ఇది చరిత్రాత్మకం  | CJI Surya Kant Inaugurates Ladakh High Court Bench | Sakshi
Sakshi News home page

ఇది చరిత్రాత్మకం 

Oct 19 2026 6:25 AM | Updated on Oct 19 2026 6:25 AM

CJI Surya Kant Inaugurates Ladakh High Court Bench

లేహ్‌లో జమ్మూకశ్మీర్‌ లద్దాఖ్‌ బెంచ్‌ ప్రారంభోత్సవంలో సీజేఐ వ్యాఖ్య

లేహ్‌: జమ్మూకశ్మీర్‌ హైకోర్టు బెంచ్‌ను లద్దాఖ్‌లో ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం లేహ్‌లోని మెలాంగ్‌ధోంగ్‌లో జమ్మూకశ్మీర్‌ ఉన్నతన్యాయస్థానం లద్దాఖ్‌ బెంచ్‌ను ఆయన ప్రారంభించారు. ‘‘ఇకపై లేహ్, కార్గిల్‌ వాసులు సత్వర న్యాయం కోసం వ్యవప్రయాసల కోర్చి సుదూరాలకు వెళ్లాల్సిన పనిలేదు. లేహ్‌లోనే రాష్ట్ర బెంచ్‌ను ఆశ్రయించవచ్చు’’ అని సీజేఐ అన్నారు.

 ‘‘న్యాయవాదులు సైతం ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్‌ను లేహ్‌లోని కోర్టు నుంచి చేయవ్చు. సుప్రీంకోర్టులో కేసులను ఇక్కడి నుంచే వర్చువల్‌గా వాదించవచ్చు’’ అని చెప్పారు. 1870లోనే లేహ్‌లో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘ఆ వ్యవస్థ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత భౌగోళిక సవాళ్ల కారణంగా దాదాపు వందేళ్లుగా ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

 2019లో లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత హైకోర్టు పేరులో లద్దాఖ్‌ను చేర్చడం ముఖ్యమైన అడుగే అయినప్పటికీ, నామమాత్రపు ప్రయోజనానికే పరిమితమైంది. కోర్టు లెటర్‌ హెడ్‌ మీద పేరు ఉండటం వేరు, అందరికీ అందుబాటులోకి కోర్టు రావటం వేరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో న్యాయసాయం ఇప్పుడిక చేరువలోకి వచ్చింది’’ అని సీజేఐ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement