విజయవాడ: నగరంలో జరుగుతున్న రేషన్ మాఫియాను ఎప్పుడు కట్టడి చేస్తారని కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీశారు వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్. రేషన్ మాఫియాపై జాయింట్ కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి నెలా రూ. 5 కోట్ల అక్రమ సంపాదన జరుగుతుందన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రేషన్ మాఫియా డాన్ల పేర్లు, ఫోన్ నంబర్లు అధికారులకు అందిస్తామని పోతిన మహేష్ స్పష్టం చేశారు.
లారీ డ్రైవర్ల పై కేసులతో సరిపెట్టకుండా మాఫియా డాన్లపై చర్యలు తీసుకోవాలి. రేషన్ మాఫియాకు మంత్రి అండదండలు ఉన్నాయా? జాయింట్ కలెక్టర్ సమాధానం చెప్పాలి. విజయవాడలో రేషన్ మాఫియాపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు?, రేషన్ మాఫియాపై పవన్ స్పందించాలి. డ్రోన్లతో రేషన్ మాఫియా డాన్లను ఎందుకు గుర్తించలేకపోతున్నారు. సీసీ కెమెరాలను దాటుకుని లారీల్లో రేషన్ బియ్యం ఎలా తరలిపోతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విజయవాడ పోలీసులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పక్షపాతం చూపితే ప్రశ్నిస్తాం.. కాకాణి హెచ్చరిక


