హైదరాబాద్: ‘‘సాక్షి’’లో వచ్చిన ఓ కథనంలో ‘‘చెట్టపట్టాల్’’ అన్న పదంపై లోకేశ్, షర్మిల అనవసరంగా అభ్యంతరాలు చెబుతూ ట్వీట్లు చేసిన వేళ దీనిపై రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తంరెడ్డి మండిపడ్డారు. సాక్షి డిబేట్‌లో పురుషోత్తంరెడ్డి మాట్లాడారు.
‘‘అప్పట్లో షర్మిలను టీడీపీ, చంద్రబాబు ఎలా చూశారు? ఇప్పుడు సాక్షిలో వచ్చిన రెండు పదాలకు అభ్యంతరం చెబుతూ లోకేశ్ ఇప్పుడు స్పందించారు. ఆయన ఇంకో విషయంపై కూడా స్పందించి ఉండాలి. గతంలో షర్మిల హైదరాబాద్‌లో ఓ కేసు పెట్టారు. తనపైన అభ్యంతరకరంగా ఫలానా ఇంట్లో.. (అది ఎవరి ఇంట్లోనే నాకు తెలియదు గానీ), వారింట్లో నుంచే నడిచింది ఓ వ్యవహారం అని కేసు పెట్టారు. అందులో టీడీపీ పాత్ర ఉందని స్వయంగా షర్మిల కేసు పెట్టారు హైదరాబాద్‌లో. ఇప్పటికీ ఆ కేసు ఉంది. అప్పుడు కూడా లోకేశ్ స్పందించి ఉండాలి. ఇది సరైంది కరాదు.. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని’’ అని చెప్పారు.
ట్విటర్ స్పేస్‌లో బూతుపురాణం గురించి..
ట్విటర్ స్పేస్‌లో జనసైనికులు చేసిన బూతుపురాణం గురించి పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ ఈ విషయంలో మనం ఉచ్ఛరించడానికి వీల్లేని భాష వాడారు. దీన్ని ఖండించాలి కదా? అధికారంలో ఉన్నారు కదా? షర్మిల పట్ల గౌరవం ఉంటే, ఆప్యాయత ఉంటే నిందితులపై యాక్షన్ తీసుకోవాలి కదా?
మరోవైపు, ‘‘చెట్టపట్టాల్’’ అన్న పదం గురించి ఇక్కడ వైఎస్ జగన్‌ను విమర్శించడం కోసం వాడుకుంటున్నారు. ఇక్కడ సమస్య రాజకీయ పదాలకు, రోజువాడే పదాలకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. చంద్రబాబుతో కలిసి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దాన్ని ఖండించండి. అంతేగానీ, ఇప్పుడు షర్మిల చేసిన ట్వీట్ వైసీపీపై లోకేశ్ రాళ్లు వేయడానికి ఉపయోగపడింది’’ అని తెలిపారు.


