో బయటపడింది. దీనిపై సీపీకి ఫిర్యాదు చేశాం. దీంతో సీపీ వారం గడువు కావాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు రాయబారానికి వచ్చారు. నేను నా కొడుకు మరణంపై ప్రైవేటు కేసు వేయడానికి సిద్ధమయ్యా.’’ అని వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. మా అబ్బాయి ఒక్కడే కాదు...పోలీసుల మీద నమ్మకం కోల్పోయానని పేరుపోగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ‘‘మా అబ్బాయి ఒక్కడే కాదు. అతని కంటే ముందే సాయికృష్ణ అనే అతన్ని కూడా పోలీసులే గోళ్లు పీకి లాకప్ డెత్ చేసిన విషయం బయట పడింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను ప్రైవేటు కేసు వేసేందుకు సిద్ధమై లాయర్లను కలుసుకున్నా. ఈ క్రమంలో గురువారం నా కుమారుడు వీడియో బయటకు వచ్చింది. నేనైతే వీడియో బయటికి పంపలేదు. కానీ క్రాంతి చనిపోయే ముందు తన స్నేహితులకు ఆ వీడియో పంపాడు. వారి ద్వారా బయటకు వచ్చింది. నా కొడుకు రౌడీషీటరే. కాదనను. సాయికృష్ణ, నా బిడ్డ క్రాంతికుమార్ వీరికంటే ముందు ఇంకా అనేక మంది సీఐ వేధింపుల బారిన పడ్డారు.’ అని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారు‘‘పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని పోలీసులు తమ వ్యక్తిగత స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. పోలీసులు చెప్పినట్లు చేయకుంటే వారం వారం స్టేషన్‌కు రావడం లేదన్న పేరుతో కొట్టి వేధిస్తున్నారన్నారు. నా బిడ్డ ఇవన్నీ నాకు చెప్పుకోలేక పోయాడు. ఒకటి రెండు సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చాడు. ప్రతిసారీ పోలీసులు ఇంటికి రావడం వల్ల నా బిడ్డ భయపడిపోయాడు. సెల్ఫీ వీడియోలోనూ నేను ఎస్సీ మాదిగగా పుట్టడమే తప్పా అంటూ ఆవేదన చెందాడు. సీఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. అతడిని తక్షణమే అరెస్టుచేయాలి. కఠినంగా శిక్షించాలి’’ అని వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా బిడ్డలా ఎవరూ బలి కాకూడదు‘‘నా బిడ్డ ఆత్మహత్యపై నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. అంత్యక్రియలు, ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అయ్యాక స్పందించాలనుకున్నా. దీంతో నేను ప్రలోభాలకు లొంగిపోయానని వార్తలు వచ్చాయి. నేనెవ్వరికి లొంగిపోలేదు. నా బిడ్డ మరణంపై న్యాయ పోరాటం చేస్తా. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కూడా స్పందించాలి. నేను కోరుతున్నది ఒక్కటే . ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలి. నా బిడ్డలా ఏ వ్యక్తి బలికాకూడదు.’’ అని పేరుపోగు వెంకటేశ్వరరావు కన్నీరుమున్నీరయ్యారు. -
నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో
-
వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శ తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు.. సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్ తప్పదని.. ఆ తర్వాత ఈ కేసులో మరికొంత మంది ఖాకీలపైనా చర్యలు ఉంటాయంటూ లీకులు వస్తున్నాయి. ఈ కేసులో సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ ఇవాళ విజయవాడ రానున్నారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, విజయవాడ సీపీ రాజశేఖర బాబులను కలిశాకే.. కృష్ణలంక స్టేషన్‌కు వెళ్తారని సమాచారం. ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు! -
తన చావుకు కారణం సీఐ నాగరాజేనని సెల్ఫీ వీడియో
-
నా కళ్లారా చూశా లాక్అప్లోనే ఉన్నా, ప్రత్యక్ష సాక్షి షాకింగ్ నిజాలు
-
CI నాగరాజు దాష్టీకం నాగరాజు, మరో యువకుడు బలి
-
అవును వాడు రౌడీ నే.. 22 కేసులున్నాయి.. కానీ వాడిని చంపడానికి నువ్వు ఎవడ్రా..
-
లాకప్‌డెత్‌తో సర్కారు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్‌డెత్ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలివిగా తప్పుకున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్‌కళ్యాణ్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్ కళ్యాణ్‌కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్‌కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. జనసేనలో కలకలం‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్‌డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులుసాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్‌లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇప్పుడేం చేద్దాం?సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలుఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చసాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్‌తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్ కమిషనర్‌ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్‌కు పంపామని చెప్పగా, సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. -
నీ కొడుకు చనిపోయాడు, ఆ రోజే చెప్పాడు ఇలా జరుగుతుంది అని కృష్ణ తల్లి
-
నా కొడుకు బతికున్నాడా.. చంపేశారా?
విజయవాడ లీగల్: ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విలపిస్తూ చెప్పారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె మంగళవారం న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల 9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు. తన సెల్‌ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు. సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చినట్లు నిజనిర్ధారణ అయింది బీబీఏ మానవహక్కుల కమిటీ చైర్మన్, సీనియర్ న్యాయవాది ఏ.ఎస్.ఎస్.రాంప్రసాద్ మాట్లాడుతూ మార్కాపురం నుంచి 20 రోజుల కిందట అక్రమంగా తీసుకొచ్చిన గాదె సాయికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో పలు కేసులతో సంబంధం ఉన్న గాదె సాయికృష్ణ కొంతకాలంగా మార్కాపురంలో ఉంటున్నాడని తెలిపారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక పోలీసులు అతడిని చిత్రహింసలకు గురిచేశారని అనుమానం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో బీబీఏ మానవహక్కుల కమిటీ తరఫున కృష్ణలంక సీఐ నాగరాజును అడగగా తాము సాయికృష్ణను తీసుకురాలేదని చెప్పారన్నారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజి ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. బార్ అసోసియేషన్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మార్కాపురం వెళ్లి విచారించారని, సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని అక్కడివారు చెప్పారని తెలిపారు. సాయికృష్ణ బయటకు రాలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడా? లేక చంపేశారా అన్న అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉంటే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచాలేగానీ పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను కోర్టులో హాజరుపర్చకపోతే బాధితురాలి పక్షాన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇలాగే బెజవాడ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు చేసినప్పుడు బీబీఏ న్యాయవాదులు పోరాటాలు చేసి అటువంటి ఘటనలు తిరిగి జరగకుండా అడ్డుకట్టవేశారని ఆయన గుర్తుచేశారు. -
కనకమహాలక్ష్మి ఆలయంలో అపచారం
డాబాగార్డెన్స్ (విశాఖ): ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది. ఆలయాల పవిత్రతను, సనాతన ధర్మ నియమాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆలయ చైర్మనే నిబంధనలను తుంగలో తొక్కి పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం నూతన ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా జనసేనకు చెందిన కందుల నాగరాజు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆయన ఆలయంలో ఏకంగా చెప్పులు వేసుకుని తిరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రతి దేవాలయానికి నిర్దిష్ట ఆగమ శాస్త్ర నియమాలు ఉంటాయని, వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిన పాలకమండలి చైర్మనే ఇలా వ్యవహరించడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని భక్తులు, అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అత్తమామలను చంపిన అల్లుడికి ఉరి
వరంగల్ లీగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడానికి అమె తల్లిదండ్రులు (అత్తమామలు) కారణమని భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు జడ్జి జె. మైత్రేయి బుధవారం సంచలన తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజుకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు చెందిన బానోతు దీపిక ప్రేమించుకున్నారు. 2023లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే పెళ్లయినప్పటి నుంచే దీపికను నాగరాజు గృహహింసకు గురిచేయడంతో భరించలేని ఆమె 2024లో పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు దీపిక తల్లిదండ్రులే కారణమని కక్ష పెంచుకున్న నాగరాజు.. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. 2024 జూలై 10న అర్ధరాత్రి దాటాక 16 చింతల తండాకు చేరుకొని నిద్రిస్తున్న దీపికతోపాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బానోతు శ్రీను మృతి చెందాడు. -
తండ్రి ఆస్తి ఇవ్వడం లేదని కొడుకు ఆత్మహత్య
మోమిన్‌పేట: తండ్రి తనకు ఆస్తి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన ఓ కొడుకు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం కేసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. గ్రామానికి యాదయ్య కుమారుడు నాగరాజు అలియాస్ (నరేందర్) (40) పదిహేనేళ్ల క్రితం ఏపీలోని గుంతకల్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఒంటరిగా గ్రామానికి వచ్చిన నాగరాజు.. తండ్రి పేరున ఉన్న 15 గుంటల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తమ భూమిని, ఇంటిని ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ అలా కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్తిని తిరిగి స్వా«దీనం చేసుకుంటానంటూ శుక్రవారం నోట్ రాసి పంచాయతీ కార్యాలయానికి అందజేశాడు. ఆ తర్వాత శనివారం ఉదయాన్నే మద్యం తాగి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. తండ్రి ఆస్తిని తన పేరున రిజి్రస్టేషన్ చేస్తేనే దిగుతానని, లేదంటే ఇక్కడే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు. అతనితో మాట్లాడిన స్థానికులు భూమి ఇప్పిస్తామని చెప్పినప్పటికీ టవర్‌పై ఉన్న ఓ తీగతో ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్, ఎస్ఐ భరత్‌భూషణ్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని దించారు. కొడుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందున ఆస్తి ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో.. నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. -
తిరుపతి చంద్రగిరిలో దారుణం..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు కళ్ల ఎదుటే మహిళపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేస్తూ టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు రెచ్చిపోయాడు. భూ వివాదంలో విశ్వేశ్వరి అనే మహిళపై నాగరాజ నాయుడు దాడికి పాల్పడ్డాడు. సర్వే నెంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలం విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా బేఖాతరు చేస్తూ నాగరాజ నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే బాధితురాలిపై విచక్షణా రహితంగా నాగరాజు నాయుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు.అనంతరం, బాధితురాలు మాట్లాడుతూ..‘టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమ కుమార్, వంశీ ఒత్తిళ్లు వల్లే మాపై దాడి చేస్తున్నారు. మా భూమిని కబ్జా చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి నన్ను రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఈ విషయమై 12 సార్లు ఫిర్యాదు చేశాను. అయినా నాకు న్యాయం జరగలేదు. నన్ను చంపేస్తారని భయంగా ఉంది. నాకు న్యాయం చేయండి’ అని వేడుకుంది. -
కామంతో కాటేసిన జనసేన కార్యకర్త
గుంటూరు రూరల్: పదో తరగతి విద్యార్థినిపై కన్నేసిన జనసేన కార్యకర్త తన పశువాంఛ తీర్చుకున్నాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వివరాలు వెల్లడించకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. నిందితుడు జనసేన కార్యకర్త కావటం, అధికార పార్టీ నాయకులు చేసే అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా పోలీసులు గోప్యత పాటిస్తున్నట్టు తెలిసింది. తనపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్న సమాచారం తెలుసుకున్న జనసేన కార్యకర్త పరారైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓబులునాయుడు పాలెం గ్రామానికి చెందిన మాదల నాగరాజు(35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల సమయంలో జనసేనలో చురుగ్గా పనిచేసిన అతడు చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేస్తున్నాడు. కాగా.. డంపింగ్ యార్డు సమీపంలోని ఓ కాలనీకి చెందిన ఒక మహిళతో నాగరాజుకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహిళ ఇంటి పరిసరాల్లో మైనార్టీ వర్గానికి చెందిన పదో తరగతి బాలికపై నాగరాజు కన్నుపడింది. అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ సైతం నాగరాజు ఇచ్చే డబ్బుకు ఆశపడి చిన్నారిని సమిధగా మార్చి అతడి కామవాంఛ తీర్చేందుకు సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యంగా కనిపించటంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులకు వాస్తవం తెలిసిపోవడంతో నాగరాజు అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కలిసి రాజీ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులు నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో అతడు పరారైనట్టు తెలిసింది. బాలికను నాగరాజుతో చనువుగా ఉండేందుకు కృషిచేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడికి అధికార పార్టీ పెద్దల అండ ఉండటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని తెలిసింది. -
వీల్ చైర్ లో నాగరాజు..చలించిపోయిన YS జగన్
-
నకిలీ మద్యం కేసు: నాగరాజు అరెస్ట్.. సీఐ హిమబిందుపై వేటు
ములకలచెరువు/మదనపల్లె/గన్నవరం/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన వారి సంఖ్య 14 మంది. తొలిరోజు 10 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురిలో కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, విదేశాల్లో ఉన్న జనార్దనరావు అరెస్ట్ కావాల్సి ఉంది. ఇదే కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఆ ఏడుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. కాగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన కల్తీ మద్యం తయారీ కేసులో మద్యం నింపేందుకు ఖాళీ బాటిళ్లను సరఫరా చేసిన సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్‌కు చెందిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మద్యం నింపేందుకు వినియోగించిన 90 ఎంఎల్ (క్వార్టర్) ఖాళీ బాటిళ్లను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లోని శ్రీనివాస పెట్ బాటిల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మంగళవారం ఆ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు కంపెనీ నిర్వాహకుడైన గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులకు 17 వరకు రిమాండ్ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసిన ముగ్గురికి కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాధల్ దాస్, ప్రతాప్దాస్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం 6వ ఎంఎం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా, ముగ్గురికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.అధికార పార్టీ నేతల్ని వదిలేసి.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు మదనపల్లె: అధికార పార్టీ పెద్దల అండదండలతో సాగిన నకిలీ మద్యం దందాలో అసలైన సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి ఎక్సైజ్ అధికారిపై వేటు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ దందా నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ హిమబిందును విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఎక్కడో అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తుంటేనే దాడులు చేసే ఎక్సైజ్ అధికారులకు ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గురించి తెలియక పోవడం విడ్డూరం అని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అందరిపై అన్ని విధాలా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం, బెల్డ్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు.. ఇలా ఇన్ని జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలుపుతోంది. -
బీమా పథకాల మిస్–సెల్లింగ్ వద్దు..
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఒక పాలసీ గురించి చెప్పి మరో పాలసీని అంటగట్టే (మిస్–సెల్లింగ్) ధోరణులను నివారించడంపై బ్యాంకులు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎ నాగరాజు సూచించారు. ఇన్సూరెన్స్ అనేది చాలా సున్నితమైన ఆర్థిక సాధనమని, కస్టమర్లకు విక్రయించే ముందు, దాని గురించి క్షుణ్నంగా వివరించాలని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటలీకి చెందిన జనరాలి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగరాజు ఈ విషయాలు తెలిపారు. మిస్–సెల్లింగ్ వల్ల కస్టమర్లకు ప్రీమియంల భారం పెరిగిపోతుందని, ఫలితంగా పాలసీదారులు తమ పాలసీని మళ్లీ పురుద్ధరించుకోరని ఆయన పేర్కొన్నారు. ప్రీమియంలు అధికంగా ఉన్నా కూడా బీమా కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడరు కాబట్టి ప్రీమియంలు సహేతుకంగా ఉండేలా కంపెనీలు చూసుకోవాలని నాగరాజు సూచించారు. కస్టమర్ల క్లెయిమ్‌లు సకాలంలో, సముచితంగా ప్రాసెస్ అయ్యేలా బీమా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 24.91 శాతం, ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 25.18 శాతం వాటాల కొనుగోలు పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. -
ఇంటింటా చేదు అనుభవం
కర్నూలు(హాస్పిటల్): ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో కర్నూలు ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఇంటింటా చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ ప్రజలు నిలదీశారు. పింఛన్ ఇవ్వట్లేదని, గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు బుధవారం ఉదయం నగరంలోని బుధవారపేటలో పర్యటించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. వారు తిరిగిన ఇళ్లల్లో అత్యధిక శాతం మంది తమకు సంక్షేమ పథకాలేవీ అందడం లేదని జవాబులివ్వడంతో.. టీడీపీ నేతలు కంగుతిన్నారు.పింఛన్ ఎందుకివ్వట్లేదు?పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏడాదైనా ఇప్పటికీ మంజూరు చేయలేదని సుంకులమ్మ అనే వృద్ధురాలు ప్రశ్నించింది. తనకు పదేళ్ల క్రితం ప్రమాదంలో కాళ్లు పోయాయని.. అయినా వికలాంగుల పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని సందెపోగు రఘు అనే వృద్ధుడు నిలదీశాడు. కనీసం వృద్ధాప్య పింఛన్ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డాడు. పదో తరగతి చదువుతున్న తనకు తల్లికి వందనం డబ్బులు పడలేదని మేరి కుమారి అనే విద్యార్థిని వాపోయింది. తమకు ఉచిత గ్యాస్ పథకం ఎందుకు వర్తింపజేయలేదంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి టీడీపీ నేతలను నిలదీశారు. తాను బీటెక్ పూర్తి చేశానని.. ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని దీపిక అనే యువతి కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాగానే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి భరత్ జవాబివ్వడంతో ఆమె షాక్‌కు గురైంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎవరో ఒకరిద్దరు పథకాలు అందలేదని చెబితే ‘సాక్షి’లో అవే చూపిస్తారంటూ అక్కసు వెళ్లగక్కారు.వితంతు పింఛన్లు ఎప్పుడిస్తారు?జి.సిగడాం: ‘ఎంపీ బాబూ.. మా ఇంటి పెద్ద దిక్కు మరణించి ఏడాది కాలమైనా ఇంత వరకు వితంతువుల పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. మేమంతా అనాథలుగా ఉన్నాం. వీటితోపాటు తల్లికి వందనం కింద రూ.15 వేలు అన్నారు. రూ.13 వేలు మాత్రమే మా ఖాతాలో జమ చేశారు. ఇదేనా సుపరిపాలన?’ అంటూ వితంతువులు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆనందపురం గ్రామాల్లో నిలదీశారు. -
దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్‌ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్‌పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని అకౌంట్లోని రూ.33 వేలు ఫోన్‌పే ద్వారా వారి ఖాతాలకు జమ చేసుకున్నారు.ఈ విషయంపై బాధితుడు హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగరాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్‌ను కూడా కలిశాడు. -
తమ్ముళ్లు, అనుయాయులే ఎమ్మెల్యేలు
సాక్షి, నరసరావుపేట: వాళ్లు ఎంపీలో, ఎమ్మెల్యేలో కాదు.. కనీసం పంచాయతీ వార్డు మెంబర్లు కూడా కాదు. అయినా వారిదే ఆ నియోజకవర్గంలో పెత్తనం. మరి వారికున్న అర్హతలేమిటంటే.. సదరు ప్రజాప్రతినిధి వారసులు, సోదరులు, బంధువులు, ఆత్మీయులు కావడమే. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ప్రభుత్వ పథకాలు మొదలు.. పదవులు, కాంట్రాక్టులు అన్నింటిలోనూ జోక్యం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని దాచుకుంటున్నారు. ఈ పరిస్థితి పల్నాడు జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుమారులు కన్నా నాగరాజు, కన్నా ఫణీంద్రలు అంతా తామే అంటూ అధికారం చెలాయిస్తున్నారు. భూముల సెటిల్మెంట్లు, మద్యం దందా.. ఇలా అన్నింటికీ రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రతి పనికి కప్పం కట్టాల్సిందేనని లావాదేవీలు చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఎన్నికల సమయంలో ఆరి్థక వ్యవహారాలు చూసుకున్న కాంట్రాక్టర్ దరువూరి నాగేశ్వరరావు కూడా ఇప్పుడు అన్నీ తానై షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తమ్ముడు నవీన్ చిన్న ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ప్రవీణ్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంటే నవీన్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడు. ఇసుక రీచ్‌ల వద్ద అనధికార టోల్గేట్లు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమరావతి మండలంలో ఎర్రమట్టి దందా ఇతని కనుసన్నల్లోనే సాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లను తొలగిస్తున్నారు. మద్యం సిండెకేట్, బెల్టు షాపుల వ్యవహారం అంతా ఈయన చెప్పినట్లే సాగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.మాజీ ఎమ్మెల్యేనా మజాకా! వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ‘మూడు రోజుల ఎమ్యెల్యే’ అని నియోజకవర్గ ప్రజలు పిలుస్తున్నారు. వారంలో ఆయన గరిష్టంగా నియోజకవర్గంలో మూడు రోజులే ఉంటారు. మిగిలిన నాలుగు రోజుల్లో సొంత వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా చేపల చెరువులన్నింటిని ఈయన తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమంగా మట్టి తోలడం, భూకబ్జాలు, నచ్చని వారిపై అక్రమ కేసులు, వేధింపులు ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు అల్లుడు వరసయ్యే విజయ్ అంతా తానై నడిపిస్తున్నాడు.గ్రావెల్‌కు అధిక ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న టిప్పర్ మట్టికి ప్రస్తుతం రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. కోటప్పకొండను అక్రమ గ్రావెల్‌కు అడ్డాగా మార్చారని, పోలీసులను అడ్డుపెట్టుకుని పంచాయితీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. చిలుకలూరిపేటలో అయితే అంతా ‘అమ్మ’గారి దయేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేరుకేనని, అంతా ఆయన భార్యదే పెత్తనమని చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఒకే మాట చెబుతున్నారు. అధికారులంతా ఆమె సేవలోనే తరిస్తున్నారని విమర్శిస్తున్నారు. -
మానవత్వమా.. కళ్లు మూసుకో!
నూజివీడు: టీడీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార జులుంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు సోమవారం మద్యం తాగి అదే గ్రామ టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్‌కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో సురేష్.. మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు పోలవరపు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కారుమంచి కిరణ్‌లతో కలిసి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా నాగరాజును తాళ్లతో బంధించి.. తీవ్రంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకెళుతూ కారులో వేసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే నాగరాజును తాళ్లతో నిర్బంధించి ఈడ్చూకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాపశివకిషోర్ దృష్టికెళ్లింది. అమానవీయంగా ప్రవర్తించిన నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్బాబులు నలుగురినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. -
ఇది కథ కాదు.. వచ్చినట్టే వచ్చి.. శాశ్వతంగా దూరం
బి.కొత్తకోట: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బిడ్డ.. 14 ఏళ్ల తర్వాత తల్లిండ్రుల వద్దకు చేరాడు. బిడ్డను చూసుకుని మురిసిపోతున్న ఆ తల్లిదండ్రుల నుంచి రెండేళ్ల తరువాత శాశ్వతంగా దూరమయ్యాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన శంకర, రెడ్డెమ్మ దంపతులకు ఆకాశ్, అభిలాష్ ఇద్దరు కుమారులు. 2008లో పెద్దకొడుకు ఆకాశ్ మూడేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. కాగా.. ఆకాశ్‌ను బెంగళూరులో ఉంటున్న రత్నమ్మ అనే మహిళ పెంచుకుంది. మూడేళ్లు పెంచుకున్నాక ఆమె మదనపల్లె మండలం కొత్తపల్లెలో ఉంటున్న ఆటో డ్రైవర్ నాగరాజు, లలితమ్మ దంపతుల వద్దకు ఆకాశ్‌ను పంపించింది. వాళ్లే ఆకాశ్‌ను పెంచుతూ వచ్చారు. ఆ తర్వాత నాగరాజు కుటుంబం నాయనబావికి మకాం మార్చింది. ఆ బిడ్డ.. మీ బిడ్డే.. ఆకాశ్ తల్లి రెడ్డెమ్మ చెల్లెలు మంజు బెంగళూరులో ఉంటూ కూలి పనులకు వెళ్తోంది. ఓ రోజు ఆకాశ్‌ను మూడేళ్ల పాటు పెంచిన రత్నమ్మ, మంజు కూలీ పనుల్లో కలుసుకున్నారు. మూడేళ్ల వయసులో అదృశ్యమైన పిల్లాడు దొరికాడా అని మంజును ఆరా తీసింది. లేదని మంజు చెప్పడంతో రత్నమ్మ అసలు విషయం చెప్పింది. నాగరాజు దంపతులు ఆ బిడ్డను తెచ్చి తనకు ఇచ్చారని, మళ్లీ వారికే ఇచ్చినట్టు తెలిపింది. ఈ విషయాన్ని మంజు తన అక్క రెడ్డమ్మకు ఫోన్ చేసి చెప్పింది. బిడ్డను తెచ్చుకునేందుకు తల్లి రెడ్డెమ్మ ఆటోడ్రైవర్ నాగరాజు వద్దకు వెళ్లగా.. ఆకాశ్ నీ బిడ్డ అనేందుకు ఆధారమేంటని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. వాడి నాలుకపై పుట్టు మచ్చ ఉంటుందని రెడ్డెమ్మ చెప్పింది.తల్లి చెప్పినట్టే ఆకాశ్ నాలుకపై పుట్టుమచ్చ ఉంది. తల్లి వద్దకు వెళ్లేందుకు మొదట్లో ససేమిరా అన్న ఆకాశ్.. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు ఆకాశ్ వయసు 19. ఈ క్రమంలో మంగళవారం రాత్రి వినాయక ఉత్సవాల్లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృత్యుఒడికి చేరాడు. -
పల్నాడులో మళ్లీ పేట్రేగిన టీడీపీ మూకలు..
సాక్షి, నరసరావుపేట, వినుకొండ (నూజెండ్ల): అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఎన్నికల హామీలపై ఏమాత్రం దృష్టిపెట్టని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా పక్కాగా అమలుచేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులను హత్యచేయడం, వారిపై దాడులకు తెగబడడం, ఆస్తులు ధ్వంసం చేసి గ్రామాల నుంచి వెళ్లగొట్టడం పల్నాడులో సర్వసాధారణమయ్యాయి. చివరికి సొంత ఊర్లో ఇళ్లు, పొలాలు వదిలి పొట్టకూటి కోసం వలస వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని సైతం వెంటాడి కిడ్నాప్ చేసి అంతమొందించడానికి తెలుగుదేశం పార్టీ గూండాలు వెనుకాడడంలేదు. తాజాగా.. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు ఆటోలో వెళ్తుండగా టీడీపీ నేతలు దారికాచి దాడిచేశారు. అందులోని అతని కుటుంబ సభ్యుల్ని గాయపరిచి నాగరాజును కిడ్నాప్ చేయడం తీవ్ర అలజడి రేపింది. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని నాగరాజును పోలీసుస్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి నాగరాజు బావమరిది రవి తెలిపిన వివరాలు ఏమిటంటే..వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన నాగరాజు కుటుంబ సభ్యులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సొంత గ్రామం జంగమేశ్వరపాడు గ్రామాన్ని విడచిపెట్టి వినుకొండలోని తన బావమరిది రవి వద్దకు వచ్చి ఉంటున్నారు. బతుకుతెరువు కోసం ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. నాగరాజు తన తల్లి వెంకమ్మ, బావమరిది రవితో కలిసి గురువారం ఉ.8.30 ప్రాంతంలో వెల్లటూరు వైపు వెళ్తుండగా వెంకుపాలెం కురవ వద్దకు రాగానే టీడీపీ నేతలు కారుతో ఆటోను అడ్డగించారు. కారులో వచ్చిన సుమారు 8 మంది రవిపై కత్తులతో దాడిచేసి గాయపరిచారు. ఆ తర్వాత నాగరాజు తల్లిపైనా దాడిచేసి నాగరాజును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెల్లటూరు వైపు దూసుకెళ్లారు. కిడ్నాప్ చేసింది జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ నేతలే అని నాగరాజు కుటుంబ సభ్యులు నిర్థారించారు.అందరూ చూస్తుండగానే..పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తూ నాగరాజును కిడ్నాప్ చేయడంతో వినుకొండ ప్రాంతంలో అలజడి రేగింది. అక్కడున్న స్థానికులు దాడిలో గాయపడిన రవి, నాగరాజు తల్లి వెంకాయమ్మలను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న నాగరాజు భార్య, నాగమల్లేశ్వరి, చెల్లెళ్లు భువనేశ్వరి, రజనీలతోపాటు నాగరాజు తండ్రి సాంబయ్య నాగరాజును చంపేస్తారని, కాపాడాలంటూ భోరున విలపించారు. ఆ టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు..నాగరాజు తండ్రి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. జంగమేశ్వరపాడుకు చెందిన టంగుటూరి శబరి కుమారుడు మల్లికార్జున, కొండా, ఆరెద్దుల మణి, కంచర్ల బొర్రయ్య కుమారుడు రామాంజి, నానారావు కుమారుడు జల్లయ్యతోపాటు మరో ముగ్గురు తన కుమారుడిని కిడ్నాప్ చేశారని తెలిపారు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద నాగరాజు భార్య సొమ్మిసిల్లి పడిపోయింది. ఆస్పత్రి ఆవరణలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బతుకుతెరువు కోసం, ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామంలో పొలాలు, ఇళ్లు వదలేసి దూరంగా బతుకుతున్నప్పటికీ టీడీపీ నేతలు తమను ఇక్కడ కూడా బతకనివ్వడంలేదని వాపోయారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుల పట్టివేత..నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ సీఐ శోభన్‌బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్ల సిగ్నల్ ఆధారంగా నిందితులను బొల్లాపల్లి మండలం మర్రిపాలెం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాడిలో ఏడుగురు పాల్గొనగా ఆరుగురిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. బాధితుడు నాగరాజును రక్షించిన పోలీసులు బొల్లాపల్లి స్టేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.కత్తులతో దాడిచేసి కిడ్నాప్ చేశారు..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బావ నాగరాజు కుటుంబం టీడీపీ దాడులకు భయపడి వినుకొండలో నా వద్దకు వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అయినాసరే వదిలిపెట్టకుండా గురువారం ఉదయాన్నే కత్తులతో దాడిచేసి గాయపరిచారు. అడ్డొచ్చిన మహిళలపై కూడా దాడిచేసి నాగరాజును కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నా ఫోన్‌ను సైతం లాక్కెళ్లారు. – రవి, దాడిలో గాయపడిన నాగరాజు బావమరిదినాగరాజుకు ఏం జరిగినాబాబుదే బాధ్యతమాజీమంత్రి అంబటి ఫైర్సాక్షి, అమరావతి: పల్నాడులో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజుకు ఎలాంటి హాని జరిగినా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీమంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పల్నాడులో నాగరాజు కిడ్నాప్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితను ప్ర శ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి. రాష్ట్రంలో ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నా యో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే వినుకొండలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తను అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనలపై చంద్రబాబు స్పందించాలన్నారు. మాజీమంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు.పోలీసులు చేతులేత్తేశారు: కొరముట్లరాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడే అంశంలో పోలీసులు పూర్తిగా చేతులేత్తేశారని, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేసేందుకే అన్నట్లుగా వారి ప్రవర్తన ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు తాడేపల్లిలో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. మొన్న వినుకొండ, నిన్న నంద్యాల, జగ్గయ్యపేట ఘటనలు జ రగ్గా ఈరోజు కిడ్నాప్ జరగడం అత్యంత దారుణమన్నారు. జగన్‌కి ఎక్కువ భద్రత ఉన్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
Nagaraju Incident in Palnadu: రంగంలోకి 6 స్పెషల్ టీంలు..
-
నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి: అంబటి రాంబాబు
-
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్
-
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
‘లద్దాఖ్’ మృతుల్లో పెడన జవాను
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు. నేడు స్వగ్రామానికి మృతదేహం నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
సంచార సన్నాయి..
చినపోలమ్మ జాతర.. కనులపండుగ్గా జరుగుతోంది. ఊక పోస్తే ఊక రాలనంత జనం. ఆడవాళ్ళంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్ళంతా కోళ్లు, గొర్రెలు పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు.. యువకుల చిందులు.. కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది.కిట్టడు మహా గొప్పగా, చాలా నేర్పుగా గాల్లోకి తారాజువ్వలు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనుస్సు రంగులను తలపిస్తోంది. ‘బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాల! వాటిని మళ్ళీ వాడే వదలాల..’ జనం కిట్టడిని ప్రశంసలతో ముంచుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు.ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడు కట్టిన బాణసంచలో అసలైంది నాగుపాము మందుగుండు. వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ మొక్కులు చెల్లించుకుని, కిట్టడు కట్టిన నాగుపాము బాణసంచా కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు. వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని రెండు మూడుసార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక వత్తిని వెతికే పనిలో పడ్డాడు.ఇంతలోపు విధి వక్రించిట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని అంటుకుంది. అది గమనించి అక్కడ నుంచి కిట్టడు వెళ్ళేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద విరుచుకు పడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడు.. శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు.‘గంగిరెద్దోలమయ్య మేము.. గరీబోలమయ్యా.. ఊరు వాడ తిరిగేము మేము గూడు లేక ఉన్నాము’ అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికీ వెళ్ళి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలామంది ఇళ్లల్లో టివీలు చూసుకుంటూ ‘చెయ్యోటం కాదు..’, ‘మళ్ళీ రా..’, ‘పనిలో ఉన్నాను..’ అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువ వినిపించాయి. బసవన్న దిగులుగా ఊరు చివర బడి పక్కనున్న మర్రిచెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకొని ఎద్దును చెట్టు మొదలకు కట్టి, దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలపడ్డాడు. చెట్టు ఆకుల సందుల్ని చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది..ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళ్తే జోలి నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతివాళ్ళు తమ గురించి పాడించుకొని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు. ఎవరూ తమ జాతివారిని పట్టించుకోకపోగా అనుమానంగా, అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులును పెంచింది.‘మాలాంటి గంగిరెద్దులోళ్ళు ఈదిలోకి వస్తున్నారంటే సాలు సిన్న పిల్లల్ని, కొత్త కోడల్ని దాసిపెట్టేత్తనరు. మేమేదో సిల్లంగి పెట్టేత్తామేమోనని భయపడతన్రు.. ఊరు ఊరు తిరుగుతూ జనాలని పొగిడి వాళ్లిచ్చే బియ్యం, డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసును గానీ వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తలపెడతామనుకుంతున్నారో’ అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతా భావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకలి పోటులా అనిపించింది.ఎండ నడినెత్తికి ఎక్కింది. ఆలోచనల్లో నుంచి బసవన్న బయటికి వచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిళ్లలు, కాటుకలు, పిన్నీసులు, తిలకాలు, అద్దాలు, పైన్లు (దువ్వెన్లు) అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకొంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టుకానుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న ‘రాకెట్ అంతరిక్ష ప్రయాణం’ అనే సై¯Œ ్స పాఠం బయటకి స్పష్టంగా వినిపిస్తోంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రిచెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు.ఊర్లో ఇచ్చిన పిండివంటలు కిట్టడికి, ఆమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్ళు తేవడానికి బడి బోరింగ్ కాడికి వెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్ళకుండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ‘ఏమయ్యా.. అలా వున్నావు, ఒంట్లో ఏమైనా నీరసంగా వుందా..?’ అని అడిగింది.సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు. ‘ఏమీలేదే, కానీ..!’ ‘ఏవయిందయ్యా..!’ రెట్టించి అడిగింది సోములమ్మ.ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి ‘పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా బతకాలో తెల్డం లేదు. మా తాత, మా అయ్యల కడుపు నింపిన ఈ వుత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే..’ అన్నాడు బసవన్న.‘అవునయ్యా.. ఊరు మొత్తం తిరిగినా బొట్లు, పిన్నీసులు కూడా అమ్ముడుపోవడం లేదు’ అంది సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ. బక్కచిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపిపించారు.భార్యవైపు చూస్తూ ‘ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం ఈదిలోకి ఎల్తే అందరూ అడిగిమరీ పాటలు పాడిచ్చుకుని తోచిందిచ్చేవోల్లు. రోజురోజుకీ పరిత్తితులు మారిపోతున్నాయి సినీమాలు, టీబీలు, సెల్లుపోనులు వొచ్చాక మన పాటలు ఎవరింతారు..? పెతీ ఇంట్లోనూ టీబీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్నెవులు పట్టించుకుంతారు.. వొస్తువులు పెరిగేకొద్దీ మన అవసరం తగ్గిపోతందే..’ అన్నాడు ఆవేదనగా బసవన్న.సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపయ్యాక ‘సూడయ్యా.. గంగిరెద్దుల్నేసుకుని నువ్వు, బొట్టుబిళ్లలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేనూ ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో శీకటి తప్ప ఎలుగు రాదు, మన పొట్టా నిండదు. కొత్తకొత్త పేషన్లు వచ్చిన తరువాత మన దగ్గర వస్తువులెవలు కొంతారు? ఇప్పుడింటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాతాటిని పట్టుకుని ఎవలు ఏలాడతారు’ అంది గుండెల్లో బాధను పంటి కింద నొక్కి పెట్టి పవిట కొంగున దాచిపెడుతూ.ఊరూరూ తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ల దగ్గర లేవు. అటు సమాజం నుంచీ, ఇటు ప్రభుత్వం నుంచీ సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికీ చెడిన రేవడిలా తయారైంది.ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరూ తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య సాగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన పదేళ్ళ పెద్దకొడుకు కిట్టడిని దగ్గర్లో ఉన్న పట్టణంలోని బాణసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన ఇద్దరు చిన్న పిల్లల్ని తమ వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు ఐదు సంవత్సరాలపాటు బాణసంచా దుకాణంలో పని బాగా నేర్చుకొని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు.ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు. వీధుల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులకు కుదురుకున్నాడు. ఇంకా ఆశ చావని సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నీసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది కానీ తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది.కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతర్లకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు. ఆమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే!బడి అలవాటు లేని ఆమాసగాడు బడిలో చెప్పాపెట్టకుండా ప్రతిరోజూ బయటకు వచ్చి చింతచెట్ల కింద, తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ‘ఒరే ఆమాస..! సదువొక్కటే మనకి ఆయుదం. అదే మన బతుకుల్ని మారుత్తుంది, మనకొక దైర్నాన్నిత్తంది. ఊరూరూ తిరగడం తప్ప అచ్చరం ముక్క రాదు మాకు. కనీసం మీరయినా సదువుకుంటే బతుకులు బాగుంటాయిరా. సుకంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను ఆమాస అని పిలుత్తుంతే నాకెంత బాధగా వుందో ఆలోశించావా? నువ్వు సదువుకుని గొప్పోడివయితే నీ అసలు పేరుతోనే నిన్నందరూ పిలుత్తారు, గౌరవిత్తారు’ అని చెప్పాడు.ఆమాస తండ్రివంక చూశాడు గానీ ఏమీ మాట్లాడలేదు. అతనికీ చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరంలేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చుని చదవాలంటే ఆమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది.బాణసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్థులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ ‘మా తిరంలేని బతుకులకి ఎక్కడికి పోయినా సుకం లేదు. మా పని పోయి ఏదొక పని చేసుకొని బతుకుదామని అనుకున్నా దినం దీరడం లేదని’ ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది.గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సు వచ్చి ‘కిట్టడిని పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మ’ని చెప్పింది. ఆ మాట విని ‘అవెక్కడ దొరుకుతాయ’ ని అమాయకంగా అడిగాడు బసవన్న.‘మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా’ అంది నర్సు. ‘అలాంటివేవీ మా దగ్గర లేవు తల్లీ.. మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం. మాకంటూ తిరమైన ఇల్లు, వూరు లేవు తల్లీ.. గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్టపోసుకునే వాళ్ళమ’ ని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ ‘కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్య, ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా?’ అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికెట్ల విషయంలో సహాయం చేసింది.కొన్నాళ్ళకి కిట్టడి ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా మానని గాయాల్ని తల్చుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలయింది. తనను ఇంట్లో కూర్చోబెట్టి రోజూ కూలిపనులకెళ్ళి తిండి పెడ్తున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్లి ‘అమ్మా మరి నేను ఈ బాంబుల పని సెయ్యడం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే’ అన్నాడు.మొహానికి, చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు ఙ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన కొడుకు మళ్ళీ ఊపిరి పోసుకుని తనముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్ళీ ‘పని పేరుతో’ కొడుకు దూరమవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది.కొడుకు వైపు చూస్తూ ‘పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీలు తాగడం మేలు అయ్యా. బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా, అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగి బతకుదాం’ అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా, తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డివేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు.ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టారు గుర్తొచ్చారు.. ‘ఒరే కిట్టా..! మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా..’ అని బాలాజీ మాస్టారు చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్లయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు, ఆప్యాయంగా దానిని తడిమాడు.పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని పెదవులకు ఆనించి ఊదడం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతువరకు ఏదో ఆత్మీయ సంగీతసాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతన్ని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్లు కూడా గంగాప్రవాహంలా మారాయి.గంగిరెద్దును తీసుకొని కిట్టడు వీధి బాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కసాగింది. జోలి నిండా బియ్యం, చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయింది. రోజూ ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్ ఫోనులో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు.ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తన తండ్రి నుంచి వచ్చిన ‘సన్నాయి కళ’కు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు. ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించడం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్‌లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేయసాగాడు.ఆ వీడియోలు చూసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాల్లో పెద్దపెద్ద డబ్బున్నవాళ్ళ వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది.‘ఈ కొత్తకొత్త పరికరాలు వొచ్చి మా వుత్తిని రూపుమాపి కడుపు కాల్చితే.. ఈ సాధనాల్నే వుపయోగించి మా కిట్టడు మళ్ళీ మా వుత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్ళుగానో అనుకుంతున్న సొంతింటి కల నెరవేరబోతోంది..’ అనుకుంటూ ‘తన కలని, కళని బతికించిన’ కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు. – సారిపల్లి నాగరాజు -
నా బిడ్డలు నాకు కావాలి.. పీఎస్ ఎదుట ఎస్ భార్య నిరసన
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఫోన్ చేస్తే నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా ఎస్ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్‌ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్‌గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
మరణంలోనూ వీడని బంధం! తల్లడిల్లిన తల్లి హృదయం..
