సాక్షి,వికారాబాద్: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ధరూర్ మండలం చింతకుంట గ్రామంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి వారి ప్రాణాలు తీసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసవి రెడ్డి (45) అనే మహిళ తన పిల్లలు సహస్ర (9), వేదాన్ష్ (5)లకు ఉరివేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అయితే ఈ దారుణ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఎల్‌కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి


