సాక్షి, వరంగల్: ఎల్నినో దెబ్బకు లోటు వర్షపాతంతో ఏకంగా పంటల సాగు తగ్గింది. జూన్లో జిల్లా సగటు నీటిమట్టం భూ ఉపరితలం నుంచి 6.53 మీ టర్ల లోతు నుంచి సెప్టెంబర్లో 5.41 మీటర్లకు వ చ్చింది. అక్టోబర్లో 19 సెంటిమీటర్లు పడిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత దిగువకు పోయే ప్రమాదముంది. ఇప్పటికీ జిల్లాలో 38 శాతం లోటు వర్షపాతం ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వం జిల్లాలో 8 కరువు మండలాలుగా ప్రకటించడం కూడా రానున్న రోజుల్లో కరువు తీవ్రత ఎలా ఉంటుందో నన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో ని 816 చెరువుల్లో 450 చెరువుల్లో 0 నుంచి 25 శాతం వరకు నీరు, 216 చెరువుల్లో 25 నుంచి 50 శాతం నీరు, 105 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీరు, 45 చెరువుల్లో 75 నుంచి 100 శాతం మేర నీ టి నిల్వలు ఉండడం.. ఒక్క చెరువు కూడా అలుగుపోయకపోవడం నీటి ఎద్దడి తీవ్రతను చెబుతోంది. వర్షపాతం లోటు, చెరువుల్లో తక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింతగా ప్రభావం చూపే అవకాశముంది.
భిన్నమైన పరిస్థితులు ఇలా..
● జిల్లాలోని వివిధ పర్యవేక్షణ కేంద్రాల వద్ద భూగర్భ జలమట్టం ఒకేవిధంగా లేదు. అక్టోబర్ నివేదికలో సంగెం మండలం తీగరాజుపల్లిలో నీటిమట్టం 13.55 మీటర్ల లోతులో నమోదైంది. పర్వతగిరి పీహెచ్సీ వద్ద 11.18 మీటర్లు, అన్నారం షరీఫ్ వద్ద 9.82 మీటర్లు, దుగ్గొండి మండలం రేకంపల్లిలో 8.97 మీటర్ల లోతులో ఉంది. ఈ కేంద్రాల వద్ద నీటిమట్టం ఎక్కువ లోతులో ఉండడం గమనార్హం. అలాగే నర్సంపేటలో 5.35 మీటర్ల లోతుగా నమోదైంది.
● మరోవైపు వరంగల్ చార్బౌలి వద్ద 1.41 మీటర్లు, నెక్కొండ మండలం అమ్మన్పేటలో 1.33 మీటర్లు, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో 3.18 మీటర్లు, ఖిలా వరంగల్ మండలం మామునూరులో 3.34 మీటర్ల లోతులో ఉంది. మండలంలోని అన్ని గ్రామాల్లోని బోర్లలో ఈ పరిస్థితి ఉండకపోవచ్చని భూగర్భజల విభాగా ధికారులు చెబుతున్నారు.
6.65
6.53
6.28
5.41
అక్టోబర్
ఆగస్టు
జూలై
సెప్టెంబర్
జూన్
సెప్టెంబర్లో 5.41 మీటర్ల నుంచి అక్టోబర్లో 5.60 మీటర్లకు..
గత నెలతో పోలిస్తే 19 సెంటీమీటర్లు పడిపోయిన నీటిమట్టం


