అమెరికా ఎన్నికల ప్రచారానికి ముంబై కనెక్షన్‌.. సంచలన కథనం | New York Times report Indian links to US election campaign | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికల ప్రచారానికి ముంబై కనెక్షన్‌.. సంచలన కథనం

Oct 20 2026 9:56 AM | Updated on Oct 20 2026 10:00 AM

New York Times report Indian links to US election campaign

వాషింగ్టన్‌: త్వరలో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దిన్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం ప్రచురించింది.  అమెరికాలో రాజకీయాల్లో విదేశీ సైబర్‌ ముఠాలు, నకిలీ ప్రచారాలు జరుగుతున్నట్లు కథనం ప్రచురించింది. భారత సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా ఓటర్ల దారి మళ్లింపు కుట్ర జరుగుతున్నట్లు పేర్కొంది.

అమెరికా రాజకీయ నేత హేలీ స్టీవెన్స్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో వందలాది వీడియోలు  ముంబైకి చెందిన సోషల్‌ మీడియా ఖాతాలు బాట్ నెట్‌వర్క్‌ల ద్వారా వ్యాప్తి చేసినట్లు కథనాలు ప్రచురించాయి. వెయ్యి వ్యూవ్స్‌కు ఒకటి నుంచి ఐదు డాలర్లు చెల్లింపులు జరిపినట్లు కథనాలు ప్రచురించాయి. 

అయితే ఈ పొలిటికల్‌ పోస్టుల వ్యాప్తి చేసినట్లు ముంబైకి చెందిన ఆయుష్‌ జైన్‌ ఒప్పుకున్నాడని " ఎనర్జిటిక్‌  హ్యుమర్‌" పేరిట నడిపే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఇవి వ్యాప్తి చేశారని తెలిపింది. అమెరికాకు చెందిన లూమినా క్లిప్పర్స్‌ అనే సంస్థ ద్వారా కాంట్రాక్ట్‌ పొందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కథనం ఇప్పుడు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 


ఇదీ చదవండి: ట్రంప్‌కు ఎదురుగాలి తప్పదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement