పనులు చేయించుకుని డబ్బు ఎగ్గొట్టిన మంత్రి కొల్లు అనుచరుడు | Banjara Community Protest in NTR District Over Unpaid Wages Worth Rs 1.54 Crore | Sakshi
Sakshi News home page

పనులు చేయించుకుని డబ్బు ఎగ్గొట్టిన మంత్రి కొల్లు అనుచరుడు

Aug 8 2026 12:07 PM | Updated on Aug 8 2026 12:09 PM

Banjara Community Protest In NTR District

విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా పెట్రోలు బంకుల నిర్మాణ పనులు చేయించుకుని తమకు ఇవ్వాల్సిన కూలి సొమ్ము రూ.­1.54 కోట్లు ఎగ్గొట్టారని ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూ­రు మండలం కట్టుబడిపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహి­ళలు ఆరోపించారు. విజయవా­డ కనకదుర్గమ్మకు సారె సమర్పించి గోడు చెప్పుకొంటామంటూ శుక్రవారం సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీగా బయలుదేరారు. పోలీసు­లు వారిని ఇబ్రహీంపట్నంలో కొద్దిసేపు అడ్డు­కో­వడంతో ఉద్రి­క్తత నెలకొంది. బాధితులు తెలిపిన మేరకు.. పామర్తి రాజా పెట్రో­లు బంకుల నిర్మాణ కాంట్రాక్టరు.

 అతడి వద్ద కట్టుబడిపాలేనికి చెందిన బాణా­వతు రాజునాయక్‌ సబ్‌ కాంట్రాక్టర్‌గా పలు ప్రాంతాల్లో హెచ్‌పీసీఎల్‌ పెట్రో­లు బంకులను నిరి్మంచారు. రాజునాయక్‌ తమ గ్రామానికి చెందిన 250 మందితో ఈ పను­లు చేయించారు. దీనికి సంబంధించిన కూలి సొ­మ్ము, ఇతరత్రా రూ.1.54 కోట్లను పామర్తి రాజా ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బు ఇవ్వమని 20 నెలల నుంచి రాజునాయక్, కూలీలుగా పనిచేసిన గిరిజనులు మంత్రి రవీంద్ర, పామర్తి రాజా కార్యాలయాల చుట్టూ తిరుగు­తున్నారు. 

ఈ ఏడాది మే 8న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అప్పుడు మంత్రి రవీంద్ర బాధితులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి­నా తరువాత పట్టించుకోవడంలేదు. రూ.12 లక్షలు మాత్రమే ఇస్తామంటూ పామర్తి రాజా రాయ­బారాలు నడుపుతున్నారు. దీంతో బాధితు­లు శుక్రవా­రం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా రాజు­నాయక్‌ మాట్లాడుతూ రావాల్సిన డబ్బు అడుగుతుంటే పామర్తి రాజా తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
  
పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది: సుగాలి మహిళలు    
రెండేళ్ల తమ కష్టార్జితం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి మంచి మనస్సు ప్రసాదించాలని సుగాలి మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. 24 గంటల్లో తమకు డబ్బులు చెల్లించకుంటే టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. అదే సమ­యంలో ఓ సుగాలి మహిళ తీవ్ర ఆందోళన­కు లోనై స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement