టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల వీరంగం | Chintamaneni Prabhakar Batch Blocks Vedurupavuluru Toll Gate | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల వీరంగం

Oct 4 2026 4:39 PM | Updated on Oct 4 2026 5:09 PM

Chintamaneni Prabhakar Batch Blocks Vedurupavuluru Toll Gate

సాక్షి, కృష్ణాజిల్లా: వెదురుపావులూరు టోల్ ప్లాజా దగ్గర టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్‌గేట్‌ను చింతమనేని బ్యాచ్‌ బ్లాక్ చేసేసింది. ఫీజు కట్టమన్న టోల్‌ ప్లాజా సిబ్బందిపై బెదిరింపులకు దిగారు. ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే రోడ్డును బ్లాక్ చేసిన చింతమనేని వర్గం.. టోల్‌ ప్లాజాకు అడ్డంగా లారీలను అడ్డు పెట్టింది. చింతమనేని అనుచరుల దౌర్జన్యంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

దీంతో వాహనాలు భారీగా బారులు తీరాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేం ఎమ్మెల్యే చింతమనేని మనుషులంటూ.. ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలంటూ పోలీసులకు  కూడా చింతమనేని అనుచరులు ఎదురు ప్రశ్నలు వేశారు.

ఇదీ చదవండి: రైతులకు బాబు లక్ష మోసాలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement