సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ | Hearing in AP High Court on Saikrishna Case | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

Jul 8 2026 5:37 PM | Updated on Jul 8 2026 7:11 PM

Hearing in AP High Court on Saikrishna Case

విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.  సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు,  ఈ పిల్‌ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. లాకప్‌డెత్‌ కేసులో సీపీతో పాటు డీజీపీ పాత్ర ఉందని, డీజీపీ కింద స్థాయి అధికారులతో సిట్‌ ఏర్పాటు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయని తన వాదనల్లో వినిపించారు పొన్నవోలు. 

గత నెల 15వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు సాయి కృష్ణ మా దగ్గర లేడు ఆయన కోసం ప్రత్యేక టీములు పెట్టి వెతుకుతున్నామని చెప్పారని, సిట్ వేసిన రిమాండ్ రిపోర్టులు మాత్రం గత నెల ఆరో తేదీన సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నట్లు చూపించారన్నారు. పోలీసులు అబద్ధాలు చెప్పి కోర్టునే తప్పుదోవ పట్టించారని విచారణ సందర్భంగా పొన్నవోలు స్సష్టం చేశారు. అయితే సిట్‌కు చిన్న అవకాశం ఇద్దామన్న హైకోర్టు.. సీల్డ్‌ కవర్‌లో విచారణ నివేదిక  ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. 

SITకు హైకోర్టు చిన్న అవకాశం సీల్డ్ కవర్ లో ఆధారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement