బిడ్డ కూడా నాతోపాటే, మళ్లీ పెళ్లి చేస్కో : భార్య సూసైడ్‌ నోట్‌ | Woman Jumps With 6 Year Old Son From 18th Floor Of Building In Pune | Sakshi
Sakshi News home page

బిడ్డ కూడా నాతోపాటే, మళ్లీ పెళ్లి చేస్కో : భార్య సూసైడ్‌ నోట్‌

Oct 31 2026 7:18 PM | Updated on Oct 31 2026 7:26 PM

Woman Jumps  With 6 Year Old Son From 18th Floor Of Building In Pune

పుణేలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. 33 ఏళ్ల మహిళ , తన ఆరేళ్ల కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. థేర్‌గావ్ వాకడ్ ప్రాంతంలోని 'సిగ్నేచర్ పార్క్' అనే హై-ప్రొఫైల్ హౌసింగ్  బిల్డింగ్ 18వ అంతస్తు నుంచి ఏక్తా భాంగ్డే (33)  కుమారుడు మాధవ్ భాంగ్డేతో  కలిసి దూకేసింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

రాజస్థాన్‌కు చెందిన ఈ కుటుంబం గత రెండేళ్లుగా ఈ సొసైటీలోని 7వ అంతస్తులో నివాసముంటోంది. ఏక్తా భర్త మనోజ్ భాంగ్డే (35) యరవాడలోని  ఐటీ  కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.  శుక్రవారం ఉదయం 10 గంటలకు మనోజ్ భాంగ్డే ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లిపోయాడు.  సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బిల్డింగ్ డక్ట్ ఏరియా నుంచి పెద్ద శబ్దం రావడంతో సొసైటీ నివాసితులు క్రిందికి వచ్చి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న ఏక్తా, ఆమె కుమారుడు మాధవ్‌లను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ఇదీ చదవండి: 5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం

వాకడ్ పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఏక్తా తన కుమారుడిని లిఫ్ట్ ద్వారా 18వ అంతస్తుకు తీసుకెళ్లినట్లు తేలింది. 18వ అంతస్తులోని గ్యాలరీ రేలింగ్ వద్ద వారి చెప్పులు లభించాయి.  ప్రాథమికంగా ఇది  ఆత్మహత్యగా భాస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, వాకడ్ పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఏక్తా మరణానికి ముందు రాసినట్లు భావిస్తున్న ఏడు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: 56 ఏళ్ల వయసులో ప్రియురాల్ని పెళ్లాడిన సీఎం

ఏక్తా కొంతకాలంగా వెన్నెముక సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. తన మరణం తర్వాత భర్త ఒంటరిగా మిగిలిపోకూడదని మరో పెళ్లి చేసుకోవాలని భర్తను కోరినట్లు సమాచారం. జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలని ఆమె లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే తన మరణం తరువాత  కుమారుడు  మాధవ్‌ ఒంటరి వాడవుతాడనే ఆందోళనతోపాటు,బిడ్డ ఉండే , మరో మరో పెళ్లి చేసుకోవడం కష్టమవుతుందని, అందుకే తన బిడ్డను తనతోపాటు తీసుకెళుతున్నట్టు  లేఖలో  పేర్కొంది.  ఈ ఘటనతో అపార్ట్‌మెంట్‌ వాసులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.

 ఇదీ చదవండి : ఆడబిడ్డ అని, బలవంతపు అబార్షన్‌, గర్భిణి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement