నిర్ణయాలే నట్టేట ముంచాయా.. ట్రంప్‌కు ఎదురుగాలి తప్పదా? | trump popularity declines usa midterm election iran war crisis | Sakshi
Sakshi News home page

నిర్ణయాలే నట్టేట ముంచాయా.. ట్రంప్‌కు ఎదురుగాలి తప్పదా?

Oct 20 2026 8:16 AM | Updated on Oct 20 2026 8:32 AM

trump popularity declines usa midterm election iran war crisis

వాషింగ్టన్‌: అమెరికా గ్రేట్‌ ఎగేన్‌ నినాదంతో ఆ దేశస్థులను ఉసిగొల్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌.. ఈ సారి భారీస్థాయిలో వారితోనే వ్యతిరేఖత ఎదుర్కొవాల్సి వస్తుంది. త్వరలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆయనకు ఎదురు గాలి వీచే అవకాశాలున్నట్లు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి.  ద్రవ్యోల్బణం, ఇరాన్ యుద్ధం ఆయన ప్రజాదరణను  తీవ్రంగా దెబ్బతీసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయనను సొంత పార్టీ అభ్యర్థులు నుంచి వ్యతిరేఖత ఎదురవుతున్నట్లు సమాచారం.

ప్రజాధారణ కనిష్ట స్థాయికి

అమెరికాలో ట్రంప్ పనితీరుతో సంతోషంగా ఉన్నవారి సంఖ్య ఆ దేశంలో క్రమంగా  తగ్గుతోంది. వివిధ సర్వేల ప్రకారం, కేవలం 30 నుండి 36 శాతం మంది మాత్రమే ఆయన పనితీరుతో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఎన్‌బిసి న్యూస్ పోల్‌లో 34% మంది ట్రంప్ పనితీరును ఆమోదించగా, వాషింగ్టన్ పోస్ట్-ఏబిసి న్యూస్ పోల్‌లో 33%,  ఫాక్స్ న్యూస్ పోల్‌లో 36% మంది ఆమోదించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో ట్రంప్‌కు అత్యంత తక్కువగా 30% మద్దతు లభించింది. ఇది ఆయన మొదటి పదవీకాలంలో లభించిన మద్దతు కంటే కూడా తక్కువ ఉన్నట్లు సమాచారం.

అల్లరి మూకలు పార్లమెంటుపై దాడి చేసిన తర్వాత, ట్రంప్ ఆమోద రేటింగ్ ఆయన మొదటి పదవీకాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయి, జనవరి 2021లో 34 శాతానికి చేరింది .

ద్రవ్యోల్బణం 

దానితో పాటు ట్రంప్ తన 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ద్రవ్యోల్బణాన్ని, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఆయన పార్టీకి సమస్యగా మారుతున్నాయి. అమెరికాలో గుడ్లు, పాలు, బ్రెడ్, మాంసం, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.  ఇంటి అద్దెలు  గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ఇరాన్ యుద్ధంతో పరిస్థితి తలకిందులు  

ఇక ట్రంప్ ఇరాన్‌పై చేపట్టిన యుద్ధం  ఆయనకు మరో సమస్యగా మారింది. ఈ యుద్ధం గ్యాసోలిన్ డీజిల్ ధరలపై ఒత్తిడిని పెంచింది, దీనివల్ల అమెరికన్ల రోజువారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎన్‌బిసి న్యూస్ సర్వేలో, ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరును కేవలం 29% మంది మాత్రమే ఆమోదించారు. ఫాక్స్ న్యూస్ సర్వేలో, ఆయన విదేశాంగ విధానంలో లోపాలు ఉన్నాయని 64% మంది అన్నారు.

అయితే, ట్రంప్ తన సొంత రిపబ్లికన్ పార్టీలోనే మద్దతును కొనసాగిస్తున్నారు. ఏపీ పోల్‌లో, 69% మంది రిపబ్లికన్ ఓటర్లు ఆయన విదేశాంగ విధానాన్ని ఆమోదించారు.

 సొంత పార్టీ అభ్యర్థుల నుంచే వ్యతిరేకత

ట్రంప్ ప్రజాదరణ తగ్గడం ఆయన సొంత పార్టీపై కూడా ప్రభావం చూపుతోంది. అక్టోబర్‌లో వచ్చిన ఒక రాయిటర్స్ నివేదిక ప్రకారం, పోటీ జరుగుతున్న 62 స్థానాలలో 41 స్థానాలలోని రిపబ్లికన్ అభ్యర్థులు ట్రంప్ యొక్క కొన్ని విధానాలతో విభేదిస్తున్నారు లేదా వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ అభ్యర్థులు ట్రంప్ విధానాలన్నింటినీ వ్యతిరేకించడం లేదు. కొన్ని విషయాలలో భిన్నంగా వ్యవహరించడం ద్వారా, పార్టీకి గట్టి మద్దతుదారులు కాని వారి మద్దతును పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ అభ్యర్థులు ఎదుర్కొంటున్న సవాలు ఏమిటంటే, ట్రంప్‌కు దగ్గరగా ఉండటం వారి ప్రజాదరణను కోల్పోయేలా చేయవచ్చు, అదే సమయంలో ఆయనకు మరీ దూరంగా ఉండటం ట్రంప్ విధేయులైన మద్దతుదారులకు కోపం తెప్పించవచ్చు.

మెజారిటీ కోల్పోతే ట్రంప్‌కు ఏమవుతుంది?

కాంగ్రెస్‌లోని ఒకటి లేదా రెండు సభలలో డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ లభిస్తే, ట్రంప్ తన నిర్ణయాలను అమలు చేయడం కష్టతరం కావచ్చు. బడ్జెట్, ప్రభుత్వ వ్యయం, కొత్త చట్టాలకు సంబంధించి కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే, అది ట్రంప్ ప్రతిపాదనలను అడ్డుకుని ఆయన పరిపాలనుకు అడ్డంకులు సృష్టించగలదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement