ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్‌పై భారీ సైబర్ దాడి జరిగినట్లు వార్తలు ప్రస్తుతం క్రిప్టో ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ఈ సైబర్ దాడిలో సుమారు 6.34 బిలియన్ డాలర్ల (రూ.లక్షల కోట్ల విలువైన) క్రిప్టో కరెన్సీ చోరీకి గురైనట్లు బ్లాక్‌చైన్ విశ్లేషణ సంస్థలు వెల్లడించాయి. అంతేకాదు ఈ దాడి వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్ల బృందం ఉన్నట్లు బ్లాక్‌చైన్ సంస్థలు అనుమానిస్తున్నాయి.
అమెరికాకు చెందిన TRM ల్యాబ్స్, చైనాలిసిస్ సంస్థలు కూడా జరిగిన దాడికి ఉత్తర కొరియా అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ ‘ట్రేడర్ట్రెయిటర్’ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి. కేవలం 20 నిమిషాల్లోనే పలు బ్లాక్‌చైన్‌ల నుంచి భారీ మొత్తంలో నిధులు తరలించినట్లు సదరు సంస్థలు గుర్తించాయి. ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీ చోరీ చరిత్రలో ఇదే అతిపెద్ద దోపిడీగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు క్రిప్టో చోరీ ప్రభావిత ఆస్తుల్లో సుమారు 3 బిలియన్ డాలర్లను నిలిపివేసేందుకు బ్లాక్‌చైన్ భాగస్వాములు, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు బినాన్స్ వెల్లడించింది. వినియోగదారుల నిధులను వారికి తిరిగి అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో బిట్‌కాయిన్, ఇథీరియం సహా పలు క్రిప్టో కరెన్సీల విలువలు ఒక్కసారిగా పడిపోయాయి.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ!


