మూడో రోజూ పారిపోయిన కూటమి | AP Legislative Council Day 3 News Updates, Council Erupts Over DSC Row And YSRCP Demands Lokesh Resignation | Sakshi
Sakshi News home page

మూడో రోజూ పారిపోయిన కూటమి

Aug 19 2026 10:27 AM | Updated on Aug 19 2026 1:53 PM

DSC Row: Andhra Pradesh Legislative Council Day 3 News Updates

సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో అసెంబ్లీ మూడోరోజు సమావేశాల మూడో రోజూ కూడా దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్‌ తిరస్కరణతో ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు

అప్‌డేట్స్‌

మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

  • మూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించింది..
  • బయట మేకపోతు గంబీర్యం ప్రదర్శిస్తుంది.
  • డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వ స్పందించడం లేదు
  • రాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయంకి తెర తీస్తోంది
  • డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయింది
  • సభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి
  • 5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటు పార్టీకి లేదు..
  • ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుంది
  • రూల్ బుక్స్, చట్టాలు, సంప్రదాయాలు ఎక్కడ వున్నాయి?
  • మేము చెప్పింది మీరు చేయండి అని మాత్రమే కూటమి అంటుంది.. ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తుంది..
  • సభా సంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర మాకు అవసరం ఎందుకు ఇచ్చావ్ దేవుడా? అని సభ్యులు బాధ పడుతున్నారు..
  • పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు.. ఆచరించాలి.
  • రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకొంటున్నారు.. వీళ్లా? మనకు నాయకులు..
  • బీసీలకు జగన్ 50శాతం అమలు చేశారు..
  • బీసీ లకు రిజర్వేషన్ పై కోర్ట్ కి వెళ్ళింది వెన్నుపోటూ పార్టీ నేతలు..
  • డీఎస్సీ మీద జీవో ఎందుకు మార్చమని చెప్పాడు.. అమ్ముకోవడానికి కదా?
  • 14 నుండి 19 వరకు ఎంతమంది బీసీ లకు చంద్రబాబు పదవులు ఇచ్చారో రేపు మాట్లాడతా..
  • మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఏకంగా చైర్మన్‌నే డిక్టేట్ చేస్తారు
  • సభలో చర్చించిదే మండలి లో చర్చించమని అడుగుతున్నాం..
  • ప్రజలు తెలిసో తెలియకో అధికారం ఇచ్చారు.. మాకు నచ్చినట్లు చేస్తాంటే కుదరదు..
  • సభను పొడిగించామని కోరుతున్నాం..
  • గ్రూప్ 1 పరీక్ష పై చర్చమని, ఎంక్వయిరీ  వేయమని అడుగుతున్నామని గ్రూప్ 1 పేరు ఎత్తడం మానేశారు..

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ కామెంట్లు..

  • తూమాటి మాధవరావు మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవమయ్యారు
  • ఆయన్ని చైర్‌లో కూర్చోబెట్టాల్సిన సమయంలో అధికారపక్షం అగౌరవంగా వ్యవహరించింది
  • నాదెండ్ల మనోహర్, మరో మంత్రి సభ రూల్స్ ను నేర్పాలని చూశారు.. అలాంటి వారు సభా మర్యాదలను పాటించలేదు
  • మండలి చరిత్రలో ఈరోజు చీకటి రోజు
  • నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు డిప్యూటీ ఛైర్మన్ ను చైర్ లో కూర్చోబెట్టడానికిన మనసు రాలేదు
  • డీఎస్సీలో విచారణకు రమ్మంటే లోకేష్ రావడం లేదు
  • స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాశాకే ఉద్యోగమిచ్చామని అధికారులు చెప్పారు
  • స్పోర్ట్స్ కోటా వారికి ఏ పరీక్షా పెట్టలేదని లోకేష్ చెబుతున్నారు
  • వ్యవసాయ శాఖ మంత్రి లేకుండా వ్యవసాయం పై చర్చిస్తారు
  • విద్యాశాఖ మంత్రికి బదులు ఫైనాన్స్ మంత్రి సమాధానం చెబుతాడు
  • ఓడలరేవులో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు
  • 15 రోజులైనా మత్స్యకారుల ఆచూకీ తెలియలేదు
  • ప్రభుత్వం ఏం చేస్తోంది
  • మత్స్యకారులు గల్లంతైన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ..

