భార్య నడతపై భర్తకు అనుమానం..! | Wife And Husband Incident In Karnataka | Sakshi
Sakshi News home page

భార్య నడతపై భర్తకు అనుమానం..!

Oct 19 2026 8:40 AM | Updated on Oct 19 2026 8:55 AM

Wife And Husband Incident In Karnataka

బెంగళూరు: అనుమానం పెనుభూతమైంది. భార్య నడతపై భర్తకు అనుమానం రావడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా కెలమంగలం సమీపంలోని అగ్గొండపల్లి గ్రామానికి వెంకట కొద్ది సంవత్సరాల క్రితం బంధువు అనిల్‌ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఎనిమిదేళ్ల బాలిక ఉంది.

ప్రస్తుతం అగ్గొండపల్లిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అనిల్‌ కుమార్‌కు తాగుడు అలవాటు ఉంది. భార్య నడతపై అనుమానం రావడంతో గొడవపడేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికెళ్లిన అనిల్‌ కుమార్‌ భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంతో భార్యను కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం కెలమంగలం పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రుక్మణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డెంకణీకోట డీఎస్పీ ఆనందర్‌రాజ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం పోలీసులు విచారణ చేపట్టారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement