సీఐ నాగరాజును మరోసారి విచారిస్తున్న సిట్‌ | SIT Completes Investigation in Sai Krishna Case | Sakshi
Sakshi News home page

సీఐ నాగరాజును మరోసారి విచారిస్తున్న సిట్‌

Jun 23 2026 10:40 PM | Updated on Jun 23 2026 10:42 PM

SIT Completes Investigation in Sai Krishna Case

విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు విచారించింది సిట్‌.. అనంతరం, రెండు గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. 

కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆరా తీసింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తోంది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సీఐ నాగరాజును ఇవాళ తొలిసారి విచారించిన అనంతరం కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాశ్‌ వెళ్లిపోయారు. నివేదికను సిద్ధం చేసినట్లు సిట్ బృందం చెబుతోంది. నేటి రాత్రి లేదంటే రేపు ఉదయం సీఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement