ముక్కు కుడి రంధ్రంలోని నాడిని ‘పింగళ’ అని అంటారు. దీనినే ‘సూర్యనాడి’అని కూడా అంటారు. పింగళ నాడికి అధిదేవత ‘బ్రహ్మ’. ముక్కు ఎడమ రంధ్రంలోని నాడిని ‘ఇడ’ నాడికి అధిదేవత ‘విష్ణువు’. పింగళ , ఇడ నాడులు పైకి వెళ్ళి కలిసే చోట (రెండు కనుబొమల మధ్య భాగమునందు) ‘సుషుమ్న’’ అనే మరో నాడి ఉంటుంది. దీనినే ‘అగ్నినాడి’ అని కూడా అంటారు. సుషుమ్న నాడికి ఆధిదేవత ‘శివుడు’. ఈ మూడు నాడులు కలవడాన్ని ‘త్రివేణి సంగమం’ అంటారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసే ఈ చోటునే ‘త్రికూట స్థానం’ అని కూడా అంటారు. ఈ సుషుమ్న నాడిలో భగవంతుడు జ్ఞానరూపంలో సంచరిస్తూంటాడని భారతీయుల విశ్వాసం. అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంథంతోను, కుంకుమతోను అలంకరిస్తారు. ఇలా అలంకరించడం వలన త్రివేణీ సంగమం సంగతి తెలుసు అనే భావం కూడా గోచరిస్తుంది.
షష్టిపూర్తికీ (60), సప్తతిపూర్తికీ (70) 84 సంవత్సరాలు నిండిన పండగకీ వైదికమైన పేర్లేవో ఉంటాయి. కొద్దిగా చెబుతారా?
షష్టిపూర్తిని ఉగ్రరథశాంతి అనీ, సప్తతిపూర్తిని భీమరథశాంతి అనీ, 84 సంవత్సరాల నాలుగు నెలలు నిండిన ఉత్సవాన్ని ‘సహస్రచంద్రదర్శనశాంతి’ అనీ పిలుస్తారు.
నిర్వహణ డి.వి.ఆర్. భాస్కర్
ఇదీ చదవండి: హరి ప్రబోధనం తులసీ కల్యాణం


