యువతుల అండాలతో దందా | Illegal activities run with the involvement of young women in Prakash Nagar hyderabad | Sakshi
Sakshi News home page

యువతుల అండాలతో దందా

Oct 31 2026 1:27 AM | Updated on Oct 31 2026 1:27 AM

Illegal activities run with the involvement of young women in Prakash Nagar hyderabad

ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి డోనర్లు

బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో వెలుగులోకి

గర్ల్స్‌ హాస్టల్‌ ముసుగులో సాగుతున్న వ్యవహారం

మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ టీమ్‌ అదుపులో పలువురు

సనత్‌నగర్‌(హైదరాబాద్‌): రాజధానిలో మరోసారి యువతుల అండాల (ఎగ్‌) దందా వెలుగులోకి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి యువతుల్ని ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, గర్ల్స్‌ హాస్టల్‌ ముసుగులో సాగుతున్న ఈ వ్యవ హారాన్ని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలక సూత్ర ధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని ప్రకాశ్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌పై స్థానిక పోలీసుల సాయంతో ఎస్‌ఓ టీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాడు లు చేశారు. 

అపార్ట్‌మెంట్‌లోని కింది అంతస్తులో తనిఖీలు చేపట్టి పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఏడాది కాలంగా ఓ బాలికల హాస్టల్‌ నడుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన యువతులు ఎనిమిది నుంచి పది మంది అక్కడ నివాసం ఉంటున్నారు. ఉద్యోగాల పేరుతో ఆయా ప్రాంతాలకు చెందిన పేద యువతులను ఆకర్షించిన సూత్రధారులు ఇక్కడకు తీసుకొచ్చారు. ఆపై వారి నుంచి అండాలను సేకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారని సమాచారం. ప్రైవేట్‌ ఉద్యోగంలో వచ్చే జీతంతోపాటు అండాలను డొనేట్‌ చేయడం ద్వారా నెలకు రూ. 30 వేలు సంపాదించుకోవచ్చని ఆశ చూపి దందా చేస్తున్నట్టు తెలిసింది. 

వీరి నుంచి సేకరించిన అండాలను వివిధ ప్రాంతాల్లోని సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పురుషుల నుంచి వీర్య కణాల సేకరణ, సరఫరా వ్యవహారంపైనా ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. అండాల సేకరణకు సంబంధించి విధి విధానాలు, ఆర్థిక లావాదేవీలు, సంతాన సాఫల్య కేంద్రాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది.. యువతులు స్వచ్ఛందంగా అండాలు ఇచ్చారా? వారిపై ఒత్తిడి లేదా ప్రలోభాలు ఉన్నాయా.., నిబంధనలకు విరుద్ధంగా అండాలు, వీర్య కణాల సేకరణ జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement