ఎస్‌ఐఆర్‌పై యూపీ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు | 1.27 Crore Hindus names Missing From Electoral Rolls In UP Yogi Adityanath | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై యూపీ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు

Oct 31 2026 4:41 PM | Updated on Oct 31 2026 4:53 PM

1.27 Crore Hindus names Missing From Electoral Rolls In UP Yogi Adityanath

సాక్షి,లక్నో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియ పై బీజేపీయేతర పార్టీలు తీవ్ర విమర్శలు గు ప్పిస్తున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి యూపీలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణపై  బీజేపీ శ్రేణులను హెచ్చరించారు. అంతేకాదు ఓటర్ల జాబితాల నుండి 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరినీ చేర్చాల్సి ఉందన్నారు.

యోగి ఆదిత్యనాథ్  కీలక విమర్శలు
ఓటర్ల జాబితా నుంచి దాదాపు 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు  మిస్‌ అయ్యాయని  యూపీ సీఎం ఆరోపించారు.  ఫలితంగా  28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో తమ  పార్టీ బలం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు  ఈ తొలగింపులతో పార్టీ స్థానం బలహీనపడుతోందన్నారు. జనాభా గణాంకాలను ఉటంకిస్తూ, ప్రస్తుతం సుమారు 13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండాలని ఆదిత్యనాథ్ వాదించారు.  యూపీ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 16 కోట్లకు పైగా ఉండాలని, కానీ ప్రస్తుతం కేవలం 13 కోట్ల మంది మాత్రమే నమోదై ఉన్నారని తెలిపారు.

గత ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర ఓటర్ల జాబితాలో కేవలం నాలుగు లక్షల మంది ఓటర్లను మాత్రమే చేర్చడంపై యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఉన్న సుమారు 66 లక్షల మంది పేర్లు  అసెంబ్లీ ఓటర్ల జాబితాలో లేవన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతున్న 55 లక్షల మంది పేర్లు ఓటర్ల లిస్ట్‌లో కనిపించడం లేదని పేర్కొన్నారు.  కొత్తగా ఓటు హక్కు పొందే వయస్సు ఉన్న 4.5 లక్షల మంది యువకుల పేర్లు నమోదవలేదు.  ఈ  సందర్భంగా  పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు.  బూత్ లెవల్ అధికారులతో (BLO) సమన్వయం కావాలని, అర్హులైన ప్రతీ ఒక్క హిందూ ఓటర్ పేరు జాబితాలో చేర్చేలా బూత్ లెవల్ అధికారులతో కలిసి పనిచేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు  పార్టీ ప్రతినిధులను ఆదేశించారు.హిందూ ఓటర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్చేలా చూడాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యనిర్వాహకులకు కూడా బాధ్యత అప్పగించారు.

ఇదీ చదవండి: స్కూలు డ్రాపౌట్‌, రూ. 114 కూలీ : ఇపుడు దేశంలోనే ధనవంతురాలు

కాగా  ఓటర్ల జాబితా నుంచి హిందూ ఓటర్లను మినహాయించారన్న ఆరోపణలపై యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేయడం ఇది  తొలిసారి కాదు. గతంలో కూడా, తమ పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉండేలా చూసుకోవాలని ఆయన బీజేపీ కార్యకర్తలను కోరారు. ఇది ఇలా ఉంటే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, SIR ప్రక్రియ ద్వారా యూపీలో మొత్తం 2.04 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు. వీటిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాలు, మహిళా ఓటర్ల పేర్లే ఉన్నాయి.అదే సమయంలో 84 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. ఈ సవరణల తర్వాత రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,39,84,792 (13.39 కోట్లు) గా నమోదైంది.

ఇదీ చదవండి: 5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement