వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి రెండో భర్తను దారుణంగా.. | Hariyana Faridabad Wife Boyfriend Husband Murder Incident | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి రెండో భర్తను దారుణంగా..

Oct 19 2026 1:37 PM | Updated on Oct 19 2026 1:44 PM

Hariyana Faridabad Wife Boyfriend Husband Murder Incident

మొదటి భర్తతో విడాకులు, రెండవ భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. చివరకు ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చిందో మహిళ. అనంతరం దుండగులు ఇంట్లోకి చొరబడి భర్తను హత్య చేశారంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాకు చెందిన గోపాల్‌ ఫరీదాబాద్‌లోని ఓ కంపెనీలో 20 ఏళ్లుగా మెషిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 16 ఏళ్ల క్రితం అదే కంపెనీలో పనిచేసే కాజల్‌తో పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే పెళ్లయి, ఐదేళ్ల కుమార్తె ఉన్న కాజల్‌ మొదటి భర్తను విడిచిపెట్టి గోపాల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, కొంతకాలంగా బౌన్సర్‌గా పనిచేస్తున్న యోగేంద్రతో కాజల్‌కు సంబంధం ఏర్పడటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో కాజల్‌.. ప్రియుడు యోగేంద్రతో కలిసి గోపాల్‌ను హతమార్చేందుకు ప్లాన్‌ వేసుకుంది. అక్టోబర్‌ 13న పిల్లలతో ఫరీదాబాద్‌కు వచ్చిన కాజల్‌.. మరుసటి రోజు యోగేంద్రను కూడా పిలిపించింది. రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త గోపాల్‌.. భార్యతో కలిసి నిద్రపోయాడు. ఈ సమయంలో కాజల్‌ కూరగాయలు కోసే కత్తితో గాఢ నిద్రలో ఉన్నటువంటి అతడి గొంతుపై పలుమార్లు దాడి చేయడంతో.. తీవ్ర రక్తస్రావంతో గోపాల్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

హత్య అనంతరం దుండగులు ఇంట్లోకి వచ్చి భర్తపై దాడి చేశారని కాజల్‌ అందరినీ నమ్మించసాగింది. అయితే, ఆమె ప్రవర్తిస్తున్న తీరుపై పోలీసులకు అనుమానం రాగా, విచారణలో ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తేలింది. అలాగే, గోపాల్‌ సోదరుడు అశోక్‌ అతడి కుమార్తెపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, ఆమెకు హత్యతో ఎటువంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ హత్యకు కారకులైన కాజల్‌, ఆమె ప్రియుడు యోగేంద్రను అరెస్ట్‌ చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: భార్య నడతపై భర్తకు అనుమానం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement