సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు | Sai Krishna Maternal Aunt Kanaka Durga Sensational Comments, Alleges Probe Went Off Track After Chandrababu Meeting | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు

Jul 30 2026 3:58 PM | Updated on Jul 30 2026 4:09 PM

Sai Krishna Maternal Aunt Sensational Comments

విజయవాడ:  సాయికృష్ణ పిన్ని, అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాతే కేసు పూర్తిగా తప్పుదోవ పట్టిందని వ్యాఖ్యానించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పూటకో మాట మాట్లాడుతోందని, రిత్వికనే లాయర్‌గా పెట్టుకోవాలని అక్కను బెదిరించారని స్పష్టం చేశారు. కేసు డిస్మిస్‌ చేస్తే మాత్రం చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే మానవహక్కుల కమిటీతో కలిసి పోరాడుతామని కనకదుర్గ పేర్కొన్నారు.

22వ తేదీన సాయికృష్ణ కేసును ఆన్‌లైన్‌లో చూశాను. హేబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా అని వచ్చింది.  హేబియస్ కార్పస్ పిటిషన్‌ను విత్‌ డ్రా చేసుకోలేదు.. సీబీఐ విచారణ వద్దని మాత్రమే చెప్పాను అని  మా అక్క చెప్పింది. 

గంటకో మాట మా అక్క మాట్లాడుతుంది. మర్డర్ కేసును క్వాష్‌ చేయాలని పిటిషన్ వేయడం ఎప్పుడైన చూసామా?, కేసును. పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు.. నేను చూస్తూ ఊరుకోను. మానవ హక్కుల కమిటీ, నేను, బార్ అసోసియేషన్ కలిసి పోరాటం  చేస్తాం’ అని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement