ఉత్తర కొరియా సంచలన వీడియో | north korean state media releases photos of kim jong un at clothing and shoe | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా సంచలన వీడియో

Oct 20 2026 11:04 AM | Updated on Oct 20 2026 11:45 AM

north korean state media releases photos of kim jong un at clothing and shoe

కిమ్‌ జోంగ్‌ ఈ పేరు వింటే చాలు ప్రపంచం మెుత్తం ఒక్కసారిగా సైలంట్‌ అవుతుంది. తన తల బిరుసు వేషాలతో ప్రపంచ దేశాల్ని ఇబ్బంది పెడుతున్న ట్రంప్‌ సైతం కిమ్‌ మామ పేరు చెబితే ఒక అడుగు వెనకకు వేస్తారంటే ఆయన పవరేంటో అర్థం చేసుకోవచ్చు.. అయితే ఈ నియంత ఆరోగ్యం సరిగ్గా లేదంటూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటూ ఈ మధ్య చాలా వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచం మెుత్తం ఆశ్చర్యపోయింది. ఈ నేపథ్యంలో కిమ్‌ ఆరోగ్యానికి సంబంధించి ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక వీడియో విడుదల చేసింది.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించిన ఆ వీడియోలో ఆయన ఒక కార్యక్రమానికి హాజరైనట్లు ఉంది.  ఆ కార్యక్రమం దుస్తులు, పాదరక్షలకు సంబంధించినదిగా  తెలిపింది. దానికి సంబంధించిన ఫొటోలను  తాజాగా విడుదల చేసింది. సోమవారం (అక్టోబర్ 19) తన కుమార్తెతో కలిసి కిమ్ ఈ ప్రదర్శనను సందర్శించినట్లు తెలిపింది. కాగా  ఆయనకు తీవ్రమైన మెదడు రక్తస్రావం జరిగిందని, కోమాలోకి వెళ్లారని, చివరకు మరణించారని సామాజిక మాధ్యమాల్లో నిర్ధారణలేని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

ఆ ఫొటోల్లో ఏముంది?

ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫొటోల్లో కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏ, భార్య రి సోల్ జుతో కలిసి కనిపించారు. ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన 2026 జాతీయ దుస్తులు, పాదరక్షల ప్రదర్శనను ఆయన సందర్శించారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులను పరిశీలిస్తూ, అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాలు ఫొటోల్లో ఉన్నాయి.

అయితే, ఈ ఫొటోలను స్వతంత్రంగా ధ్రువీకరించే అవకాశం లేదని వాటితోపాటు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. చిత్రాల్లో చూపించిన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు స్వతంత్ర పాత్రికేయులకు అనుమతి ఇవ్వలేదు. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన చిత్రాలనే వార్తా సంస్థలు ఉపయోగించాయి. ఫొటోపై కనిపించే కొరియన్ భాషలోని వాటర్‌మార్క్‌ ‘కేసీఎన్‌ఏ’ అంటే కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ అని అర్థం.

ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో తయారైన 70,700కు పైగా దుస్తులు, 1,70,000కు పైగా జతల పాదరక్షలను ప్రదర్శించారు. ప్రధాన నగరాలకే కాకుండా ప్రాంతీయ ప్రాంతాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో కిమ్ అమలు చేస్తున్న ప్రాంతీయ అభివృద్ధి విధానంలో భాగంగా ఈ ఉత్పత్తులను తయారు చేసినట్లు అధికారిక కథనంలో పేర్కొన్నారు. ఉత్పత్తిని పెంచడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ విధానం లక్ష్యమని వెల్లడించారు.

కిమ్ ఆరోగ్యంపై  పుకార్లు
కిమ్ ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు పెరిగిన నేపథ్యంలో తాజాగా విడుదలైన ఫొటోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయనకు తీవ్రమైన మెదడు రక్తస్రావం జరిగిందని, కోమాలోకి వెళ్లారని, అత్యవసర వైద్యం కోసం బీజింగ్‌కు తరలించారని కొన్ని పోస్టులు ప్రచారం చేశాయి.

కిమ్ మరణిస్తే ఉత్తర కొరియాకు తదుపరి నాయకుడు ఎవరు అవుతారనే ప్రశ్నలను కూడా కొందరు సామాజిక మాధ్యమ వినియోగదారులు లేవనెత్తారు. భవిష్యత్తులో నాయకత్వ మార్పు జరిగితే ఆయన కుమార్తె కిమ్ జు ఏ లేదా సోదరి కిమ్ యో జోంగ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు చేశారు. ఈ ఊహాగానాల నడుమ పుకార్లుకు చెక్‌ పెడుతూ కీలక వీడియో విడుదల చేసింది.

 

ఇదీ చదవండి: అమెరికాలో ఫేక్‌ ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement