వారణాసి: తమ తండ్రిపై హోటల్ సిబ్బంది దాడి చేశారన్న ఆగ్రహంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ హోటల్‌లో వీరంగం సృష్టించారు. ఆ హోటల్‌లోని సామగ్రిని ధ్వంసం చేస్తూ సిబ్బందిపై రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నవంబర్ 4న హోటల్ సిబ్బందితో జరిగిన గొడవలో తమ తండ్రిపై హోటల్ సిబ్బంది దాడి చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై భేలూపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
అయితే స్కూటీపై వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు ఈ ఘటనను వీడియో తీస్తుండగా, మరొకరు మాత్రం హోటల్‌లోకి వెళ్లి దోశ పిండి ఉన్న పాత్రను కిందపడేశారు. అక్కడ ఉన్న సిబ్బందితో హోటల్‌ను మూసివేయాలంటూ కేకలు వేస్తూ రెచ్చిపోయారు. దాంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Two girls in Varanasi vandalised a dosa shop after their father was allegedly brutally beaten by the shop's employees. With no police action for nearly two weeks, their frustration turned into anger. https://t.co/hQFlA6UCM6
— Ghar Ke Kalesh (@gharkekalesh) November 16, 2026
ఇక మరోవైపు మహిళల తీరుపై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ గౌరవ్ కుమార్ తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు హతం


