ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని అడ్డుకున్న పోలీసులు | MLC Varudu Kalyani Blocked by Police in Srikakulam | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని అడ్డుకున్న పోలీసులు

Jul 30 2026 3:45 PM | Updated on Jul 30 2026 4:15 PM

MLC Varudu Kalyani Blocked by Police in Srikakulam

శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన వేళ పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. అంపోలు జంక్షన్‌ దగ్గర పోలీసులు అతి చేశారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ‍్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా వైఎస్‌ జగన్‌ పర్యటన కొనసాగుతోంది. 

కాగా, వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి శ్రీకాకుళం చేరుకున్నారు. సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజుపై చంద్రబాబు నాయుడు అక్రమ కేసు పెట్టించి అరెస్ట్‌ చేయించిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారు. వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ కూటమి కుట్రలు పన్నుతోంది. 

వైఎస్‌ జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టి, జనం వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ప్రజలు రాకుండా పోలీసులను రంగంలోకి దించింది. జగన్ కాన్వాయ్‌కు కఠిన నిబంధనలు విధించింది. కేవలం 8 వాహనాలకే అనుమతి అంటూ పోలీసులు ప్రకటించారు. ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉందంటూ, ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పారు. వైఎస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది. పోలీసు ఆంక్షలు తమను ఆపలేవంటూ వైఎస్‌ జగన్‌ కోసం జనం వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement