సాయికృష్ణ కేసులో కీలక పరిణామం | Sai Krishna Case Head Constables Ashok and Nani Surrender | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో కీలక పరిణామం

Jun 29 2026 5:53 PM | Updated on Jun 29 2026 7:21 PM

Sai Krishna Case Head Constables Ashok and Nani Surrender

విజయవాడ: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్‌, నాని లొంగిపోయారు. వారిద్దరినీ సిట్‌ ఆఫీసుకు తరలించారు. వీరిద్దరు సాయికృష్ణ కేసులో నిందితులుగా ఉన్నారు. సీఐ నాగరాజు అరెస్ట్‌​ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.

సాయికృష్ణ కేసులో వీరి పాత్ర ఉందని ఖరారైన నేపథ్యంలో ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల గురించి గాలించారు. ఇప్పటికే వీరిద్దరిని సస్పెండ్‌ చేశారు. వీరిద్దరు దొరకడంతో కేసులోని చిక్కుముడులన్నీ వీడుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసి విచారించి పలు వివరాలు లాగింది సిట్‌. 

మరోవైపు, సాయికృష్ణ కేసులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారించింది. సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై విచారణను 15కు వాయిదా వేసింది హైకోర్టు. 

కాగా, సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అత్యంత సంచలనం సృష్టించిన ఘటనల్లో ఒకటిగా మారింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదని వారు చెబుతున్నారు. దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక విషయాలు బయటపడ్డాయి.

సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement