నేటి నిరసనలో మేం పాల్గొనం: ఆప్‌  | AAP to skip INDIA bloc protest outside EC office on 6 Oct 2026 | Sakshi
Sakshi News home page

నేటి నిరసనలో మేం పాల్గొనం: ఆప్‌ 

Oct 6 2026 6:31 AM | Updated on Oct 6 2026 6:31 AM

AAP to skip INDIA bloc protest outside EC office on 6 Oct 2026

న్యూఢిల్లీ: సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ఈ నెల 6వ తేదీన ఇండియా కూటమి పక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమంలో తాము పాలుపంచుకోవడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) తెలిపింది. ఆప్‌ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సోమవారం మీడియాకు ఈ విషయం తెలిపారు. ‘ఓటరు జాబితా సర్‌కు వ్యతిరేకంగా వామపక్షాలు, కాక్రోచ్‌ జనతా పార్టీ సహా వివిధ సంఘాలు, సంస్థలు నిత్యం దేశంలో ఏదో ఒక చోట ఆందోళనలు చేపడుతున్నాయి. 

మంగళవారం ఇండియా కూటమి నిరసనలకు దిగుతోంది. ఇది ఇండియా కూటమి ఆందోళన. అందుకే, ఇందులో ఆప్‌ పాల్గొనదు. మేం సొంతంగా నిరసనలు నిర్వహిస్తాం’అని ఆయన వివరించారు. ప్రతిపక్ష డీఎంకే సైతం 6న జరిగే ఆందోళనలో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించింది. ఈసీ కార్యాలయం వద్ద నిరసన అనంతరం ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలవాలని సెపె్టంబర్‌ 30న జరిగిన భేటీలో ఇండియా కూటమి నేతలు నిర్ణయించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement