ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్‌ | Two Gurukulam Schoolgirls Go Missing In Krishna District, Traced Safely After High Alert Search Operation | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్‌

Aug 8 2026 9:15 AM | Updated on Aug 8 2026 10:12 AM

Residential School Two Student Missing

కృష్ణాజిల్లా: మండలంలోని బల్లిపర్రు డాక్టర్‌ బీఆర్‌  అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడంతో గురువారం రాత్రి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వెనుక ప్రహరీ దూకి పరారయ్యారు. ఆ ఇరువురు మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకుని ఇరువురిలో ఒక బాలిక దారిన పోయే ఒక వ్యక్తిని ఫోన్‌ అడిగి, తల్లికి ఫోన్‌ చేసింది. ఫోన్‌ ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు వేయాలని కోరింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి సదరు ఫోన్‌గల వ్యక్తికి మరోసారి ఫోన్‌ చేసి.. పిల్లలు ఎక్కడ ఉన్నారనే ఆరా తీసి.. వారిని ఆటో ఎక్కించి పంపించాలని సూచించింది.  

కలెక్టర్‌కు ఫిర్యాదు.. 
ఆ తరువాత ఆ తల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రూతమ్మకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో స్పందించిన ప్రిన్సిపాల్‌ జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పెడన పోలీసులు, స్పెషల్‌ బ్రాంచ్‌ వారు           అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి వారంతా గాలింపు చేపట్టారు. బాలికలు బల్లిపర్రు నుంచి మెయిన్‌ రోడ్డు వెంబడి నడుస్తూ పెడనకు చేరుకున్నారు. పెడనలో ఆటో ఎక్కి మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మరొక ఆటో ఎక్కి రుద్రవరం వైపుగా వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. శుక్రవారం వేకువజామున బల్లిపర్రులోని గురుకుల పాఠశాలకు ఆ విద్యార్థినులను క్షేమంగా చేర్చడంతో  అంతా ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన సంఘటనపై పెడన పోలీస్‌స్టేషన్‌లో ప్రిన్సిపాల్‌ గురువారం   అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement