56 ఏళ్ల వయసులో ప్రియురాల్ని పెళ్లాడిన సీఎం | JK CM Omar Abdullah marries Nidhi Razdan | Sakshi
Sakshi News home page

56 ఏళ్ల వయసులో ప్రియురాల్ని పెళ్లాడిన సీఎం

Oct 31 2026 5:28 PM | Updated on Oct 31 2026 5:55 PM

JK CM Omar Abdullah marries Nidhi Razdan

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రియురాలు 49 ఏళ్ల  నిధి రజ్దాన్‌ను పెళ్లాడారు.  56 ఏళ్ల ఒమర్ రెండో  వివాహం శుక్రవారం శ్రీనగర్‌ల ఒక ప్రైవేట్ వేడుకలో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఒమర్ అబ్దుల్లా  న్యూ జర్నీ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ పోస్ట్‌ను జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను ట్యాగ్ చేయగా, ఇట్స్‌ డన్‌ బ్రో అంటూ  నిధి రజ్దాన్‌  ట్వీట్‌  చేశారు. ఇద్దరికీ ఇంది రెండో వివాహం​

ఓమర్‌, నిధి ఇద్దరూ గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు.  అయితే మొదటి భార్య  పాయల్ నాథ్‌ల వివాహం విడాకులతో ముగిసే వరకు పెళ్లికి వేచి ఉన్నారు. సుదీర్ఘ కాలం తరువాత ఆ ఏడాది జూలైలో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దీంతో  మూడు నెలల తరువాత  వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

కాగా ఒమర్, పాయల్ నాథ్‌లు 1994లో వివాహం చేసుకున్నారు. వారికి జహీర్, జమీర్ అబ్దుల్లా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక నిధి విషయానికి వస్తే  గతంలో ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత, జర్నలిస్ట్‌ను వివాహం చేసుకున్నారు.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement