సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం | Saikrishna lock up death Constables taken into custody by SIT | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం

Aug 5 2026 4:21 PM | Updated on Aug 5 2026 5:15 PM

Saikrishna lock up death Constables taken into custody by SIT

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. ఏడురోజుల పాటు సీఐ నాగరాజును సిట్‌ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు ఐదు రోజులపాటు విచారించేందుకు  కోర్టు అనుమతించింది.

ఈ నేపథ్యంలో  కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను  సిట్ అధికారులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లు ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ‌

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement