అబ్బురపర్చిన ఆవిష్కరణలు
నిట్‌లో ఘనంగా టెక్నోజియాన్–26 షురూ
కాజీపేట అర్బన్: నిట్ సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–26 శుక్రవారం అట్టహాసంగా ప్రా రంభమైంది. సాంకేతిక ఆవిష్కరణలతో ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నూతన సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శనలను తిలకించారు. నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నోజియాన్–26ను ‘ఇన్నోవేషన్స్ బియాండ్ బౌండరీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో టెక్‌ఫెస్ట్‌ను ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబు దీ, డీన్లు కిరణ్‌కుమార్, వెంకన్న పాల్గొన్నారు.
విలువలు నేర్చుకోవాలి..
నిట్ వరంగల్ విద్యార్థులు సాంకేతిక విజ్ఞానంతో పాటు మానవీయ విలువలను నేర్చుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా నిట్‌కు పేరు తీసుకురావాలని ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా తెలిపారు. విజయాలను సాధించేందుకు సానుకూల దృక్పథం అలవర్చుకోవాలని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ టీంగా పని చేయాలని సూచించారు. సాంకేతిక విద్యను పూర్తి చేసి సాధారణంగా ఉద్యోగాల్లో రాణించడం కంటే వ్యాపారవేత్తలుగా, స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలన్నారు.
ప్రపంచంతో పోటీ పడే సత్తా నిట్ సొంతం
ప్రపంచంతో పోటీ పడే సత్తా నిట్ విద్యార్థులకే సొంతమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నా రు. విద్యార్థులు తమ ఆవిష్కరణల్ని తరగతి గదుల కే పరిమితం చేయకుండా పరిశ్రమలకు పరిచయం చేయాలన్నారు. పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యంతో రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన బజాజ్ సంస్థ రాబోయే తరాలకు ప్రయోగశాలగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు హాల్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఐడియాను నిట్‌లో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు.
మాట్లాడుతున్న
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ
మాట్లాడుతున్న
ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్
కమల్ కిషోర్ వోరా
చూపుతిప్పనివ్వని సాంకేతిక ఆవిష్కరణలు
ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు
ముఖ్య అతిథిగా ఓలెక్ట్రా వైస్
ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా హాజరు
టెక్నోజియాన్‌లో ఆకట్టుకున్న
సాంకేతిక ఆవిష్కరణలు
విద్యార్థుల ప్రతిభకు
దర్పణం పట్టేలా రూపకల్పన


