breaking news
vasavi reddy
-
ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
సాక్షి,వికారాబాద్: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ధరూర్ మండలం చింతకుంట గ్రామంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి వారి ప్రాణాలు తీసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసవి రెడ్డి (45) అనే మహిళ తన పిల్లలు సహస్ర (9), వేదాన్ష్ (5)లకు ఉరివేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అయితే ఈ దారుణ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ఎల్కేజీ బాలికపై మూడవ తరగతి విద్యార్థి భీకర దాడి -
ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కడప: బీజేపీ నాయకుడు కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబుల్ రెడ్డి తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాసవీరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కడప వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాసవీ రెడ్డి గతంలో శివానందరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినట్టు తెలుస్తోంది. తనకు శివానందరెడ్డి ఆస్తులు ఏమీ వద్దని, ఓబుల్ రెడ్డి భార్యగా గుర్తింపు కావాలని బాధితురాలు పేర్కొంది. తాను ఎంటెక్ చదివానని, తన కాళ్లపై తాను నిలబడగలనని తెలిపింది. భర్తతో కలిసుండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓబుల్ రెడ్డి, వాసవీ రెడ్డి మధ్య అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


