శక్తిమంతమైన దేశంగా ఉంటేనే శాంతి: కిమ్ | Kim Jong Un says his goal is superiority in drone warfare | Sakshi
Sakshi News home page

శక్తిమంతమైన దేశంగా ఉంటేనే శాంతి: కిమ్

Oct 30 2026 5:35 PM | Updated on Oct 30 2026 6:36 PM

Kim Jong Un says his goal is superiority in drone warfare

ఉత్తర కొరియా మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందించిన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో భాగంగా 600 మి.మీ. సామర్థ్యం కలిగిన ‘స్నైపర్’ మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను తొలిసారిగా ఆవిష్కరించి, ప్రత్యక్షంగా పరీక్షించింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు.

ఈ రాకెట్ లాంచర్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అంతేకాదు ఈ ప్రదర్శనలో ఒకేసారి పది కంటే ఎక్కువ లాంచర్లతో కాల్పులు జరిపారు. డ్రోన్ల ద్వారా క్షిపణులను ప్రయోగించారు. వాటితో పాటు ఆత్మాహుతి డ్రోన్ల దాడులను కూడా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా సైన్యం డ్రోన్ల యుద్ధంలో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సైనిక బలం అవసరమని, శక్తిమంతమైన దేశంగా ఉంటేనే శాంతిని కాపాడుకోగలమని కిమ్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: శాకాహారులైన టెక్ దిగ్గజాలు.. నా బ్రేక్‌ఫాస్ట్ స్టీక్, ఎగ్స్: ఎలాన్ మస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement