ఉధంపూర్: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బస్సు లోయలో పడింది. పేచౌండ్ నుంచి రామ్‌నగర్ వెళ్తున్న ఈ బస్సు గుల్లీ గాలా ప్రాంతానికి చేరుకోగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే బస్సు లోయలో పడినట్లు ప్రాథమిక సమాచారం.
J&K: Deputy Commissioner (DC) Udhampur, Ananth Dwivedi, says, "At least 10 people sustained injuries when a passenger bus met with an accident at Gala Pachound in Udhampur district. Following the incident, emergency relief teams, alongside the Sub-Divisional Magistrate (SDM) and medical personnel, rushed to the spot to coordinate rescue and evacuation efforts. Medical teams are on their way to the spot and medical staff at Sub District Hospital Ramnagar have been placed on alert, with full arrangements made to treat the injured. No casualties have been reported so far, and administration officials remain actively engaged on the ground."
— ANI (@ANI) October 21, 2026
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్ అనంత్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం, గాలా పచౌండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ్‌నగర్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ఉధంపూర్ డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘బొద్దింక’ దహనంపై ‘ఆప్’ ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు


