Engagement Ends After Woman Government Job Is Temporary ‘వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి’ అనే సామెతకు కాలం చెల్లింది. భార్యభర్తల బంధంలో పారదర్శకత, నమ్మకం ముఖ్యం అంటూ తనకు కాబోయే భార్య ప్రకటించినట్టుగా ఆమెది ప్రభుత్వ ఉద్యోగం కాదని తెలుసుకున్న ఒక వ్యక్తి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న వైనం నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది. మ్యాచింగ్ మేకింగ్ యాప్ ద్వారా భాగస్వామిని వెతుక్కున్న సదరు వ్యక్తి, అసలు విషయం తెలిసి ఏకంగా తన పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నాడు. "పెళ్లి సంబంధాలలో అంచనాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పుడు" (When Matrimony Expectations Don't Match Reality) అనే శీర్షికతో రెడ్డిట్ (Reddit)లో షేర్ అయిన ఈ ఘటన వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ పోస్ట్ ప్రకారం తన స్నేహితురాలికి ఈ అనుభవం ఎదురైందని రెడ్డిట్ యూజర్ వెల్లడించారు. మ్యాట్రిమోనీ యాప్‌లో సంబంధాలను వెతుకు తున్న యువతి ఒక ప్రైవేట్ కళాశాల నుండి బీఎస్సీ (BSc) డిగ్రీ పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో పనిచేస్తోంది. అయితే, ఆమె చేస్తున్నది తాత్కాలిక ఉద్యోగం, కానీ ఈ విషయాన్ని ఆమె తన ప్రొఫైల్‌లో స్పష్టంగా పేర్కొనలేదు.ఇదే చిక్కులు తెచ్చిపెట్టింది.
మరోవైపు అసలు విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా తన కాబోయే వరుడిగురించి భారీగానే అంచనాలు పెట్టుకుంది. వరుడి జీతం గురించి అడగడమే కాకుండా, వరుడికి ఇంత జీతం ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అలాగే సొంత కారు కూడా ఉండాలనే షరతులు పెట్టింది. యాప్‌లో అబ్బాయి ఎత్తు 5'5 అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, తనకు పొడుగ్గా ఉండే వ్యక్తి కావాలని కోరుకుందని పోస్ట్‌లో వివరించారు.మొదట అంతా సజావుగా సాగుతున్నట్లు అనిపించింది. నిశ్చితార్థం ముహూర్తం కూడా ఖరారైంది. కానీ, ఆ యువతి చేస్తున్న ఉద్యోగం టెంపరరీ జాబ్ అని వరుడి తరపు వారికి తెలియడంతో కథ అడ్డం తిరిగింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే వరుడు ఇస్రో (ISRO) శాస్త్రవేత్త. ఆయన ప్రముఖ కళాశాల నుండి ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అతనికి మంచి కెరీర్, సౌకర్యవంతమైన జీవనశైలి ఉన్నాయి.
ఇదీ చదవండి : బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్
సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, నెటిజన్లు దీనిపై భిన్న కోణాల్లో స్పందించారు. తాను అసలు విషయం దాచిపెట్టడమే కాకుండా, అతి ఆశించే ఆమె ధోరణి నేపథ్యంలో వరుడి నిర్ణయం సరైందేనని చాలామంది అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన విషయాలను దాచడం వల్ల ప్రారంభంలోనే నమ్మకం దెబ్బతింటుందని కొందరు అభిప్రాయపడగా, కేవలం ఒకవైపు వాదన మాత్రమే విని ఇంత త్వరగా ఒక అభిప్రాయానికి రావద్దని మరికొందరు సూచించారు.
ఇదీ చదవండి: బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం కుమార్తె


