సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందులలో నామినేషన్ల అడ్డగింతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దగ్గరుండి అభ్యర్థులతో నామినేషన్ వేయించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి, చక్రాయపేటల్లో అరాచకంపై పిర్యాదు చేసింది. అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కోర్టుకు విన్నవించింది. రెండు మండలాల్లో 21 గ్రామ పంచాయతీల్లో అడ్డుకున్నారని కోర్టుకు తెలిపింది. వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆ 21 గ్రామాల్లో దగ్గరుండి నామినేషన్లు వేయించాలని హై కోర్టు ఆదేశించింది.


