విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి.
అయితే, నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణ విచారణ కోసం వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష‍్మి. దీంతో పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టుకు ఆదేశించింది.
మొదట సీబీఐ విచారణ ఎందుకు కోరారు? మళ్లీ వద్దని ఎందుకు కోరుతున్నారో చెప్పాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.


