ఎల్‌కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి | A Class 3 student thrashed a kindergarten girl at Haryana School | Sakshi
Sakshi News home page

ఎల్‌కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి

Oct 31 2026 3:18 PM | Updated on Oct 31 2026 4:02 PM

A Class 3 student thrashed a kindergarten girl at Haryana School

సాక్షి,న్యూఢిల్లీ: హర్యానాలోని పంచకుల ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాల తరగతి గదిలో ఎనిమిదేళ్ల బాలుడు(మూడవ తరగతి విద్యార్థి) ఆరేళ్ల బాలిక(కిండర్‌గార్టెన్)పై రాళ్లు, పూలకుండీతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది.

అక్టోబర్ 28న సంస్కృతి మోడల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. పాఠశాలలోని సీసీటీవీ దృశ్యాల్లో పరిశీలించగా.. దాడి చేసిన బాలుడు ఆ  బాలికను తరగతి గదిలోకి ఈడ్చుక్కెళ్లి, డెస్క్‌కు తల బాదడంతో పాటు కిందపడేసి విచక్షణారహితంగా బాలికను తన్నినట్లు కనిపించింది. అనంతరం రాళ్లు, పూలకుండీతో పలుమార్లు దాడి చేశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

అయితే అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెను పాఠశాల నుండి తీసుకువెళ్లడానికి వచ్చినప్పుడు, నిందితుడైన బాలుడు వారిని ఆమె ఉన్న చోటికి తీసుకెళ్లి, "మీ అమ్మాయి ఇక్కడ పడి ఉంది" అని చెప్పినట్లు సమాచారం.

అనంతరం బాలికను మొదట స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో చండీగఢ్‌లోని పీజీఐ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

బాలుడు చేసిన పనులను టీచర్లకు ఫిర్యాదు చేస్తానని బాలిక చెప్పడంతోనే బాలుడు ఈ దాడికి పాల్పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలోనూ బాలుడు దూకుడుగా ప్రవర్తించేవాడని, కుక్కలను కొట్టిన ఘటనల్లోనూ అతడిపై ఫిర్యాదులు ఉన్నాయని బాలిక మేనమామ తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం ఆయన చేశారు.

ఇదీ చదవండి: క్రిప్టో ప్రపంచంలో భారీ దోపిడీ.. ఉత్తర కొరియా హ్యాకర్లపై అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement