breaking news
Sai Krishna
-
సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. మాకేమి తెలీదు.. అంత CI నాగరాజుకే..
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. ఏడురోజుల పాటు సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు ఐదు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది.ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను సిట్ అధికారులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లు ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. -
సాయి కృష్ణ కేసును మమ అనిపించారు పొన్నవోలు షాకింగ్ నిజాలు
-
సాయికృష్ణను ఎందుకంత క్రూరంగా హింసించారు?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్‌డెత్, డెడ్‌బాడీ మాయం కేసులో మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు ఐదో రోజు సోమవారం ప్రశ్నించారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులు, స్టేషన్ సిబ్బంది లింకులపై ఆరా తీశారు. నాగరాజుతో సన్నిహితంగా ఉండే వారి గురించి కూడా అడిగారు. ప్రైవేటు వ్యక్తులతో మీకు సంబంధం ఏంటని ప్రశ్నించగా నాగరాజు నోరు మెదపలేదని సమాచారం. సాయికృష్ణ కేసులో మరో సీఐ ప్రమేయంపై కూడా సిట్ ప్రశ్నలు వేసింది. లాకప్ డెత్, మృతదేహం మాయం కేసులో మీకు ఓ సీఐ సహకరించినట్లు ఆరోపణలున్నాయని అవి నిజమేనా? మీకు సహకరించిన సీఐ ఎవరు? అని సిట్ అడగ్గా, నాగరాజు మౌనంగానే ఉన్నట్లు సమాచారం. సాయికృష్ణతో మీకు ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా, ఎందుకు అంత క్రూరంగా అతడిని హింసించారని సిట్ అధికారులు ప్రశ్నించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు మీకు సాయికృష్ణను అప్పగించినప్పుడు ఏమైనా గాయాలున్నాయా, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారిపై వచ్చిన ఆరోపణలు నిజమేనా అని సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా ఏమైనా టార్చర్ చేశారా, అతని తల్లి ఆరోపణలకు మీరు ఏమి సమాధానం చెబుతారంటూ సిట్ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. కాగా సిట్ అడిగిన ఏ ప్రశ్నకూ నాగరాజు నోరు మెదపలేదని సమాచారం. -
సాయికృష్ణ కేసు.. సిట్ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ4గా ఉన్న సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేష్ పరారీలో ఉన్నట్టు ఆచూకీ తెలపాలని సిట్ ప్రకటన విడుదల చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు.సిట్ ఎదుట విచారణకు హాజరైన తరువాత కేసు నమోదు కాగానే సురేష్ పరారయ్యాడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ పరారీలో ఉన్నాడని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు సిట్ నివేదించింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్‌కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. -
కృష్ణలంక PSలో సీన్ రీక్రియేషన్
-
అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజును సిట్ అధికారులు రెండో రోజూ విచారించారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సిట్ కార్యాలయంలో ఉ.10 నుంచి సా.5 గంటల వరకూ విచారించారు. రెండో రోజు కూడా నాగరాజు సహకరించలేదని తెలిసింది. అన్ని ప్రశ్నలకు ఆయన మౌనం దాల్చినట్లు సమాచారం. మరోవైపు.. కానిస్టేబుల్ సురేష్, ఆర్ఎంపీ, ఇతర సిబ్బంది నుంచి తీసుకున్న సమాచారం మేరకు సిట్ అధికారులు సీఐ నాగరాజును విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే, ప్రతీ దానికి ఆయన ఏమీ తెలీదని చెబుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నారని తెలిసింది. ఈ ప్రశ్నలకు సమాధానం లేదు..అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు.. ఎవరు తెచ్చారు.. అతన్ని ఎక్కడ ఉంచారు.. ఎలా చనిపోయాడు.. ఎప్పుడు చనిపోయాడు.. ఒకవేళ చనిపోతే మృతదేహాన్ని ఏం చేశారు అనేవి ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. విచారణకు ఇంకా ఐదు రోజులే ఉండడంతో గడువు ముగిసేలోపు కేసులో ఏమైనా క్లూ రాబడతారా లేదా అనే సందేహం నెలకొంది. -
పోలీసు కస్టడీకి సీఐ నాగరాజు
విజయవాడ లీగల్: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన కాపు యువకుడు గాదె సాయికష్ణ అదశ్యం కేసులో సస్పెండ్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విజయవాడ కష్ణలంక సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి విజయవాడ నాలుగో అడిషనల్ జూనియర్ సివిల్ కమ్ ఆర్సీసీ కోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో గురువారం విజయవాడ న్యాయస్థానంలో పోలీసులు ఆయన్ను హాజరుపరిచారు. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. నాగరాజు తరఫున న్యాయవాది జి. సాంబశివరావు వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జైలు మాన్యువల్ నిబంధనలకు లోబడి పోలీసుల విచారణ ఉ.10 నుంచి సా.5 వరకు మాత్రమే జరపాలన్నారు. విచారణ పేరుతో రాత్రి వేళల్లో సుదీర్ఘ ఇంటరాగేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిలేదని, 24 గంటల పాటు నిందితులను ఇంటరాగేషన్ చేయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమన్నారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది పందిరి బాబూరావు లేదా వేరొక న్యాయవాదిగానీ హాజరుకావచ్చన్నారు. అయితే, న్యాయవాది విచారణలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకూడదని ఆంక్షలు విధించిందని కోర్టు తీర్పును చదివి వినిపించారు. లాయర్ విచారణ ప్రదేశానికి కనీసం 10 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని ట్రయల్ కోర్టు తీర్పులో ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా ట్రయల్ కోర్టు, హైకోర్టుల ప్రధాన నిబంధనలను సమర్థిస్తూనే కొన్ని సవరణలు చేసిందని.. విచారణ మొత్తం జైలు మాన్యువల్, కోర్టు నిబంధనల పరిధిలోనే సాగాలని డిఫెన్స్ న్యాయవాదులు వాదించారు. విచారణకు వచ్చేముందు పోలీసు అధికారులు సమయం, ఇతర వివరాలను ముందుగా నిందితుడి తరఫు న్యాయవాదులకు తెలియజేయాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే విచారణాధికారులు విచారిస్తారని, అలాగే నిందితునికి సిట్ కార్యాలయంలో సీసీ కెమేరాల పర్యవేక్షణలో భారీ భద్రత మధ్య రూమ్‌ను కేటాయించనున్నట్లు న్యాయమూర్తి దష్టికి తెచ్చారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రిషీక్ విచారణ సమయంలో విచారణాధికారుల నుండి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తెలియజేయాలని సూచిస్తూ నాగరాజును పోలీసు కస్టడీకి అనుమతించారు.తొలిరోజు ప్రశ్నల వర్షంస్పందించని సీఐ నాగరాజుసాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మరో ఆరు రోజులపాటు సిట్ విచారణసాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్‌డెత్, బాడీ మాయం కేసులో గురువారం సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. తొలుత ఆయనను రాజమండ్రి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ వాదనలు జరిగాక పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన అనంతరం నాగరాజును సిట్ కార్యాలయానికి తరలించారు. లాకప్‌డెత్ అంశంపై పలు ప్రశ్నలను సిట్ సంధించింది. దీనికి నాగరాజు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని సమాచారం. సాయికృష్ణను ఎందుకు హింసించారు?మార్కాపురం నుంచి విజయవాడకు సాయికృష్ణను తీసుకొచ్చి టాస్క్‌ఫోర్స్ నుంచి అదుపులోకి తీసుకున్నాక కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని సిట్ ప్రశ్నించింది. కస్టోడియల్ టార్చర్, లాకప్‌డెత్ తర్వాత పరిణామాలు ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?.. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా?.. సాయికృష్ణను లాకప్‌లో ఎందుకు చిత్రహింసలకు గురిచేశారంటూ నిలదీశారు. సాయికృష్ణ లాకప్‌డెత్ జరిగిందా?.. లాకప్‌డెత్ తర్వాత డెడ్‌బాడీ మాయం చేశారా?.. లాకప్‌డెత్ జరిగిన రోజు స్టేషన్లో సిబ్బంది ఎవరెవరు ఉన్నారు.. ఈ కేసులో సిబ్బంది పాత్ర ఎంత ఉందని సిట్ ఆరా తీసింది. స్టేషన్లో సీసీ ఫుటేజ్‌ను ఎందుకు మాయం చేశారంటూ వేసిన ప్రశ్నలకు నాగరాజు మౌనంగా ఉండిపోయారని సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉ.10 నుంచి సా.5 వరకు విచారించిన సిట్ మరో ఆరు రోజులు నాగరాజును ప్రశ్నించనుంది. -
సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: సాయికృష్ణ పిన్ని, అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాతే కేసు పూర్తిగా తప్పుదోవ పట్టిందని వ్యాఖ్యానించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పూటకో మాట మాట్లాడుతోందని, రిత్వికనే లాయర్‌గా పెట్టుకోవాలని అక్కను బెదిరించారని స్పష్టం చేశారు. కేసు డిస్మిస్ చేస్తే మాత్రం చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే మానవహక్కుల కమిటీతో కలిసి పోరాడుతామని కనకదుర్గ పేర్కొన్నారు.22వ తేదీన సాయికృష్ణ కేసును ఆన్లైన్లో చూశాను. హేబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా అని వచ్చింది. హేబియస్ కార్పస్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోలేదు.. సీబీఐ విచారణ వద్దని మాత్రమే చెప్పాను అని మా అక్క చెప్పింది. గంటకో మాట మా అక్క మాట్లాడుతుంది. మర్డర్ కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేయడం ఎప్పుడైన చూసామా?, కేసును. పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు.. నేను చూస్తూ ఊరుకోను. మానవ హక్కుల కమిటీ, నేను, బార్ అసోసియేషన్ కలిసి పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. -
కృష్ణలంక సాయికృష్ణ కేసులో మరో ట్విస్ట్
-
సాయికృష్ణ కేసులో సంచలనం
సాక్షి, అమరావతి: ఆది నుంచీ మలుపులపై మలుపులు తిరుగుతున్న కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తన కుమారుడు లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి బుధవారం హైకోర్టుకు నివేదించింది. తనకు తెలియకుండా, తన సమ్మతి లేకుండా, ఎలాంటి సూచనలు తీసుకోకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో ఆమె దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాది కోగంటి రిత్విక పిటిషన్ వేశారని న్యాయవాది గుడివాక వాసుదేవుడు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిత్విక స్థానంలో వాదనలు వినిపించేందుకు తనను విజయలక్ష్మి నియమించుకుని, ఆ మేరకు వకాలత్ ఇచ్చారని ఆయన వివరించారు. తాను ఈ కేసులో హాజరయ్యేందుకు రిత్విక నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోరినప్పటికీ, ఆమె స్పందించడం లేదని వాసుదేవుడు కోర్టుకు నివేదించారు. ఎన్వోసీతో పాటు కేసు రికార్డులను కూడా ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్వోసీ లేకుండానే వకాలత్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఆ మేర తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలని కోరారు. దీంతో హైకోర్టు, విజయలక్ష్మి తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిశీలించింది. ఇందులోని ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు, వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. ఇదేమీ చిన్న విషయం కాదంది. రిత్విక వాదనలు విన్న అనంతరమే తగిన నిర్ణయం తీసుకుంటామని, ఆమెకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.నాకు తెలియకుండానే రిత్విక ఆ పిటిషన్ వేశారు..తన కుమారుడిని కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత సాయికృష్ణ లాకప్‌డెత్ జరిగిందన్న విషయం రూఢీ అయింది. దీంతో ఆమె తన కుమారుడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, సీబీఐ దర్యాప్తు కోసం తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని, అందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 14న విజయలక్ష్మి తరఫు న్యాయవాది కోగంటి రిత్విక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీబీఐ దర్యాప్తు కోసం వేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్‌నూ ఉపసంహరించుంటామని పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం, ప్రధాన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ఓ చోట, అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని మరో చోట రాశారని గుర్తు చేసింది. అసలు సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వివరిస్తూ తాజాగా పిటిషన్ దాఖలు చేయాలని విజయలక్ష్మిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఐదుగుర్ని అరెస్ట్ చేశాం.. ఒకరు పరారీలో ఉన్నారు..తాజాగా ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాసుదేవుడు స్పందిస్తూ జరిగిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సాయికృష్ణ కేసు దర్యాప్తు పురోగతి ఏమిటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతిను ప్రశ్నించింది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విజయలక్ష్మి అనుమతి లేకుండానే సీబీఐ దర్యాప్తు కోసం గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరణకు పిటిషన్ వేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది రిత్వికకు నోటీసు ఇవ్వాలని వాసుదేవుడిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.దర్యాప్తు పురోగతిని మా ముందుంచండిసాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
హైకోర్టులో CI నాగరాజు క్వాష్ పిటిషన్ నిజాలు వెలుగులోకి వస్తాయా..?
-
డీజీపీ, కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, లాకప్ డెత్, మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం.మానసలను నిందితులుగా చేర్చాలంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈపిటిషన్‌లో ఏమని పేర్కొన్నారంటే.. ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 210 ప్రకారం నేరం గురించి ఎవరైనా మేజి్రస్టేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మేజిస్ట్రేట్ ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా చర్యలు ప్రారంభించవచ్చు. చట్టపరమైన నిషేధం ఉంటే మినహా లోకస్ స్టాండై (కేసు దాఖలు చేయడానికి ఉంటే చట్టపరమైన హక్కు) అనే భావన క్రిమినల్ లాలో లేదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. బాధితుడికి ఫిర్యాదుదారుడు ‘అపరిచితుడు’ అయినంత మాత్రాన ఫిర్యాదును కొట్టివేయలేరని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివాహ సంబంధిత నేరాలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు లాంటి కొన్నింటికి మినహా హత్య లాంటి తీవ్రమైన నేరాలపై మూడో వ్యక్తి లేదా సామాజిక కార్యకర్త ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. క్రిమినల్ వ్యవహారాల్లో సాంప్రదాయ లోకస్ స్టాండై నిబంధన ఖచ్చితంగా వర్తించదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది’ అని గురుమూర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల అరాచకాలను ఉపేక్షించొద్దని సుప్రీం చెప్పింది ‘విధి నిర్వహణలో అనుకోకుండా జరిగే పొరపాట్లకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 218 కింద ప్రభుత్వ అధికారులకు రక్షణ ఉంటుంది. కానీ చట్టవిరుద్ధమైన, ఉద్దేశపూర్వక తీవ్ర నేరాలు, హింస, కస్టడీ హత్యలు లాంటివి ప్రభుత్వ అధికారిక విధుల కిందకు రావు. ఇదే విషయాన్ని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ మానసల నేరపూరిత చర్యలకు సెక్షన్ 218 కింద రక్షణ లభించదు. వారి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదు. విచారణ సమయంలో లేదా కస్టడీలో చిత్రహింసలు, అమానుష ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధం. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 113వ నివేదికలో కస్టడీ గాయాల విషయంలో బాధ్యత పోలీసులపైనే ఉంటుందని పేర్కొంది. లాకప్‌డెత్‌లు నాగరిక సమాజానికి తీవ్రమైన ముప్పు అని, పోలీసుల అరాచకాలను ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. ఫిర్యాదు చేసినా డీజీపీ, కమిషనర్ పట్టించుకోలేదు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, కస్టడీలోనే చంపేసే అవకాశం ఉందని, వెంటనే జోక్యం చేసుకోవాలని డీజీపీ, కమిషనర్లకు తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. డీజీపీ, కమిషనర్ పట్టించుకోకపోవడంతో విజయలక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సాయికృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియదని, ఆచూకీ కోసం టీమ్‌లు ఏర్పాటు చేశామని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సాయికృష్ణ పోలీసుల చిత్రహింసల వల్ల మరణించాడని, అధికారులు నిజాన్ని దాస్తున్నారని విజయలక్ష్మీ తరఫు న్యాయవాది వాస్తవాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు’ అని పిటిషన్లో నివేదించారు. వైఎస్ జగన్ పరామర్శ తరువాతే ప్రభుత్వం దిగొచ్చింది ‘మాజీ సీఎం వైఎస్ జగన్ 18.06.2026న బాధితుడి ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 19.06.2026న పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణలంక సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చారు. తర్వాత సిట్‌ను ఏర్పాటు చేశారు. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారాన్ని డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలు ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చారు. 5.6.26న టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకురావడం, అక్రమ నిర్బంంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేసి చంపడం, సీసీటీవి హార్డ్ డిస్‌్కలను మార్చడం, మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, ఫోన్‌ను గోవాకు పంపి తప్పుదోవ పట్టించడం లాంటి వాటి వెనుక ఉన్నతాధికారుల కుట్ర ఉంది. సాయికృష్ణ లాకప్‌డెత్ వారి సహకారంతోనే జరిగింది’ అని గురుమూర్తి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. టాస్క్ ఫోర్స్ ను పంపింది రాజశేఖరబాబు, మానసనే ‘సీఐ నాగరాజు కోరిక మేరకు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, ఏసీపీ మానసలు సాయికృష్ణను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్‌ను పంపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు 5.6.2026 రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని సెంట్రీ కానిస్టేబుల్ సాగి పవన్ కుమార్‌కు అప్పగించారు. ఇదంతా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానసలకు స్పష్టంగా తెలుసు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ముగ్గురిదీ నేరపూరిత కుట్రే ‘అంతా తెలిసీ, సాయికృష్ణ ఆచూకీ తెలియదని హైకోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించారు. తద్వారా నేరాన్ని కప్పిపుచ్చి, నిందితులను కాపాడే కుట్ర పన్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్ విషయంలో డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలది కేవలం నిర్లక్ష్యమే కాదు.. నేరస్థులను కాపాడటానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఉన్నతాధికారులుగా నేరాన్ని నిరోధించకుండా లాకప్‌డెత్‌కు సహకరించారు. అక్రమ నిర్బంంధానికి అనుకూలంగా వ్యవహరించడం, చట్టపరమైన విధులు నిర్వర్తించడంలో విఫలమై బాధితుడికి తీవ్ర హాని కలిగించడం, నిందితులను శిక్ష నుంచి కాపాడేందుకు సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం లాంటి నేరాలకు పాల్పడ్డారు. వీటన్నింటి దృష్ట్యా ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని నివేదించారు. డీజీపీ, కమిషనర్‌కు రోజూ అక్రమ నిర్బంధాల నివేదికలు ‘ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఆ స్టేషన్ సిబ్బందితో లేదా ర్యాంకులతో సంబంధం లేకుండా, స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ ఉంటారు. వీరు ఆ పోలీస్ స్టేషన్లో జరిగే రోజువారీ కార్యకలాపాలను, చట్టబద్ధ, అక్రమ నిర్బంంధాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరు డైలీ స్టేటస్ రిపోర్ట్ తయారు చేసి ఏసీపీ ద్వారా ఆ జోన్ డీఎస్పీకి పంపుతారు. డీఎస్పీ దానిని కమిషనర్, డీజీపీ, రాష్ట్ర నిఘా వర్గాలకు పంపిస్తారు. అక్రమ నిర్బంంధాల గురించి ఈ విధమైన నివేదికలు డీజీపీ, పోలీసు కమిషనర్ ఇద్దరికీ వెళ్తాయి. కాబట్టి సాయికృష్ణ అక్రమ నిర్బంధం విషయం వారి దృష్టిలో ఉందన్న విషయం స్పష్టమవుతోంది’ అని గురుమూర్తి వివరించారు. లాకప్‌డెత్ గురించి డీజీపీ, కమిషనర్‌కు తెలుసు ‘కమిషనర్ రోజూ ఉదయం తన కమిషనరేట్ పరిధిలోని డీసీపీ, ఏసీపీలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్, సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తుల గురించి, నిర్బంంధాల వివరాలను కమిషనర్‌కు వివరిస్తారు. తర్వాత రాష్ట్రంలోని కమిషనర్లందరూ డీజీపీతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఉన్న నిర్బంంధాలు, అక్రమ నిర్బంంధాల సమాచారాన్ని డీజీపీకి నివేదిస్తారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ అక్రమ నిర్బంధం గురించి, ఆ తరువాత లాకప్‌డెత్ గురించి డీజీపీ, కమిషనర్, ఏసీపీలకు ప్రత్యక్ష, పరోక్ష సమాచారం ఉంది’ అని తిరుపతి ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సాయి కృష్ణ తల్లి కేసును వెనక్కి తీసుకుందంటే... పొన్నవోలు షాకింగ్ నిజాలు
-
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున పొన్నవోలు ఫిర్యాదు చేశారు.డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ఏ–1గా పేర్కొన్న పిటిషనర్.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబును ఏ–2గా, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ ఎం.మానసను ఏ–3గా చేర్చారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అదృశ్యం, మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు.టాస్క్‌ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున కమిషనర్‌కు అరెస్టు విషయం తెలియదనడం సాధ్యం కాదని వాదన. సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకుని మే 9 వరకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. జూన్ 15న హైకోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు.హైకోర్టుకు ఇచ్చిన సమాచారం, సీఐ రిమాండ్ రిపోర్టులోని వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదన. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహాని అనుమానాలపై డీజీపీ, కమిషనర్‌కు ఈ–మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. సమాచారం అందినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సాయి కృష్ణను రక్షించేందుకు చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వక మౌనం వల్ల సాక్ష్యాలను మాయం చేసేందుకు, నిందితులను కాపాడేందుకు అవకాశం కలిగిందని పిటిషన్లో ఆరోపించారు.పోలీస్‌స్టేషన్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ల మార్పు, ఫుటేజీ మాయం అంశాలపైనా పిటిషన్లో ప్రస్తావించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్‌ఫోన్‌తో నకిలీ ఆధారాలు సృష్టించడం సంస్థాగత కుట్రలో భాగమని పిటిషనర్ పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు, డైలీ స్టేటస్ రిపోర్టులు, అధికారుల రోజువారీ సమావేశాల ద్వారా అక్రమ నిర్బంధ సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుందని పిటిషన్లో వాదన. ఇది కేవలం కిందిస్థాయి పోలీసుల చర్య కాదని, ఉన్నతస్థాయి కుట్ర–కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.సిట్ దర్యాప్తు కిందిస్థాయి పోలీసులకే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని పేర్కొన్న పిటిషనర్.. డీజీపీ, కమిషనర్, ఏసీపీపై హత్య, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, అధికార దుర్వినియోగం, సాక్ష్యాల మాయం అభియోగాలు ఉన్నాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61, 49, 103, 127(3), 198, 238తో పాటు సెక్షన్ 3(5) కింద చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన చర్యలు కావని, అందువల్ల విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్ వాదన. పోలీస్ కస్టడీలో కొట్టడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ఫిర్యాదుదారు ఉదహరించారు.ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుతోపాటు ప్రైవేట్ ఫిర్యాదును కలిపి విచారించేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 233ను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కేసులో డీజీపీ నుంచి కిందిస్థాయి పోలీసుల వరకు మొత్తం పాత్రను వెలికితీయాలని పిటిషన్ వేశారు. ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనే సూత్రాన్ని అమలు చేయాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, కమిషనర్, ఏసీపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. -
బ్రేకింగ్ న్యూస్..సాయి కృష్ణ ఇంటికి సిట్ అధికారులు
-
ఆ తల్లి పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి కారణం..! CI నాగరాజును లేపేస్తే కేసు ఉండదు అని...!
-
సాయికృష్ణ కేసుపై న్యాయవాదుల సంచలన వ్యాఖ్యలు..
-
విశ్వసనీయత లేని బాబు మాటలు
-
పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు?: హైకోర్టు
విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. అయితే, నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణ విచారణ కోసం వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. దీంతో పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టుకు ఆదేశించింది.మొదట సీబీఐ విచారణ ఎందుకు కోరారు? మళ్లీ వద్దని ఎందుకు కోరుతున్నారో చెప్పాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. -
సాయి కృష్ణ కేసుకు బ్రేకులు
-
‘సిట్’ మరిచిన సీసీ ఫుటేజీ!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆధారాల సేకరణ వైపు ‘సిట్’ బృందం కన్నెత్తి చూడటం లేదు. సీసీ ఫుటేజీ రికవరీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ కేసు ముందుకు కదలాలంటే సీసీ పుటేజి అత్యంత కీలకమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నిందితుడు నాగరాజు గత 18 నెలలుగా పాల్పడిన దారుణాలు వెలుగు చూడకుండా ఉండేందుకే ప్రణాళిక ప్రకారం డేటాను మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రధానంగా నెట్ వర్క్, వీడియో రికార్డర్ హార్డ్‌డిస్క్‌లను మార్చేసి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆపరేటింగ్ సిస్టం పనిచేసేందుకు అందులో కొద్దిపాటి ర్యాం ఉంటుంది. ఈ దృశ్యాలు ఎవరు, ఎప్పుడు తొలగించారు? అనే వివరాలు అంతర్గతంగా నిక్షిప్తం అవుతాయి. ఎన్వీఆర్ లాగ్ వీడియోలను వెలికి తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా విశ్లేషిస్తే ఆ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. సాక్ష్యాధారాల సేకరణలో ఇది కీలకం కానుంది. అయితే సిట్ ఏర్పాటై రోజులు గడిచిపోతున్నా విచారణలో మాత్రం పురోగతి లేదు. బాధితుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కొన్ని అరెస్టులు మినహా పెద్దగా సాధించింది ఏమీ లేదు. నిందితుల నుంచి కీలక సమాచారం ఏదీ రాబట్టలేదు. లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ, నాగరాజు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన కాంత్రికుమార్ కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడంతో మేలుకున్న చంద్రబాబు సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు ఆదేశించినా చిత్తశుద్ధి చూపడం లేదు.మా లాయర్‌ను మార్చడంలేదురెండో అదనపు జ్యుడీషియల్ కోర్టుకు తెలిపిన సాయికృష్ణ చిన్నమ్మ సాక్షి, విజయవాడ: విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు, న్యాయవాది మల్లెమూడి సతీష్ బాబే వాదిస్తారని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి సోదరి, అడ్వొకేట్ కనకదుర్గ తెలిపారు. గాదె సాయికృష్ణ కేసులో రెండో అదనపు జ్యుడిషియల్ కోర్టులో గాదె విజయలక్ష్మి తన న్యాయవాదిని మార్చుకున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. తన సోదరి విజయలక్ష్మి తన కొడుకు సాయికృష్ణ కేసులో న్యాయవాదిని మార్చుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, న్యాయవాది మల్లెమూడి సతీష్ బాబును మార్చడంలేదని కనకదుర్గ రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీకాంత్ దృష్టికి తెచ్చారు. హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు మాత్రమే తమ తరఫున వాదనలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. పిటిషనర్ గాదె విజయలక్ష్మి తన ఎదుట హాజరు కావాలని, న్యాయవాదిని మార్చుకోవడంలేదని స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆ తరువాతే ఈ కేసులో జ్యుడీషియల్, సీసీ ఫుటేజీ పరిశీలన విచారణను కొనసాగిస్తానని జడ్జి తెలిపారు. విజయలక్ష్మి ఆరోగ్య సమస్య కారణంగా రాలేదని, ఆమె తరఫున తాను హాజరైనట్లు కనకదుర్గ తెలిపారు. దీంతో జడ్జి కేసు విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు. -
లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టులో సాయికృష్ణ పిన్ని
-
దొరికిన సాయికృష్ణ లాకప్ డెత్ CCTV ఫుటేజ్
-
హైకోర్టు ఆర్డర్స్.. విచారణకు ఒక్కరోజే అనుమతి..
-
సాయి కృష్ణని ఎక్కడైతే చంపాడో అక్కడే CI నాగరాజు విచారణ
-
సుప్రీం కోర్టుకు చేరిన సాయికృష్ణ కేసు
సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలన్న ఆదేశంపై అభ్యంతరం తెలిపిన సిట్.. దర్యాప్తు ప్రక్రియకు ఇది ఆటంకంగా మారుతుందని పేర్కొన్నట్లు సమాచారం.హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలేంటంటే..గాదె సాయికృష్ణ మృతి కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి సీఐ నాగరాజును ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. అయితే కస్టడీ విచారణ విషయంలో ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దర్యాప్తు అధికారుల విచారణలో పారదర్శకత కోసం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే విచారణ సమయంలో నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సీఐ నాగరాజును ఒక రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, మిగిలిన రోజులు రాజమండ్రి జైలులోనే విచారించాలని సూచించింది.సుప్రీంకు వెళ్లిన సిట్హైకోర్టు ఆదేశాలపై సిట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కస్టడీ విచారణ సమయంలో ఇలాంటి పరిమితులు ఉంటే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన అంశాలు, సాక్ష్యాల సేకరణ, నిందితుడిని ప్రశ్నించే విధానంపై హైకోర్టు ఆదేశాలు తమ దర్యాప్తు పరిధిని ప్రభావితం చేస్తున్నాయని సిట్ తన అభ్యర్థనలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.లాకప్‌డెత్ కేసులో కీలక విచారణగాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కస్టడీ.. అనంతరం కనిపించకుండా పోవడం.. చివరకు లాకప్‌లో హింసించడం కారణంగానే మృతి చెందాడని.. ఆనవాలు కూడా దొరక్కుండా శవం మాయం చేశారని తేలింది. ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు సిట్ దర్యాప్తు చేపట్టింది. సీఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కస్టడీ విచారణ కీలకంగా మారింది. అయితే.. సిట్ తనను ఇరికించేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే కస్టడీకి కోరిందని.. విచారణ పేరిట తనను టార్చర్ చేయకుండా రక్షణ కల్పించాలని నాగరాజు న్యాయస్థానాన్ని లేఖ రాయడంతో కేసు కీలక మలుపు తిరిగినట్లైంది. -
సాయికృష్ణ కేసులో ‘సిట్’ సాగదీత!
సాక్షి, విజయవాడ/సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ‘సిట్’ దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండగా.. పోలీస్ బాస్‌లు పెదవి విప్పడం లేదు. అధికార పార్టీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు, పోలీస్ బాస్, నగర బాస్‌లకు తెలిసే ఇదంతా జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, సాంబయ్య, బాబురావును అరెస్టు కాగా సిట్ విచారణ ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగడం వెనుక ప్రభుత్వ ఒత్తిడే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించిన తరువాతే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చింది. నిజాలు తేల్చాలని అన్ని వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో విధిలేని పరిస్థితుల్లో సిట్‌ను ఏర్పాటు చేసింది. మరి నెలన్నర రోజుల్లో విచారణలో సిట్ ఏం తేల్చిందంటే సమాధానం లేదు. తన కుమారుడిని చంపేశారని.. కనీసం బూడిదైనా ఇవ్వండయ్యా..! అంటూ వేడుకుంటున్న సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆర్తనాదం అరణ్య రోదనగానే మిగిలింది.నాగరాజు బినామీ సురేష్ ఎక్కడ?సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఏ 4 ఎవరు? ప్రధాన నిందితుడు నాగరాజు బినామీ సురేష్‌ను సిట్ అదుపులోకి తీసుకుందా? లేదంటే పరారీలో ఉన్నాడా? అనే విషయాలపై స్పష్టత లేదు. కస్టడీలో తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీని సిట్ విచారించిందా? లేదా? అనేది వెల్లడించలేదు. వైద్యం చేయడానికి అతడిని ఎవరు పిలిపించారు? అతడినే పిలవడానికి కారణాలు ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉంది. కృష్ణలంక స్టేషన్‌కు సమీపంలోనే క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నాడు. కొద్ది రోజులుగా క్లినిక్ మూతపడింది. సీన్ రీ కన్స్ట్రక్షన్కు అనుమతి..న్యాయస్థానం అనుమతి మేరకు నిందితుడు నాగరాజును సిట్ బృందం గురువారం నుంచి ఈ నెల 16 వరకు విచారించనుంది. విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు సవరించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి నాగరాజును విజయవాడకు తరలించనున్నారు. సాక్ష్యాధారాలను సేకరించడంతో పాటు సీన్ రీ కన్స్ట్రక్షన్కు న్యాయస్థానం అనుమతించింది. ఈ నెల 17వ తేదీన విజయవాడ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట ఒరిజినల్ వీడియో రికార్డులను సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. నిందితుడు నాగరాజు నోరు మెదపకుండా నొక్కి పెడుతున్నది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు చెన్నయ్య, సత్యనారాయణ, కానిస్టేబుల్ బాబు, సహాయ రైటర్ వీరాంజనేయుడు, రైటర్ రాజేష్ తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైనట్లు సమాచారం. మే 6వతేదీ నుంచి 8వ తేదీ వరకు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు? ఆ సమయంలో స్టేషన్లో ఏం జరిగిందనే కోణంలో విచారించినట్లు సమాచారం. సీఐ నాగరాజుకు రిమాండ్ పొడిగింపువిజయవాడ లీగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజు రిమాండ్ బుధవారం ముగియడంతో పోలీసులు న్యాయస్థానంలో వర్చువల్‌గా హాజరుపరిచారు. విచారణ అనంతరం నాగరాజుకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎస్.శ్రీకాంత్ ఆదేశాలు జారీచేశారు. -
సాయికృష్ణ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
సాక్షి, అమరావతి: కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సీజే ధర్మాసనం ముందు తాజాగా విచారణకు వచ్చిన ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు. ‘సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం కేవలం కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు వరకే పరిమితం చేస్తోంది. లాకప్‌డెత్ వెనుక డీజీపీ, విజయవాడ కమిషనర్, డీసీపీ, ఏసీపీ తదితరుల పాత్ర ఉంది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా డీజీపీ, విజయవాడ కమిషనర్లు హైకోర్టును తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నారో తమకు తెలియనే తెలియదని చెప్పారు. అయితే నాగరాజును అరెస్ట్ చేసిన తరువాత దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మే 6నే అదుపులోకి తీసుకున్నారు. తద్వారా సాయికృష్ణ గురించి పూర్తి వివరాలు డీజీపీ, కమిషనర్లకు స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది. దీనిపై పారదర్శక, నిష్పాక్షిక దర్యాప్తు కోరుతున్నాం. సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదు. స్వతంత్ర సంస్థ దర్యాప్తుతోనే నిజాలు నిగ్గుతేలుతాయి. ఈ దారుణంలో డీజీపీతో సహా ఉన్నతాధికారులు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు’ అని పొన్నవోలు ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు, ఆరుగురిని నిందితులుగా చేర్చినట్లు సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలియజేశారు. -
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు, ఈ పిల్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. లాకప్‌డెత్ కేసులో సీపీతో పాటు డీజీపీ పాత్ర ఉందని, డీజీపీ కింద స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని తన వాదనల్లో వినిపించారు పొన్నవోలు. గత నెల 15వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు సాయి కృష్ణ మా దగ్గర లేడు ఆయన కోసం ప్రత్యేక టీములు పెట్టి వెతుకుతున్నామని చెప్పారని, సిట్ వేసిన రిమాండ్ రిపోర్టులు మాత్రం గత నెల ఆరో తేదీన సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నట్లు చూపించారన్నారు. పోలీసులు అబద్ధాలు చెప్పి కోర్టునే తప్పుదోవ పట్టించారని విచారణ సందర్భంగా పొన్నవోలు స్సష్టం చేశారు. అయితే సిట్‌కు చిన్న అవకాశం ఇద్దామన్న హైకోర్టు.. సీల్డ్ కవర్లో విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. -
హత్యకు మోటివ్ ఏంటో తేలితే..అందరి పాత్రలు బయటకొస్తాయి
-
నా అనుభవంతో చెప్తున్నా.. ఎవ్వరు తప్పించుకోలేరు.. సాయి కృష్ణ కేసులో వచ్చే తీర్పు ఇదే
-
ఆయన ఫోన్, ల్యాప్ టాప్ ఏం చేసారంటే.. అడ్వకేట్ జనార్దన్ షాకింగ్ నిజాలు
-
CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా
-
సత్యమేవ జయతే నినాదాన్ని కాపాడండి
సాక్షి, అమరావతి : దేశ జాతీయ నినాదమైన ‘సత్యమేవ జయతే’ సమగ్రతను కాపాడుతూ నిజాన్ని వెలికి తీసేందుకు కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును నిష్పక్షపాతంగా, శాస్త్రీయ పద్ధతిలో విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలంటూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది.సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ నిమిత్తం నాగరాజును రాజమహేంద్రవరం జైలు నుంచి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌తో సహా నేర ఘటనలు జరిగిన చోట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి నాగరాజును కస్టడీలోకి తీసుకుని ఈ నెల 16 వరకు విచారించాలని సిట్‌ను ఆదేశించింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి రాజమహేంద్రవరం జైలుకు నాగరాజును తరలించే సమయంలో అతని ప్రతి కదలికను తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఆ ఒరిజినల్ వీడియో రికార్డింగ్‌లను ఈ నెల 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీని ఒరిజినల్ రూపంలో 17న విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు తేల్చి చెప్పింది. కస్టడీ కాలంలో నాగరాజు ప్రాణానికి, శారీరక భద్రతకు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులకు స్పష్టం చేసింది. సీఐ కస్టడీ విషయంలో విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన మిగతా అన్ని షరతులు యథాతథంగా కొనసాగుతాయని న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం తీర్పుచెప్పారు.జైలులోనే విచారించాలన్న విజయవాడ కోర్టుసాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో నిందితుడు నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇటీవల అనుమతించింది. ఈ నెల 10 వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని, విచారణకు న్యాయవాదిని అనుమతించాలని సిట్ అధికారులను ఆదేశించింది. వీటితో పాటు పలు షరతులు విధించింది. పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం నిమిత్తం మొత్తం విచారణ జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు లేదా ఇతర వీడియో రికార్డింగ్ సిస్టం ఉన్న ప్రాంతంలోనే నాగరాజును విచారించాలని సిట్‌కు స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీ సమయంలో జైలు ప్రాంగణంలో రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజీని కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భద్రపరచాలని, దానిని తొలగించడానికి, ఓవర్ రైట్ చేయడానికి లేదా ట్యాంపరింగ్ చేయడానికి ఎవరినీ అనుమతించకూడదని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. నాగరాజు భద్రతకు దర్యాప్తు ఆఫీసర్, అదనపు ఎస్పీ, సిట్ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ సంయుక్తంగా, వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ కస్టడీని 10వ తేదీ తర్వాత పొడిగించబోమని స్పష్టం చేసింది. విజయవాడ కోర్టు విధించిన ఈ షరతులను, ఆదేశాలను సిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. నాగరాజును కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో విచారించేందుకు అనుమతించాలని కోరింది. ఈ వ్యాజ్యంపై సోమవారం సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, నాగరాజు తరఫున చల్లా అజయ్ కుమార్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు తీర్పును రిజర్వ్ చేసి మంగళవారం నిర్ణయం వెలువరిస్తానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆయన మంగళవారం తన తీర్పును వెలువరించారు.అప్పుడు ధ్వంసం చేసి.. ఇప్పుడు సీసీటీవీ కెమెరాల రక్షణ కోరతారా?‘నిందితుడు నాగరాజు విజయవాడ కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్. అతనిపై హత్య, సాక్ష్యాల నాశనం కింద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అక్రమ కస్టడీలో హత్య జరిగినట్లు భావిస్తున్న కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, హార్డ్ డిస్క్‌ను ఉద్దేశ పూర్వకంగా మాయం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు నాగరాజుపై ఉన్నాయి. ఇటువంటి తరుణంలో, కేవలం రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలనడం దర్యాప్తు సంస్థల చట్టబద్ధమైన అధికారాలకు అడ్డుకట్ట వేయడమే అవుతుంది.నిందితుడు ఒకప్పుడు తానే సీసీటీవీ కెమెరాలను మాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పుడు తన విచారణకు అవే సీసీటీవీ కెమెరాల రక్షణ కావాలని కోరడం పరస్పర విరుద్ధంగా ఉంది. రాజ్యాంగ బద్ధమైన ఈ కోర్టు, నిందితుడి హక్కులను కాపాడటంతో పాటు దర్యాప్తు సంస్థల అధికారాలను కూడా సమతుల్యం చేయాల్సి ఉంది. అందువల్ల విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరిస్తున్నాం’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు. -
CCTV ఫ్యూటేజ్ మిస్ అవ్వలేదు, సాయి కృష్ణ కేసుపై సంచలన నిజాలు
-
వైఎస్ జగన్ వార్నింగ్.. సీఐ నాగరాజుపై మరో కేసు
సాక్షి,విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. దళిత యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు సెక్షన్లు మార్చారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన తర్వాతే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.మే 21న కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటివరకు కనీసం కేసును కూడా పట్టించుకోని పోలీసులు, మొదట దీనిని కేవలం అనుమానాస్పద మృతిగా మార్చేశారు. నగరంలో సాయికృష్ణ కస్టడీ మరణం తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో.. వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగి క్రాంతికుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించిన వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.వైఎస్ జగన్ పర్యటన, డిమాండ్ల అనంతరం ఉన్నతాధికారులు ఈ కేసుపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. విజయవాడ నార్త్ ఏసీపీ సత్యానంద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా, సీఐ నాగరాజు వేధింపుల వల్లే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమవడంతో పోలీసులు కేసులో సెక్షన్లు మార్చారు. సీఐ నాగరాజుపై ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆయనను నిందితుడిగా చేర్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయి హత్య కేసు ఎదుర్కొంటున్న నాగరాజుకు వైఎస్ జగన్ పరామర్శతో ఈ కొత్త కేసు రూపంలో మరిన్ని చట్టపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. -
పవన్ పై సాయి కృష్ణ తల్లి ఇచ్చిన హింట్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రజిని
-
టెర్రస్ మీద సాయి కృష్ణ ను కాలిస్తే.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అడ్వకేట్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ తల్లిని చంపేందుకు జైలు నుంచే CI మర్డర్ ప్లాన్
-
నా కొడుకు క్రిమినలా
సాక్షి, విజయవాడ: ‘కాపులం ఓట్లు వేసి నిన్ను గెలిపించుకున్నాం.. నా కొడుకు మీకు (పవన్ కళ్యాణ్) ఫ్యానే (అభిమాని)గా.. మీ వెంటే తిరిగాడుగా.. అందుకనే మాకు ఇలా చేస్తున్నారా? నా కొడుకును క్రిమినల్ అని ఇంకా దు్రష్పచారం చేస్తున్నారు. సీఐ నాగరాజు కంటే నా కొడుకేమీ పెద్ద క్రిమినల్ కాదు. పోనీలే న్యాయం, నిజం నిదానంగా తెలుస్తాయి. సచ్చి ఎక్కడో ఉన్నోడి మీద నిందలేస్తారా? ఇంత వరకు నాకు నా పిల్లోడి బూడిద ఇవ్వలేదు. అక్కడా.. ఇక్కడా తిప్పుతున్నారు. అందరూ కలిసి మాయ చేస్తున్నారు. నా కొడుకు బూడిద ఇస్తే నేను కర్మ కార్యక్రమాలు చేసుకుంటానయ్యా.. నేను బతకలేక పోతున్నానయ్యా.. నా కొడుకు రోజూ నా ముఖం చూసి వెళ్లేవాడు. గుర్తుకు వస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా..’ అని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం విజయవాడ సబ్ కలెక్టరేట్లో జరిగిన మెజిస్టీరియల్ విచారణకు ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నాకు వీళ్ల ఆస్తులు, పొలాలు, బంగారం ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. రెండు నెలలైంది. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చకే సీఐ నాగరాజు నా కొడుకు బతికుండగానే పడుకోబెట్టి చేతులపై మేకులు కొట్టి, లాఠీలతో కొట్టి.. అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడు? ఇంతకు ముందు ఇంకెంత మందిని ఇలా చంపారో? ఆఖరికి మమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎంత మందిని చంపుతారు? ఎంత మందిని దహనం చేస్తారు? సీఐ నాగరాజే పెద్ద క్రిమినల్. ఈ నిజాలన్నీ బయటకు రావాలి. నా కొడుకును చంపిన కేసులో ఉన్న అందరూ బయటకు రావాలి.ఇంతవరకు నలుగురినో, ఐదుగురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్లేరీ? ఆ రోజు నా కొడుకును తీసుకెళ్లడానికి వచ్చినోళ్లు ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంతకంటే ముందు నా బిడ్డని తీసుకురమ్మన్నోళ్ల మీద ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవట్లేదు? నేను ఏమీ చేయలేని అసమర్థురాలిని. ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎవరిని న్యాయం అడగగలనయ్యా.. నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నా.. నా కొడుకు బూడిద ఇవ్వండి. దండం పెట్టి అడుగుతున్నా.. లేదంటే రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని చచ్చిపోతా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మీ వెంటే తిరిగాడు కదా.. ‘నేను చెప్పకూడదు. వాళ్ల విషయం ఎత్తకూడదు. నీకు (డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్) నా కొడుకు ఫ్యాన్. మీ వెనకాలే నా కొడుకు తిరిగినట్లు ఎవరూ ఏనాడూ తిరగలే. చచ్చిపోయి ఎక్కడో ఉన్నోడి మీద నిందలేస్తున్నారు. ఏం జరిగిందో ఆ అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న. రేప్ చేస్తే కోర్టులు ఊరికే ఉంటాయా? నా కొడుకును క్రిమినల్ అని ఇంకా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా చంపేశారని బాధతో మాట్లాడుతున్నా. ఇప్పటికైనా దయచేసి నాకు ఇంత బూడిద ఇప్పించండి.. నేను కార్యక్రమం చేసుకుంటా’ అని విజయలక్ష్మి విలపించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌పైన దొరికిన ఎముకలు, బూడిద తన కొడుకువే అని గ్యారెంటీ ఏంటని ఆమె ప్రశ్నించారు. ‘సాయికృష్ణను ఈ రకంగా చంపేశారంటే.. దేనికి ఆశపడి చేశారు? పోలీసులు కూడా అన్నమేగా తినేది? ఇలా ఎంత మందిని కనపడకుండా చేశారు?’ అని ఆమె ప్రశ్నించారు. ‘నా కొడుకు సాయికృష్ణను తెచ్చిన వాళ్లు, చంపిన వాళ్లలో ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. అయితే నేను ఇప్పుడు అరెస్ట్ చేసినవాళ్లను చూసే పరిస్థితిలో లేను. మాట్లాడలేకపోతున్నా.. మీరే చూస్తున్నారుగా చేతులు వణికిపోతున్నాయి. అయ్యా.. నా కొడుకును ఒకసారి చూపించండి అని కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లి అడిగితే.. ‘మా సీఐ ఊరుకోవట్లేదు. నువ్వు వెళ్లిపోవమ్మా ముందు’ అని బయటికి తోసింది ఎవరు? నా కొడుకు ఉంటే ఒక్కసారి ఫోన్ చేయించండయ్యా.. ఒకసారి చూపించండయ్యా.. అని ఎంతగా ఏడ్చాను? ఎంతగా బతిమిలాడాను? అయినా కనికరించలేదు. నా కొడుకు ఏం చేశాడని అంతలా చేతులపై మేకులు కొట్టి చంపేశారు? పోలీసులు కచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిందే’ అని ఆమె డిమాండ్ చేశారు. మెజిస్ట్రేట్ విచారణ ఏమైంది అని అడగ్గా.. మళ్లీ పిలుస్తామని చెప్పారన్నారు. -
2 నెలల తర్వాత ఎముకలు, బూడిద ఎలా వచ్చాయి?
సాక్షి, అమరావతి: అబ్రకదబ్ర అంటూ గాల్లో వస్తువులు సృష్టించడం ఇంద్రజాల విద్య. కానీ చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. అబ్రకదబ్ర అంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద సృష్టించింది. సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌లో అంతమైన కేసును నీరుగార్చేందుకు సరికొత్త కట్టుకథను తెరపైకి తెచ్చింది. ఈ కేసు నుంచి పోలీసు, ప్రభుత్వ పెద్దలను తప్పించేందుకు ఏకంగా న్యాయస్థానం కళ్లుగప్పేందుకు బరితెగించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డీజీపీ కార్యాలయంలో పక్కా స్కెచ్ సిద్ధమైపోయిందని హైకోర్టులో పోలీసులు సమర్పించిన లంచ్ మోషన్ పిటిషన్ బట్టబయలు చేస్తోంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్‌పై తమకు కొన్ని ఎముకలు, కొంత బూడిద దొరికినట్లు హఠాత్తుగా ఓ కట్టుకథను వినిపించడం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణ అదృశ్యంపై దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టును బురిడీ కొట్టించడం.. ఈ కేసు నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు, విజయవాడ పోలీస్ కమిషనర్‌తోపాటు తెరవెనుక పోలీసు, ప్రభుత్వ పెద్దల పాత్రను తప్పించడం.. కేసు సీబీఐ పరిధిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు పన్నిన కుతంత్రం విస్తుగొలుపుతోంది. రెండు నెలల తర్వాత పోలీస్ స్టేషన్‌పై ఎముకలు, బూడిద! సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యమైన దారుణాన్ని దారి మళ్లించేందుకు పోలీసులు పన్నిన సరికొత్త పన్నాగం విస్మయ పరుస్తోంది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆయన తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని నెల క్రితమే ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తునకు నియమించిన సిట్ అధికారిక సమాచారం ప్రకారం సాయికృష్ణను మే 6న కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. అంటే ఇప్పటికి దాదాపు రెండు నెలలు అవుతోంది. రెండు నెలల తర్వాత సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్ డాబా మీద హఠాత్తుగా కొన్ని ఎముకలు, కొంత బూడిదను గుర్తించారట. అంతే కాకుండా అనుమానాస్పద మరకలతోపాటు ఓ లాఠీని కూడా గుర్తించారని సిట్ హైకోర్టుకు సమరి్పంచిన నివేదికలో పేర్కొంది. సాయికృష్ణను ఎక్కడికో తరలించి మరీ దహనం చేయడం ద్వారానో మరో విధంగానో లేకుండా చేశారని ఇదే సిట్ మొదట పేర్కొంది. విద్యుత్ దహన వాటికలో అనాథ మృతదేహంగా బూడిద చేశారనే బలమైన వాదనా ఉంది. సిట్ అధికారులు విద్యుత్ దహన వాటికకు వెళ్లి దర్యాప్తు చేశారు కూడా. కాగా అందుకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికాయని సిట్ చెప్పడం విడ్డూరం. హెబియస్ కార్పస్ పిటిషన్ నుంచి తప్పించుకునేందుకే.. సాయికృష్ణ ఆచూకీ కోసం ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై పోలీసు పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాయికృష్ణను గానీ, ఆయన మృతదేహాన్ని గానీ, ఆయనకు సంబంధించిన డీఎన్ఏ అవశేషాలనుగానీ గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అందుకే తాము ఏదో ఎముకలు, బూడిద కనుగొన్నాం.. దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టును తప్పుదారి పట్టించాలన్నది పోలీసుల ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ ఎముకలు, బూడిద సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డీఎన్ఏ నమూనాలతో కనీసం పరీక్ష కూడా చేయించలేదు. కొన్ని వాయిదాల తర్వాత డీఎన్ఏ నమూనాలు సరిపోలేదని చెప్పవచ్చులే అన్నది పోలీసుల ధీమాగా స్పష్టమవుతోంది.సిట్.. ఈ ప్రశ్నలకు బదులివ్వాలి » ఎక్కడో బయటకు తీసుకువెళ్లి దహనం చేసి ఉంటే.. అక్కడి నుంచి ఎముకలు, బూడిద తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ మీద దాచారా? » ఒకవేళ పోలీస్ స్టేషన్ డాబా మీదే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి ఉంటే, అప్పుడు వచ్చే మంటలు, పొగను ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది నివాసాల్లో ఉన్న వారు గమనించలేదా? » అదే జరిగి ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు, సిబ్బంది అందరికీ ఈ విషయం తెలిసి ఉండదా? » మరి విజయవాడ కోర్టుకు సమర్పించిన సాయికృష్ణ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాలను ఎందుకు వెల్లడించ లేదు? »ప్రస్తుతం హఠాత్తుగా హైకోర్టుకు ఎందుకు ఈ విషయాన్ని చెప్పినట్టు? » హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ఇది బరితెగించడం కాదా?టాస్క్ ఫోర్స్, సీపీ, డీజీపీ, పెద్దలను తప్పించడమే లక్ష్యంటీడీపీ ప్రజా ప్రతినిధి భూ, ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలోనే సాయికృష్ణను అంతం చేశారన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారం వెనుక కేవలం సీఐ నాగరాజు పాత్రధారి మాత్రమేనని.. టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు పాత్ర ఉందన్నది నిర్వివాదాంశం. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా ఉన్నారని పోలీసువర్గాలే చెబుతున్నాయి. ఈ కేసును కేవలం సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అందుకే కృష్ణలంక పోలీస్‌స్టేషన్ డాబా మీదే ఎముకలు, బూడిద దొరికినట్టు కట్టు కథను తెరపైకి తెచ్చారు. కాగా, సాయికృష్ణ లాకప్‌లోనే అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సీఐబీకి అప్పగించాలని సామాజికవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. సీబీఐ రంగంలోకి దిగితే టాస్క్ ఫోర్స్ అధికారులు, సీపీ, డీజీపీలతోపాటు ప్రభుత్వ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది. అందుకే ఈ కేసు దర్యాప్తులో ఏదో పురోగతి సాధించామని నమ్మించేందుకు.. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదించేందుకు వీలుగా పోలీసు పెద్దలే పోలీస్ స్టేషన్‌పై కొన్ని ఎముకలు, కొంత బూడిద లభించాయనే కట్టుకథను సృష్టించారన్నది స్పష్టమవుతోంది. సాయికృష్ణ లాకప్ హత్య కేసును పూర్తిగా నీరుగార్చేందుకు పోలీసు పెద్దలు ఇంతగా బరితెగిస్తుండటం సదరు శాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
సాయి కృష్ణ కేసులో CIనాగరాజుకి అన్యాయం జరిగిన కూడా ఒప్పుకోము
-
నీకు ఓటు వేసి గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి..
-
నిన్ను వదిలితే.. నేను పెట్రోల్ పోసుకుని నడి రోడ్డుపై చస్తా
-
గాదె సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్‌డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బూడిదైనా ఇప్పించాలని.. లేకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానన్నారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని.. లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న సాయికృష్ణ తల్లి.. విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నన్ను చంపాలనే కుట్ర జరుగుతుంది. మేము కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు. నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా?. కేసు వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. అందుకే ఇలా చంపారు. నా కొడుకుని తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మెజిస్టీరియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు. కేసు విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. -
ఆధారాలను విచారణ అధికారికి ఇచ్చిన సాయికృష్ణ తల్లి
-
గోవాలో CI నాగరాజు ఫోన్.. పోలీస్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు..
-
నాగరాజును విజయవాడలోనే విచారిస్తాం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు నాగరాజును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో విచారించాలని విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇచ్చిన పోలీసు కస్టడీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిట్ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాజమహేంద్రవరం జైలులో కాకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజును విచారించేందుకు అనుమతించాలని సిట్ తన పిటిషన్లో హైకోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు విచారణ జరిపారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. సిట్ అత్యవసర విచారణ కోరుతున్న నేపథ్యంలో ఆదివారమైనప్పటికీ ఆ రోజున ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జైలులో విచారణకు సిట్ అభ్యంతరాలు ఇవీ.. నాగరాజును పోలీస్ కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. ఈ నెల 10వ తేదీ వరకు నాగరాజును పోలీసు కస్టడీకి ఇచ్చింది. రాజమహేంద్రవరం జైలులోనే నాగరాజును విచారించాలని ఆదేశిస్తూ పలు నిబంధనలు విధించింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టులో సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, ‘నేరం మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే జరిగింది. పోలీస్ కస్టడీ సమయంలో నిందితుడు నాగరాజు ఇచ్చే సమాచారం ఆధారంగా భౌతిక ఆధారాలను సేకరించడానికి లేదా క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు దర్యాప్తు అధికారి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోలీస్ కస్టడీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే పరిమితం చేయడం వల్ల సరైన దర్యాప్తు జరపకుండా అడ్డుకున్నట్లవుతుంది. నేరం జరిగిన పరిధిని విడిచిపెట్టి వేరే చోట నాగరాజును విచారించడం వల్ల దర్యాప్తు అధికారికి ఎదురయ్యే ఇబ్బందులను కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దర్యాప్తులో భాగమైన అధికారులందరూ రాజమండ్రి జైలుకెళ్లడం సాధ్యం కాదు. పోలీసు అధికారి అయిన నాగరాజు నుంచి వివరాలు రాబట్టడం అంత సులభం కాదు. అందువల్ల ఇందుకు సంబంధించి కింది కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలి’’ అని విన్నవించారు.మరకలు ఉన్న లాఠీ.. ఎముకలు.. బూడిద, కాలిన రిస్ట్ చైన్ స్వాదీనం చేసుకున్నాం: హైకోర్టుకు సిట్ సంచలన విషయాలువిజయవాడ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సిట్ తన పిటిషన్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ‘సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా, చట్టవిరుద్ధంగా కస్టడీలో ఉంచారు. ముఖ్య సాక్షులు అతనిని పోలీస్ స్టేషన్లో గాయాలతో చూశారు. సాయికృష్ణ కస్టడీలో ఉన్న విషయాన్ని నాగరాజు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు. 01.05.2026 నుండి 01.06.2026 వరకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని డిలీట్ చేశారు. ఎల్రక్టానిక్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన స్టీల్ రిస్ట్ చైన్, ఇతర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం స్వాదీనం చేసుకున్నాం.. సాయికృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతని మరణం, మృతదేహం మాయం చేయడం, ఆధారాల ధ్వంసం వంటి కీలక అంశాలకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.’ అని సిట్ తన పిటిషన్లో పేర్కొంది.నాకు ప్రాణహాని ఉంది: నాగరాజుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ప్రధాని నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజు తనకు ప్రాణహాని ఉందంటూ విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. నాగరాజును ఎనిమిది రోజుల పాటు విచారించేందుకు సిట్‌కు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన విజయవాడ కోర్టుకు ఈ లేఖ రాశారు.తాను నిర్దోషినని, సిట్ తనను అన్యాయంగా ఇరికించి భయభ్రాంతులకు గురిచేస్తోందని ఈ లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను విచారించాలని, సిట్ టార్చర్ లేకుండా చూడాలని కోరారు. నాగరాజును రాజమహేంద్రవరంలో విచారించడంసహా పోలీస్ కస్టడీకి సంబంధించి విచారణ కోర్టు ఇచ్చిన పలు ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించడంతో శుక్రవారం ఆయన విచారణ ప్రక్రియ నిలిచిపోయింది. -
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
-
స్టేషన్ టెర్రస్ పై సాయికృష్ణ ఎముకలు, బూడిద..
-
జంగిల్ రాజ్‌తో డిఫెన్స్‌లో చంద్రబాబు!
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జగన్‌కు బౌలింగ్ ఎలా వేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిలగిలలాడినట్లు అనిపిస్తుంది. జగన్ చేసిన విమర్శలకు నేరుగా జవాబు ఇవ్వలేక చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలకే పరిమితం అయ్యారా! అన్న భావన కలుగుతుంది. ఒకసారి జగన్ కొట్టిన రాజకీయ సిక్సర్లు ఏమిటో చూద్దాం..హే రామ్.. సేవ్ ఆంధ్ర! రాష్ట్రంలో జంగిల్ పాలన, 18 నెలల సీసీ టీవీ పుటేజి తీసివేశారంటే ఎందరిని పోలీసులు చంపారో! జీవించి ఉంటే ఎన్టీఆర్‌పై కూడా రౌడీ షీట్ పెట్టేవారేమో!, రాజకీయ స్వార్ధంతో పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్తులో వారికి పథకాలు ఎలా వస్తాయి? మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే మీరేం చేస్తున్నారు? దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అమరావతిలో అవినీతికి వ్యతిరేకం, మావిగన్‌కు కట్టుబడి ఉంటాం.. ఎన్నికల మానిఫెస్టోలో పెడతాం! బాబు పాలన అంటే మోసం గ్యారంటీ!... ఇలా ఆయా సబ్జెక్టులపై ఒక స్పష్టతతో, ఆధారాలతో జగన్ పంచ్ డైలాగులు విసిరారు.హే రామ్.. అన్నది జాతిపిత మహాత్మా గాంధీ వాడిన మాట. ఏపీని రాముడే రక్షించాలని జగన్ వ్యాఖ్యానించారన్న మాట. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతోందని సోదాహరణంగా వివరించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయిన తీరు, పోలీసుల వ్యవహార శైలి, సీసీ టీవీ ఫుటేజీ గల్లంతైన వైనం, రైతుల కష్టాలు పరిశీలించడానికి అమరావతి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం, ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్‌ను టీడీపీ కార్యకర్త ఒకరు రాయితో గాయపరచడం వంటి అంశాలను డిటైల్డ్‌గా ప్రస్తావించారు.చట్టాన్ని పోలీసు వ్యవస్థ చేతిలోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తోందని చెబుతూ సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు ఆదారంగా ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపి, దహనం చేసి, బూడిదను కూడా ఇవ్వకుండా 46 రోజుల పాటు కేసును కప్పిపెట్టేశారని ఆయన అన్నారు. తాను వెళ్లి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత కానీ ప్రభుత్వం కదలలేదని, తదుపరే బాధ్యుడైన సర్కిల్ ఇన్ స్పెక్టర్పై చర్య తీసుకోవడం ఆరంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 18 నెలల సీసీ టీవీ ఫుటేజీ పోలీస్ స్టేషన్లో మిస్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో, డీజీపీ ఆఫీస్‌లో బ్యాకప్ ఉండదా అని ప్రశ్నించారు.పోలీస్ కమిషనర్‌ను రక్షించడానికి డీజీపీ, ఈయనను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ అంశాలపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. చనిపోయిన వ్యక్తి కాపు, పోలీసు కాపు అని అంటూ, కుల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అంతటితో ఆగకుండా ఒక్కోసారి రౌడీల ప్రవర్తనతో పోలీసులకు ఫ్రస్టేషన్ వస్తుందని అని అన్నారు. ఇది పోలీసులు లాకప్ డెత్ ఘాతుకాలకు పాల్పడితే సమర్థించడం అవ్వదా! ఒక సీఎం ఇలా వ్యవస్థ నేరాలను ప్రోత్సహించవచ్చా? ఇక్కడే ఆయన బలహీనత కనిపిస్తుంది. సీసీటీవి ఫుటేజీ మాయం, రౌడీషీటర్ అయినంత మాత్రాన పోలీసులకు చంపే హక్కు ఉంటుందా? అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు.ఇద్దరి వాదనలు విన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అనుకోవచ్చనిపిస్తుంది. జగన్ ఆ రకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారని అనుకోవచ్చు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు వాడే యత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుమార్తెను సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అంటూ సంబంధం లేని వ్యాఖ్య చేశారు. నిజానికి అలా ఎవరైనా చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. మధ్యలో పవన్ కళ్యాణ్ కుమార్తెను కూడా ఈ రాజకీయ రొంపిలోకి తీసుకురావడం చంద్రబాబు వంటి సీనియర్‌కు తగునా అన్న ప్రశ్న వస్తుంది.జగన్‌ను తాను అనుకుంటే ఒక్క నిమిషంలో అరెస్టు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించడం అర్దవంతంగా లేదని చెప్పాలి. ఒక టీడీపీ ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు నిలువరించడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సమాజంలో విద్వేషాలు పెంచుతుంటే చర్య తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం వారితో గొడవజరుగుతున్న తీరును జగన్ వివరించారు. ఈ అంశంలో చంద్రబాబు ఇంతవరకు నోరు మెదిపినట్లు కనిపించలేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ వైఖరి ఏమిటని కూడా జగన్ అడిగారు. దానికి టీడీపీ వైపు నుంచి జవాబు లేదు.అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు ప్రభుత్వం వేదిస్తున్న తీరుపై జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి పరిశీలించడానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీకి చెందిన వారు గూండాయిజం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారు. వైఎస్సార్సీపీ నేతల కార్లు ధ్వంసం చేశారు. ఇంత చేసిన టీడీపీ వారిపై కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం మీద జగన్ మండిపడ్డారు. బాదితులపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. అమరావతిలో అవినీతిని, దోపిడీని ప్రశ్నించే గొంతులను చంద్రబాబు నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.అలాగే అమరావతిలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగైదు వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి రూ.20,439 రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని ప్రశ్నించారు. ఇదంతా అవినీతి కాదా? అని ఆయన అడిగారు. అమరావతికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి రాకూడదని ముఖ్యమంత్రి, ఇతర టీడీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం ఒక అలవాటుగా ప్రభుత్వం మార్చుకుందని, ఇది జంగిల్ రాజ్‌గా మారిందని ఆయన అన్నారు.ఎన్టీ.రామారావు బతికి ఉంటే, గతంలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై కూడా చంద్రబాబు సర్కార్ రౌడీ షీట్ పెట్టి ఉండేదేమోనని జగన్ ఎద్దేవ చేశారు. నిజంగానే ఈ రెండేళ్లలో విపక్ష వైఎస్సార్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా వారిపైన, జర్నలిస్టులపైన, ఎవరు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ అంటూ అరాచకంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ గా మార్చిందన్న విమర్శలు జనం నుంచి కూడా వస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలను కూడా జగన్ ప్రస్తావించి ఓట్లు కోల్పోతే పేదలకు స్కీముల పరిస్థితి ఏమిటని అన్నారు. దీని గురించి టీడీపీ ఎటూ మాట్లాడదు.అమరావతి విషయంలో జగన్ విస్పష్టమైన ప్రకటన చేసి చంద్రబాబుకు సవాల్ చేయడం కూడా సరికొత్త పరిణామంగా భావించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా రెడీమేడ్‌గా ఉన్న మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. నిజానికి ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. దీనికి ముఖ్యమంత్రి అమరావతిలో అవినీతి లేదని గట్టిగా జవాబు ఇవ్వలేకపోయారు. కేంద్ర నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర నిర్మాణ వ్యయానికి ఇన్ని రెట్ల తేడా ఎందుకు ఉందో, అదంతా అవినీతి అవుతుందా? అవ్వదా అన్నదానిపై వివరణ ఇవ్వలేకపోయారు.నాడు మూడు ముక్కలు, ఇప్పుడేమో మావిగన్ అని కామెంట్ చేస్తూ మావవిగన్ అంటే అర్థం ఉందా అని మాత్రమే ఆయన అన్నారు. అమరావతికి, మావిగన్‌కు ఉన్న తేడా ఏమిటో జగన్ చెబుతుంటే, చంద్రబాబు మాత్రం ఆ కోణంలో చెప్పలేకపోతున్నారు. తొలుత ఏభై వేల ఎకరాలు సేకరించడం, మళ్లీ మరో ఏభై వేల ఎకరాలు రెండో దశ కింద సేకరించే యత్నం, లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టడానికి సిద్దం అవడం, ఇప్పటికే సుమారు ఏభైవేల కోట్ల అప్పు చేయడం, ఇతర హామీలను అమలు చేయకపోవడం వంటివాటిపై ప్రజలకు సమాధానం చెప్పగలిగి ఉంటే చంద్రబాబుకు కొంతైనా విశ్వసనీయత వచ్చేది. ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఒకే చోట లక్షల కోట్ల ఖర్చు పెడుతున్న వైనంపై ఏపీ ప్రజలలో వ్యతిరేకత వస్తుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యల నేపథ్యంలో జగన్ హే రామ్.. సేవ్ ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేముంది!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
విజయవాడలో ఇంత అరాచకమా.. నిద్రపోతున్నారా..?
-
క్రాంతి కుమార్ కొడుకు పరిస్థితి చూసి చలించిపోయిన జగన్
-
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
సీఐని చంపేస్తారా..!? సాయికృష్ణ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
నా ప్రాణాలకు ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నా ప్రాణాలకు ముప్పుంది.. నన్ను పోలీస్ కస్టడీకి ఇస్తే నాకు ప్రాణహాని ఉంది’ అని లాకప్ నుంచి కనుమరుగైన సాయికృష్ణ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు బుధవారం ఏకంగా న్యాయస్థానంలో ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలు ఈ కేసు వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని స్పష్టం చేస్తున్నాయి. పోలీసు అధికారి అయిన నాగరాజే పోలీసు కస్టడీలో ప్రాణాలకు భరోసా లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే రాష్ట్రంలో పోలీసు స్టేషన్లలో వ్యక్తుల ప్రాణాలకు రక్షణ లేదని ఆయన తేల్చి చెప్పేశారు. సీఐ నాగరాజును పోలీస్ కస్టడీలోనే అంతం చేసేందుకు కుట్ర సాగుతోందన్నది బట్టబయలైంది. అంతటి తెగింపు ఎవరికి సాధ్యం? ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న వారికే సాధ్యమన్నది బహిరంగ రహస్యమే. అంటే సాయికృష్ణను లాకప్‌లో అంతం చేయడం వెనుక సూత్రధారులుగా ఉన్న ప్రభుత్వ పెద్దలే ప్రస్తుతం నాగరాజును అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని తేటతెల్లమవుతోంది. దాంతో ఈ కేసులో కీలక విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన సీఐ నాగరాజు విచారణకు సహకరించడం లేదని సిట్ చెబుతుంటే.. ఇప్పటికే తాను మొత్తం సమాచారం ఇచ్చినట్లుగా సీఐ నాగరాజు బుధవారం కోర్టు ఎదుట చెప్పడం సిట్ బండారాన్ని బయట పెట్టింది. బుధవారం కస్టడీ పిటీషన్‌పై విచారణలో సమయంలో సీఐ నాగరాజును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ, సిట్ తీరుపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నేరం ఒప్పుకునేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని, అకారణంగా కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఐ.. న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న సమాచారం అంతా అందించానని చెప్పారు. కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలను, ఆరోపణలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సిట్ బృందం మాత్రం ఇందుకు భిన్నంగా రిమాండ్ రిపోర్టులో దర్యాప్తునకు సహకరించడం లేదని చెప్పడం గమనార్హం. పెద్దల కుట్రలో పాత్రధారే సీఐ నాగరాజు టీడీపీ ప్రజాప్రతినిధి భారీ భూదందా, ఆర్థిక అక్రమాల పంచాయితీతోనే గాదె సాయికృష్ణను లాకప్‌లో అదృశ్యం చేశారన్నది ఇప్పటికే స్పష్టమైంది. చినబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయవాడ ప్రజాప్రతినిధి జగ్గయ్యపేట వద్ద ఓ భూ దందా సాగించారు. ఆ పంచాయితీలో ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం కూడా గట్టిగా నిలబడింది. ప్రజాప్రతినిధి వ్యతిరేక వర్గం తరఫున సాయికృష్ణ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దాంతోనే సాయికృష్ణను పోలీసుల సహకారంతో లాకప్‌లోనే అదృశ్యం చేశారని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విజయవాడ పోలీస్ బాస్, బిగ్‌బాస్ సూత్రధారులుగా సాగిన ఈ కుతంత్రంలో సీఐ నాగరాజు పాత్రధారిగా వ్యవహరించారు. గుట్టుచప్పుడు కాకుండా సాయికృష్ణను లాకప్‌లోనే అదృశ్యం చేశారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం బట్టబయలైంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. సిట్‌ను నియమించారు. కానీ సాయికృష్ణను మాయం చేయడానికి ప్రధాన కారణమైన భూ దందాను కప్పిపుచ్చడం ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలకు సవాల్‌గా మారింది. కుట్రకు ప్రత్యక్ష సాక్షి నాగరాజే కాబట్టి.. సాయికృష్ణను లాకప్‌లోనే అంతం చేసిన కుట్రలో ప్రధాన పాత్రధారి సీఐ నాగరాజే కాబట్టి, న్యాయ విచారణలో ఆయన వాస్తవాలు వెల్లడిస్తే ప్రభుత్వ పెద్దల బండారం మొత్తం బయటపడుతుంది. అందుకే ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ఆశ చూపించారు. ప్రస్తుతం ఈ కేసును తప్పుదారి పట్టించేంత వరకు తమకు సహకరించాలని సూచించారు. కాగా ఈ కేసు న్యాయస్థానం పర్యవేక్షణలో సాగుతుండటం.. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగ ప్రవేశం చేయడంతో సీఐ నాగరాజుకు పరిస్థితి క్రమంగా అర్థమవుతోంది.తన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని ఆయన గుర్తించారు. దాంతో ఈ కేసులో వాస్తవాలను న్యాయస్థానంలో వెల్లడించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సాయికృష్ణను లాకప్‌లోనే అంతం చేయాలని తనను ఆదేశించిన ప్రభుత్వ, పోలీసు పెద్దల పేర్లను ఆయన బయటపెట్టే అవకాశముంది. ఇలా జరగకుండా సాయికృష్ణను మాయం చేసినట్టే.. సీఐ నాగరాజును కూడా అడ్డు తొలగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు కుతంత్రం పన్నుతున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని నాగరాజు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజును మరింతగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దాంతో నాగరాజుకు భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండే అవకాశముందన్నది పూర్తిగా స్పష్టమైంది. తాను పోలీసుల కస్టడీలోకి వెళితే.. ఇక తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయో, ఉండవోనని ఆయన ఆందోళన చెందారు. అందుకే తనను కస్టడీకి ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా కుండబద్దలు కొట్టారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు, పోలీసు కస్టడీలో ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేదని స్వయంగా ఓ సీఐనే తేల్చి చెప్పారు. భూదందాలు, ఆర్థిక అక్రమాల కోసం తమ ప్రత్యర్థి వర్గీయులనే కాదు.. సాక్షాత్తు పోలీసు అధికారులను కూడా లాకప్‌లు, పోలీసు కస్టడీలోనే అంతం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు బరితెగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న జంగిల్ రాజ్ దారుణాలను బట్టబయలు చేస్తోంది. నిజాలు దాస్తున్న సిట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసును పది రోజులుగా సిట్ బృందం దర్యాప్తు చేస్తున్నా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్రణాళికతో నిజాలను దాస్తూ కేసును నీరుగార్చేలా నడిపిస్తోంది. సీఐ నాగరాజును అరెస్టు చేసిన సమయంలో, ఆ తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులతో ఈ విషయం తేటతెల్లమైంది. సిట్ బృందం ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించిన మూడు రిమాండ్ రిపోర్టుల్లో ‘విచారణలో నిందితులు సహకరించలేదు. ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. మౌనం వహించారు’ అనే సమాధానాలనే పొందు పరిచింది. మరోపక్క సీఐ నాగరాజు అరెస్టు సమయంలోనే కానిస్టేబుళ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నా సిట్ ఆ పని చేయలేదు. వారు పరారీలో ఉన్నట్లు, వారి కోసం ప్రత్యేక బృందాలు వెదుకుతున్నట్లు కాల యాపన చేశారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోతున్నట్లు లీకులు ఇచ్చారు. చివరకు సినిమాలో మాదిరి ఇద్దరూ ఆటోలో వచ్చి, ఏసీపీ ఎదుట లొంగిపోయినట్లు కథ నడిపారు. వీరిద్దరి రిమాండ్ రిపోర్టులో సైతం పాత కథే చెప్పారు. ఈ కేసులో సీఐకి సహకరించి, కీలకంగా వ్యవహరించిన అతని సన్నిహితుడి పాత్ర ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ కేసులో మరో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు బాబూరావు, సాంబశివరావును మంగళవారం అదుపులోకి తీసుకుని, బుధవారం విజయవాడ రెండో ఏసీఎం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిద్దరి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ దాదాపు పాత కథనే చెప్పింది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి ప్రాణాలు విడిచిన క్రాంతికుమార్ ఉదంతంలో దర్యాప్తుపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఒకే కోణంలో కేసు దర్యాప్తు సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. -
కస్టడీలో కొట్టడంవల్లే సాయికృష్ణ మృతి
విజయవాడలీగల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కైతేపల్లి బాబురావు (ఏ–5), గొరిపర్తి సాంబయ్య (ఏ–6)కు ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీకాంత్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. అనంతరం బాబురావును అవనిగడ్డ సబ్‌జైలుకు, సాంబయ్యను గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.విజయవాడలోని సిటీ పోలీసుగెస్ట్‌హౌస్ వద్ద మంగళవారం ఉదయం వీరిరువురినీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజర్ మెమో ద్వారా జప్తుచేశారు. సిట్ అధికారుల విచారణలో నిందితులు ఇరువురు ఎలాంటి సహకారం అందించకుండా మౌనంగా ఉండిపోయారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలు..‘సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, కస్టడీలో ఉండగా తీవ్రంగా కొట్టడం వల్ల అతడు మరణించాడు. అనంతరం నిందితులంతా కలిసి నేరాన్ని దాచడానికి సాక్ష్యాలను తుడిచివేసి, మృతదేహాన్ని మాయం చేశారని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో ఏ–1 సీఐ నాగరాజు, ఎ–2 పొట్లంక అశోక్‌కుమార్, ఏ–3 జంగం నానిని నిందితులుగా చేర్చారు. కృష్ణలంక పోలీసుస్టేషన్లో సీఐతోపాటు నలుగురు నిందితుల సమక్షంలో సాయికృష్ణను విచారించినట్లు సీడీఆర్ డేటాలో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కృష్ణలంక పోలీసుస్టేషన్‌లోని నెట్వర్క్ వీడియో రికార్డును పరిశీలించగా, అందులో గత 18 నెలల సీసీటీవీ ఫుటేజీ లభించలేదు. నిందితులు తమ చట్టవిరుద్ధ నిర్బంధాన్ని, కస్టడీ హింసను దాచడానికి ప్రభుత్వ ఆస్తి అయిన అసలు హార్డ్ డిస్కులను దొంగిలించి, వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్కులను ఉద్దేశపూర్వకంగా మార్చారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి వాదనలు వినిపిస్తూ నిందితులు పోలీసు శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ హోదాల్లో ఉన్నందున, వారు బయట ఉంటే సాక్షులను (సహచర సిబ్బందిని) బెదిరించే లేదా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన, సున్నితమైన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ దశలో ఉందని, ఈ నేపథ్యంలో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. సీఐ నాగరాజు కస్టడీపై తీర్పు వాయిదావిజయవాడ లీగల్: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపించారు. కీలకమైన ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజు విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించలేదన్నారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు 12 రోజులపాటు పోలీసు కస్టడీ కోరారు. నాగరాజుకు పూర్తి భద్రత కల్పించామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించగా, న్యాయమూర్తి దీనికి సంబంధించి అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం డిఫెన్స్ తరఫు న్యాయవాదులు దిట్టకవి రామ్‌చంద్, గుడిశేవ సాంబశివరావు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుడు పోలీసులకు పూర్తిగా సహకరించాడన్నారు. పోలీసు కస్టడీకి కేవలం రెండు రోజుల సమయం సరిపోతుందన్నారు.రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని, వీడియో, ఆడియో రికార్డులను భద్రపరచి న్యాయస్థానంలో సమర్పించాలని, న్యాయవాది సమక్షంలోనే నిందితుని విచారణ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని, అందుచేత రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ జరపాలని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనల అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీకాంత్ తీర్పును గురువారానికి వాయిదా వేశారు. -
హే రామ్..సేవ్ ఆంధ్ర
‘‘సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి.’’‘‘సాయికృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పెట్టుకున్న అర్జీలకు విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణ వాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్‌లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్‌లను చిన్న చిన్నోళ్లకు పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ’’‘‘18 నెలల సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రిమాండ్ రిపోర్టులో రాశారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యం? ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడమేమిటి? ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే... కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు?’’ ‘‘అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439.’’ ‘‘రెండేళ్ల క్రితం ఏ ఇంట్లో అయినా సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది.’’‘‘జంగిల్ రాజ్ అంటే బిహార్‌లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా వారిని నిందితులుగా చూపిస్తూ కేసులు పెట్టిన ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా(చట్టం) పక్కకు పోయి మొత్తం ‘రూల్ ఆఫ్ ఫియర్’(భయం) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిపోయింది. ఇక్కడ జంగిల్‌రాజ్ పాలన సాగుతోంది.’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎదురు లేదని, తామేం చేసినా చెల్లుతుందన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పాయని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలనతో పాటు, తాను మోసం చేసిన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లపై ప్రశ్నించేవారి గొంతు నొక్కడం కోసం చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారని ఎత్తిచూపారు. సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడం, పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడతాయని అన్నారు. చివరకు తాను వెళ్లి సాయికృష్ణ కుటుంబాన్ని కలిసే వరకు, ప్రభుత్వంలో చలనం రాలేదని, దాదాపు 46 రోజుల పాటు గోప్యంగా ఉంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే అంటున్నాం.. ‘‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’’ అని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ ఆయుధంగా మార్చుకుని.. వ్యవస్థలను దిగజార్చి సాగిస్తున్న భీతావహపాలనను సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. రాష్ట్రంలో భయం రాజ్యమేలుతోంది.. ‘‘రెండేళ్ల క్రితం వరకు ఏ ఇంట్లో అయినా.. సంక్షేమం, అభివృద్ధి, విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు చేసిన మంచి గురించి చర్చ జరిగేది. కానీ నేడు ఏ ఇంటికి వెళ్లినా రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత శవాలను మాయం చేయడం, చంద్రబాబు చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఆయన చెబుతున్న అబద్ధాలు, చేస్తున్న టాపిక్ డైవర్షన్లు, ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోట్లపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే? చట్టం, న్యాయం (రూల్ ఆఫ్ లా) పక్కకు పోయి భయం(రూల్ ఆఫ్ ఫియర్) రాజ్యమేలుతోంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోయాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పాలన, తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలు, ఎన్నికలప్పుడు ఆయనిచ్చిన బాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.... ఆ ప్రశ్నించే గొంతును నొక్కే కార్యక్రమం జరుగుతోంది. చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను చంద్రబాబు తన చేతుల్లో తీసుకున్నారు.. ఎవరైనా తనను ప్రశ్నిస్తే.. అది ప్రతిపక్ష పార్టీ నేతలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా, జర్నలిస్టులైనా.. వారిని అణిచివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకోసం చట్టాలను, పోలీస్ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయాయివ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. ఇవాళ మనం చూస్తున్న ఈ దుర్మార్గాలన్నీ కూడా దాని పర్యవసానాలే. రాష్ట్రంలో న్యాయం, ధర్మం గాడితప్పింది. పాలించే వారిలో భయమనేది పోయింది. మనం మనుషులమేనన్న సంగతి మరిచిపోయి, ఒక మనిíÙని మనం ఏం చేసినా అడిగే వాడు ఉండడనే ధైర్యం అసలు ఎక్కడ నుంచి వచ్చింది? ఇది ప్రభుత్వం తప్పు కాదా? విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్నా, పోలీసుల వేధింపులకు గురై క్రాంతికుమార్ అనే అబ్బాయి వీడియో చేసి మరణవాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్‌కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు, తెనాలిలో తిరుపతమ్మ కేసు, శ్రీకాకుళం సంతకవిటికి చెందిన కళావతి కేసు రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దంపడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిíÙని దారుణంగా కొట్టి చంపి, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ లేకుండా చేసి, చివరికి శవం కూడా మాయం చేసి ఆ శవం ఎక్కడ ఉందో ఏం చేశారో ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు కూడా బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగింది. ఇది రాజధానిలో.. చంద్రబాబు ఇంటికి ఆమడదూరంలో జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ నివ్వెరపోయిన ఘటన ఇది. ఒక్కొక్కటిగా ఇలాంటి ఘటనలు బయటకొస్తున్నా చంద్రబాబును ఎవరూ నిలదీయకూడదట. వీటి కోసం ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం చెప్పాల్సింది పోయి, క్రిమినల్స్‌కు మద్దతు ఇస్తారా అంటూ ఎదురు దాడి చేయడమే కాకుండా.. తమకు తానా తందానా అనే ఎల్లో మీడియాలో ఇదే మాదిరిగా రాతలురాయిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా రాశారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? ఈ ఘటన మే 6వతేదీన జరిగింది. తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోవాలని సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7.26 గంటలకు ఇదే విజయవాడ సీపీకీ అర్జీ పెట్టుకుంది. కానీ సీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయికృష్ణ బంధువులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోలేదు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సీఐని సీపీ కాపాడతాడు. సీపీని డీజీపీ కాపాడతాడు. డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. ఇవన్నీ రాష్ట్రంలో మన కళ్లెదుట కన్పిస్తున్న సాక్ష్యాలు. కుప్పకూలిన, దిగజారిన పోలీస్ వ్యవస్థకు అద్దంపడుతున్నాయి. క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?మరో ఘటనలో దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణవాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చావుకు కారణం ఇదే కృష్ణ లంక పోలీస్ స్టేషన్, ఇదే సీఐ కారణమని చెబుతూ మరణవాంగ్మూలం ఇచ్చిన ఘటన కూడా ఇదే సీపీ పరిధిలో జరిగినా సీపీ, డీజీపీలు ఏం చేస్తున్నారు? క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? తనకొడుకు సాయి కృష్ణ కోసం ఆ తల్లి వేదన పడుతూ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకుంటే విలువ లేదా? ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇచ్చిన మరణవాంగ్మూలానికి విలువ లేదా? జగన్ వెళ్తే కానీ అరెస్ట్‌లు మొదలు కాలేదు. ఆ అరెస్ట్‌ల్లో కూడా చిన్న చిన్నోళ్లను పరిమితం చేశారు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సీపీని, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులు చేయడం లేదని అడుగుతున్నా? ఇంతగా బరితెగించి సీఐ నుంచి డీజీపీ వరకు అధికారులను కాపాడుతున్న చంద్రబాబు ఇంట్రస్ట్ ఏమిటి? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును కవరప్ చేస్తున్నారని అడుగుతున్నా ? అసలు ఈ ఘటన ఇంత పెద్దది కాకపోయినా, జగన్ వెళ్లకపోయినా ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చేది కాదు.. పూర్తిగా కవరప్ చేసేవారు. ప్రశ్నిస్తే ఎన్టీఆర్‌ను కూడా రౌడీషీటర్ అనే వారు.. నిజంగా విలన్లను ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం. కానీ చంద్రబాబు రూపంలో ఇక్కడే మన కళ్లెదుటే మనకు విలన్లు కన్పిస్తున్నారు. ఇవన్నీ దారుణాలు కావా? దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు రౌడీషీటర్లట..రౌడీలను పెట్టుకుంది నువ్వు. దాడి చేసింది, కొట్టించింది, కారు అద్దాలు పగలు కొట్టింది నువ్వు. తిరిగి మా వాళ్లను రౌడీలంటావా? నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే.. చంద్రబాబును ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండి ఉంటే.. ఆయన్ని కూడా రౌడీషీటర్ అనే వారు. ఎన్టీఆర్ అయినా, లక్ష్మీపార్వతి అయినా అంతే. చంద్రబాబును ప్రశ్నిస్తే రౌడీషీటర్ అంటారు. చంద్రబాబు పాలనలో ఎవరికైనా ఎక్కడైనా రక్షణ ఉంటుందా? అని అడుగుతా ఉన్నా. వీడియోలలో.. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్.. ధ్వంసమైన కారు.. రాయి పట్టుకుని ఉన్న టీడీపీ నేతలు పెంచలయ్య, మట్టిమాఫియా నేత నాగరాజు.. టీడీపీ గూండాలను దాడికి పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ.. కనిపిస్తున్నారు.. పోలీసుల సమక్షంలోనే రాళ్లు పట్టుకొని దాడులు చేస్తున్నారు. కారు పగలగొడుతున్నారు. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు దెబ్బలు తగిలాయి. మా వాళ్ల మీద ఎందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేమైనా పాకిస్థాన్ బోర్డరా? కొంతమంది పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పటి వరకు మా వాళ్లు పెట్టిన ఫిర్యాదులపై కేసులు పెట్టలేదు. ఏ తెలుగుదేశం వాళ్లను అరెస్ట్ చేయలేదు.. నిజంగా రైతులు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా భూములు ఎందుకయ్యా అని ఆ రైతులు అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు తమ బినామీలకు, నాయకులకు ఆ భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రాజధాని ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. నీ స్వార్థం కోసం భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి వెళ్లగొడతారా? అని రైతులు నిలదీస్తున్నారు. చంద్రబాబు, ఆయన పార్టనర్ అధికారిక ప్రకటన చేయగలరా?అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్ర పూరితంగా సీసీ ఫుటేజ్, శవం మాయం చేయడం, చివరకు ఆ తల్లికి బూడిద కూడా ఇవ్వని అమానవీయ ఘటనపై ఎల్లోమీడియాలో అక్షరం ముక్క రాయరు. పైగా తానా తందానా అంటూ చంద్రబాబుకు భజన చేస్తారు. రౌడీ షీటర్‌కు సపోర్ట్ చేస్తారా అంటూ ఎదురుదాడి చేస్తారు. ఈ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు పార్టనర్ కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగా తెరపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతుల్లో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని దొంగ కేసులు పెడతామని, చంపుతామని, శవాలు మాయం చేస్తామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? అని చంద్రబాబును, ఆయన పార్టనర్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కవరప్‌లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీషీటర్ అన్నారు. రౌడీషీటర్‌ను వెనకేసుకొస్తారా అని ఎదురు దాడి చేశారు. జనం ఎప్పుడైతే ఛీ కొట్టడం మొదలు పెట్టారో వెంటనే యూ టర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు సాయికృష్ణ కుటుంబ సభ్యులను సెక్రటేరియట్‌కు పిలిపించుకుని పక్కన కూర్చో పెట్టుకొని చేయి పట్టుకుని న్యాయం చేస్తానంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు.. ఏకంగా 46 రోజుల పాటు బయటకు రాకుండా తొక్కిపెట్టిన ఈ ఘటనతో యావత్ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.నేను వెళ్లాకే అరెస్టులునేను వెళ్లిన నాలుగు రోజుల తర్వాత అరెస్ట్‌లు ప్రారంభించారు. 46 రోజుల పాటు ఈ కేసును ఎందుకు తొక్కిపెట్టారు, అసలు ఏం జరిగింది? దీనికి వెనుక ఉన్న పెద్దల మీద చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రిపైన లేదా అని అడుగుతున్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ చంద్రబాబులో కానీ, ఈ ప్రభుత్వంలో కానీ చిత్తశుద్ధి లేదు. ఎక్కడా ఏ కోశానా పశ్చాత్తాపం కన్పించలేదు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే.. సాగుతున్న దర్యాప్తును ఒక్కసారి గమనిస్తే కేసును నిర్వీర్యం చేసేందుకు, పైవాళ్లను కాపాడేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో ఆధారాలతో సహా చాలా స్పష్టంగా కన్పిస్తుంది.18 నెలలుగా సీసీ ఫుటేజ్ లేదంటున్నారు.. ఇంకెన్ని హత్యలు జరిగాయోమోసపూరిత కుట్ర ఎంత లోతుగా ఉందో మరో ఉదాహరణ... కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్లు ఫైల్ చేసిన మొదటి రిమాండ్ రిపోర్టులో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వీడియో ఫుటేజ్ లేదని రాశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ల రిమాండ్ రిపోర్టులో 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు రాస్తారు. అంటే ఈ 18 నెలల్లో ఎన్ని మర్డర్లు జరిగాయో? రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పైగా సీపీ, డీజీపీ, చంద్రబాబు, హోంమంత్రి కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నా... సీసీ ఫుటేజ్ మాయమవడం ఎలా సాధ్యమని అడుగుతున్నా.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు డిలీట్ చేసుకుంటూ పోవడానికి ఎలా కుదురుతుంది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? ఇక్కడ డిలీట్ చేస్తే.. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫుటేజ్ ఉండదా? అక్కడ ఏమైనట్టు? ఒకచోట డిలీట్ చేస్తే మరొక చోటైనా ఉంటుంది కదా? సీపీ, డీజీపీ కార్యాలయాల్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. స్టేషన్లో ఫుటేజ్‌లో లేదంటున్నారు. విజయవాడలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్ జంక్షన్లు, పబ్లిక్ ప్లేస్‌లలో సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ఏమైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా సాయికృష్ణ శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో? ఏం చేశారో కనుక్కోవచ్చు కదా.. కానీ సిట్ ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని అడుగుతున్నాం. మ్యాట్రిక్ సిస్టమ్, క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ అందుబాటులో ఉంటుందని తెలిసినా దాన్ని సిట్ ఎందుకు స్వాదీనం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నా. సీఐతో పాటు సంబంధిత పోలీస్ బాసుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల పరిశీలించే కార్యక్రమం ఎందుకు చేయడంలేదు? ఆశ్చర్యమేమిటో తెలుసా ఆర్థిక ఇబ్బందుల వలన కానిస్టేబుళ్ల ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశారని చెబుతున్నారు. మనిషిని చంపేశారు. శవాన్ని కన్పించకుండా చేశారు. వీడియో ఫుటేజ్ మాయం చేశారు. ఫోన్లు నాగపూర్‌లో అమ్మేశారు. రాజధాని ప్రాంతంలోనే సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మానవ హక్కులకు విలువ లేదా? యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనలు..చంద్రబాబు పాలనలో వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్లు ఈ విధంగా కుమ్మక్కవడం కొత్తేమీ కాదు. ఈ రెండేళ్లలో శతకోటి ఉదాహరణలు ఇవ్వొచ్చు. సీసీ ఫుటేజ్ మాయంతో సహా ఆధారాలు నాశనంచేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయడం, న్యాయ స్థానాలను పక్కదోవపట్టించడం, చివరకు కొన్ని కేసుల్లో పోలీసులే స్వయంగా డబ్బులు తీసుకెళ్లి వాళ్ల ఇళ్లల్లో పెట్టి మరీ కేసులు పెడుతున్నారు. ఈ స్థాయిలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయి. రెండేళ్లుగా రెడ్ బుక్ పాలనలో రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎన్నో చూశాం. ఒకర్ని పిన్ పాయింట్‌గా గుర్తించడం, వాళ్లను బలవంతంగా కేసుల్లో ఇరికించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా నైతికత, విలువలు లేకుండా పోయాయి. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నామన్న పశ్చాత్తాపం కూడా కన్పించడం లేదు. ఏ స్థాయికి దిగజారిపోయినా పర్వాలేదు. చంద్రబాబు ముఖంలో సంతోషం చూడాలి. అదొక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగిల్ రాజ్ అనక ఇంకేమనాలి. జంగిల్ రాజ్ అంటే బిహార్‌లో ఉంటుందని అంటారు. కానీ ఆంధ్రాలో కూడా జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబు జంగిల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకుల బృందం ఆ గ్రామాలకు వెళ్తే ఏం జరిగిందో మనమంతా చూశాం. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలను, రాజధాని ప్రాంత రైతులు పడుతున్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.దాడికి గురైన బాధితులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు..రాజధాని ప్రాంతానికి వెళ్లిన మా పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా బాధితులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నేతలనే నిందితులుగా చూపిస్తూ కేసులు పెడుతున్న ఘటనలు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. న్యాయం, ధర్మం అనేది పూర్తిగా భూస్థాపితం చేశారనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఇదే మీటింగ్ హాలులో ఇటీవలే రాజధాని గ్రామాలకు చెందిన రైతులు నన్ను కలిశారు. తమ గోడు చెప్పుకున్నారు. వాళ్ల కోరిక మేరకు ఒక కమిటీని, లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేశాం. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు చూపుతాం.. మీరు రండి అని రైతులు అడిగితేనే మా పార్టీ బృందం అక్కడకు వెళ్లింది. ఆ బృందంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులపై దాడులు చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కార్ల అద్దాలు పగలకొట్టారు. రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మళ్లీ తిరిగి మా వాళ్లే దాడులు చేసినట్టుగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. భూములివ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరిట వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేయడం, ఇంకా దారుణంగా కొండవీటి వాగును వీరి భూముల్లోకి మళ్లించి వాళ్ల భూములు చుట్టూ నీళ్లు నింపేసి చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్లు భూములు వదిలేసుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేస్తోంది.అమరావతిలో ప్రతీ పనిలోనూ దోపిడీయే..అమరావతిలో జరిగే ప్రతీ పనిలోనూ కన్పించేది అవినీతి, దోపిడీయే... కేంద్రప్రభుత్వం అమరావతిలో కడుతున్న ప్రభుత్వ భవనాలు, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,645 అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు అప్రూవల్ ఇచ్చింది. అదే అమరావతిలో చంద్రబాబు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన చేస్తున్న ఖర్చు చదరపు అడుగుకు అక్షరాలా రూ.20,439. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. పక్కన తెలంగాణ సెక్రటేరియట్ 10 లక్షల ఎస్ఎఫ్టీలకు మించి లేదు. ఇది దోపిడీ కాదా ? అని అడుగుతున్నా. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏ నగరం తీసుకున్నా 5స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్‌తో నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. చివరికి జాతీయ రహదారి నిర్మాణం కిలోమీటర్‌కు రూ.24 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్వయంగా ఓ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కానీ అమరావతిలో ఎంతో తెలుసా ? కిలోమీటర్‌కు సగటున రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే డబుల్ కంటే ఎక్కువ. ఇవన్నీ బయటకు రాకూడదని, రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి చేస్తున్న అన్యాయం, మోసం, అమరావతి పేరిట చేస్తున్న దోపిడీ బయటకు రాకూడదనే ఈ దాడులకు పాల్పడుతున్నారు. -
కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్ విజయవాడ 2వ ACM కోర్టు ఆదేశాలు
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. మరో ఇద్దరికి రిమాండ్
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గన్నవరం జైలుకు సాంబయ్య, ఆవనిగడ్డ జైలుకు బాబురావును తరలించారు.కాగా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి.సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు మాయం చేయడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహారించారని తేలింది. కృష్ణలంక పీఎస్ సీసీటీవీ హర్డ్ డిస్క్‌ను మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక పీఎస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాబురావు, సాంబశివరావులను సిట్ అధికారులు నిందితులుగా చేర్చి విచారించగా ఆధారాలు మాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో వీరిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు పోతర్లంక అశోక్ కుమార్ ఏ2,జంగం నాని ఏ3లకు ఇదివరకే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదెకృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నెలరొజుల కిందట అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చిన స్థానిక ఆర్ఎంపీని నిన్న (మంగళవారం) సిట్ విచారించింది.హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలు పిలిస్తేనే అక్కడికి వెళ్లి వైద్యం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాగా వైద్యం చేసే సమయంలో సాయికృష్ణ శరీరంపై ఎక్కడెక్కడ గాయాలున్నాయని ఆరాతీసి ఆయన స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆర్ఎంపీ విచారణలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
YS Jagan: "ఫోన్లు నాగ్‌పూర్‌లో అమ్మేశారా? ఈ కథను నమ్మాలా?"
-
క్రిమినల్స్ అయితే ఎందుకు పిలిచి ముసలి కన్నీరు కార్చుతున్నావ్
-
ఆఫ్ట్రాల్ CI గాడివి.. క్రిమినల్ అయితే చంపేస్తావా..?
-
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.. సాయికృష్ణ కేసులో నోరు విప్పిన హెడ్ కానిస్టేబుల్స్
-
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
సాయి కృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ బాబురావు A5, A6గా సాంబయ్యలను చేరుస్తున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సాయి కృష్ణ లాకప్‌డెత్ లో అశోక్, నాని మా ఎదుట సరండర్ అయ్యారు. వారిని అరెస్టు చేసినప్పుడు మొబైల్స్ ఫోన్స్ ఇవ్వాలని అడిగితే అమ్మేశామంటూ చెప్పారు. అయితే తమ ఫోన్లను నాగపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్లు తెలిపారు. అయితే సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించడం నుంచి హత్య చేయడం వరకు సాక్ష్యాలు మాయం చేయడంలో అశోక్, నానిలు కీలకంగా వ్యవహరించారు. కుట్రలో భాగంగానే వీరు ముందస్తు చర్యల్లో భాగంగా భాగంగా అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. ఈ కేసు ఇంకా కీలక విచారణ దశలోనే ఉంది. మృతదేహాన్ని మాయం చేయడంలో ఇంట్లో ఎవరు పాత్ర ఉందో విచారణ జరపాలి ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరపాల్సి ఉంది. అశోక్, నానిని మరింత విచారించాల్సిన అవసరముంది. మే 6న సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు. సాయి కృష్ణను విజయవాడలో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకువచ్చినట్టు టవర్ లోకేషన్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు లభించాయి.. సాక్షులు నిందితుల మొబైల్ ఫోన్లో నెట్వర్క్ లు ఒకే ప్రాంతంలో చూపించాయి. సాయి కృష్ణ లాక్ అప్ డెత్ లో అశోక్, నాని ఇద్దరి పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షులు విచారించిన తర్వాత A 1గా వున్నా నాగరాజుని సాయికృష్ణకి అప్పగించారు. సాయికృష్ణ ని అశోక్, నాని, నాగరాజు తీవ్రంగా కుట్టారని శరీరం మీద గాయాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తీవ్రమైన హింస కారణంగా సాయికృష్ణ లాక్ అప్ డెత్ అయ్యాడు అని మేము విశ్వసిస్తున్నాం.’అని చెప్పుకొచ్చారు. -
సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు
-
సాయికృష్ణ కేసు కొత్త మలుపు.. మహిళా కానిస్టేబుల్, RMP డాక్టర్‌పై పోలీసుల చర్య
-
లాకప్ డెత్ కేసులో కొత్త ఆధారాలు.. సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్!
-
Big Intro : హెడ్ కానిస్టేబుళ్లపై సంచలన ఆరోపణలు.. వెలుగులోకి వచ్చిన నిజాలు!
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్‌స్టేషన్‌లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్‌డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్‌తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్‌లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్‌కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
కానిస్టేబుళ్ల లొంగుబాటు... నిజమా? నాటకమా? కోర్టులో ఏంజరిగిదంటే
-
Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ?
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ లొంగిపోయిన సాక్షులు...
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
విజయవాడ: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోయారు. వారిద్దరినీ సిట్ ఆఫీసుకు తరలించారు. వీరిద్దరు సాయికృష్ణ కేసులో నిందితులుగా ఉన్నారు. సీఐ నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు.సాయికృష్ణ కేసులో వీరి పాత్ర ఉందని ఖరారైన నేపథ్యంలో ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల గురించి గాలించారు. ఇప్పటికే వీరిద్దరిని సస్పెండ్ చేశారు. వీరిద్దరు దొరకడంతో కేసులోని చిక్కుముడులన్నీ వీడుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసి విచారించి పలు వివరాలు లాగింది సిట్. మరోవైపు, సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారించింది. సీబీఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై విచారణను 15కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా, సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అత్యంత సంచలనం సృష్టించిన ఘటనల్లో ఒకటిగా మారింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లేదని వారు చెబుతున్నారు. దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక విషయాలు బయటపడ్డాయి. -
గాదె సాయికృష్ణ కేసుపై అందరి చూపు.. నేడు హైకోర్టులో విచారణ!
-
హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది? ఫోన్ డేటా డిలీట్ కేసులో టెన్షన్!
-
సాయి కృష్ణ కేసుకు కొత్త మలుపు.. అంబటి సంచలన లేఖ వైరల్!
-
సీఐ నాగరాజు మాస్టర్ స్కెచ్.. 32 టెరాబైట్స్ CCTV ఫుటేజ్ డిలీట్..
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
సాయికృష్ణ కేసు.. అంబటి లేఖతో దర్యాప్తుపై కలకలం
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. సిట్ చీఫ్, ఐజీ ఎం. రవిప్రకాష్‌కు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, అనేక అనుమానాస్పద అంశాలను ప్రస్తావించిన అంబటి.. రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు స్పష్టంగా లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్య ఎలా జరిగింది? మొదలు.. ప్రతీ కీలక ప్రశ్నకూ సరైన సమాధానం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారాయన.టాస్క్‌ఫోర్స్, కృష్ణలంక పోలీస్‌స్టేషన్, పైస్థాయి అధికారుల పాత్ర ఉన్నప్పటికీ క్రిమినల్ లయబిలిటీని(బాధ్యత) కేవలం ఒక సీఐకే పరిమితం చేయడం సరికాదని అంబటి తన లేఖలో విమర్శించారు. సాయికృష్ణను హ్యాండోవర్ చేసిన సమయంలో రాతపూర్వక అకాలెడ్జ్మెంట్ ఉన్నప్పటికీ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదని ఆయన ప్రశ్నించారు.కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ విషయంలో సిట్ నిర్లక్ష్యం చూపిందని లేఖలో ఆరోపించారు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్‌లో ఉన్న ఫుటేజీని వెంటనే సీజ్ చేయకపోవడం, ఓవర్‌రైట్ లేదంటే డిలీట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్రమైన లోపమని ఆయన పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ధ్వంసం కావడంపై కూడా స్పష్టత అవసరమని అన్నారు.అంతేకాకుండా పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్‌లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ను పరిశీలిస్తే పెద్ద కుట్ర వెలుగులోకి వచ్చేదని.. కానీ సిట్ ఆ దిశగా వెళ్లలేదని అంబటి ఆరోపించారు. భారత న్యాయసంహిత(BNS) సెక్షన్లు 61, 3(5) కింద క్రిమినల్ కాన్స్పిరసీ, కామన్ ఇంటెన్షన్ అంశాలు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మ్యాట్రిక్స్ సర్వైలెన్స్ సిస్టమ్, 90 రోజుల క్లౌడ్ బ్యాకప్ వంటి ఆధునిక నిఘా వ్యవస్థల ఫుటేజీని సిట్ పరిశీలించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. వాహనాల కదలికలు, మృతదేహం తరలింపు వంటి కీలక అంశాలు ఈ ఫుటేజీల్లో ఉండే అవకాశం ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.మే 28న బాధిత తల్లి ఇచ్చిన క్రైమ్ పిటిషన్‌పై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడాన్ని కూడా అంబటి ప్రశ్నిస్తూ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లేఖతో సాయికృష్ణ కేసు మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
ఇవాళ హైకోర్టు ముందుకు సాయికృష్ణ కేసు
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి..
-
తెర వెనుక మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్‌కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
సాయికృష్ణ కేసు కంచికే.. పోలీసులే పోలీసులపై విచారణ.. కృష్ణలంక క్రిమినల్స్
-
సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..
-
నా కొడుకు కేసును CBIకి ఇవ్వండి.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
పరారీలో ఉన్న కానిస్టేబుళ్ల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు సన్నిహితుడు..
-
విజయవాడ సీపీపై సాయికృష్ణ తల్లి సంచలన కామెంట్స్
-
మాకు బాబుపై నమ్మకం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి...
-
హైకోర్టుకు సాయి కృష్ణ తల్లి.. ఖాకీలపై నమ్మకం లేదు.. సీబీఐకి ఇవ్వండి!
-
సాయి కృష్ణని ఎంత క్రూరంగా చంపారో చూశాడు కనుకనే క్రాంతి కుమార్ ఆ పని చేసాడు
-
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
-
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
100 మంది ఉన్న పోలీసు స్టేషన్ లో సాయి కృష్ణను చంపడం ఒక్కరు కూడా చూడరా?
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై తల్లి న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్‌డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యరి్థస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్వతంత్ర దర్యాప్తు కేవలం ఆ సంస్థ పరిధిలోనే కాకుండా పూర్తి స్థాయిలో కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. సాయికృష్ణ ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ సుభేందు శమంతో ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. 40 రోజుల పాటు కమిషనర్ మౌనంగా ఉన్నారంటే అర్థమేంటి..? ‘కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది, టాస్‌్కఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం, సాక్ష్యాల నాశనంలో స్వయంగా భాగస్వాములుగా ఉన్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిందితులుగా ఉన్న అదే పోలీస్ శాఖే ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదు. ఉన్నతాధికారులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడమే ఏకైక మార్గం. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, పోలీస్ కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటన జరిగితే కనీసం 7 రోజుల్లోగా ఆ ప్రాంత పోలీసు అధిపతి అయిన కమిషనర్‌కు పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో సదరు కమిషనర్ 40 రోజుల పాటు పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడం దేనిని సూచిస్తోందంటే.. ఈ నేరంలో లేదా ఈ విషయాన్ని తొక్కిపెట్టడంలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించడంలో అర్థమే లేదు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పోలీసుల దర్యాప్తును నమ్మడానికి వీల్లేదు కాబట్టి, హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’ అని సాయికృష్ణ తల్లి హైకోర్టును అభ్యర్థించారు. హైకోర్టుకు ఏదో ఒకటి చెప్పి కేసును మూసేయించాలని చూస్తున్నారు.. ‘ప్రస్తుత దర్యాప్తు కేవలం ఒక్క పోలీస్ అధికారి (నాగరాజు) చుట్టూనే తిరుగుతోంది. కానీ అసలు నిజం ఏమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది మొత్తం సాయికృష్ణ అదృశ్యం ఘటనలో భాగస్వాములయ్యారు. సాయికృష్ణ ప్రాణాలు తీసి అతడి శరీరాన్ని ఎప్పటికీ దొరకకుండా మాయం చేయాలనే క్రూరమైన ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. నేరంలో భాగమైన కృష్ణలంక స్టేషన్ సిబ్బంది అందరినీ వదిలేసి, కేవలం ఆ ఒక్క నిందితుడి నుంచి మాత్రమే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. తాము దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టుకు ఏదో ఒక నివేదిక సమర్పించి తద్వారా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను మూసివేయించాలని చూస్తున్నారు. ఒకసారి కోర్టులో ఈ పిటిషన్ మూసివేస్తే ఈ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా పూర్తిగా అణచివేయవచ్చని, దోషులను శాశ్వతంగా తప్పించవచ్చని పోలీసులు భావిస్తున్నారు’ అని ఆమె తన పిటిషన్లో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను మే 28నే విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశా. ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయంపై, అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పోలీసులు జూన్ 19 వరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక వారి ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజులకు పైగా సుదీర్ఘ జాప్యం జరిగింది. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం, కేవలం ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతే దిగివచ్చి కేసు నమోదు చేసింది. ఒక వ్యక్తి అదృశ్యమైన వెంటనే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన పోలీసులు 45 రోజుల పాటు మౌనంగా ఉండి, కోర్టు జోక్యం తరువాతే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పడం వారి నిబద్ధతను శంకిస్తోంది. సాయికృష్ణ అదృశ్యమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసును కోర్టు విచారణ వరకు లాగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే.. ఈలోపు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేయడమే’ అని సాయికృష్ణ తల్లి నివేదించారు. హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే దర్యాప్తు చేయడమా..? ‘సాయికృష్ణ పోలీసు కస్టడీలో దారుణమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే అతడిని మాయం చేశారు. ఇదంతా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది. చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవరూ కూడా తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా లేదా దర్యాప్తు అధికారిగా ఉండకూడదు. ఎవరిపై అయితే హత్యానేరం లేదా అక్రమ నిర్బంధం ఆరోపణలు ఉన్నాయో, వారికే దర్యాప్తు చేసే అధికారం ఇస్తే వారు తమ తప్పులను తామే ఎలా ఒప్పుకుంటారు? నిందితులుగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్నే ఈ కేసును దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే, అది ‘నిష్పక్షపాత, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నారు. కంటి తుడుపు సిట్ దర్యాప్తుతో ఉపయోగం లేదు... ‘సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టడానికి సిట్‌ను ఏర్పాటు చేశామని పోలీసులు కోర్టు ముందు కేవలం మాటల్లోనే చెబుతున్నారు. కానీ, ఆ మాటలకు తగ్గట్టుగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలను, నివేదికలను వారు ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదు. హైకోర్టు విచారణ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ వారు నిజంగానే నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే, ఆ నిజాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సాయికృష్ణ అసలు ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? అనే దానికి సంబంధించిన వాస్తవాలను పోలీసులు కోర్టుకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఈ కంటితుడుపు సిట్ దర్యాప్తులను పక్కనబెట్టి కేసును తక్షణమే సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. కోర్టు ఆ దిశగా తగిన ఆదేశాలు జారీ చేయాలి’ అని విజయలక్ష్మి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు..? ‘ఒకవేళ కింది స్థాయి పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ అరెస్ట్, అదృశ్యం గురించి తమ పైఅధికారులకు ముందే సమాచారం అందించి ఉంటే... అంతటి తీవ్రమైన విషయంలో ఆ ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే.. వారు కూడా ఈ నేరాన్ని లోపల సమరి్థస్తూ, దాచడానికి ప్రయత్నించారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని తమ పైఅధికారులకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే... అది నిజాలను తీవ్రంగా తొక్కిపెట్టడం, తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం కావడం కిందకే వస్తుంది. ఒక పౌరుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు ఆ విషయాన్ని దాచగలిగారంటే అక్కడ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు’ అని విజయలక్ష్మి పేర్కొన్నారు.ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును తప్పుదోవ పట్టించారు... ‘సాయికృష్ణ అదృశ్యంపై నేను దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సాయికృష్ణ అసలు ఎవరి కస్టడీలో ఉన్నాడు? అతడిని ఎక్కడ నిర్బంధించారు..? ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై అప్పుడు కూడా కనీస సమాచారాన్ని పోలీసులు హైకోర్టుకు వెల్లడించలేదు. ఆ తర్వాత సిట్ తన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణను మే 6నే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, స్పష్టమైన ఆధారాలు దొరికాయని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే జూన్ 2 నుండి కోర్టు విచారణల సమయంలో సాయికృష్ణ అక్రమ నిర్భంధం గురించి, అదృశ్యం గురించి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది’ అని ఆమె నివేదించారు. ముందస్తు ప్రణాళికతోనే సాక్ష్యాలను నాశనం చేశారు...‘సాయికృష్ణను ఈ ఏడాది మే 6న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీస్ కస్టడీలోనే ఉంచారు. దీనిని సిట్ రిమాండ్ రిపోర్ట్ ధృవీకరిస్తోంది. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కానీ సాయికృష్ణ్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చిన కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతడిపై జరిగిన హింసను, మరణాన్ని దాచడానికి పోలీసులు అంతా కలిసి సాక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో నాశనం చేశారనడానికి బలమైన ఆధారం’ అని విజయలక్ష్మి తన అనుబంధ పిటిషన్లో స్పష్టం చేశారు. -
కీలక పరిణామం.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు. మొదట అదృశ్యం కేసుగా నమోదైంది ఈ వ్యవహారం. ఆ తర్వాత కస్టడీలో మృతి చెందాడన్న ఆరోపణలు వచ్చాయి.సాయికృష్ణను 2026 మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకపోవడంతో పాటు ఇంటికి కూడా రాకపోవడంతో, అతని తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలోనే తన కుమారుడిని హింసించి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. -
సాయికృష్ణ లాకప్‌డెత్‌పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఎన్‌హెబ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది సిట్ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.పోలీసు స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయాలి. గాదె సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలి. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలి. ఈ ఘటనలో సాక్షులను కాపాడాలి. బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం సహాయం వివరాలను అందజేయాలి’’ ఎన్హెచ్ఆర్సీ కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
సాయి కృష్ణ తల్లి ఓడిపోవడం ఖాయం ఎందుకంటే..! అడ్వొకేట్స్ సంచలన నిజాలు
-
పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారా ? సీఐ నాగరాజు జాగ్రత్త
-
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. ఇద్దరు పై అనుమానాలు
-
పెద్దలకు తెలిసే జరిగిందా..? సాయికృష్ణ కేసులో బిగుస్తున్న ఉచ్చు
-
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
-
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!
-
ఈ సిట్ మాకొద్దు.. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
జాగ్రత్త నాగరాజు.. నిన్ను జైల్లోనే...! CIపై చంద్రబాబు బిగ్ స్కెచ్..!?
-
సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
-
CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం
-
సాయికృష్ణ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందటే..?
-
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
-
CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు
-
ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి!
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ‘నా కొడుకును చూపిస్తామన్న పోలీసులు చివరకు చంపేసి శ్మశానంలో కాల్చేశారు. ఇప్పటికైనా నా బిడ్ద బూడిద ఇవ్వండి. కర్మకాండలు చేసుకుంటా’ అని విజయవాడలోని కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకుని పోలీస్ కస్టడీలోనే కొట్టి చంపారన్నది నిజమైందని, తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన మిగతా వారందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ బిడ్డను స్టేషన్లోనే కొట్టి చంపేసి మూటకట్టి శ్మశానానికి తీసుకెళ్లి కాల్చేశారని, కనీసం బూడిద కూడా ఇవ్వలేదని, ఇదేమైనా న్యాయంగా ఉందా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ‘ఈరోజు నేను కుమిలిపోతున్నాను. నా బిడ్డ ఎక్కడ. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం చేశారు పోలీసులు. నా బిడ్డను అంత చిత్రవధ చేసి చంపిన వాళ్లందరికీ శిక్ష పడాలి. అందరూ కలిసి కొట్టి కొట్టి చంపేశారు. నన్ను స్టేషన్‌కు కూడా రానివ్వకుండా వాడిని ఎక్కడికో తీసుకెళ్లి హతమార్చారు. అలా చేయాల్సిన అవసరం ఏమొచి్చంది. వాడి వయసెంత. మీ పోలీసుల వయసెంత. అంత చిన్న బిడ్డను చిత్రవధ చేశారు. వాళ్లకు తగిన శిక్ష పడాలి. నాకు అదే కావాలి’ అని వాపోయారు. మీడియాను చూపిస్తూ ‘నాకు మీరే న్యాయం చేయాలి’ అని వేడుకున్నారు. -
ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది. ఈ హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్‌బాస్‌తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకు ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకప్ హత్యకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకుండా ‘సిట్’ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్లు సూటిగా పేర్కొనని సిట్... దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూమంత్రంగా రిమాండ్ రిపోర్టును రూపొందించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవుతోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు..? హత్యాయుధం.. సమయం.. మృతదేహం తరలింపు.. అవశేషాల గుర్తింపు.. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీసు రిజిస్టర్లు, రికార్డులు... వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు... సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ బాధ్యులు.. సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ స్వాధీనం..! ఇలా ఏ అంశాలను కూడా ప్రస్తావించకుండానే, వాటి గురించి పేర్కొనకుండానే రిమాండ్ రిపోర్టును సమర్పించడం విభ్రాంతి కలిగిస్తోంది. ప్రధానంగా సాయికృష్ణను లాకప్‌లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోకపోవడం గమనార్హం. తద్వారా ఈ కేసులో ఎవరో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్బాస్లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నాగమన్నది తేటతెల్లమవుతోంది. సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది....హత్య వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా?కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ మరణం కేసును న్యాయ విచారణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయికృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు (డిసీజ్డ్)అని పేర్కొంది. కానీ ఆయన్ని ఎప్పుడు, ఎక్కడ ఎలా హత్య చేశారు? అనే కనీస వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొనలేదు. అంటే.. నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనేలేదు. టాస్క్‌ఫోర్స్ అధికారులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తరువాత.. వివరాలన్నీ అగమ్యగోచరమే. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన సాయికృష్ణ తరువాత ఏమయ్యారన్నది సిట్ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. ఆయన ప్రాణాలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారా...? లేదా ఆయన మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తరలించారా? అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్ అధికారులు విస్మరించారు. అసలు సాయికృష్ణ లాకప్‌లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్ రిపోర్ట్‌లో సూటిగా ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయపరుస్తోంది. లాకప్‌లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే పేర్కొంది. హత్య ప్రదేశం, సమయం, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అన్నవి ఈ కేసులో ప్రధానమైనవి. ఆ మూడు కీలక అంశాల గురించి రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. సాయికృష్ణ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్ గుర్తించనే లేదు. తద్వారా సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారని నిరూపించడానికి కీలక ఆధారం లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. అంటే సాయికృష్ణ అసలు హత్యకు గురయ్యారా లేదా అనే సందేహానికి బలం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుగానే కుట్రకు బరితెగించింది. అంతగా ఈ కేసును నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు భావిస్తున్నట్లు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్షులే లేకుండా చేసే కుతంత్రంఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితోపాటు ఎస్సైను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బలకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయటాన్ని తాను విన్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పారని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్సై కూడా తాను మే 6 – 8వ తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. మరి అన్ని రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొన లేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం! మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? అనేది సిట్ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్ తూతూ మంత్రంగా రిపోర్ట్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవర్ని కాపాడేందుకు యత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కీలక రిజిస్టర్లు, రికార్డుల వివరాలే లేకుండా రిమాండ్ రిపోర్టా...!సాయికృష్ణ లాకప్ మరణం కేసును నీరుగార్చేందుకు సిట్ పక్కాగా రంగంలోకి దిగింది. ప్రధాన బాధ్యుడైన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు టాస్క్‌ఫోర్స్ అధికారిని ఈ కేసు నుంచి తప్పించాలన్న కుట్ర బయటపడింది. తద్వారా వారిద్దరి వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను కాపాడాలన్న లక్ష్యంతో వ్యవహరించింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ అధికారులు మార్కాపురంలో అదుపులోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించినట్టు సిట్ పేర్కొంది. కానీ ఆ తరువాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ప్రధానంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం నమోదు చేయాల్సిన కీలక రిజిస్టర్లు, రికార్డులను సిట్ కనీసం పరిశీలించలేదు. తమ రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించనూ లేదు. వాటిని రోజూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సీపీ రాజశేఖర్‌బాబు ఎందుకు తన బాధ్యతను విస్మరించారనే కోణంలో దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆ కీలక అంశాలు ఇవీ...» పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లాకప్‌లలో ఉన్న వారి వివరాలతో లాకప్ డెయిరీ సర్వీస్‌రిజిస్టర్(డీఎస్ఆర్)ను సీపీకి సమర్పిస్తారు. నిందితులను లాకప్‌లో పెట్టిన తేదీ, సమయం, సంబంధిత పోలీసు అధికారి తదితర వివరాలు అందులో ఉంటాయి. 24 గంటలు మించి ఎవరూ లాకప్‌లో ఉండకుండా.. న్యాయస్థానంలో హాజరుపరిచారా లేదా? అన్నది సీపీ పరిశీలించాలి. మరి సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్‌లో ఉంచితే ఆ విషయాన్ని సీపీ ఎందుకు పట్టించుకోలేదు? అవేవీ పరిశీలించకుండానే డీఎస్‌ఆర్‌ను ఆమోదించారా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే సీపీకి తెలిసే సాయికృష్ణను రోజుల తరబడి అక్రమంగా లాకప్‌లో ఉంచారన్నది స్పష్టమవుతోంది. » ఇక పోలీస్ స్టేషన్లలో స్టేషన్ ఆఫీసర్లు, జనరల్ డ్యూటీ ఇన్‌చార్జ్‌లు, సెంట్రీలు ప్రతి ఆరు నుంచి 12 గంటల మధ్య షిఫ్ట్‌లు మారుతూ ఉంటారు. అలా షిఫ్ట్ మారే సమయంలో లాకప్‌లో ఉన్న వారి వివరాలను జనరల్ డైరీలో రాయాలి. మరి సాయికృష్ణను ఉంచిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ వివరాలను సిట్ ఎందుకు రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించ లేదు? జనరల్ డైరీ, స్టేషన్ డైరీ, లాకప్ రిజిస్టర్, కస్టడీ రిజిస్టర్, ప్రిజనర్ మూవ్మెంట్ రిజిస్టర్, విజిటర్స్ రిజిస్టర్, సెంట్రీ రిజిస్టర్, అరెస్టు రికార్డులు ఇవన్నీ కీలకం. వాటిని పరిశీలించకుండా వాటి ప్రస్తావనే లేకుండా రిమాండ్ రిపోర్ట్ రూపొందించడం ద్వారా ఈకేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నారన్నది స్పష్టమవుతోంది. » సాయికృష్ణకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నందునే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. మరి పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూలు, వాటిపై తీసుకున్న చర్యలను పోలీస్ కమిషనర్‌కు ప్రతి రోజూ నివేదిస్తారు. మరి సాయికృష్ణను ఎన్బీడబ్ల్యూ జారీ చేసి అదుపులోకి తీసుకుంటే ఆ విషయాన్ని సీపీకి సమర్పించే రోజువారీ నివేదికలో ప్రస్తావించాలి కదా? మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? సాయికృష్ణకు ఎన్బీడబ్లూ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారా...? తీసుకుంటే న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెడతారు? అని ప్రశ్నించాలి కదా. మరి ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా స్పందించలేదు? అంటే ఆయనకు తెలిసే సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రస్తావన రిమాండ్ నివేదికలో పేర్కొనలేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.సాయికృష్ణను ఎక్కడ దహనం చేశారో ఎందుకు వెల్లడించలేదు?సాయికృష్ణను ఎలా కనుమరుగు చేశారన్నది కూడా రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మృతదేహం అనే అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే విషయాన్నే సిట్ అధికారులు ప్రస్తావించనే లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారు అనే కోణంలో సిట్ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? ఆయన మృతదేహాన్ని దహనం చేశారని భావిస్తున్న ప్రదేశాన్ని ఎందుకు గుర్తించ లేదు? వాస్తవానికి సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించి... అక్కడ అవశేషాలను సేకరించాల్సిన బాధ్యత సిట్ అధికారులపై ఉంది. ప్రధానంగా దంతపు అవశేషాలు అత్యంత కీలకం. మృతదేహాన్ని దహనం చేసినా దంతపు అవశేషాలు మిగిలే ఉంటాయి. వాటి నుంచి డీఎన్ఏ నమూనాలను పరీక్షించి నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించాలి. ఇంతటి కీలకమైన అంశాన్ని పోలీసులు ఎందుకు విస్మరించారన్నది సందేహాస్పదంగా మారింది. అంటే సాయికృష్ణ లాకప్ మరణం కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచాలన్నది పోలీసుల లక్ష్యమని స్పష్టమవుతోంది. తద్వారా ఈ హత్య వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులను రక్షించాలన్నదే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.క్రిమినల్ కుట్ర కోణాన్నే పట్టించుకోని సిట్ ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే...సాయికృష్ణ లాకప్ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు సిట్ అధికారులు బరితెగించారు. అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్నే పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. అందుకే సాయికృష్ణను ఎందుకు హత్య చేసి ఉంటారు? అనే కోణంలో కనీసం దర్యాప్తు చేయలేదు. విజయవాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ భూ వివాదం, విజయవాడలో ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థలో నిధుల వ్యవహారంలో రెండువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయని... ఆ వ్యవహారాలను కప్పిపుచ్చేందుకే సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి సిట్ ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదన్నది కీలకంగా మారింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రజాప్రతినిధితోపాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్‌బాస్ పాత్ర బయటపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్ర కోణాన్నే విస్మరిస్తే... ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకేనా...!సాయికృష్ణ మిస్సింగ్ విషయంలో సీఐ నాగరాజుతోపాటు పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించారు. హెబియస్ కార్పస్ లాంటి కీలకమైన పిటిషన్‌కు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించే అధికారిక నివేదికపై సీపీ రాజశేఖర్‌బాబుకు ముందే సమాచారం ఉంటుంది. ఆయన ఆమోదంతోనే న్యాయస్థానానికి నివేదిక ఇస్తారు. కాగా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని సీఐ నాగరాజుతోపాటు విజయవాడ పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ సిట్ రిమాండ్ రిపోర్ట్ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనకు మే 6న అప్పగించినట్టు నాగరాజు పేర్కొన్నారని చెప్పారు. ఇక్కడ రెండు ప్రధాన సందేహాలు తలెత్తుతున్నాయి...» సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే అవాస్తవాలు చెప్పారా..? అలా చెబితే అందుకు సీపీతోపాటు విజయవాడ పోలీసులు బాధ్యులు అవుతారు. » లేదా... టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను సీఐ నాగరాజుకు అప్పగించినట్టు ప్రస్తుతం చెబుతున్న రికార్డులు ట్యాంపర్ చేసి ఉండవచ్చు. అధికారిక రికార్డులను ట్యాంపర్ చేయడం తీవ్రమైన నేరం. అందుకు సీపీ రాజశేఖర్‌బాబు, టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.ఈ రెండింటిలో ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..? అన్నది తేలాల్సి ఉంది.సీసీ టీవీ బ్యాకప్ ఫుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ధ్వంసమైనట్లు సిట్ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్ నుంచి ఫుటేజీని సిట్ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీ కావాలని సిట్ అధికారులు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమోరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరమని... ఆ మెమోరీ సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేటు సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.కాలయాపన చేసేందుకే సిట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్ అధికారులు వెంటనే వెళ్లి ఆ బ్యాకప్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?.. వారిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేటు సంస్థ ఇచ్చేంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్ ఫుటేజీ కూడా మాయం చేసే కుట్ర దాగుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పోలీసు ప్రధాన కార్యాలయంలో బ్యాకప్ ఫుటేజీ కూడా గల్లంతు అయితే అందుకు డీజీపీతోపాటు యావత్ పోలీసు ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొన లేదు. పోస్ట్‌మార్టం, మెడికల్ రికార్డులు లేనే లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నదీ చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్టు, రికార్డుల వివరాలు పేర్కొన లేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రస్తావనే లేదు. హత్య వెనుక కుట్ర కోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకప్ హత్య కేసును నీరుగార్చి సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. -
CI నాగరాజు ఫోన్ ఎక్కడ..? శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
‘సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణపై ఆయన బుధవారం తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌లోనే మర్డర్ చేస్తే ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగలేదు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శిస్తే గాని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో చెప్పలేని పరిస్థితుల్లో అధికారులున్నారు. ఈఘటనలో చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుపడాలి. సామాన్యుడి ప్రాణం పోతే పట్టించుకోరా?సాయికృష్ణ ఘటనకు ఎవరు రాజకీయ రంగు పులిమారు. చంద్రబాబూ.. మిమ్మల్ని ప్రజలు ఖబడ్దార్ అంటున్నారు. మీ పాలన ఎప్పుడు పోతుందో అని ప్రజలు రోజులు లెక్కపెడుతున్నారు.మీరు మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు. రౌడీషీటర్ అని ఆరోపిస్తున్నారు.. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా?.కోర్టులో హాజరు పరిచి శిక్ష విధించేలా చేయండి. సాయికృష్ణ కేసులో ఇవాళ జరిగిందా డొల్ల విచారణే. సీపీ నేతృత్వంలోనే టాస్క్ ఫోర్స్ నడుస్తోంది. విచారణలో సీపీ పేరు రాకపోవడం దుర్మార్గం. కృష్ణలంక పీఎస్ పరిధిలోకి వచ్చే ఏసీపీని మీరెందుకు విచారించలేదు.17మంది సాక్షులను విచారించామని చెబుతున్నారు. సిట్ అధికారులు ఈ 17మందితోనే ఎందుకు ఆగిపోయారు.సిట్ విచారణలో సాయికృష్ణను కొట్టి చంపింది ఒక్క సీఐ నాగరాజేనా?. మిగితావారు ఈ కేసులో లేరా?. సీఐ నాగరాజుకు ఎవరు సాయం చేశారు? డెడ్ బాడీని ఎవరు మాయం చేశారు. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కడే మోసుకెళ్లాడా?. సిట్ విచారణలో ఈ అంశాలన్నీ ఎందుకు తేల్చలేదు. పీఎస్‌లో ఫుటేజీ మాయం చేస్తే.. బయటి ఫుటేజీ అయినా ఉండాలి కదా?. అంటే ఎవరూ లేని సమయంలో స్టేషన్లోనే మృతదేహాన్ని పాతి పెట్టారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
బయటపడ్డ సాయికృష్ణ మరదలి సంచలన ఆడియో
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా 17 మంది
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం ..
-
నేనే చంపా..! రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు ఇవే
-
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. CI నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..!
-
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు.. మిస్సింగ్ కేసు కాదు.. రిపోర్ట్ లో సంచలన నిజాలు
-
నాగరాజుతో డీల్..? పెద్దల పేర్లు సేఫ్ ..?
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు: కోర్టులో సిట్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసు మిస్టరీ అధికారికంగా వీడింది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టడీయల్ డెత్ కేసుగా పేర్కొంటూ దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. అలాగే ఈ కేసులో అరెస్టయిన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (2nd AJM) కోర్టులో ఈ కేసు నిందితుడు సీఐ(సస్పెండెడ్) నాగరాజును హాజరుపరిచిన సిట్ అధికారులు.. దర్యాప్తులో వెలుగుచూసిన పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుకు సిట్ చెప్పిన షాకింగ్ నిజాలుసాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారుసాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశాంమొత్తం 17 మంది సాక్షులను విచారించాంమే 6న సాయికృష్ణను మార్కాపురంలో అరెస్ట్ చేశారుఅదే తేదీన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజుకు అప్పగించారునాగరాజు 24 గంటల్లోపు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదునాన్బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదుసాయికృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా పీఎస్‌లో చూసినట్లు ఓ ఎస్సై వాంగ్మూలం ఇచ్చాడుమృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్సై స్టేట్మెంట్ ఇచ్చాడుసాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక.. డెడ్‌బాడీని మాయం చేశారుకృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీఫుటేజీ లేదుమే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజీలు లేవువాటిని ఎవరు? ఎందుకు మాయం ఎందుకు చేశారనేది తేలాల్సి ఉందిఅయితే మే 6-8 తేదీల మధ్య.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు చెప్పాడుఇతర సాక్ష్యాలను పరిశీలించాకే.. కస్టోడియల్ డెత్‌గా నిర్ధారించుకున్నాంఈ కేసులో నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశాంఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదుఅక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం.. డెడ్‌బాడీ మాయం చేశారుహైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారుఆధారాలు మాయం కావడం సహా అన్నింటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాంసిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది ప్రకారం.. మార్కాపురంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాదె సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉన్నప్పటికీ, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు. ఇది కోర్టు ధిక్కరణ (Contempt of Court) కిందకు వస్తుందని పేర్కొన్నారు.అలాగే దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు వెల్లడించారు. మృతి విషయాన్ని మెజిస్ట్రేట్‌కు తెలియపర్చకుండా.. మృతదేహాం మాయం చేశారని తెలిపారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారన్న ఆరోపణలకు ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. నాగరాజు నుంచి కీలక ప్రశ్నలకు సమాధానం దొరకలేదని సిట్ కోర్టుకు తెలిపింది. సాయికృష్ణను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు?లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ డెడ్‌బాడీని ఏం చేశారు?పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందన సిట్ కోర్టుకు తెలిపింది. అందుకే మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది.నాగరాజుకు రిమాండ్రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిందితుడు నాగరాజుకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది కోర్టు. జులై 8న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టమని సిట్‌ను ఆదేశించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ, సిట్ దర్యాప్తు, తాజాగా కోర్టులో వెల్లడైన అంశాలు కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లాయి. సీఐ(సస్పెండెడ్) నాగరాజు రిమాండ్ రిపోర్టులో నమోదైన అంశాలు, సిట్ కోర్టుకు సమర్పించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
-
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
పేరు చెప్పొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..! సీఐ నాగరాజు కు బిగ్ ఆఫర్..
-
సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదులో ఏముంది?ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.దండ రెడీ చేసుకో..విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్‌లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే హైకోర్టుకు.. సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే...
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
CI నాగరాజు మామూలోడు కాదు.. ఆ రోజు స్టేషన్ లో జరిగింది ఇదే
-
ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. ఎవరి పేర్లూ చెప్పొద్దు
సాక్షి, అమరావతి : ‘వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. మిత్రపక్షం అందుకు సిద్ధంగా ఉంది. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం వెనుక సూత్రధారుల పేర్లు బయటపెటొద్దు.’ – ఇదీ సీఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆఫర్.సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ, ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్‌బాస్‌తోపాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయటపెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగరాజుకు సన్నిహితుడైన రిటైర్డ్ డీజీపీ ఈ మేరకు రాయబారం నడిపినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అజ్ఞాతం వీడి, అరెస్టుకు సహకరించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఐ నాగరాజు అరెస్టుకు ముందు తెరవెనుక సాగిన వ్యవహారాలు ఇలా ఉన్నాయి.నేను ఒప్పుకోను.. అందరిపేర్లు బయటపెడతా – ఎదురుతిరిగిన సీఐ నాగరాజుకాపు యువకుడు సాయికృష్ణను లాకప్‌లోనే కనుమరుగు చేసిన వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. టీడీపీ కీలక నేతల భూ దందాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించిన ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంతోనే సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్తోపాటు బిగ్‌బాస్ డైరెక్షన్లో కథ నడిపించారు. టాస్క్‌ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా, చినబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్‌బాస్ ఆమోదంతో గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి.. ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్బాస్లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల భూ, ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడ.అందుకే ఈ కేసులో ఏ1, ఏ2గా ఉండాల్సిన బాస్, టాస్క్‌ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సీఐ నాగరాజు వరకే ఎఫ్ఐఆర్ను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడ పట్ల సీఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తనను ఒక్కడిని ఇరికించి.. పెద్దలు అందరూ తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆయన ప్రభుత్వ, పోలీసు పెద్దలకు ఝలక్ ఇచ్చారు. ‘అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టాస్క్‌ఫోర్స్ సీపీ ఆధీనంలో పని చేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు’ అని సీఐ వాదించినట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి గానీ, తనకు అప్పగించినట్టు ఉన్నాయా.. అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ, పోలీసు పెద్దలు షాక్‌కు గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు. రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారంసీఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు. ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్‌ను కూడా వెల్లడించారు. దాంతో రిటైర్డ్ డీజీపీ.. సీఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు. ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్టు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సీఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లూ బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్టు అయితే త్వరగా బెయిల్‌పై విడుదల అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఈ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిందంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించినట్టు పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ను అరెస్టు చేయాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా ప్రభుత్వం తెరవెనుక నుంచి డ్రామాకు తెరతీసింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి ఆందోళనలు చేయిస్తుండటం గమనార్హం. -
సీఐ నాగరాజును మరోసారి విచారిస్తున్న సిట్
విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు విచారించింది సిట్.. అనంతరం, రెండు గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆరా తీసింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తోంది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సీఐ నాగరాజును ఇవాళ తొలిసారి విచారించిన అనంతరం కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాశ్ వెళ్లిపోయారు. నివేదికను సిద్ధం చేసినట్లు సిట్ బృందం చెబుతోంది. నేటి రాత్రి లేదంటే రేపు ఉదయం సీఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
సిట్ ప్రశ్నలకు CI నాగరాజు షాకింగ్ సమాధానాలు
-
తప్పు ఒప్పుకున్న CI నాగరాజు..? ఎవరెవరి పేర్లు బయటకొస్తాయి?
-
రూట్ మార్చిన పోలీసులు... ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపై ఉత్కంఠ
-
ఒకరు కాదు ఇద్దరు కాదు.. 28 మంది వరకు ఈ కేసులో నిందితులు ఉన్నారు
-
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, సీసీ పుటేజ్ మాయం ఎందుకు చేసారంటే ..!