కరీంనగర్: ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు.. అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మలివయసులో అండగా ఉంటారనుకున్న ఇద్దరు కుమారు హఠాత్తుగా చనిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఈ విషాద సంఘటన మంథనిలో విషాదం నింపింది. పుట్టినప్నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగి వారి బంధాలు.. మరణంలోనూ ఒకటిగా కలిసే పోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై కిరణ్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి నాగరాజు(42), ఆయన సోదరుడు నవీన్(35) రామగిరి మండలం బేగంపేటకు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై పనినిమిత్తం వెళ్తున్నారు. అయితే, లక్కేపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా, అతివేగం వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన అక్కేపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌గా గుర్తించారు. అన్నదమ్ములను ఢీకొట్టిన ట్రాక్టర్ సమీపంలోని ప్లాట్ల వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు సమాచారం. ప్లాట్లలో మట్టి పడి ఉంది. ట్రాక్టర్ బోల్తాపడిన ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. ట్రాక్టర్‌ను సరిచేసుకొని డ్రైవర్ అక్కడి పారిపోయినట్లు భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నాగరాజుకు భార్య, కూతురు(12) ఉన్నారు. అలాగే నవీన్‌కు భార్య, సంవత్సరం, మూడేళ్ల కుమారులు ఉన్నారు. మృతులిద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తల్లి రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కదిలించిన హృదయాలు.. మంథని సుభాష్‌నగర్‌కు చెందిన తాటి రాధ– బాపు దంపతులకు నలుగురు కుమారులు. అనారోగ్యంతో బాపు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్తను కోల్పోయిన రాధ.. దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తన కుమారులను చూసుకుంటోంది. ఇందులో ఇద్దరు డ్రైవర్లుగా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో కుమారుడు అమాయకుడు కావడంతో ఇంటివద్దే ఉంటున్నాడు. కాగా, నాగరాజుకు కుమారుడు లేడు. దీంతో కూతురుతో చితికి నిప్పంటించారు. అలాగే నవీన్ పెద్దకుమారుడు(3)తో చితికి నిప్పు పెట్టించడంతో అక్కడున్నవారుకన్నీటి పర్యంతమయ్యారు. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఒకేరోజు ప్రమాదంలో మృతి చెందడం విషాదం నింపింది. ఇవి కూడా చదవండి: ఆన్లైన్ గేమ్స్‌తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!? -
పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీపీగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన నాగరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియర్లు ఉన్నప్పటికీ టికెట్ దక్కించుకుని వర్ధన్నపేట నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై విజయం సాధించారు. ప్రచారంలో కూడా వెనుకే.. నాగరాజు ఎన్నికల ప్రచారం అంతంతమ్రాతమే చేశారు. ఆయన గెలుపునకు నాయకులు, కార్యకర్తలే కష్టపడ్డారు. నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాల్లో ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తమకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. ప్రభుత్వంపై వ్యతిరేకత నాగరాజు గెలు పునకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. -
ఆలిండియా ముద్దపప్పు.. తెలంగాణ పప్పు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పప్పు రేవంత్‌రెడ్డి, ఆల్ ఇండియా ముద్దపప్పు రాహుల్ గాంధీ దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యమన్నట్లు మాట్లాడుతున్నారు. ఇద్దరు బిత్తిరోళ్లు ఎగేసుకుని పోయి కాళేళ్వరం ప్రాజెక్టును చూసి వచ్చి మహా ఇంజనీర్లలా బ్రిడ్జి కూలిపోతుందని తప్పు డు ప్రచారం చేస్తున్నారు. బ్రిడ్జిపై ఉండే ఎక్స్పాన్షన్ జాయింట్ల ఫొటోలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడం రాహుల్, రేవంత్‌ల అవగాహనారాహిత్యానికి నిదర్శనం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి గడ్డం నాగరాజు గురువారం తన అనుచరులతో కలసి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఏఐసీసీ అంటే అల్ ఇండియా చెత్తాచెదారం, టీపీసీసీ అంటే తెలంగాణ పెరట్లో చెత్తా చెదారంలా తయారైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, నోటుకు ఓటు దొంగ, కాంగ్రెస్ పార్టీ టికెట్లను అంగట్లో పశువుల్లా అమ్ముతున్న రేవంత్‌ను పక్క న పెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అయిన రేవంత్‌రెడ్డి.. రాహుల్ గాందీని కూడా కోఠిలో చారాణాకో, ఆఠాణాకో అమ్మేస్తాడు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి శనీశ్వరం కాంగ్రెస్ పార్టీ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి వరమైతే కాంగ్రెస్ పార్టీ దేశానికి శనీశ్వరం. బీఆర్ఎస్ది కుటుంబ పాలనంటూ మాట్లాడుతున్న రాహుల్ తన కుటుంబ నేపథ్యం ఏమిటో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టులోని చిన్న లోపాలను పెద్దవిగా చూపి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు జీవనదుల నడుమ ఉన్న తెలంగాణను దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ కరువు కోరల్లోకి నెట్టింది. కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణలో నేల నెర్రెలు వారింది. విప్లవ ఉద్యమాల నెత్తురుతో ఎర్రవారింది. రాహుల్ గాం«దీకి తెలంగాణ చరిత్ర తెలియదు. తెలుసుకొనే సోయి, పరిజ్ఞానం కూడా లేదు. 60 ఏళ్ల పాలనలో తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం జరగలేదు. కాంగ్రెస్ పాలన సక్రమంగా జరిగి ఉంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందుకు ఉద్యమించారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చి దాడి చేస్తే ఊరుకోం.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరి సాగులో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ. ప్రాజెక్టు ఫెయిలైతే 3.50 కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండింది? కాళేశ్వరం గురించి ఆయన పక్కన ఉన్న సన్నాసులు చెప్పేది కాకుండా రాహుల్ అసలు విషయాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? కుంభకోణా ల కుంభమేళా కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయతీ గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. ఇది ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నడుమ జరుగుతున్న ఎన్నిక. మోదీ విధానాలు జుమ్లా లేదా హమ్లా. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణపై దాడి చేస్తే సహించేది లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దరువు ఎల్లన్న, సిద్దం వేణు తదితరులు పాల్గొన్నారు. -
కలిసి తిరిగిండు.. కత్తితో పొడిచిండు..
కరీంనగర్: వారిద్దరూ స్నేహితులు.. నిత్యం కలిసే తిరిగేవారు.. ఉన్నట్టుండీ ఏమైందో గానీ.. వీరిలో ఒకరు తన మిత్రుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కొత్తపల్లి ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ శివారు రేకుర్తి విజయపురికాలనీకి చెందిన మావురం నాగరాజు(38) ఓ సినిమా హాల్లో, అతని భార్య చంద్రకళ శాతవాహన యూనివర్సిటీలో స్వీపర్‌గా పని చేస్తున్నారు. నాగరాజు, ఇదే ప్రాంతానికి చెందిన మేక అజయ్ మంచి స్నేహితులు. నిత్యం కలిసే తిరుగుతూ మద్యం తాగేవారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానికుడైన మారంపల్లి వినోద్ నాగరాజు ఇంటికి వచ్చాడు. స్థానిక బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేసి, అతన్ని అజయ్ ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత నాగరాజు, అజయ్‌ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. అజయ్ కత్తితో నాగరాజు గొంతులో పొడిచాడు. స్థానికులు గమనించి, బాధితుడిని కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన భర్తను హత్య చేయాలన్న ఉద్దేశంతోనే గొంతులో కత్తితో పొడిచాడని, ఇందుకు మేక రాజశేఖర్, కిరణ్, లక్ష్మి, మారంపెల్లి వినోద్‌లు సహకరించారని మృతుడి భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. -
వర్ధన్నపేట బరిలో రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నాగరాజు
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహరచనతో వెళ్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణను నియమించిన పార్టీ అధిష్టానం.. ఇక్కడి నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలోనూ ఆర్థిక, కుల, స్థానిక, పరిచయాలు ఉన్న వారిని ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పావులు కదుపుతోంది. కొద్ది రోజులుగా వరంగల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కొండేటి శ్రీధర్ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముందని వార్తలొచ్చాయి. తాజాగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు రిటైర్డ్ ఎస్పీ, ఎస్సీ మాల వర్గానికి చెందిన కేఆర్ నాగరాజు పేరు వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మామునూరు క్యాంపులో ఆదివారం జరిగిన ‘క్యాంప్ లైన్స్ బాయ్స్’ ఆత్మీయ సమ్మేళనం ఈయన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేసింది. మీకు మేం అండగా ఉంటాం.. మీరు రాజ కీయాల్లోకి రండి’ అంటూ ఈ ఆత్మీయ సమ్మేళనంలో మిత్రులందరూ ప్రతిపాదించడాన్ని బట్టి చూస్తుంటే నాగరాజు వర్ధన్నపేట గడ్డ వేదికగా పోరుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, మరికొందరు నేతలతోపాటు కేఆర్ నాగరాజు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్లనుండడంతో ఆయన చేరిక లాంఛనమేనని స్థానిక నేతలు అంటున్నారు. మళ్లీ వర్ధన్నపేట నుంచే... స్థానికుడితోపాటు వర్ధన్నపేటలోనే ప్రొహిబిషనరీ ఎస్సైగా 1990లో పోలీస్ కెరీర్ ప్రారంభించిన నాగరాజు.. ఇప్పుడు అక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం మొదలెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. స్పెషల్ పార్టీలో పని చేసిన సమయంలోనూ ఇక్కడ చాలామందితో పరిచయం ఉంది. స్కూలింగ్ మామునూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఆ తర్వాత పది వరకు రంగశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువులు హనుమకొండలో చదివారు. ఉమ్మడి వరంగల్‌లో వర్ధన్నపేట ప్రొహిబిషనరీ ఎస్సై, నెక్కొండ, కేయూసీ, మొగుళ్లపల్లి, స్పెషల్ పార్టీ, మిల్స్ కాలనీ, పరకాలలో ఎస్ఐగా, ములుగు, సుబేదారి, సీఐడీ వరంగల్, పాలకుర్తిలో సీఐగా, డీఎస్పీగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జనగామలో పనిచేశారు. ఆతర్వాత హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేసి మళ్లీ వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, ఆ తర్వాత ఐపీఎస్ వచ్చాక నిజామాబాద్ కమిషనర్‌గా పనిచేసి 2023 మార్చి 21న రిటైర్డ్ అయ్యారు. హాకీలోనూ జూనియర్, సీనియర్ నేషనల్స్ ఆడిన కేఆర్ నాగరాజు ఎక్కువ సమయం మాత్రం మామునూరుకే కేటాయించారు. ఇప్పటికే మామునూరు క్యాంప్‌నకు ఆనుకొని ఉన్న లక్ష్మీపురంలో ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే అరూరిపై ఉన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌కి ఉన్న బలం, తన వ్యక్తిగత పరిచయాలు, బంధువులు, పోలీసు శాఖలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న పరిచయాలు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఓ దఫా వర్ధన్నపేట నియోజకవర్గంలో సర్వే పూర్తిచేసినట్లు తెలిసింది. గతంలోనూ పేరు వినిపించినా.. ఇప్పటికే కేఆర్ నాగరాజు పేరు కొన్నేళ్లుగా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీనుంచే వరంగల్ ఎంపీగా పోటీచేస్తారని గుసగుసలు వినిపించినా.. చివరకు హస్తం పార్టీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల ఎంపీగా పోటీ చేస్తే ప్రయోజనం ఉండదనుకున్న కేఆర్ నాగరాజు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనుంచి నమిండ్ల శ్రీనివాస్ వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు లేకపోవడం కూడా కేఆర్ నాగరాజుకు కలిసిరానుంది. ఇప్పటికే కేఆర్ నాగరాజు బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన సంకేతాలు ఇస్తున్నట్టుగా ప్రచారం ఉంది. ఇంకోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరు కూడా పార్టీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతోంది. దీనికితోడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు దంపతులు కూడా పార్టీని గెలిపించేవారికే సై అంటున్నట్టుగా ఉన్నారని తెలిసింది. దీంతో త్వరలోనే అభ్యర్థి ఎవరనేది తేలనుంది. -
తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి
ఖలీల్‌వాడి : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీ అయి రెండు నెలలు గడుస్తున్నా నియామకం జరగడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కేఆర్ నాగరాజు పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయ్యింది. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు నెలలుగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ పోలీసు కమిషనర్ నియామకానికి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారిని, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిని నియమించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన ప్రజాప్రతినిధులు ప్రపొజల్స్ పంపడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల గడువు సమీపించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్ కావాలని జిల్లాలోని ప్రధాన ప్రజాప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఎస్సై, సీఐ తదితర పోస్టులకు సదరు ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు లేనిదే పోలీస్స్టేషన్లలో పోస్టులు భర్తీ కావడంలేదనే చర్చ పోలీస్‌శాఖలో సాగుతోంది. ఇప్పుడు వచ్చే పోలీస్‌కమిషనర్ రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే సీపీ ఉంటే బాగుంటుందని చర్చించినట్లు తెలిసింది. దీంతో కొత్త కొత్వాల్ కోసం మల్లాగుల్లాలు పడుతున్నట్లు సామాచారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసిన వారిని కాకుండా సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో సదరు ఐపీఎస్ అధికారి నిజామాబాద్ సీపీ పోస్టు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేఆర్ నాగరాజుకు అవకాశం లభించినట్లు తెలిసింది. దీంతో మరోసారి సదరు ఐపీఎస్ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పోలీస్స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు చెపుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. -
చదివింది 9వ తరగతి.. మంత్రి ఆస్తి రూ. 1,510
కృష్ణరాజపురం: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శ్రీమంతుడు, మంత్రి ఎంటీబీ నాగరాజు తన నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో రూ. 1,510 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ వేశారు. రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడు అంటే ఎంటీబీ నాగరాజు ముందుంటారు. గత ఎన్నికల అనంతరం ఆయన ఆస్తులు మరో రూ 495 కోట్లు పెరిగాయి. ఈసారి ఆయన హొసకోటెలో పోటీకి దిగారు. -
'అనితా ఓ అనితా' సింగర్ గుర్తున్నాడా?.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనితా ఓ అనితా నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద.' ఈ పాట వినని వారు ఉండరేమో. అంతలా యువతను ఊపేసింది ఆ సాంగ్. ఎక్కడ చూసినా ఆ సాంగ్ మార్మోగిపోయింది. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరినీ ఊర్రూతలూగించింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అప్పట్లో ఓ రేంజ్లో ఫేమస్ అయినా ఈ సాంగ్ రాసిన యువకుడు పేరు నాగరాజు. ఒక్క పాటతో సంచలనం సృష్టించిన నాగరాజు గురించి తెలుసుకుందాం. నాగరాజు మాట్లాడుతూ..'ఒక వీడియో సాంగ్ పాటకు అనితా పాటను అటాచ్ చేశారు. నిజంగా నేను చనిపోయానని అప్పుడు రూమర్స్ వచ్చాయి. అప్పుడు నాకు చాలా బాధనిపించింది. హైదరాబాద్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది. భయంతో నేను మా ఊరికి వెళ్లిపోయా. ఇప్పుడు అనితకు పెళ్లి అయిపోయింది. నాకు కూడా పెళ్లి జరిగింది. నిజంగా అనితకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె వల్లే నేను ఈ పాట రాయగలిగాను. అమ్మాయి ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవడం వల్ల మా లవ్ బ్రేకప్ అయింది.' అని అన్నారు. నా ప్రేమను ఓ పాట రూపంలో చెబుదామని ప్రయత్నించానని నాగరాజు తెలిపారు. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని ఆయన అన్నారు. పెద్దబ్బాయికి మూగ, చెవుడు తన కుటుంబం గురించి నాగరాజు మాట్లాడుతూ.. 'ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయికి మూగ, చెవిటి. మాటలు రావు. చిన్నబ్బాయి కూడా అన్నతో పాటే సైగలే చేస్తుంటాడు. ఇంతకుముందు ఒక చిన్న పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగించా. ఎవరన్నా పిలిస్తే వెళ్లి పాటలు పాడేవాన్ని. నా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతనితో పాటే ప్రస్తుతం నేను హైదారాబాద్‌లోనే ఉన్నానని' తెలిపారు. కాగా ప్రస్తుతం అనితా పాటకు సీక్వెల్‌గా అనిత-2 సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు నాగరాజు వెల్లడించారు. 'నా ప్రాణమా నిను మరిచిపోనులే.. ఊపిరి ఆగినా నీ మీద ప్రేమ చావదే'. అంటూ సాగే సాంగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. -
టీడీపీ నేత దూషించి, దాడి చేశాడు
సాక్షి, ప్రొద్దుటూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు తనపై దాడి చేసి, దూషిస్తూ నైటీ చింపేశాడని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని వరసిద్ధి వినాయక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లబోతుల చిట్స్ నిర్వాహకుడుగా ఉన్న నల్లబోతుల నాగరాజు వద్ద గతంలో తాను అప్పు తీసుకుని ప్రతి నెలా అధిక వడ్డీని చెల్లిస్తున్నానన్నారు. కొద్ది రోజులుగా తన భర్త శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జాప్యం జరిగిందని, వడ్డీతో సహా పూర్తి డబ్బు చెల్లిస్తామని తెలిపామన్నారు. అయినా వినకుండా శనివారం నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసి నైటీ చింపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో ఉన్న తన భర్త శివప్రసాద్‌ను దూషించి, జుట్టుపట్టుకుని గాయపరిచారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకుంటే చంపుతామని కత్తితో బెదిరింనట్లు ఆమె వివరించారు. ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం నల్లబోతుల నాగరాజు కేసు రాజీ కావాలని ఇతరులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం) -
యూకే లేబర్ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్
సాక్షి, హైదరాబాద్: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్‌లిస్ట్ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్ లిస్ట్‌ను లేబర్ పార్టీ రూపొందించగా ఉదయ్ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
నాగరాజు కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేసిన వైఎస్ షర్మిల
సాక్షి, నారాయణపేట జిల్లా(గరిడేపల్లి): తెలంగాణ ఉద్యమకారుడు గరిడేపల్లి మండలం నాయినిగూడెం గ్రామానికి చెందిన నాగరాజుకు సోమవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్థిక సాయం చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో రూ. 4లక్షలను అందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించేందుకు రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, చేయి పోగొట్టుకొని ఏ పనీ చేయలేక దుర్భరజీవితం గడుపుతున్న నాగరాజు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతని కన్నీటి వ్యథను “ఉపాధి కరువై.. బతుకుభారమై’ అనే శీర్షికన ఈ నెల 13న సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆమె నాగరాజుతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అతడిని నారాయణపేటకు పిలిపించుకుని సోమవారం స్వాతంత్య్రవేడుకల్లో రూ.4లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ షర్మిల స్వయంగా ఫోన్ చేసి తనను నారాయణపేటకు పిలిపించుకొని ఆర్థిక సాయం చేశారన్నారు. దీంతో ఆమెకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తన లాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. చదవండి: (Munugode Politics: ఆ పార్టీ సరేనంటే.. కమ్యూనిస్టులు అటువైపే..!) -
టీడీపీ దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేత మృతి
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలోని గరాలదిబ్బలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు ఒడుగు నాగరాజు (46) మృతిచెందాడు. దీంతో మృతితో మచిలీపట్నం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నాగరాజు అంత్యక్రియలు నిర్వహించారు. మచిలీపట్నం మండలం గరాలదిబ్బలో పంచాయతీ ఎన్నికల తరువాత వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తరచు వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 5వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడులు చేశారు. వైఎస్సార్సీపీ వారి ఇళ్లల్లోకి వెళ్లి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో వీరంగం చేశారు. టీడీపీ వర్గీయుల దాడిలో ఒడుగు నాగరాజు, నిరీక్షణరావు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ తీవ్రంగా గాయపడ్డారు. అన్నం తింటున్న నిరీక్షణరావును బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. నాగరాజుకు కత్తిగాయమైంది. గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వారం రోజులు చికిత్స తీసుకున్న నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. తరువాత వాంతులవడం, అనారోగ్యంగా ఉండటంతో జూన్ 22న ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యులు విజయవాడకు రిఫర్ చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కొద్దిరోజుల చికిత్స తరువాత పరిస్థితి మరింత విషమించటంతో మరింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు శనివారం సాయంత్రం మరణించాడు. గరాలదిబ్బలో టెన్షన్ టెన్షన్.. వైఎస్సార్సీపీ నాయకుడు నాగరాజు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నాగరాజు మృతికి టీడీపీ శ్రేణులే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 5న జరిగిన దాడి ఘటనపై బొడ్డు వీరవెంకటేశ్వరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్న)తో సహా 12 మంది టీడీపీ వర్గీయులపై పలు సెక్షన్ల కింద రూరల్ ఎస్ఐ జి.వాసు కేసు నమోదు చేశారు. నాగరాజు మృతితో వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిలకలపూడి, పెడన, చల్లపల్లి సీఐలు శ్రీధర్‌బాబు, వీరయ్యగౌడ్, రవికుమార్, ఐదుగురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
పెద్దల సభలో బలమైన బీసీ వాణి!
సాహు మహరాజ్ లాగా ఏపీ సీఎం జగన్ కూడా బలహీనవర్గాల ప్రజలను ఆదరిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం శ్లాఘనీయం. వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే ‘మనకాలపు సాహు మహరాజ్ జగన్’ అంటాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి ఒక మంత్రి లేదా ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఇంకా ఉంటే ఒకటో రెండో కార్పొరేషన్ ఛైర్మన్లు! అంతే బీసీలు, ఎస్సీలకు గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాధాన్యం! ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అసలు బీసీలు, ఎస్సీ, ఎస్టీల ఊసే లేదు. కానీ, జగన్ ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వాలకు భిన్నంగా బీసీలకు పెద్ద ఎత్తున స్థానం కల్పించడం గమనార్హం. బీసీ సమాజం, సంఘాలు, సోకాల్డు బీసీ లీడర్లను కూడా ఈ పరిమాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే బీఆర్ అంబేడ్కర్ చదువుకొని భారత రాజ్యాంగ రూపకర్తగా మారారు. సీఎం జగన్ ప్రోత్సా హంతో ఇప్పుడు రాజకీయ అధికార పదవుల్లోకి వచ్చిన వారు ముందు ముందు మరిన్ని కీలక పదవులు పొంది తమ వర్గాల సాధికారత కోసం కృషిచేసే అవకాశం ఉంది. బీసీ ఉద్యమంలో ఆర్. కృష్ణయ్య నిర్వహిస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది. బీసీల కోసం గత నాలుగు దశాబ్దాలకు పైగా ‘బీసీ సంక్షేమ సంఘం’ ద్వారా అలుపెరగని, అవిశ్రాంత పోరాటం చేస్తూన్న పోరాట యోధుడాయన. రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు ఆర్. కృష్ణయ్య కృషి చిరస్మరణీయం. సుదీర్ఘ కాల ఉద్యమ నేపథ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆర్. కృష్ణయ్యకు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో సభ్యునిగా స్థానం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని 136 బీసీ కులాలకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తుండటం దురదృష్టకరం. బీసీల సంక్షేమ పార్టీగా చెప్పుకొని టీడీపీ ఈ అంశంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, విమర్శించడం దారుణం. 2014లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికలలో నారా చంద్రబాబు బీసీ ముఖ్య మంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రయోగించినందునే తెలుగుదేశం పార్టీకి నామమాత్రంగానైనా అసెంబ్లీ సీట్లు లభించాయని చెప్పవచ్చు. (👉🏾చదవండి: వైపరీత్య ఘటనల్లో రాజకీయమా?) ఇక ఆర్. కృష్ణయ్య తెలంగాణ వాడు కదా... ఆయనకు ఏ విధంగా రాజ్యసభ సీటు ఇస్తారని టీడీపీ అనుంగు అనుచరులు విమర్శలు చేయడం శోచనీయం. కృష్ణయ్య లాంటి జాతీయ స్థాయి బీసీ ఉద్యమ నేతను కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తూ విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అదే విధంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు, బీసీ కులాల గణాంకాలు లాంటి అనేక డిమాండ్లు బీసీలకు దశాబ్దాల తరబడి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి. బీసీల పార్టీలుగా ఈ సమస్యలపై ఎప్పటినుంచో ఉద్యమిస్తూ ఉన్న ఆర్. కృష్ణయ్య పార్లమెంట్లో ఉంటే బీసీల వాణి మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా వినిపించవచ్చు. బీసీల సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అందుకే ఆర్. కృష్ణయ్యను పెద్దల సభకు పంపడానికి నిర్ణయించింది. (👉🏾చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!) - మన్నారం నాగరాజు తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
మేనకోడలితో వివాహేతర సంబంధం.. సినీఫక్కీలో భార్యను..
సాక్షి, కొత్తవలస (విజయనగరం): కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు(33)..భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు శుక్రవారం అంగీకరించాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మిని ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ బాబు యశ్వంత్(7) ఉన్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆమెను తరచూ వేధిస్తూ వివాహేతర సంబంధాలు అంటగడుతూ అదే గ్రామానికి చెందిన వరుసకు మేనకోడలు మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నాగరాజును మందలించారు. చదవండి: (తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి) సినీఫక్కీలో హత్యకు పథకం భార్య లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు పథకం రచించి జనవరి 28న రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మి స్వీట్‌షాప్‌లో విధులు ముగించుకుని వస్తుండడంతో దారిలో కాపుకాసి తీర్థానికి రావాలని అడిగాడు. దీంతో నమ్మిన ఆమె భర్త స్కూటీ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్‌స్కూల్ వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చి బండిపైనుంచి భార్య దూకి పారిపోయే ప్రయత్నం చేసింది. తిరిగి ఆమెను స్కూటీపై ఎక్కించి బలిఘట్టం రెవెన్యూ పరిధిలోగల అర్ధాన్నపాలెం దారిలో జీడి తోటలోకి తీసుకువెళ్లి తనకు విడాకులు ఇవ్వాలని నాగరాజు కోరగా ఆమె తిరస్కరించడంతో బలంగా తోసేశాడు. దీంతో ఆమె రాళ్లకుప్పపై పడి స్పృహ కోల్పోయింది. అదే అదునుగా రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గోతిలో వేసి ఎండు పుల్లలు వేసి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా అభంశుభం తెలియని భార్య లక్ష్మిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా హత్యచేసిన నాగరాజును ఉరితీయాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. జోడిమెరక గ్రామ నుంచి గిరిజనులు నినాదాలు చేస్తూ కొత్తవలస పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని ఆందోళన చేశారు. -
నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. దిగులుతో భార్య మృతి
సాక్షి, దొడ్డబళ్లాపురం (బెంగళూరు): నెలమంగల పట్టణంలోని కేఏఎస్ అధికారి నాగరాజు భార్య గుండెపోటుతో మృతిచెందింది. నాగరాజు ఇంటిపై ఇటీవలే ఏసీబీ అధికారులు దాడిచేసి కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి భార్య నాగరత్న దిగులుగా ఉంటోంది. గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందింది. తమ ఇంటిపై వరుసగా మూడోసారి ఏసీబీ దాడి జరగడంతో ఆమె ఆ రోజే మీడియా ముందు బోరున విలపించింది. చదవండి: (కట్నం వేధింపులకు నవ వధువు బలి) -
అమ్మవారి విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి..
ముదిగొండ: దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనంకోసం తీసుకువెళుతుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ ఉండగా, ఊరేగింపు అనంతరం బయలుదేరి న స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బాణాపురం సమీపాన ఇసుక బావి వద్ద అమ్మవారి విగ్రహం ఉన్న ట్రాక్టర్ ముందుగా వెళ్లింది. ఆ వెనుకాల ఉన్న ట్రాక్టర్లో 25 మంది గ్రామస్తులు ఉండగా, ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొందరు గాయపడగా 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అదృశ్యమైన నాగరాజు దారుణహత్య
నరసరావుపేట రూరల్: ఇటీవల అదృశ్యమైన మాచర్ల నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నాయకుడు కంచర్ల నాగరాజును పట్టణ సమీపంలోని పెదతురకపాలెం రోడ్డు గ్రావెల్ గుంటలలో దారుణంగా హతమార్చి దహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించటం లేదు. దీంతో కుటుంబసభ్యులు 21వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా చివరి లోకేషన్ నరసరావుపేట, పరిసర ప్రాంతాలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు కుటుంబసభ్యులు సైతం నాగరాజు ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాలిపోయిన మృతదేహన్ని పెదతురకపాలెం రోడ్డులో కుటుంబసభ్యులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ సుధీర్‌కుమార్, దుర్గి ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని రూరల్ పోలీసుల సహకారం తీసుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు నాగరాజే అని అతని కుటుంబసభ్యులు నిర్దారించడంతో పోలీసులు ఘటనా స్థలంలోనే శవపంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ నాగరాజుకు తురకపాలెంకు చెందిన ముస్లిం యువతితో ప్రేమ వివాహం అయిందని చెప్పారు. 2013 లో వివాహం అయిన మూడు నెలలకే ఆ యువతి మృతి చెందిందని తెలిపారు. ఆ కేసు 2017 వరకు కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతదేహం ఇక్కడ లభించడంతో యువతి కుటుంబసభ్యులకు ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానం ఉందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ప్రణాళిక ప్రకారమే హత్య... వెల్దుర్తి: హత్య చేసేందుకు ముందే ప్రణాళిక చేసుకొని మధ్యవర్తిగా ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ద్వారా నాగరాజును ఫంక్షన్ అని చెప్పి పిలిపించారని సమాచారం. ఫంక్షన్‌కు వెళ్లే సమయంలో వారు వెంబడించి పట్టుకొని అతనిని తీసుకెళ్లి హత్య చేశారని తెలిసింది. ఆనవాళ్లు కనబడకుండా నాగరాజు సెల్‌ను ఆ రహదారిలో వెళ్తున్న లారీలో విసిరివేశారు. కాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాయవరం జంక్షన్ నుంచి నాగరాజు అంతిమయాత్రను నిర్వహించారు. బైక్‌ను కారు ఢీకొని మహిళ దుర్మరణం పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటనలో మహిళ దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెదకాకాని సమీపంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేబ్రోలు కొత్త రెడ్డిపాలెంకు చెందిన గుంటూరు ప్రసాద్ నంబూరు అత్తగారింటికి వచ్చాడు. భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలసి తిరిగి ఇంటికి బయలు దేరాడు. వారు ప్రయాణిస్తున్న బైక్ జాతీయ రహదారిపై పెదకాకాని డక్కన్ టుబాకో కంపెనీ సమీపంలోకి చేరుకునే సరికి వెనుక నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైవేలో బైక్‌పై వస్తున్న నలుగురు గ్రిల్స్ (రెయిలింగ్) దాటి సర్వీసు రోడ్డులో పడ్డారు. ప్రసాద్, భార్య నిర్మల ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిర్మల (45) మృతి చెందింది. వారిలో కుమార్తె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పెదకాకాని సీఐ సిబ్బందితో చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలు మండలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్నాడు. బైక్‌ను ఢీ కొన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొంది. ప్రమాద సమయంలో కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడి నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కేటీఆర్ పీఏనంటూ మోసాలు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు వరుస మోసాలు చేస్తున్నాడు. గతేడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్ వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. తాజాగా ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన ఇతగాడు రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదు కాగా.. నిందితుడు బి.నాగరాజును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతగాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ ఆటగాడు కావడం గమనార్హం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజుపై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఏడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నగరానికి చెందిన ఓ రియల్ఎస్టేట్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరాజు బొడుమూరు అనే యువకుడు క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్– 25 వరల్డ్ కప్‌కు అతడు సెలెక్ట్ అయ్యాడని చెబితే తనను తానే ప్రమోట్ చేసుకున్నాడు. నాగరాజు (తాను) టోర్నీతో పాటు 20–20 సన్‌రైజ్ టీమ్‌కూ ఎంపికయ్యాడని చెబుతూ.. నాగరాజు పేద కుటుంబానికి చెందిన వాడని చెప్పుకొన్నాడు. అతడికి క్రికెట్ కిట్‌తో పాటు లండన్ టూర్ ఖర్చుల స్పాన్సర్ షిప్ అవసరం ఉందని, అందుకు రూ. 3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వలలో పడ్డారని మోసగాడు నిర్ధారించుకున్నాడు. దీంతో స్పాన్సర్షిప్ నగదును డిపాజిట్ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్ కిట్‌ను నాగరాజు బెంగళూర్‌లో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ఆయ కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని చెప్పాడు. ఇది మీ కంపెనీకి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ నమ్మించాడు. ఇతని మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రూ కాలర్ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగానే నమ్మిన సంస్థ నగదును ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట్‌లోని కెనరా బ్రాంచ్ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేశారు. త్వరలో ఎల్బీస్టేడియంలో కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారనీ నాగరాజు ఆ కంపెనీ వారితో చెప్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా మీ సంస్థనే సార్ ఎంపిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై మా బంధువు ఒకరు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సహాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని తేలింది. బాధ్యుల్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. తాజాగా నగరానికి చెందని ఓ ఫార్మా కంపెనీకి కేటీఆర్ పీఏగా పని చేస్తున్న తిరుపతిరెడ్డి పేరుతో నాగరాజు కాల్ చేశాడు. కాలుష్య నియంత్రణ మండలి మీ సంస్థను మూసేస్తోందని, అలా కాకుండా చేయాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని చెప్పాడు. దీనిపై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు తన బృందంలో వల పన్నారు. సోమవారం నాగరాజు కదలికల్ని గుర్తించి అరెస్టు చేశారు. 2014– 16 మధ్య ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీ జట్టులో ఎంపికైన బుడుమూరు నాగరాజు గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బీసీసీఐ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లు, మరో ప్రముఖ రాజకీయ నాయకుడి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడి నుంచి డబ్బు డిమాండ్ చేసి అరెస్టు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. -
ధర్మారెడ్డి ఆత్మహత్య.. అనుమానాలెన్నో..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. అనుమానాలెన్నో.. 77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదీ వివాదం.. నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఏ సమయంలో ఏం చేశాడంటే.. – శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు. – రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు. 9.30: టవల్ వేసుకొని పడుకున్నారు. 10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు. – 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. – 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు. – 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు. – 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు. సివిల్ కేసులో పోలీసుల ప్రమేయమేంటి? మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. – ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. – వెంకటమ్మ, మృతుడి భార్య -
వేధింపులతోనే ఆత్మహత్య: ధర్మారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు. తహసీల్దార్ నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్ దొరకలేదు. (నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య) జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందారు. బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారు. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ... ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేఎల్ఆర్ మా భూమిని కబ్జా చేసి వేధించారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదు. జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి... చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదు. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయ్యింది. అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పీజీ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
-
నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ధర్మారెడ్డి కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాగా కోటి రూపాయల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నాగరాజు రెండో లాకర్లో భారీగా బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీ ఖాతాలో భారీగా బంగారం బయటపడింది. నాగరాజు బినామీ అయిన అల్వాల్‌కు చెందిన నందగోపాల్ అనే వ్యక్తి ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో నందగోపాల్ పేరిట అల్వాల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఒక లాకర్, పీజే మహేందర్ కుమార్ పేరిట మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో మరో లాకర్‌ను కూడా నాగరాజు, అతని భార్య స్వప్న వాడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ లాకర్లను గురువారం అధికారులు తెరవగా నందగోపాల్ పేరిట ఉన్న లాకర్లో రూ.60 లక్షల విలువైన ఒక కిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. నాగరాజుకు సంబంధించి ఇది రెండో లాకర్ కాగా, మూడో లాకర్లో రూ.4.5 లక్షల విలువచేసే 7.29 కిలోల బరువున్న 35 వెండిబిస్కట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొదటి లాకర్ అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకులో నాగరాజు సమీప బంధువు నరేందర్ పేరిట ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ 2న ఈ లాకర్‌ను తెరిచిన ఏసీబీ రూ.57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
నాగరాజు లాకర్లలో భారీగా బంగారం
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూసుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల ఆయన ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. బినామీ పేరుతో పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి ఏసీబీ... ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజలు క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకుముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. -
నాగరాజుది హత్యే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో బయటికి వస్తానని, లాయర్లతో మాట్లాడాలని చెప్పిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య స్వప్న, బావమరిది శేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య పలు సంచల న ఆరోపణలు చేశారు. ఆయన చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. అసలు రూ. కోటి పది లక్షల లంచం కేసు తప్పుడుదని.. ఆయన్ను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. తాను, పిల్లలంటే ప్రాణమిచ్చే వ్యక్తి తన ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నించారు. ఈ విషయంలో జైలు అధికారులు, పోలీసులు, ఏసీబీ మీద తమకు న మ్మకం లేదన్నారు. ఆయన మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసేందుకు సీబీఐ విచారణ జరగాల్సిందేనని స్వప్న డిమాండ్ చేశారు. దాడులు జరిగిన ఆగస్టు 14 రాత్రి ఏసీబీ అధికారులే నగదు బ్యాగుల్లో తీసుకువచ్చారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని నాగరాజు చెప్పారన్నారు. అసలు టర్కీ టవల్‌తో ఉరివేసుకోవడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఆ సమయం లో నాగరాజుతోపాటు ఉన్నవారంతా ఎందు కు లేవలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం 3.30 గంటలకు నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే.. 6 గంటలు దాటాక తమ కు సమాచారం ఇచ్చారని వాపోయారు. అది ముమ్మాటికీ తప్పుడు కేసు.. రూ.కోటి పది లక్షల కేసు తప్పుడుకేసని నాగరాజు బావమరిది శేఖర్ ఆరోపించారు. ఆ మొత్తం ఏసీబీ వాళ్లే తీసుకువచ్చారని ధ్వజమెత్తాడు. ఈ మేరకు తమ వద్ద సీసీ టీవీ ఫుటేజీ ఉందని, వాటిని హైకోర్టుకు అందజేస్తామన్నారు. అసలు రూ.కోటి పదిలక్షల కేసు నిలవదని తెలిసాకే, నాగరాజును ఇరికించేందుకు నకిలీ పాసు పుస్తకాల కేసు పెట్టారని తెలిపారు. ఆత్మహత్యకు ముందురోజు వీడియో కాల్ నకిలీ పాసు పుస్తకాల జారీ కేసులో కందాడి ధర్మారెడ్డితోపాటు నాగరాజు మరో నలుగురిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఈ నెల 13, 14 తేదీల్లో నాగరాజును ప్రశ్నించేందుకు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీకి ఒక్కరోజు ముందు.. అంటే ఈ నెల 12న కుటుంబ సభ్యులతో నాగరాజు వీడియో కాల్లో మాట్లాడారు. ఆ కాల్ రికార్డును కూడా కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేశారు. అందులో ఏముందంటే.. తాను అన్ని పత్రాలు పరిశీలించాకే ముందుకు వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో చెప్పడం కనిపించింది. భయపడాల్సిన పనిలేదని, బెయిల్ వస్తుందని న్యాయస్థానంలో పోరాటం చేద్దామని నాగరాజుకు శేఖర్ ధైర్యం చెప్పడం వీడియోలో కనిపించింది. -
మాజీ తహసీల్దార్ నాగరాజు వీడియో కాల్?!
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) (చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య!) -
కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో అరెస్ట్అయిన కీసర తహసీల్దార్ నాగరాజు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఈనెల 14న చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యనని, సీబీఐ విచారణ కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తాము తెలిపారు. (కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య) ఈ మేరకు శుక్రవారం నాగరాజు కుటుంబ సభ్యులు సాక్షి మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఎంతోమంది ఖైదీలు ఉండే జైల్లో ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. అదీ టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు..? పక్కన ముగ్గురు ఖైదీలు వున్నారు. ఆ సమయంలో వాళ్లేంచేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదు. అందుకు తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికే సీసీ వీడియో ఏసీబీ కోర్టుకి ఇచ్చాము. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే నాగరాజు వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. చనిపోడానికి ముందు ఉదయం మాతో ఫోన్లో మాట్లాడాడు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు ఇలాంటి కేసులు సహజం. న్యాయపరంగా బయటకువచ్చాక పోరాటం చేద్దామన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు. మా అందరికీ ఆయనే దిక్కు. మా పరిస్థితి ఏంటీ’అని ప్రశ్నించారు. మరోవైపు నాగరాజు చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడారు, ఏం చెప్పారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?
అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య! నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైలు సిబ్బందిని విచారించారు. చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు నాగరాజును విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విషయాల్లో దర్యాప్తు సాగుతోంది. చదండి: కీసర నాగరాజా మజాకా! -
కీసర మాజీ తాహసీల్దార్ ఆత్మహత్య
-
కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) నాగరాజుపై ఏసీబీ ప్రశ్నల వర్షం నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
140 ఎకరాల భూమిపై ధర్మారెడ్డి కన్ను
సాక్షి, హైదరాబాద్: కీసర నాగరాజు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటూ దొరకడం జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు స్థానికులు, రియల్టర్లతో కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. కీసర తహసీల్దార్‌గా ఉన్న సమయంలో నాగరాజు రాంపల్లికి చెందిన కందాడి ధర్మారెడ్డి పేరిట, తన స్నేహితులు, బంధువుల పేరిట రెండెకరాలకుపైగా భూమిని దక్కించుకున్నాడు. ఈ భూములతోపాటు మొత్తం 24 ఎకరాల భూములకు నకిలీపత్రాల సాయంతో పాసుబుక్కులు జారీ చేసిన నాగరాజును రెండోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టిన ఏసీబీకి నాగరాజు అక్రమాలకు సంబంధించిన అనేక ఆధారాలు లభిస్తున్నాయని తెలిసింది. అనేక భూ సెటిల్మెంట్లు.. స్థానికంగా పలుకుబడి కలిగిన కందాడి ధర్మారెడ్డితో కలిసి నాగరాజు అనేక భూ సెటిల్మెంట్లు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. గ్రామపరిధిలో ఉన్న 140 ఎకరాలను ధర్మారెడ్డి కాజేద్దామని ప్రయత్నించిన సమయంలోనూ నాగరాజు సహాయసహకారాలు అందించినట్లు సమాచారం. సర్వే నంబరు 621, 639లలో 140 ఎకరాల వివాదాస్పద భూమి ఉంది. దీనిపై కన్నేసిన ధర్మారెడ్డి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని 24 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. 1996లో ఆ భూమి తనదే అంటూ ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) పత్రాలను సృష్టించాడు. దీనిపై సుమారు 20 మంది స్థానికులు అభ్యంతరం తెలిపారు. 1958లో తాము కిషన్‌సేఠ్ అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేశానంటూ నకిలీపత్రాలను అప్పటి ఎమ్మార్వోకు సమర్పించారు. అయితే, అప్పుడు తన పాచిక పారలేదు. కీసరకు నాగరాజు తహసీల్దార్‌గా రాగానే మళ్లీ పైరవీ మొదలుపెట్టాడు. ఈ మేరకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ విషయాలన్నీ ప్రస్తుత ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయని తెలిసింది. ఇటీవల 24 ఎకరాలకు అక్రమంగా పాసుబుక్కులు జారీ చేయడంపైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో నాగరాజు, ధర్మారెడ్డితోపాటు అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, రియల్టర్లు వెంకటేశ్వర్రావు, జగదీశ్వరరావు, భాస్కర్‌రావులను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ 24 ఎకరాల భూమి విలువ రూ.48 కోట్లకుపైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 14న పట్టుబడిన సమయంలోనూ దాదాపు 53 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
కీసర నాగరాజా మజాకా!
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె.ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ధారాదత్తం చేశాడన్న ఆరోపణలపై ఇటీవల విజిలెన్స్ విభాగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీబీ డీజీని ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినిæయోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వేనం 621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం 633/ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గుంటలకు జూలై 9వ తేదీన అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు. నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. -
లవకుశ నాగరాజు ఇక లేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రాల్లో ‘లవకుశ’ ఒకటి. ఈ చిత్రంలో లవుడి పాత్రలో అలరించిన అనపర్తి నాగరాజు (71) ఇక లేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో శ్వాస సంబంధిత వ్యాధితో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. యన్టీఆర్ శ్రీరామునిగా, అంజలీ దేవి సీతగా నటించిన ‘లవకుశ’ చిత్రానికి సి.పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో లవుడి పాత్రలో నాగరాజు, కుశుడి పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు దాటినా ఇప్పటకీ వారు లవ, కుశలుగానే గుర్తింపు పొందారు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండూ కలగలిపిన లవుడి పాత్రలో నాగరాజు చక్కగా నటించారు. నాగరాజు తండ్రి ఏవీ సుబ్బారావు సినీ నటుడు. అలా నాగరాజు కూడా నటుడిగా రంగప్రవేశం చేశారు. చిన్నప్పుడే నాగరాజుకి నాటకాలంటే ఇష్టం. సుబ్రహ్మణ్యం, నాగరాజు కలిసి కొన్ని నాటకాల్లో కూడా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు నాగరాజు. యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నారు నాగరాజు. ‘సీతారామ కల్యాణం’లో లక్ష్మణుడిగా, ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో పద్మావతి దేవి తమ్ముడిగా.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలు మానుకున్నాక హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో నాగరాజు పూజారిగా చేయడం మొదలుపెట్టారు. ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. ఆయనకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు డి. సురేష్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. -
‘లవుడు’ కన్నుమూత
చిక్కడపల్లి (హైదరాబాద్): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశేష ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం లవకుశలో లవుడు పాత్ర పోషించిన నటుడు ఆనపర్తి నాగరాజు సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్ గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2017లో ఒక్కగానొక్క కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో నాగరాజు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ వచ్చింది. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ చేర్చుకోవడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నాగరాజు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. 340 చిత్రాల్లో నటన... నాగరాజు అసలు పేరు.. నాగేందర్రావు. 340కి పైగా చిత్రాల్లో నటించారు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏ.వీ.సుబ్బారావు కుమారుడే నాగరాజు. భక్తరామదాసు సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. హైదరాబాద్‌లోని ఒక అపార్ట్మెంట్ వద్ద నిర్మించిన ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. అలా వచ్చే కొద్దిపాటి సంపాదనతోనే జీవితం సాగిస్తున్నారని లవకుశలో కుశుడిగా నటించిన సుబ్రహ్మణ్యం తెలిపారు. తాను అమలాపురంలో టైలర్స్ షాపును ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల శ్రీకామాక్షి పీఠంలో జరిగిన కార్యక్రమానికి నాగరాజు, సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథులుగా హాజరుకావడం విశేషం. -
కలెక్టర్, ఆర్డీవో చెబితేనే వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: కీసర భూ బాగోతం ఊహించని మలుపు తిరిగింది. ఈ వ్యవహా రంలో తాను మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే శ్రీనాథ్, అంజిరెడ్డిలను కలిసేందుకు వెళ్లానని, అదే సమయంలో ఏసీబీ దాడి జరిగిందని కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ విచారణలో వెల్లడించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. గురువారం ఏసీబీ న్యాయస్థానానికి అందజేసిన నిందితుల నేరాంగీకారపత్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పలు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మొత్తం కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో రవి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్ ప్రకాశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తహసీల్దార్ నాగరాజు, ఏ2 వీఆర్ఏ సాయిరాజు, ఏ3 శ్రీనాథ్‌యాదవ్, ఏ4 అంజిరెడ్డిలతోపాటు ఇటీవల ఏసీబీ కస్టడీలో అనేకమంది అధికారుల పేర్లు వెల్లడించారు. నాగరాజు ఏమని చెప్పాడంటే.. విచారణలో నాగరాజు ఏసీబీ అధికారులకు అస్సలు సహకరించలేదు. పలు కీలక ప్రశ్నలకు ఆయన మౌనం వహించాడు. అయితే శ్రీనాథ్, అంజిరెడ్డిల నుంచి లంచం తీసుకునే విషయమై నాగరాజు సంచలన విషయాలు వెల్లడించాడు. తాను మేడ్చల్ కలెక్టర్, ఆర్డీవో రవి ఆదేశాల మేరకే భూవివాదంపై చర్చించడానికి అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను కలిసేందుకు కాప్రా వెళ్లానని స్పష్టం చేశాడు. అంజిరెడ్డి, శ్రీనాథ్యాదవ్లకు ఈ వివాదాస్పద భూమితో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదన్నాడు. వాస్తవానికి శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూవివాదం తన పరిధిలో లేనేలేదని చెప్పాడు. శ్రీనాథ్ వివరణ ఇదీ.. ఏ3 నిందితుడు రియల్టర్ శ్రీనాథ్ యాదవ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాంపల్లి దయారాలోనే సర్వే నంబర్ 614లోని 61 ఎకరాల 20 గుంటల వివాదాస్పద భూమి గురించి తనకు కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇక్బాల్ ద్వారా తెలిసిందని శ్రీనాథ్ చెప్పాడు. తాను అంజిరెడ్డిని, అతని సోదరుడు హన్మంతరెడ్డి ద్వారా కలిశానన్నాడు. దాంతో భూమి పొజిషల్‌లో ఉన్న పట్టాదారులు, ముస్లింలతో ఇక్బాల్ ద్వారా, గ్రామస్తులను అంజిరెడ్డి సాయంతో అనేక సార్లు సమావేశమయ్యానన్నారు. చివరికి ఈ భూ వివాదంపై తాను సూచించిన పరిష్కారానికి వారంతా అంగీకరించారన్నాడు. ఇందులో భాగంగానే ఈ భూమికి సంబంధించి మొయినుద్దీన్ గాలిబ్ మరో 37 మంది ద్వారా తన పేరిట జీపీఏ చేయించినట్లు వివరించాడు. నగదును ఎలా సేకరించావన్న ప్రశ్నకు శ్రీనాథ్ బదులిస్తూ.. ఆగస్టు 14న తాము తన స్నేహితుడు యుగంధర్‌తో కలిసి తన కారులో కాజీపేట వెళ్లామని పేర్కొన్నాడు. మొత్తం రూ.కోటీ పది లక్షలను తన స్నేహితుడైన ముడిదె తేజేశ్వర్ ఏర్పాటు చేశాడన్నారు. తేజేశ్వర్ సూచన మేరకు తాము రూ.70 లక్షలను వరంగల్ బస్టాండ్ సమీపంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తీసుకున్నామన్నారు. దేవీ థియేటర్ వెనక భాగంలో రూ.30 లక్షలు, మరో రూ.10 లక్షలను రత్నం రాజిరెడ్డి, ఆర్ఎల్ రవి నుంచి అంబేడ్కర్ భవన్ వద్ద తీసుకున్నామన్నాడు. డబ్బును కారు డిక్కీలో పెట్టుకుని రాత్రి 7.30 గంటలకు కాప్రా ఆరుల్నగర్లోని అంజిరెడ్డి ఇంటికి చేరుకున్నామని చెప్పాడు. తహసీల్దార్ నాగరాజుతో పరిచయం ఎలా జరిగింది అన్న ప్రశ్నకు.. ఈ ఏడాది మార్చిలో తన మిత్రుడు, హన్మకొండ తహసీల్దార్ అయిన కిరణ్ ప్రకాశ్ ద్వారా కీసర ఆర్డీవో రవి పరిచయమయ్యాడని, ఆయన ద్వారా నాగరాజును ఆశ్రయించానని చెప్పాడు. ఈ పనికి నాగరాజును పురమాయించేందుకు ఆర్డీవోకి ఏమైనా లంచం ఇచ్చావా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ నోరు మెదపలేదు. అదే విధంగా ఈ వ్యవహారం పరిష్కరించేందుకు, మ్యుటేషన్ ఇంకా కలెక్టర్ ప్రొసీడింగ్స్ కోసం నాగరాజుకు, వీఆర్ఏ సాయిరాజుకు అంజిరెడ్డి ఇంట్లో ఏమైనా డబ్బులు చెల్లించారా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ సమాధానం చెప్పలేదు. -
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
-
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం సాక్షి మీడియా చేతికి చెక్కింది. ఈ కేసులో కీసర ఎమ్మార్వోతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహశీల్దార్ పాత్ర ఉందని నిందితుల వాంగ్మూలంలో తేలింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజు ఒప్పందం కుదిరిందని ఈ కేసులో ఏ3 నిందితుడు శ్రీనాథ్ వాంగ్మూలం ఇచ్చారు. దయారాలోని 614, మరికొన్ని సర్వే నెంబర్లలోని 61 ఎకరాల 20 గుంటల భూమి.. సాయిరాజ్, అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదరిందన్నారు. మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెట్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు (కలెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది). ఏసీబీ అధికారులకు చిక్కిన కోటి పదిలక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కి వెళ్లానని ప్రధాన నిందితుడు ఎమ్మార్వో నాగరాజు (ఏ1) తెలిపారు. శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు. గతంలో తనతండ్రి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశాడని, తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు తెలిపారు. 1995లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్, ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేసినట్లు విచారణలో చెప్పారు. అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. 2011లోనే నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 10కోట్ల ఆస్తులు గుర్తించారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అతని బ్యాంకు లాకర్లలో 55లక్షల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెంట్స్‌పై విచారణ కొనసాగుతోంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
నాగరాజు లాకర్లో 1.5 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత నెల 14న రూ.కోటి పది లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక నాగరాజు వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు
సాక్షి, మేడ్చల్: కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ శుక్రవారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. రాంపల్లి దాయర వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు రిపోర్టులో తేలింది. ఇందులో భాగంగానే తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్‌ను అంజిరెడ్డి కుదిర్చినట్లు తేలింది. నాగరాజుకు అందజేసిన డబ్బు శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి సమకూర్చినట్లు బయటపడింది. దీంతోపక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ.. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్‌ను సీజ్ చేసింది. అయితే నాగరాజుతో డీల్‌కు సంబంధించి అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో సమావేశమైనట్లు తెలిసింది. ఏసీబీ దాడి సమయంలో అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిని మొత్తం సెర్చ్ చేసిన ఏసీబీ.. ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 65 పేజీల రెప్రజెంటేటివ్ లెటర్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించి ఇళ్ళ అనుమతికి 204 పేజీల పత్రాలతో పాటు, రాంపల్లి దాయర భూ పంచాయతీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలు, పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ కాపీలతో పాటు 65 పత్రాలు స్వాధీనం చేసుకుంది. (చదవండి : కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!) ఈ అంశాలపైనే మూడు రోజుల పాటు విచారించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో నిందితులెవరు సహకరించలేదని ఏసీబీ తెలిపింది. దీంతో నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో నాగరాజుతో పాటు మిగతా నిందితులు ఏసీబీ కోర్టులో శుక్రవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కీసర తహశీల్దార్ కేసులో విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో మూడోరోజు ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రూ.కోటి.10 లక్షల పై రియల్టర్ శ్రీనాథ్ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్ సహకరించాడన్న నేపథ్యంలో శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. కాగా రియల్ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పాడు. డబ్బు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో ఏసీబీకి శ్రీనాథ్ తెలిపారు. నాగరాజు సహచరుడు అంజిరెడ్డి వద్ద దొరికిన ప్రజాప్రతినిధి డాక్యుమెంట్లపై ఏసీబీ వివరాలు సేకరించింది. గుండ్లపోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను.. ఆర్టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి తెలిపారు. రాంపల్లి దయారా గ్రామానికి సంబంధించిన రూ.54 లక్షల ఎంపీ నిధుల మంజూరు లెటర్‌హెడ్‌పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మరో నాలుగు నియోజకవర్గాల పనుల కోసం నిధుల కేటాయింపుకు సిద్ధం చేసిన లెటర్‌హెడ్స్ అని అంజిరెడ్డి తెలిపినట్టు సమాచారం. కాగా తహశీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని, బ్యాంక్ లాకర్లపై నోరు మెదపడం లేదని అధికారులు తెలిపారు. బినామీ ఆస్తులపై, తాను చేసిన అక్రమాలపై ఏసీబీకి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా ఇదే కేసులో కీసర రెవెన్యూ శాఖ సిబ్బందిని ఏసీబీ ప్రశ్నించింది. నేటితో నలుగురు నిందితుల కస్టడీ ముగియనుంది. కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ఏసీబీ హాజరుపర్చనుంది. చదవండి: గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్ -
రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజు, వీఆర్వో సాయిరాజ్‌తో పాటు నిందితులుగా ఉన్న అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు సంబంధించి అనేక విషయాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి ఇంట్లో దొరికిన భూ లావాదేవీల డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో కోటి 10 లక్షల రూపాయల డబ్బు ఎవరివి అన్నదానిపై పూర్తి వివరాలు రాబట్టిననట్లు సమాచారం. ఎమ్మార్వో నాగరాజు మాత్రం ఏసీబీ అధికారులకు సహకరించనట్లు తెలుస్తోంది. తాజా విచారణలో సైతం ఆయన బ్యాంకు లాకర్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విచారణ అనంతరం ఈ కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (చదవండి: 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) -
గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక భూపట్టా విషయంలో రూ.2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీకరిస్తూ ఇటీవలే తహసీల్దార్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వ ఉద్యోగి 20 మిలియన్లను లంచం రూపంలో తీసుకుంటూ పట్టుబడటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండవచ్చని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యకలాపాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న దరఖాస్తులో తెలిపారు. దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన తమవద్ద ఇంతవరకు ఎలాంటి కేటగిరీ లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు
సాక్షి, మేడ్చల్: కొత్త పాసు పుస్తకాల కోసం అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు ఆశ్రయించగా, ఆర్ఐ కిరణ్ ఇళ్లు నిర్మించుకుంటున్నాడని రూ.35 లక్షలు అప్పు ఆయనకు ఇప్పించి, ఇప్పటి వరకు ఇవ్వలేదని కీసర దాయారకు చెందిన రైతు కుంటోళ్ల దశరథ తెలిపారు. మా రాంపల్లి దాయార గ్రామానికి సంబంధించిన భూముల వ్యవహారంలో పాసు పుస్తకాల జారీ విషయంపై రియల్టర్ బ్రోకర్ల నుంచి రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కటంతో ఆయన లంచావతారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గతంలోనే డబ్బులివ్వాలని తహసీల్దార్ నాగరాజుకు వద్దకు వెళ్లితే... తనపై అక్రమంగా 353 ఐపీసీ కింద కేసు నమోదు చేయించి తీవ్రంగా వేధించారని దశరథ తెలిపారు. కీసర దాయార గ్రామంలో 173, 174, 175, 176, 179, 213 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాసు పుస్తకాల కోసం నాగరాజును తరచు కలిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వకపోగా ఆర్ఐ కిరణ్‌కు ఇప్పించిన రూ. 35 లక్షలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త పాసు పుస్తకాలు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి పట్టుబడ్డ వెంకటేశ్వరరెడ్డి: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కోనసాగుతున్నాయి. సర్వేయర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటేశ్వరరెడ్డి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. -
బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు
సాక్షి, మేడ్చల్ : ఏసీబీ విచారణలో కీసర ఎమ్మార్వో నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పహనీలు రాకుండా, డిజిటల్ సంతకాలు కన్పించకుండా తనవద్దకే బాధితులు నేరుగా వచ్చేలా ఎమ్మార్వో స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. 30శాతం భూములు బ్లాక్ చేసి భూ యజమానులను వేధింపులకు గురి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మార్వో నాగరాజు..విదేశాల్ల ఉన్న వ్యక్తుల పేర్లమీద భారీగా ఆస్తుల కొనుగోలు చేసి వీటిని నగరంలోని మార్వాడి సేట్లకు వడ్డీ వ్యాపారాలకు ఇచ్చినట్లు సమాచారం. వీరికి సంబంధించిన బ్యాంకు లాకర్ల తాళాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అవినీతి తిమింగలం అక్రమాలు, ఈ కుట్ర కోణం వెనకున్న బడానేతల వివరాలను కూడా బయటపెడతామని తెలిపారు. రియల్టర్ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఏసీబీకి చిక్కిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్ వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపై విచారణ చేస్తున్నామని ఏసీబీ తెలిపారు. నాలుగురోజుల పాటు కస్టడీకి అనుమతించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నేడు విచారణకు సంబంధించి కస్టడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!) పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం నిందితులు నాగరాజు, అంజిరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా పలు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా నిందితులకు సహకరించిన వారి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మార్వో నాగరాజు ఇంట్లో నుంచి కొన్ని డాక్యుమెంట్లను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మొదటినుంచి ఈ కేసులో రాజకీయనేతల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఇంటికి బెంజ్, ఇన్నోవా కార్లరో వచ్చిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా విచరణ చేపడుతున్నారు. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!)