  • డీఎస్సీ పై మూడవ రోజు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు
  • ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటోంది
  • నిజానిజాలను చర్చించేందుకు మండలిలో అవకాశం లేకుండా చేయడం దురదృష్టకరం
  • డిప్యూటీ ఛైర్మన్ కుర్చీని అధికారపక్షం అగౌరవపరిచింది
  • మండలి పట్ల అధికారపక్షానికి ఎంత గౌరవముందో తేలిపోయింది
  • బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో చర్చించారు
  • బలహీన వర్గాలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు
  • స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది
  • జగన్ మోహన్ రెడ్డి జనరల్ పోస్టుల్లోనూ బిసిలకు అవకాశం కల్పించారు
  • జీవో లేకపోయినా 36% బిసిలకు అవకాశం కల్పించిన మహానాయకుడు జగన్
  • బీసీలే వెన్నుముక అని నమ్మిన నాయకుడు జగన్
  • 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు
  • అధికారంలోకి వచ్చి రెండేళ్లైన బీసీలకు పెన్షన్ ఇవ్వలేదు
  • జగన్ బీసీ కులాలకు కార్పొరేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు హేళన చేశారు
  • ఇప్పుడు తమ మనుషులతో అవే కార్పొరేషన్లను భర్తీ చేసుకున్నారు
  • మేయర్, జడ్పీ ఛైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు నిర్వహిస్తామనడం దుర్మార్గం
  • తమ మనుషులకు మేలు చేయడం కోసమే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు

ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ..

  • మంత్రి లోకేష్ అసెంబ్లీలో చెప్పిన మాటలు మండలికి వచ్చి ఎందుకు చెప్పరు?
  • డీఎస్సీ అక్రమాల పై చర్చకు రాకుండా పారిపోతున్నారు
  • ఈరోజు సభలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరం
  • మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షం వ్యవహరించింది
  • రూల్స్ బుక్ తీసుకొచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు సభా మర్యాదలు తెలియదా?
  • స్పీకర్ గా చేసిన వ్యక్తికి సభ రూల్స్ గుర్తులేదా?

మండలి మీడియా పాయింట్‌ వద్ద రమేశ్‌ యాదవ్‌ కామెంట్లు.. 

  • బీసీలకు ‘వెన్నుపోటు పార్టీ’ వెన్నుపోటు పొడుస్తుంది..
  • 34 శాతం బీసీ రిజర్వేషన్ మీద సభలో హైడ్రామా నడిపారు
  • గత ప్రభుత్వం 34శాతం బీసీ లకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది
  • వెన్నుపాటు పార్టీ ప్రతాప్ రెడ్డి అనే నాయకుడితో కోర్టులో రిట్ పిటిషన్ వేశారు..
  • పార్టీ పరంగా బీసీ లకు 50శాతం సీట్లు ఇచ్చిన నేత జగన్..
  • 18 స్థానాలు ఎమ్మెల్సీ ఖాళీలు అయితే 11 బీసీ లకు ఇచ్చిన నేత జగన్..
  • మున్సిపాలిటి, జిల్లా పరిషత్, కార్పొరేషన్ లో అత్యధిక ప్రాధాన్యత కల్పించారు..
  • జగన్ ఇద్దరు బీసీలను డిప్యూటీ సీఎంగా చేశారు..
  • కూటమి ప్రభుత్వం బీసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు..
  • కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నాడు
  • బీసీలకు చంద్రబాబు వెన్నుపోటూ పొడుస్తూనే వున్నాడు..
  • 136 కులాలను తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు
  • కోర్టుకు పొతే నిలవదని చంద్రబాబుకి తెలిసి అసెంబ్లీలో బిల్లు పెట్టాడు..
  • బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో పెద్ద పీఠ వేశారు..
  • చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి..
  • బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ కి ప్రభుత్వం సిద్ధమా?


మీడియా పాయింట్‌ వద్ద కౌరు శ్రీనివాస్ కామెంట్లు.. 

  • 2019 నుండి 2024 వరకు బీసీలకు అన్యాయం చేసారని చంద్రబాబు మాట్లాడుతున్నారు
  • రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని గుర్తించిన నేత జగన్
  • ఆ కులాలకు పదవి ఇచ్చిన నేత జగన్
  • కూటమి బీసీలను ముందుకు తీసుకొని వెళ్లిన దాకలాలు లేవు
  • బీసీలను ఏ విధంగా గుర్తించాలని అని ఆలోచించిన నేత జగన్
  • రాజశేఖర్ రెడ్డి, జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది
  • అన్ని పధకాలు బీసీలతో పాటు ఎస్సీఎస్టీలకు అందేలా చేసిన వ్యక్తి జగన్
  • బీసీలు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి అంటే.. మళ్లీ జగన్ సీఎం కావాలి

వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు: తూమాటి

  • మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు
  • బాధ్యతలు స్వీకరించిన వెంటనే మాట్లాడిన తూమాటి
  • నాకు డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు
  • మండలి ఛైర్మన్, విపక్షనేత, సభ్యులకు ధన్యవాదాలు
  • ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉంది
  • శాసనమండలి విలువలను కాపాడుతా

    బొత్స కామెంట్లు.. 
  • శాసన మండలిలో కూటమి ఎమ్మెల్సీల దుస్సంప్రదాయం

  • డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక సమయంలో బయటకు వెళ్లిపోయిన కూటమి సభ్యులు

  • డిప్యూటీ చైర్మన్‌గా  ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలు

  • మండలిలో వెన్నుపాటు పార్టీ నేతల తీరు బాధాకరం: బొత్స

  • కూటమి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు: బొత్స

  • అధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవ పరిచారు: బొత్స

  • డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక సమయంలో అధికార పక్షం లేకపోవడం సరికాదు: బొత్స

  • సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు: బొత్స

  • నాదెండ్ల ప్రవర్తనను చాలాసార్లు గమనించా: బొత్స

  • పొరపాటు జరిగితే చెప్పాలిగానీ.. చైర్మనే హిత బోధ చేయడం ఏంటి?: బొత్స

  • డీఎస్సీపై చర్చించాలన్నదే మా డిమాండ్‌: బొత్స

  • నిబందనలు ఒక్కరికే కాదు.. అందరికీ వర్తిస్తాయి: బొత్స

  • అధికార సభ్యులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు: బొత్స

 

మంత్రులపై బొత్స ఆగ్రహం

మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు

  • ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు

  • వైఎస్సార్‌సీపీ తరఫున ఏకైక నామినేషన్‌

  • తూమాటి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు

  • అభినందనలు తెలిపిన వైఎస్సార్‌సీపీ సభ్యులు

  • ఆ వెంటనే డిప్యూటీ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన తూమాటి


వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసన మండలి

  • సభలో మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం

  • వైఎస్సార్స్‌సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం

  • చైర్మన్‌నే ఆదేశించేలా వ్యాఖ్యలు

  • చైర్మన్‌పట్ల మంత్రి నాదెండ్ల వ్యవహరించిన తీరుపై బొత్స మండిపాటు

  • ప్రొసీజర్‌ బుక్‌ తెచ్చి.. తానేం తప్పుగా మాట్లాడలేదంటూ మంత్రి నాదెండ్ల బుకాయింపు

  • సభ్యులు పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించిన నాదెండ్ల

  • చైర్మన్‌ సీటును మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని నాదెండ్లకు బొత్స హితవు

ప్రారంభం.. ఆ వెంటనే వాయిదా
డీఎస్సీ అంశంపై చర్చ జరపాలని వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. శాసనసభలో సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌.. మండలికి వచ్చి అదే సమాధానం చెప్పాలని కోరుతోంది. అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. తప్పు ఒప్పుకుని నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలని అంటోంది. అదే సమయంలో.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే ప్రభుత్వం తరఫున నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రావడం లేదు. కేవలం దాటవేత ధోరణి మాత్రమే కనిపించింది. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యుల చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టడంతో.. ఆయన మండలిని కాసేపు వాయిదా వేశారు.

మంత్రులకు చైర్మన్‌ చురకలు
వైఎస్సార్‌సీపీ సభ్యుల డీఎస్సీ డిమాండ్‌తో కూటమి మంత్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమాధానం ఇవ్వలేక.. గట్టి గట్టిగా అరుస్తూ ఏవేవో స్టేట్‌మెంట్లు ఇచ్చారు. చివరకు మండలిని సరిగ్గా నడపాలంటూ చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు మీద అసహనం ప్రదర్శించారు. మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా? అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వ్యా‍ఖ్యానించారు. మంత్రి పార్థసారథి ఓ అడుగు ముందుకేసి వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే మంత్రుల కమాండింగ్‌పై చైర్మన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రులందరికీ చురకలంటించారు.

నల్ల కండువాతో..
అంతకు ముందు.. మండలి సమావేశానికి ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు వేసుకుని ర్యాలీగా వచ్చారు. ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేస్తూ మండలికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.

మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్‌ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో డీఎస్సీ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.

పొంతన లేని సమాధానాలు: లేళ్ల అప్పిరెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. డీఎస్సీ కన్వీనర్‌, ఎస్సీఆర్టీ డైరెక్టర్‌గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి నారా లోకేశ్‌ చెబుతున్న మాటలకు విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని విమర్శించారు.

ఎన్‌ఓసీ తీసుకోలేదని లోకేశ్‌ చెబుతుంటే.. ఎన్‌ఓసీ తీసుకున్నానంటూ నవీన్‌ కోర్టును ఆశ్రయించారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలను లక్షల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అలాగే.. పీవీ సింధు తరహాలోనే మిగతా వాళ్లకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారని, నియామకాల ప్రక్రియకు ఈ స్టేట్‌మెంట్‌కు సంబంధం ఏమైనా ఉందా? అని నిలదీశారు. 

‘లోకేశ్‌ మండలికి వచ్చి సమాధానం చెప్పాలి’
డీఎస్సీ అక్రమాలపై తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని అప్పిరెడ్డి విమర్శించారు. లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సవాళ్లు విసరడం తప్ప తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మండలిలో మాత్రం చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

డీఎస్సీ కన్వీనర్‌, ఎస్సీఆర్టీ డైరెక్టర్‌గా ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు విద్యాశాఖ, శాప్‌ అధికారులను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారులందరినీ బదిలీ చేసినప్పుడు సంబంధిత మంత్రి లోకేశ్‌ను కూడా పదవి నుంచి తొలగించాలి కదా అని వ్యాఖ్యానించారు.

డీఎస్సీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత దూరం తప్పించుకున్నా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు, యువతే ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement