సాయికృష్ణ కేసు: సీఐ నాగరాజు అరెస్ట్‌! | Sai Krishna Case Updates: Tension at CI Nagarajus Residence as SIT Move | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసు: సీఐ నాగరాజు అరెస్ట్‌!

Jun 23 2026 12:59 PM | Updated on Jun 23 2026 3:30 PM

Sai Krishna Case Updates: Tension at CI Nagarajus Residence as SIT Move

సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్‌) నాగరాజు అరెస్ట్‌ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌.. మంగళవారం నాగరాజు నివాసానికి వెళ్లింది. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.

అయితే తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొ‍ట్టగా.. సిట్‌ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం.. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం నాగరాజును పోలీస్‌ గెస్ట్‌హౌజ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అక్కడ వైద్యపరీక్షల అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉంది. నాగరాజు అరెస్ట్‌పై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్‌ డెత్‌ చేసి ఉంటారనే అనుమానాల నడుమ.. ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీని నాగరాజు మాయం చేసినట్లు.. లాకప్‌డెత్‌ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement